Saturday, November 16, 2024

Tax Saving Schemes: పన్ను ఆదా చేసే పథకాలు ఎన్ని ఉన్నాయో తెలుసా? వాటిల్లో బెస్ట్ ఇవే..

పన్ను చెల్లింపుదారులు తాము చెల్లించే పన్ను మొత్తంలో చాలా వరకూ ఆదా చేసుకొనే వెసులుబాటు ఉంది. ఆదాయ పన్ను చట్టమే ఆ వెసులుబాటు కల్పించింది. అయితే అందుకోసం మీరు పాత పన్ను విధానంలోనే కొనసాగాల్సి ఉంటుంది.
ఒక వేళ మీరు పాత పన్ను విధానంలో ఉంటే అనేక పథకాలు పన్ను ఆదా చేసేవి మనకు అందుబాటులో ఉన్నాయి. అయితే ఇవి అందరికీ అనుకూలంగా ఉండకపోవచ్చు. ఎక్కువ శాతం మంది మాత్రం ప్రయోజనం పొందే వీలుంటుంది. ప్రతి నెలా, లేదా త్రైమాసిక, వార్షిక ప్రాతిపదికన ఆయా పథకాల్లో మీరు పెట్టుబడులు పెట్టాల్సి ఉంటుంది. ప్రతి పథకానికి కొంత సమయం లాకిన్ సమయం కూడా ఉంటుంది. మరికొన్నింటిలో రిస్క్ ఎలిమెంట్ కూడా ఉంటుంది. అందుకే చెల్లింపుదారులు వారి ఆదాయం, ఖర్చులు, ఆర్థిక లక్ష్యాలను బేరీజు వేసుకుంటూ ఆయా పథకాలను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఆరోగ్య బీమా, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్(ఎన్ఎస్సీ), పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్(పీపీఎఫ్), ఈక్విటీ లింకెడ్ మ్యూచువల్ ఫండ్స్, పెన్షన్ స్కీమ్స్, సుకన్య సమృద్ధి యోజన వంటి పథకాలు ఈ జాబితాలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో పన్ను చెల్లింపుదారులకు అందుబాటులో ఉన్న బెస్ట్ పన్ను ఆదా పథకాలను మీకు అందిస్తున్నాం.

నేషనల్ పెన్షన్ స్కీమ్..

మన దేశంలో అందుబాటులో ఉన్న బెస్ట్ రిటైర్ మెంట్ స్కీమ్లలో ఇదీ ఒకటి. దీనిలో రాబడి 8.16శాతం వరకూ ఉంటుంది. మీరు ఉద్యోగం చేస్తూనే దీనిలో పెట్టుబడులు పెట్టొచ్చు. 60ఏళ్ల తర్వాత వాటని పెన్షన్ రూపంలో పొందే అవకాశం ఉంటుంది. సెక్షన్ 80సీసీడీ(1)కింద రూ. 1.5లక్షలు, సెక్షన్ 80సీసీడీ(1బీ) కింద రూ. 50వేలు పన్ను ఆదా చేసుకోవచ్చు. అలాగే సెక్షన్ 80సీసీడీ(2) కింద కంపెనీ యాజమాన్యం ఉద్యోగి ఎన్పీఎస్ ఖాతాకు జమ చేస్తే ఉద్యోగి వేతనంలో 10శాతం క్లయిమ్ చేసుకోవచ్చు. అలాగే ఇందులో పెట్టే పెట్టుబడులను ఈక్విటీలకు కూడా బదలాయించుకోవచ్చు.

నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్..
ఈ పథకంలో సెక్షన్ 80సీ కింద పన్ను ప్రయోజనం లభిస్తుంది. కానీ రాబడి మొత్తం పన్ను పరిధిలోకి వెళ్తుంది. దీనిలో కూడా లాకిన్ పీరియడ్ ఐదేళ్లు ఉంటుంది. రాబడి మొత్తం 7నుంచి 8శాతం మధ్య ఉంటుంది.

బీమా పథకాలు..

వాస్తవానికి ఇన్స్యూరెన్స్ పథకాలు ట్యాక్స్ సేవింగ్స్ కోసం చేసేవి. అవి జీవిత, ఆరోగ్య పరిరక్షణ కోసం వచ్చేవి. అనుకోని విపత్తుల్లో ఆర్థికంగా భరోసా ఇచ్చేందుకు ఇవి ఉపయోగపడతాయి. జీవిత బీమా పథకాలు దురదృష్టవశాత్తూ వ్యక్తులు మరణిస్తే బీమా పరిహారం ఆ వ్యక్తి కుటుంబానికి అందుతుంది. దీనిలో చాలా రకాల పాలసీలు ఉన్నా టెర్మ్ ప్లాన్లు మెరుగైనవి. ఈ టెర్మ్ ప్లాన్లపై ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు ఉంటుంది. దీనిలో రాబడులు 5 నుంచి 6శాతం ఉంటుంది. లాకిన్ పీరియడ్ ఐదేళ్లు ఉంటుంది. అదే సమయంలో ఆరోగ్య బీమా పథకాల్లో 60ఏళ్ల లోపు వారు అయితే సెక్షన్ 80డీ కింద రూ. 25,000, 60 ఏళ్లు పైబడిన వారికైతే రూ. 50,000 వరకూ పన్ను ఆదా చేసుకునే వెలుసుబాటు ఉంటుంది.

పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ పీపీఎఫ్..

దీనిలో రాబడిపై కూడా పన్ను పడదు. ఈ పథకం కాల వ్యవధి 15ఏళ్లు ఉంటుంది. ప్రస్తుత వడ్డీ రేటు 7.1శాతంగా ఉంది. సెక్షన్ 80సీ కింద రూ. 1.5లక్షల వరకూ పన్ను ఆదా చేసుకోవచ్చు. దీనిలో పాక్షిక ఉపసంహరణకు అవకాశం ఉంటుంది. బ్యాంకులు పోస్టాఫీసుల్లో ఈ ఖాతాను ప్రారంభించొచ్చు.

రిటైర్ మెంట్ ఫండ్స్..

రిటైర్ మెంట్ ఫండ్స్ ఈక్విటీతో పాటు డెట్ సాధనాల్లోనూ పెట్టుబడులు పెడతాయి. దీంతో అధిక రాబడులకు అవకాశం ఉంటుంది. పలు ప్రైవేటు సంస్థలు ఈ రిటైర్ మెంట్ ఫండ్స్ ను నిర్వహిస్తాయి. సెక్షన్ 80సీ కింద ఈ పెట్టుబడులపై రూ.1.5లక్షల వరకూ పన్ను మినహాయింపు పొందే వీలుంటుంది. దీనిలో రాబడి ఐదేళ్లలో 7 నుంచి 9శాతం ఉంటుంది. లాకిన్ పీరియడ్ ఐదేళ్లు ఉంటుంది.

సుకన్య సమృద్ధి యోజన..

ఆడబిడ్డల తల్లిదండ్రులకు వరం ఈ పథకం. ప్రస్తుతం దీనిలో వడ్డీ రేటు 8.2శాతం ఉంటుంది. లాకిన్ పీరియడ్ 18ఏళ్లు. ఒక ఆర్థిక సంవత్సంరలో రూ. 1.5లక్షల వరకూ దీనిలో పెట్టుబడులు పెట్టొచ్చు. సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు పొందొచ్చు.

