Mangu Machalu : ముఖంపై వచ్చే మంగు మచ్చలను తగ్గించే మొక్క ఇది.. అద్భుతంగా పనిచేస్తుంది..!

Mangu Machalu : మనకు వచ్చే చర్మ సంబంధమైన సమస్యలలో మంగు మచ్చలు కూడా ఒకటి. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ఈ సమస్య అందరినీ వేధిస్తోంది.
శరీరంలో రోగ నిరోధక శక్తి తగ్గినప్పుడు, శరరీంలో వేడి ఎక్కువగా ఉన్నప్పుడు, అందం కోసం రసాయనాలు కలిగిన ప్రొడక్ట్స్ ను వాడినప్పుడు, ప్రమాదకరమైన సూర్య కిరణాలు మన ముఖంపై ఎక్కువగా పడినప్పుడు ఈ మంగు మచ్చలు ముఖంపై వస్తాయని నిపుణులు చెబుతున్నారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Join Now
Facebook Page Join Now

అంతే కాకుండా స్త్రీలు గర్భం దాల్చినప్పుడు మంగు మచ్చలు ముఖంపై వచ్చి ప్రసావానంతరం వాటంతట అవే పోతాయి.

దీర్ఘ కాలిక వ్యాధులతో బాధపడే వారిలో, అధికంగా మందులను వాడే వారిలోనూ ఈ మంగు మచ్చలు వస్తాయి. ఈ విధంగా మంగుమచ్చలు రావడానికి అనేక కారణాలు ఉంటాయి.

ఈ మంగు మచ్చలు మన ముఖంపైనే కాకుండా ఇతర శరీర భాగాలపై కూడా వస్తాయి. మంగు మచ్చల కారణంగా ముఖం అందవిహీనంగా కనబడుతుంది. అయితే ఎటువంటి మందులను, క్రీములను వాడే పని లేకుండానే ఆయుర్వేదం ద్వారా మనం ఈ సమస్య నుండి బయటపడవచ్చు.

ఆయుర్వేదంలో ఎంతగానో ఉపయోగించే పునర్నవ మొక్కను వాడి మన చర్మంపై వచ్చే మంగు మచ్చలను తగ్గించుకోవచ్చు. ఇవి ఎక్కడపడితే అక్కడ మనకు కనిపిస్తూనే ఉంటాయి. దీనిని తెల్ల గలిజేరు అని కూడా పిలుస్తూ ఉంటారు. వర్షాకాలంలో ఈ మొక్క ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది.

Mangu Machalu

పునర్నవ మొక్క ఆకులను సేకరించి మెత్తగా దంచి దాని నుండి రసాన్ని తీసుకోవాలి. దీంట్లో కొద్దిగా పాలను, తేనెను కలిపి మంగు మచ్చలపై ప్రతిరోజూ రాయాలి. ఇలా చేయడం వల్ల క్రమేపీ మంగు మచ్చలు తగ్గుతాయి.

ఈ రసాన్ని ముఖానికి రాసుకోవడం వల్ల మంగు మచ్చలే కాకుండా మొటిమలు, నల్ల మచ్చలు, జిడ్డు చర్మం వంటి సమస్యలు కూడా తగ్గి చర్మం కాంతివంతంగా మారుతుంది.

ఈ విధంగా పునర్నవ మొక్క మనకు వచ్చే మంగు మచ్చలతోపాటు ఇతర చర్మ సంబంధమైన సమస్యలైన మొటిమలు, నల్లమచ్చలను నయం చేసి ముఖం కాంతివంతంగా అయ్యేలా చేస్తుందని నిపుణులు తెలియజేస్తున్నారు.