సీనియర్ సిటిజెన్ సేవింగ్స్ స్కీమ్..

వృద్ధులు అంటే 60ఏళ్ల నిండిన వారికి ఇది మంచి ఆప్షన్. దీనిలో రాబడి అత్యధికంగా 8.2శాతం ఉంటుంది. కనీస లాకిన్ పీరియడ్ ఐదేళ్లు ఉంటుంది. తర్వాత పొడిగించుకునే అవకాశం ఉంది. సెక్షన్ 80సీ కింద రూ. 1.5లక్షల వరకూ పన్ను ప్రయోజనం పొందొచ్చు. ప్రతి త్రైమాసికానికి వడ్డీ చెల్లింపులు
ఉంటాయి.

ఈఎల్ఎస్ఎస్..

ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్(ఈఎల్ఎస్ఎస్) లో దీర్ఘకాలంలో అధిక రాబడులను అందిస్తుంది. దీనికి లాకిన్ పీరియడ్ మూడేళ్లు ఉంటుంది. కనీసం ఐదేళ్ల కాలానికి పెట్టుబడి పెడితే రిటర్న్ లు 17శాతం వరకూ ఉంటాయి. దీనిలో కూడా సెక్షన్ 80సీ కింద ఒక ఆర్థిక సంవత్సరంలో రూ. 1.5లక్షల వరకూ పన్ను మినహాయింపును పొందొచ్చు.

జుట్టు రాలడం, చుండ్రు రెండిటికీ చెక్ పెట్టే మిరాకిల్ రెమెడీ ఇది.. అస్సలు మిస్ అవ్వకండి

హెయిర్ ఫాల్( Hairfall ).. దాదాపు ప్రతి ఒక్కరిలోనూ ఈ సమస్య ఉంటుంది. అయితే కొందరిలో తక్కువగా ఉంటే.. కొందరిలో మాత్రం జుట్టు రాలడం అనేది చాలా అధికంగా ఉంటుంది.
అలాగే చుండ్రు సమస్యతో కూడా ఎంతో మంది బాధపడుతుంటారు. ఈ రెండిటికీ చెక్ పెట్టే మిరాకిల్ రెమెడీ ఒకటి ఉంది. ఈ రెమెడీని వారానికి ఒక్కసారి ప్రయత్నించినా చాలు జుట్టు రాలడం, చుండ్రు సమస్యలు పరార్ అవుతాయి. మరి ఇంతకీ ఆ రెమెడీ ఏంటో ఓ చూపు చూసేయండి.

ముందుగా ఒక ఉల్లిపాయ( Onion )ను తీసుకుని తొక్క తొలగించి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు మరియు నాలుగు రెబ్బలు కరివేపాకు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుంచి జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో నాలుగు టేబుల్ స్పూన్లు మునగాకు పొడి వేసుకోవాలి.

అలాగే వన్ టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె( Coconut Oil ) మరియు సరిపడా ఉల్లిపాయ కరివేపాకు జ్యూస్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ ధరించాలి. గంట అనంతరం మైల్డ్ షాంపూను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి. వారానికి ఒక్కసారి ఈ రెమెడీని పాటించడం వల్ల జుట్టుకు చక్కని పోషణ అందుతుంది.

కుదుళ్లు దృఢంగా మారతాయి. దాంతో జుట్టు రాలడం తగ్గుతుంది. అలాగే చుండ్రు సమస్యతో బాధపడుతున్న వారికి కూడా ఈ రెమెడీ చాలా ఉత్తమంగా సహాయపడుతుంది. చుండ్రు ఎంత తీవ్రంగా ఉన్నా సరే రెండు మూడు వాషుల్లోనే మొత్తం తొలగిపోతుంది. స్కాల్ప్ హెల్తీ గా( Healthy Scalp ) మారుతుంది. కాబట్టి జుట్టు రాలడం, చుండ్రు సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు తప్పక ఈ రెమెడీని ట్రై చేయండి.

Maruti Swift 2024: 4 కొత్త ఫీచర్లతో వచ్చిన మారుతీ స్విఫ్ట్‌.. ధరెంతో తెలుసా?

2024 మారుతి స్విఫ్ట్ ఫీచర్లు: మారుతి స్విఫ్ట్ భారతీయ కార్ మార్కెట్లో బాగా ప్రసిద్ధి చెందింది. స్విఫ్ట్ 2023 సంవత్సరంలో అత్యధికంగా అమ్ముడైన కారు. 2 లక్షల యూనిట్లు (2,03,469 యూనిట్లు) అమ్ముడయ్యాయి. ఇప్పుడు దీని కొత్త ఫేస్ లిఫ్ట్ వెర్షన్ లాంచ్ కానుంది. ఇది ఏప్రిల్ నాటికి ప్రారంభించబడుతుందని భావిస్తున్నారు. హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ లో లేని నాలుగు ఫీచర్ల గురించి మాట్లాడుకుందాం.

పెద్ద టచ్‌స్క్రీన్.. ప్రస్తుత స్విఫ్ట్ 7-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ టచ్‌స్క్రీన్‌ను పొందుతుంది. ఇది Grand i10 Niosలో ఉన్న 8-అంగుళాల యూనిట్ కంటే చిన్నది. అయితే, కొత్త స్విఫ్ట్ 9-అంగుళాల టచ్‌స్క్రీన్‌ను పొందే అవకాశం ఉంది. ఇది ఇప్పటికే Baleno, Brezza, Frontxలో వస్తుంది. దీన్ని వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీతో అమర్చవచ్చు.

ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్.. నాల్గవ తరం స్విఫ్ట్ ఇప్పటికే జపాన్‌లో ప్రవేశపెట్టబడింది. ఇందులో ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ ఉంది. అటువంటి పరిస్థితిలో, ఈ ఫీచర్‌ను ఇండియా-స్పెక్ మోడల్‌లో కూడా తీసుకురావాలని భావిస్తున్నారు. Grand i10 Niosలో ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ అందుబాటులో లేదని మీకు తెలియజేస్తాము

బ్లైండ్ స్పాట్ మానిటర్.. 2024 స్విఫ్ట్ ఇండియాలో టెస్టింగ్ సమయంలో కూడా గుర్తించబడింది. దాని టెస్ట్ మ్యూల్‌లో, బ్లైండ్ స్పాట్ మానిటర్ హెచ్చరిక ORVMలలో బ్లింక్ అవుతూ కనిపించింది. అటువంటి పరిస్థితిలో, దాని ఉత్పత్తి నమూనాలో బ్లైండ్ స్పాట్ మానిటర్ కనుగొనబడుతుందని భావిస్తున్నారు.

360-డిగ్రీ కెమెరా.. మారుతి సుజుకికి చెందిన పలు మోడల్స్ ఇప్పటికే 360 డిగ్రీల కెమెరాతో అందించబడుతున్నాయి. ఇప్పుడు రాబోతున్న స్విఫ్ట్ కూడా 360 డిగ్రీ కెమెరాతో రానుంది. ప్రస్తుత స్విఫ్ట్ మరియు గ్రాండ్ ఐ10 నియోస్ రెండింటిలోనూ రియర్‌వ్యూ కెమెరా మాత్రమే ఉంది. కానీ, ఇండియా-స్పెక్ కొత్త స్విఫ్ట్ 360-డిగ్రీ కెమెరాతో రావచ్చు.

నెలకి లక్ష పైనే జీతం తో డిగ్రీ తో CBRI లో ఉద్యోగాలు. వివరాలు ఇవే.

CSIR- సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్- రూర్కీ డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తుంది.
వివరాలు:

* టెక్నికల్ అసిస్టెంట్: 24 పోస్టులు

అర్హత: డిప్లొమా (సివిల్/ ఆర్కిటెక్చర్/ ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్స్/ మెకానికల్ ఇంజినీరింగ్), బీఎస్సీ (ఫిజిక్స్/ కెమిస్ట్రీ/ జియాలజీ).

Salary details: నెలకు రూ.35,400 – రూ.1,12,400.

Age limit: 28 ఏళ్లు మించకూడదు.

Fee for application: రూ.100. SC/ST/PWD/మహిళలు/మాజీ-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఫీజు నుండి మినహాయింపు ఉంది.

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ట్రేడ్ టెస్ట్, సర్టిఫికెట్ల పరిశీలన, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 07-02-2024.

పోస్ట్ ద్వారా దరఖాస్తు ఫారమ్‌లను పంపడానికి చివరి తేదీ: 20.02.2024.

Details :

CSIR- సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్- రూర్కీ డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తుంది.
వివరాలు:

* టెక్నికల్ అసిస్టెంట్: 24 పోస్టులు

అర్హత: డిప్లొమా (సివిల్/ ఆర్కిటెక్చర్/ ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్స్/ మెకానికల్ ఇంజినీరింగ్), బీఎస్సీ (ఫిజిక్స్/ కెమిస్ట్రీ/ జియాలజీ).

Salary details: నెలకు రూ.35,400 – రూ.1,12,400.

Age limit: 28 ఏళ్లు మించకూడదు.

Fee for application: రూ.100. SC/ST/PWD/మహిళలు/మాజీ-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఫీజు నుండి మినహాయింపు ఉంది.

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ట్రేడ్ టెస్ట్, సర్టిఫికెట్ల పరిశీలన, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 07-02-2024.

పోస్ట్ ద్వారా దరఖాస్తు ఫారమ్‌లను పంపడానికి చివరి తేదీ: 20.02.2024.

Details : https://cbri.res.in/

ఇంటి నుంచే వ్యాపారం .. 2 లక్షలు ఉంటే చాలు.. ఊహకందని లాభాలు మీ సొంతం ..

ఈరోజుల్లో చదువుకున్న వాళ్లంతా ఉద్యోగం చేస్తూనే ఏదో ఒక వ్యాపారం చేసే ధోరణిలో ఉన్నారు. కరోనా కారణంగా, ఉద్యోగాలకు ఇకపై హామీ లేదు. పని ఎక్కువ, జీతం తక్కువ..సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తున్న వారి పరిస్థితి మరీ దారుణం.

గత రెండేళ్లలో సొంతంగా వ్యాపారం చేయాలనుకునే వారి సంఖ్య గణనీయంగా పెరిగినట్లు గణాంకాలు చూస్తే తెలుస్తుంది . మీకు కూడా ఇదే ఆలోచన ఉంది ఉంటే.. ఈ బిజినెస్ ఐడియా మీకోసమే..! పెట్టుబడి కూడా తక్కువే. వివరాలు ఏంటో చూద్దాం.!

ధరలు గరిష్ట స్థాయికి చేరుకున్నప్పుడు, ప్రతి వంటకంలో ఉల్లిపాయలు చాలా అరుదు. ఉల్లి గడ్డలకు ఏటా డిమాండ్ బాగానే ఉంటుంది. ఉల్లి ముద్దకు మార్కెట్లోనూ డిమాండ్ పెరుగుతుంది. మీరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకుంటే, మీరు ఉల్లిపాయ పేస్ట్ వ్యాపారాన్ని ఎంచుకోవచ్చు.

ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ (KVIC) ఉల్లి పేస్ట్ తయారీ వ్యాపారంపై ప్రాజెక్ట్ నివేదికను సిద్ధం చేసింది. దీని ప్రకారం రూ.4.19 లక్షల నుంచి ఈ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. వ్యాపారం ప్రారంభించడానికి మీ వద్ద డబ్బు లేకపోతే, మీరు ప్రభుత్వ ముద్రా పథకం నుండి రుణం పొందవచ్చు. కెవిఐసి నివేదిక ప్రకారం ఉల్లి పేస్ట్ తయారీ యూనిట్ ఏర్పాటుకు మొత్తం రూ.4,19,000 అవసరం.
ఇందులో బిల్డింగ్ షెడ్ నిర్మాణానికి రూ.1 లక్ష, పరికరాలు (ఫ్రైయింగ్ పాన్, ఆటోక్లేవ్ స్టీమ్ కుక్కర్, డీజిల్ ఫర్నేస్, స్టెరిలైజేషన్ ట్యాంక్, చిన్న కుండలు, మగ్గులు, కప్పులు మొదలైనవి) కోసం రూ.1.75 లక్షలు ఖర్చు చేస్తారు. ఈ యూనిట్లో సంవత్సరానికి 193 క్వింటాళ్ల ఉల్లి పేస్ట్ ఉత్పత్తి అవుతుంది. 5.79 లక్షలు విలువ చేసే క్వింటాల్కు రూ.3,000. ఈ విధం గా ఈ వ్యాపారం ఇంటినుంచి చేసే అవకాశం కలదు. దీనిలో మీకు ఊహించని లాభాలు ఖచ్చితం గా ఉంటాయి.

Personal Loan: ఎటువంటి పత్రాలు లేకుండా భారీ రుణం.. వడ్డీ తక్కువే.. ఈ బ్యాంకులు ట్రై చేయండి..

వివాహాలు లేదా అత్యవసరంగా విదేశాలకు వెళ్లడం వంటి అత్యవసర నగదు అవసరాల కోసం, ఆసుపత్రి బిల్లుల కోసం వ్యక్తిగత రుణాలు ఉపయోగపడతాయి.
అయితే ఇవి అన్సెక్యూర్డ్ రుణాలు. అంటే ఈ రుణాలపై తనఖా లేదా పూచీకత్తు లేదు. అందుకే బ్యాంకులు ఇతర సెక్యూర్డ్ రుణాలతో పోలిస్తే వీటిని మంజూరు చేయడానికి అధిక వడ్డీని వసూలు చేస్తాయి.
పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. అన్నీ అనుకున్నట్లు జరగవు. కొన్నిసార్లు పరిస్థితులు సవాళ్లను విసురుతాయి. ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో.. అత్యవసరంగా నగదు అవసరం కావచ్చు. ఇలాంటి సందర్భాల్లో బ్యాంకు రుణాలు మనకు ఉపయోగపడతాయి. బ్యాంకుల్లో అనేక రకాల రుణాలు అందుబాటులో ఉన్నాయి. కారు, ఇల్లు, విద్య మొదలైన రుణ సౌకర్యాలు ఉన్నాయి. కానీ వీటికి ఆయా కారణాల రీత్యా రుణాలు ఇస్తారు. ఇవే కాకుండా బంగారంపై రుణాలు, వ్యక్తిగత రుణాలు కూడా ఉన్నాయి.
కానీ ప్రతి ఒక్కరికీ బంగారం ఉండదు. ఈ క్రమంలో, అత్యవసర ఆర్థిక పరిస్థితుల్లో పర్సనల్ లోన్ సహాయపడుతుంది. వివాహాలు లేదా అత్యవసరంగా విదేశాలకు వెళ్లడం వంటి అత్యవసర నగదు అవసరాల కోసం, ఆసుపత్రి బిల్లుల కోసం వ్యక్తిగత రుణాలు ఉపయోగపడతాయి.

అయితే ఇవి అన్సెక్యూర్డ్ రుణాలు. అంటే ఈ రుణాలపై తనఖా లేదా పూచీకత్తు లేదు. అందుకే బ్యాంకులు ఇతర సెక్యూర్డ్ రుణాలతో పోలిస్తే వీటిని మంజూరు చేయడానికి అధిక వడ్డీని వసూలు చేస్తాయి. ఉదాహరణకు, కరూర్ వైశ్యా బ్యాంక్ సెక్యూర్డ్ రుణాలపై సంవత్సరానికి 11 శాతం మరియు అన్సెక్యూర్డ్ వ్యక్తిగత రుణాలపై 13-14 శాతం వసూలు చేస్తుంది.

కానీ వారు వసూలు చేసే రేటు దరఖాస్తుదారు క్రెడిట్ స్కోర్, బ్యాంక్తో సంబంధం, యజమాని వర్గం (MNC/ ప్రభుత్వం/ రక్షణ మొదలైనవి) వంటి అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఈ నేపథ్యంలో, ప్రధాన బ్యాంకులు తమ అధికారిక వెబ్సైట్లలో వెల్లడించిన వడ్డీ రేట్ల ఆధారంగా వ్యక్తిగత రుణాలపై తక్కువ వడ్డీ రేట్లను అందించే బ్యాంకుల వివరాలను మేము మీకు అందిస్తున్నాము.

ICICI Bank.. మన దేశంలో రెండో అతిపెద్ద ప్రైవేట్ రుణదాత ఈ బ్యాంక్ వ్యక్తిగత రుణాలపై సంవత్సరానికి 10.65 శాతం నుంచి 16 శాతం వరకు వసూలు చేస్తుంది. ఇక్కడ ప్రాసెసింగ్ ఛార్జీలు 2.50 శాతం వరకు ఉంటాయి.

HDFC Bank.. దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ప్రాసెసింగ్ ఛార్జీలను రూ. 4,999 కానీ వడ్డీ రేటుగా 10.5 నుండి 24 శాతం వసూలు చేస్తుంది.

State Bank of India (SBI) కార్పొరేట్ దరఖాస్తుదారులకు 12.30 నుండి 14.30 శాతం వడ్డీ రేటును వసూలు చేస్తుంది. అయితే, ఉద్యోగులు, CLACEలు మరియు ప్రభుత్వ విభాగాలకు, వడ్డీ రేటు సంవత్సరానికి 11.30 నుండి 13.80 శాతం. ఇది రక్షణ సిబ్బందికి సంవత్సరానికి 11.15 నుండి 12.65 శాతం రాయితీ రేటుతో వ్యక్తిగత రుణాలను అందిస్తుంది.

Bank of Baroda ప్రైవేట్ రంగ ఉద్యోగులకు (బ్యాంకుతో అనుబంధంగా ఉన్న) వ్యక్తిగత రుణాలను సంవత్సరానికి 13.15 నుండి 16.75 శాతం వరకు అందిస్తుంది. అయితే, ఇది ప్రభుత్వ ఉద్యోగులకు సంవత్సరానికి 12.40 నుండి 16.75 శాతం సబ్సిడీ రేటుతో రుణాలను అందిస్తుంది. బ్యాంకుతో సంబంధం లేని ప్రైవేట్ రంగ ఉద్యోగులకు ఏడాదికి 15.15 నుంచి 18.75 శాతం వడ్డీ రేటుతో రుణాలు ఇస్తారు.

Punjab National Bank..రుణగ్రహీత క్రెడిట్ స్కోర్ ఆధారంగా సంవత్సరానికి 13.75 నుండి 17.25 శాతం మధ్య మారుతూ ఉంటుంది. అదే సమయంలో, ప్రభుత్వ ఉద్యోగులకు 12.75 శాతం నుండి 15.25 శాతం మధ్య రాయితీ వడ్డీ రేటును అందిస్తారు.

Kotak Mahindra Bank..ఈ ప్రైవేట్ రుణదాత తన వ్యక్తిగత రుణాలపై సంవత్సరానికి కనీసం 10.99 శాతం వడ్డీ రేటును వసూలు చేస్తుంది. అయితే, లోన్ ప్రాసెసింగ్ ఛార్జీలు లోన్ మొత్తంలో 3 శాతం మరియు ఇతర పన్నులు ఉంటాయి.

Karur Vysya Bank.. అన్సెక్యూర్డ్ పర్సనల్ లోన్లపై వడ్డీ రేట్లు సంవత్సరానికి 13 శాతం నుంచి ప్రారంభమవుతాయి. ఈ రేట్లు డిసెంబర్ 31, 2023 నుండి అమలులోకి వస్తాయి.

S Bank..ఈ బ్యాంక్ వడ్డీ రేటును సంవత్సరానికి 10.49 శాతం నుండి వసూలు చేస్తుంది. పదవీకాలం 72 నెలల వరకు ఉంటుంది. రుణగ్రహీత కొంత భాగాన్ని తిరిగి చెల్లించవచ్చు. రూ. 50 లక్షల వరకు రుణం మంజూరు చేస్తుంది.

Axis Bank.. ఈ బ్యాంక్ తన వ్యక్తిగత రుణాలపై సంవత్సరానికి 10.65 శాతం నుంచి 22 శాతం వడ్డీ రేటును వసూలు చేస్తుంది.

IndusInd Bank.. ఈ బ్యాంకులో వడ్డీ రేటు 10.49 శాతం నుంచి ప్రారంభమవుతుంది. ప్రాసెసింగ్ ఛార్జీలు 3 శాతం వరకు ఉంటాయి. రుణం మొత్తం రూ. 30,000 నుండి రూ. 50 లక్షల మధ్య అందిస్తుంది.

BIG BREAKING: యూపీ నుంచి రాజ్యసభకు మెగాస్టార్ చిరంజీవి!

లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ దేశ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. జాతీయ పార్టీలు ప్రాంతీయ పార్టీలతో పొత్తు పెట్టుకుని రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో సత్తా చాటేందుకు సమాయత్తమవుతున్నాయి.
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మరోసారి విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టాలని ఉవ్విళ్లూరుతోంది. ఈ క్రమంలోనే ఏపీపై ప్రధానంగా ఫోకస్ పెట్టింది. అక్కడ ప్రాంతీయ పార్టీ అయిన పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేనతో పొత్తు పెట్టుకుంది. ప్రధాని నరేంద్ర మోడీపై ఉన్న అభిమానాన్ని ఓట్ల రూపంలో రాబట్టేందుకు బీజేపీ పక్కాగా ప్రణాళికలు సిద్దం చేస్తోంది.

ఈ మేరకు ఏపీలో ఉన్న కాపు సామాజికవర్గాన్ని తమ ఓటు బ్యాంకుగా మలుచుకునేందుకు మెగాస్టార్ చిరంజీవిని బీజేపీ తరపున రాజ్యసభకు పంపనున్నట్లుగా తెలుస్తోంది. ఈ పరిణామంతో ఏపీ తమ పార్టీకి కొత్త ఊపు వస్తుందని బీజేపీ పెద్దలు అంచనా వేస్తున్నారు. ఆ పథకంలో భాగంగానే ఇటీవలే ఆయనను రామమందిర ప్రాణ ప్రతిష్టకు హాజరు కావాలంటూ ప్రత్యేక ఆహ్వానం కూడా పంపింది. అదేవిధంగా దేశ రెండో అత్యున్నత పురస్కారమైన పద్మ విభూషణ్‌ పురస్కారాన్ని సైతం కట్టబెట్టింది. అదేవిధంగా ఇప్పటి వరకు రాజ్యసభ సభ్యుడిగా కొనసాగిన జీవీఎల్‌ నరసింహారావు స్థానంలో మెగాస్టార్ చిరంజీవిని పెద్దల సభకు పంపనున్నట్లుగా సమాచారం. అయితే, బిహార్‌లో కూడా బీజేపీ సరిగ్గా ఇలాంటి స్ట్రాటజీనే అమలు చేసింది. అక్కడ జననేతగా పేరుపొందిన మాజీ మఖ్యమంత్రి కర్పూరి ఠాకూర్‌కు దేశ అత్యున్నత పురస్కారమైన భారతరత్న పురస్కారాన్ని ప్రకటించింది.

Indian Railway Jobs 2024: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. రైల్వే పోస్టులకు 3 ఏళ్ల వయసు పెంపు..!

Indian Railway Jobs 2024: ఇండియన్‌ రైల్వే ఇటీవల విడుదల చేసిన అసిస్టెంట్ లోకో పైలెట్‌ నోటిఫికేషన్‌కు సంబంధించి మూడేళ్ల వయసు సడలింపు చేసింది. మొత్తం 5,696 అసిస్టెంట్ లోకో పైలట్ల (ALP) భర్తీకి నోటిఫికేషన్‌ రిలీజ్‌ చేసిన సంగతి తెలిసిందే.
రైల్వే నెట్‌వర్క్ విస్తరిస్తున్న కొద్దీ సిబ్బంది నియామకాలు పెరుగుతాయని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఇటీవల తెలిపారు. గతంలో 30 సంవత్సరాల వరకు వయోపరిమితి ఉన్న అభ్యర్థులు మాత్రమే ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి అర్హులు. కానీ ఇప్పుడు 3 సంవత్సరాల సడలింపుతో గరిష్ట వయోపరిమితి 33 ఏళ్లుగా మారింది.

ఈ పోస్టుల కోసం జనవరి 31 నుంచి ఆన్‌లైన్‌లో అప్లికేషన్‌ ప్రక్రియ ప్రారంభమైంది. చివరితేదీ 19 ఫిబ్రవరి 2024గా నిర్ణయించారు. వయోపరిమితి జూలై 1, 2024 నుంచి లెక్కిస్తారు. ఇది కాకుండా ALP రిక్రూట్‌మెంట్ ప్రతి సంవత్సరం నిర్వహిస్తామని ప్రకటించారు. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల చేరిక వెంటనే జరుగుతుంది. దీని కోసం వారు వేచి ఉండాల్సిన అవసరం లేదు.

ఎంపిక ప్రక్రియ
1. మొదటి దశ CBT (కంప్యూటర్ ఆధారిత పరీక్ష)

2. రెండవ దశ CBT

3. కంప్యూటర్ ఆధారిత ఆప్టిట్యూడ్ టెస్ట్

4. డాక్యుమెంట్ వెరిఫికేషన్

అప్లికేషన్ గురించి మాట్లాడితే రూ. 500 అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. CBT 1 పరీక్షలో పాల్గొన్న వారికి రూ.400 వాపసు ఇస్తారు. ఎస్సీ, ఎస్టీ, మహిళలు, ఈబీసీ, వికలాంగ కేటగిరీ అభ్యర్థులు రూ.250 దరఖాస్తు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. CBT 1 పరీక్షకు హాజరైన వారికి మొత్తం రూ. 250 తిరిగి ఇస్తారు.

జగన్‌కు మరో షాక్..వైసీపీకి బాలినేని గుడ్ బై…?

సార్వత్రిక ఎన్నికల ముందు అధికార వైసీపీ పార్టీకి వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే టికెట్ దక్కని నేతలు , అసంతృప్తి నేతలు వరుసగా పార్టీని వీడుతుండగా , తాజాగా టికెట్ హామీ ఉన్న నేతలు సైతం వైసీపీని వీడుతున్నారు.
తాజాగా ఈ లిస్ట్‌లో పార్టీ కీలక నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పేరు వినిపిస్తోంది.

ఆయన వైసీపీకి గుడ్ బై చెప్పడానికి రెడీ అయ్యారనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వచ్చే ఎన్నికల్లో పార్టీ అధిష్టానం బాలినేనికి ఒంగొలు అసెంబ్లీ టికెట్ ఖారారు చేశారు. అయితే ఆయన తన టికెట్‌తో పాటు ,ఒంగోలు ఎంపీ సీటు విషయంలో పట్టుపడుతున్నారనే విషయం అందరికి తెలిసిందే. సిట్టింగ్ ఎంపీ మాగుంటకు తిరిగి టిక్కిట్ ఇప్పించుకోవడానికి బాలినేని విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.

2019 ఎన్నికల ముందు మాగుంటను టీడీపీ నుంచి వైసీపీలోకి తీసుకురావడంలో ఆయనే కీలక పాత్ర పోషించారు. అయితే అభ్యర్థుల మార్పుల్లో భాగంగా మాగుంటకు టికెట్ లేదని పార్టీ అధిష్టానం చెప్పడంతో బాలినేని రంగంలోకి దిగారు. మాగుంట సీటు విషయంలో సీఎం జగన్‌తో బాలినేని పలుమార్లు భేటీ అయినప్పటికీ ఫలితం లేకపోయింది. మాగుంట స్థానంలో చెవిరెడ్డిని ఒంగోలు అభ్యర్థిగా ప్రకటిస్తారనే ప్రచారం జరుగుతుంది.

దీనిపై మరోసారి సీఎం జగన్‌ను కలవడానికి సీఎంఓ కార్యాలయానికి వచ్చిన బాలినేనికి ఛేదు అనుభవమే ఎదురైందని తెలుస్తోంది. సీఎం బిజీగా ఉన్నారని కలవరని చెప్పడంతో బాలినేని నిరాశగా వెనుతిరగడం జరిగింది. ఈక్రమంలోనే మాగుంటకు సీటు లేదని వైసీపీ పెద్దలు బాలినేనికి తేల్చి చెప్పినట్టుగా తెలుస్తోంది.

మాగుంట అంశాన్ని తేల్చిసిన వైసీపీ అధిష్టానం నెల్లూరు, ఒంగోలు కొత్త ఇన్‌ఛార్జ్‌గా చెవిరెడ్డిని నియమిస్తున్నామని బాలినేనికి స్పష్టం చేశారట. దీంతో ఒంగోలు ఎంపీ సీటు మాగుంటకు కాకుండా చెవిరెడ్డికి ఇస్తున్నారని సమాచారం అందుకున్న బాలినేని వైసీపీని వీడటానికి సిద్దపడినట్టుగా తెలుస్తోంది. వైసీపీ పెద్దలపై ఆగ్రహం వ్యక్తం చేసిని బాలినేని ..మాగుంటకు సీటు లేకపోతే తనకు ఫోన్ చేయవద్దని పార్టీ నేతలకు స్పష్టం చేసినట్టుగా సమాచారం అందుతుంది.

సీఎం పిలిచినా రాను అని బాలినేని ఖరాఖండిగా చెప్పేశారట. బాలినేనితో చర్చించడానికి ప్రయత్నించినప్పటికీ ఆయన వైసీపీ నేతలకు అందుబాటులో లేరని సమాచారం. ఈ ఘటన అనంతరం ఆయన హుటాహుటిన విజయవాడ నుంచి హైదరాబాద్ బయల్దేరారని తెలుస్తోంది.

By Naresh K Oneindia
source: oneindia.com

రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి సరికొత్త క్లాసిక్ 350 బాబర్‌

లగ్జరీ బైకుల తయారీ కంపెనీ రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి కొత్త మోడల్ విడుదల కాబోతుంది. దీని పేరు ‘క్లాసిక్ 350 బాబర్‌.
ప్రస్తుతం క్లాసిక్ 350 మోడల్ అందుబాటులో ఉండగా, ఇప్పుడు దీనిలో బాబర్ డిజైన్‌ను తీసుకొస్తున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు ఆన్‌లైన్‌లో కనిపించాయి. ఈ కొత్త బైక్ ఇండియాలో 2024 ద్వితీయార్థం నాటికి మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. అంచనాల ప్రకారం, దీని ధర రూ.

2.2 లక్షలు. ‘క్లాసిక్ 350 బాబర్‌’ 350cc ఇంజన్‌ను కలిగి ఉంటుంది. దీని బాడీ క్లాసిక్ 350 లాగే ఉన్నప్పటికి ఇది పొడవాటి హ్యాండిల్‌బార్, మెరుగైన సీటింగ్‌, LED టర్న్ ఇండికేటర్‌లు, రిమూవబుల్ పిలియన్ సీటు వంటి సదుపాయాలతో వస్తుంది. స్టైలిష్ డిజైన్ కావాలనుకునే వారికి ఇది బాగా నచ్చుతుందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఈ మోడల్ మార్కెట్లోకి విడుదల అయితే జావా పెరాక్, 42 బాబర్ వంటి ఇతర బైక్‌లకు గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది.

Income Tax: Ramanjaneyulu Income Tax Software = రామాంజనేయులు ఇన్కమ్ టాక్స్ సాఫ్ట్ వేర్ 2023-24 తో మీ టాక్స్ ఎంతో లెక్కించండి

Ramanjaneyulu Income Tax Software 2023
రామాంజనేయులు ఇన్‌కమ్ ట్యాక్స్ సాఫ్ట్‌వేర్ 2023, 2024-2025 అసెస్‌మెంట్ ఇయర్, 2023-24 ఆర్థిక సంవత్సరానికి ఇక్కడి నుంచి ఐటీని లెక్కించడానికి. ఆదాయపు పన్ను సాఫ్ట్‌వేర్ 2024 IT AP మరియు తెలంగాణ ఉపాధ్యాయులు మరియు ఉద్యోగుల తాజా తుది వెర్షన్‌ను అందిస్తుంది. IT ప్రోగ్రామ్ ఫైల్‌లో ఇవ్వబడిన IT సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించడం కోసం సూచనలను అనుసరించాలి. IT బిల్లు తయారీకి ఎల్లప్పుడూ కొత్త కాపీని ఉపయోగించండి.

“AP ఎంప్లాయీస్ IT కాలిక్యులేటర్” అనేది భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్‌లోని ఉద్యోగుల ఆదాయపు పన్నును లెక్కించడానికి ఉపయోగించే కాలిక్యులేటర్‌ని సూచిస్తుంది. ఈ కాలిక్యులేటర్ యొక్క ఖచ్చితమైన వివరాలు మరియు ప్రత్యేకతలు ఆ సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో అమలులో ఉన్న పన్ను చట్టాలు మరియు నిబంధనలపై ఆధారపడి ఉంటాయి. మీరు ఈ కాలిక్యులేటర్‌ని ఉపయోగించాలనుకునే ఉద్యోగి అయితే, మరింత సమాచారం కోసం మీరు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లేదా భారత ఆదాయపు పన్ను శాఖ వెబ్‌సైట్‌ని తనిఖీ చేయవచ్చు.
2024 ఆర్థిక సంవత్సరానికి ఆదాయపు పన్ను రేట్లు | అసెస్‌మెంట్ సంవత్సరం 2024-25

అసెస్‌మెంట్ ఇయర్ 2024 మరియు 2023-24 ఆర్థిక సంవత్సరంలో వ్యక్తిగత వ్యక్తులకు ఆదాయపు పన్ను స్లాబ్ రేటు మరియు మినహాయింపు పరిమితిలో ఎటువంటి మార్పు లేదు. ఎడ్యుకేషన్ సెస్ మరియు సెకండరీ 2% & హయ్యర్ ఎడ్యుకేషన్ సెస్ 1% రేటులో ఎటువంటి మార్పు లేదు. భారతదేశం యొక్క అధికారిక ఆదాయపు పన్ను పారిశ్రామిక ఆదాయపు పన్ను. హౌసింగ్ లోన్ ప్రిన్సిపల్ అమౌంట్ మినహాయింపు మరియు హౌసింగ్ లోన్ వడ్డీ తగ్గింపు ఆదాయపు పన్ను 2024. ఎడ్యుకేషనల్ లోన్ మరియు ఇద్దరు పిల్లల ట్యూషన్ ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు పన్ను లేదు.

80C & 80CCE- గరిష్టంగా రూ.150000 వరకు మినహాయింపు
PF, VPF, PPF, NPSలో ఉద్యోగుల సహకారం, ఇన్సూరెన్స్ ప్రీమియం, హౌసింగ్ లోన్ ప్రిన్సిపల్ రీపేమెంట్, NSC, ELSS, దీర్ఘకాలిక బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్, పోస్ట్ ఆఫీస్ టర్మ్ డిపాజిట్ మొదలైన వాటిలో రూ.1.5 లక్షల వరకు పెట్టుబడులు పన్ను పరిధిలోకి వస్తాయి. ఆదాయం. వ్యక్తిగత వస్తువులపై పరిమితి లేదు, (ఉదాహరణకు) మొత్తం 1 లక్ష NSC లేదా PPF మొదలైన వాటిలో పెట్టుబడి పెట్టవచ్చు.

Flash… Budget 2024: 8 లక్షల వరకు టాక్స్ లేదు..? బడ్జెట్ 2024
ప్రావిడెంట్ ఫండ్ (PF) & వాలంటరీ ప్రావిడెంట్ ఫండ్ (VPF)
పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ (PLI)
APGLI / TGLI
జీవిత బీమా ప్రీమియంలు
యూనిట్-లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF)
నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ (NSC)
హోమ్ లోన్ ప్రిన్సిపల్ రీపేమెంట్ & స్టాంప్ డ్యూటీ మరియు రిజిస్ట్రేషన్
ఇద్దరు పిల్లలకు ట్యూషన్ ఫీజు
ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్ (ELSS)
5 సంవత్సరాల బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లు (FDలు)
పెన్షన్ ఫండ్స్ లేదా పెన్షన్ పాలసీలు – సెక్షన్ 80CCC
ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ బాండ్‌లు
నాబార్డ్ గ్రామీణ బాండ్లు
సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ 2004 (SCSS)

Download…..IT Software AP

Download…..IT Software TS

KSS PRASAD Final ఇన్కమ్ టాక్స్ సాఫ్ట్వేర్ వచ్చేసింది.. మీ టాక్స్ ఎంతో లెక్క వేసుకోండి..

KSS PRASAD Final ఇన్కమ్ టాక్స్ సాఫ్ట్వేర్ వచ్చేసింది.. మీ టాక్స్ ఎంతో లెక్క వేసుకోండి..
Flash.. Download KSS Prasad Final Income Tax Software Updated on December 27th.

ప్రతి ఒక్క ఎంప్లాయి లేదా ఆదాయం పొందేవారు ప్రతి సంవత్సరం కూడా డిసెంబర్ నెల వచ్చేసరికి తన ఆదాయ పన్ను ఎలా లెక్కించాలి తన ఏడాది ఆదాయానికి ఎంత పన్ను పడుతుంది, పన్ను మినహాయింపులు ఏంటి అనేటువంటి లెక్కలు వేసుకొని వారి యొక్క ఇన్కమ్ టాక్స్ ని క్యాలిక్యులేట్ చేసుకోవడం అవసరం.

ఈ క్రమంలో ప్రతి ఒక్క ఉద్యోగి తన యొక్క ఆదాయ పన్నుని క్యాలిక్యులేట్ చేసుకొనుట కొరకు మనకి అనేక రకాలైనటువంటి సాఫ్ట్వేర్లు అందుబాటులో ఉన్నాయి అలాగే ఇన్కమ్ టాక్స్ ఇండియా అనే వెబ్సైట్లో కూడా అధికారికంగా మనం మన యొక్క ఆదాయం పన్ను లెక్కించుకోవడానికి అవకాశం కూడా ఉంది. కానీ మనకి ఈజీగా ఎక్సెల్ లో మన ఆదాయప్పను లెక్కించుకోవడానికి చాలామంది నిపుణులు ఎక్సెల్ లోనే సాఫ్ట్వేర్ తయారుచేసి చాలా ఈజీగా మన యొక్క ఆదాయప్పను లెక్క వేయుటకు అవకాశం కల్పిస్తున్నారు.

వీరిలో మనం చెప్పుకోదగిన వారు కేఎస్ఎస్ ప్రసాద్ అనేవారు. ఈయన ప్రతి ఏడాది ఉద్యోగులకి అతి సులువుగా టాక్స్ లేక్కించడం అనే ఎక్సెల్ సాఫ్ట్వేర్ ని చాలా యూజర్ ఫ్రెండ్లీగా తయారుచేసి అందుబాటులో ఉంచడం జరుగుతుంది.

2023-24 ఆర్థిక సంవత్సరానకి ఈయన ఆదాయపన్ను లెక్కింపు సాఫ్ట్వేర్ ని తయారు చేసి ట్రైన్ ని రిలీజ్ చేశారు ఈ ట్రైలర్స్ ని మనం వాడుకొని మన ఆదాయం టాక్స్ ఎంతో చూసుకోవచ్చు.

ఇవే కాకుండా చాలామంది నిపుణులు వాళ్ళ యొక్క ఇన్కమ్ టాక్స్ సాఫ్ట్వేర్ ని కూడా అందుబాటులో ఉంచడం జరుగుతుంది. ఎప్పటికప్పుడు MannamWeb.com మీకు అందిస్తూ వారి యొక్క అప్డేటెడ్ సాఫ్ట్వేర్ ని కూడా ఈ యొక్క పేజీలో మీకోసం అందించడం జరుగుతుంది.

Download KSS Prasad IT Software LINK

Pillow benefits: కాళ్ల కింద దిండు పెట్టుకుని పడుకుంటే ఈ నొప్పి వెంటనే మాయమవుతుంది.. ఇతర ప్రయోజనాలు తెలుసుకోండి..

Pillow benefits: నిరంతరం పని చేయడం వల్ల మనం చాలా అలసిపోతాం. చాలా సార్లు మనకు అలసట వల్ల విపరీతమైన కాలు నొప్పి వస్తుంది. కాళ్ల నొప్పుల (కాలు నొప్పి) వల్ల మనం సరిగ్గా నిద్రపోలేము.

మన నిద్రని కూడా ఆస్వాదించలేము. దీనితో పాటు, చాలా మంది మహిళలు గర్భధారణ (గర్భధారణ) సమయంలో వారి పాదాల కింద ఒక దిండు (పిల్లో)ను ఉంచి నిద్రించడం మీరు తరచుగా చూస్తారు. అయితే ఇలా ఎందుకు చేస్తుందో ఎప్పుడైనా ఆలోచించారా? కాబట్టి ఈ రోజు మనం మన పాదాల క్రింద దిండు పెట్టుకుని పడుకోవడం వల్ల మనం పూర్తిగా రిలాక్స్ అవుతాము.

కానీ ఈ విధంగా, అంటే మీరు కూడా మీ పాదాల కింద దిండు పెట్టుకుని పడుకుంటే, మీరు కూడా పూర్తిగా ఒత్తిడి లేకుండా ఉంటారు. ఈ విషయం గర్భిణీ స్త్రీలకే కాదు ప్రతి ఒక్కరికీ ఎంతో మేలు చేస్తుంది. అందుకే పాదాల కింద దిండు పెట్టుకుని పడుకోవడం వల్ల శరీరానికి ఎలాంటి లాభాలు కలుగుతాయో తెలుసుకోండి…

కాళ్లవాపు తగ్గుతుంది..

తరచుగా ప్రజలు చాలా అలసిపోయినప్పుడు పాదాల వాపును పొందుతారు. అలసట వల్ల కాళ్ల నొప్పులు నిత్యం వస్తుంటాయి, రాత్రి పడుకునేటప్పుడు కాళ్లకింద దిండు పెట్టుకుని పడుకుంటే కాళ్లలో వాపు తగ్గుతుంది. వెరికోస్ వెయిన్స్ అతిగా శ్రమపడటం వల్ల కలుగుతాయి, దీని వల్ల కండరాలలో వాపు వస్తుంది.

లోయర్ బ్యాక్ పెయిన్..

డెస్క్‌పై ఎక్కువ సమయం పని చేయడం వల్ల చాలా మందికి వెన్నునొప్పి వస్తుంది. ఇలాంటప్పుడు పాదాల కింద దిండు పెట్టుకుని నిద్రిస్తే వెన్నునొప్పి తగ్గి రిలాక్స్‌గా అనిపిస్తుంది.

సయాటికా..

డిస్క్ పెయిన్..

మీరు డిస్క్ నొప్పితో చాలా అలసిపోయినట్లయితే, ఇది మీకు ఉత్తమమైనది. ఇలా దిండుపై కాళ్లు పెట్టుకుని నిద్రపోతే డిస్క్ పాన్ నుంచి ఉపశమనం పొంది రిలాక్స్ అవుతారు

మెరుగైన రక్తప్రసరణ..

శరీరంలో రక్త ప్రసరణ బాగా జరగడం చాలా ముఖ్యం. ఈ విషయంలో మీ శరీరంలో ఏదైనా లోపం ఉంటే, మీరు మీ పాదాల క్రింద ఒక దిండును ఉంచి, ఆపై నిద్రించండి. ఈ స్థితిలో పడుకోవడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది మరియు కాళ్ళలో మంట కూడా తగ్గుతుంది. ( నిరాకరణ : ఈ కథనం ప్రజల విశ్వాసాలు , ఇంటర్నెట్‌లో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింద.)

Boiled Eggs: ఉడకబెట్టేటప్పుడు గుడ్లు పగిలిపోతున్నాయా? అయితే ఈ సింపుల్‌ టిప్స్ మీకోసమే..

Egg Benefits: గుడ్లు మన శరీరానికి ఎంత మేలు చేస్తాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గుడ్లు చాలా ముఖ్యమైన పోషకాలను కలిగి ఉంటాయి. అందుకే వైద్యులు కూడా రోజుకు ఒకటి లేదా రెండు గుడ్లు తినాలని సిఫార్సు చేస్తున్నారు.
ఇక చిన్న పిల్లలకు ఆహారంలో గుడ్లు కచ్చితంగా ఉండాల్సిందే. వీటిని తినడం వల్ల పిల్లలు రోజంతా యాక్టివ్‌గా ఉంటారు. మెదుడు కూడా బాగా పనిచేస్తుంది. ఫలితంగా వారు చదువులో మరింత చురుకుగా మారుతారు. చాలామంది గుడ్లను ఉడకబెట్టడం, ఆమ్లెట్లు ..ఇలా చాలా రూపాల్లో తీసుకుంటారు. ఇక చాలా ఇళ్లల్లో ప్రజలు అల్పాహారంలో గుడ్లు తినడానికి ఇష్టపడతారు. అలాంటి వారికి ఉడకబెట్టిన గుడ్లు మంచి ఛాయిస్‌. పైగా ఉడకబెట్టిన గుడ్లలో శరీరానికి అవసరమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. రుచి కూడా అద్భుతంగా ఉంటుంది. అయితే చాలామంది గుడ్లు ఉడకబెట్టడంలో తెలిసో తెలియక కొన్ని పొరపాట్లు చేస్తుంటారు. ఫలితంగా అవి నీటిలోనే పగిలిపోతుంటాయి లేదా చెడిపోతుంటాయి. అయితే కొన్ని కిచెన్‌ ట్రిక్స్‌ పాటించడం ద్వారా గుడ్లు పగలకుండా చేయవచ్చు. మరి ఆ ఎఫెక్టివ్ కిచెన్ ట్రిక్స్ ఏంటో తెలుసుకుందాం రండి.

పెద్ద పాత్రలో

మీరు రెండు గుడ్లు ఉడకబెట్టాలనుకుంటున్నారా, అయితే దీని కోసం పెద్ద పరిమాణపు పాత్రను ఎంచుకోండి. ఇలా చేయడం ద్వారా, గుడ్లు ఉడకబెట్టేటప్పుడు ఒకదానికొకటి ఢీకొనవు. ఫలితంగా అవి పగిలిపోకుండా ఉంటాయి. అయితే కొందరు గ్యాస్ ఆదా చేయడానికి లేదా గుడ్లను త్వరగా ఉడకబెట్టడానికి చిన్న పరిమాణపు పాత్రలను ఉపయోగిస్తారు. ఇలా చేయడం వల్ల గుడ్లు త్వరగా పగిలిపోతాయి.

నీటిలో ఉప్పు

గుడ్లు ఉడకబెట్టే నీటిలో మొదట్లో ఉప్పు వేయాలని చాలా తక్కువ మందికి తెలుసు. వాస్తవానికి, ఉప్పును జోడిస్తే వంటకాలు చాలా రుచికరంగా ఉంటాయి. ఇక ఉప్పునీటిలో గుడ్లను ఉడకబెట్టడం వల్ల వాటి పెంకులను తొలగించడం సులభమవుతుంది. చాలా సార్లు ప్రజలు గుడ్లను ఉడకబెట్టిన తర్వాత వాటి తొక్కలను సరిగ్గా తీయలేరు. దీన్ని నివారించడానికి, గుడ్లు ఉడకబెట్టే నీటిలో కాసింత ఉప్పును కలపాలి.

నేరుగా అలా చేయకుండా..

గుడ్లను ఫ్రిజ్‌లో ఉంచడం సాధారణ విషయం. అయితే వాటిని నేరుగా ఉడకబెడితే పగిలిపోయే అవకాశం ఉంది. అందుకే ఫ్రిజ్‌ నుంచి గుడ్లను బయటకు తీసిన తర్వాత 10 లేదా 15 నిమిషాలు అలాగే వదిలివేయాలి. ఇలా చేయడం వల్ల వాటి ఉష్ణోగ్రత సాధారణ స్థితికి చేరుకుంటుంది. అలాగే ఎక్కువ సేపు మంటపై, పెద్ద మంటపై గుడ్లను ఉడకబెట్టకూడదు. ఎల్లప్పుడూ మీడియం మంటపైనే గుడ్లను ఉడకబెట్టాలి. దీంతో అవి పగిలిపోకుండా, బాగా ఉడకడానికి కూడా అవకాశం ఉంటుంది.

Epsom Salt Bath : స్నానం చేసే నీటిలో దీన్ని కాస్త వేసి స్నానం చేయండి.. ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో చూస్తారు..!

Epsom Salt Bath : మన శరీరానికి ఆహారం ఎంత అవసరమో నిద్ర కూడా అంతే అవసరం. శరీరానికి తగినంత నిద్ర లభించకపోయిన కూడా అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.
మనకు సుఖమైన నిద్ర కావాలంటే నిద్ర పోయే ముందు శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి. అంటే మనం స్నానం చేయాలి. మనం నిద్ర లేచిన దగ్గరి నుండి రాత్రి పడుకునే వరకు ఏదో ఒక పని చేసి అటు మానసికంగా, ఇటు శారీరకంగా అలసిపోతూ ఉంటాం.

అంతేకాకుండా పని చేయడం వల్ల కండరాల నొప్పులు, కీళ్ల నొప్పులు, ఒంటి నొప్పులు వంటివి కూడా వస్తూ ఉంటాయి.

ఒత్తిడి, అలాగే నొప్పులు తగ్గి మనకు చక్కగా నిద్ర పట్టాలంటే మనం నిద్రపోయే ముందు స్నానం చేయాలి. సాధారణ నీటితో కాకుండా మనం స్నానం చేసే నీటిలో కొద్దిగా ఎప్సమ్ సాల్ట్‌ ను వేసి ఆ నీటితో స్నానం చేయాలి.

ఇలా చేయడం వల్ల ఒత్తిడి తగ్గడంతో పాటు అలసట, నొప్పులు కూడా తగ్గుతాయి. మనకు మార్కెట్ లో ఎప్సమ్ ఉప్పు విరివిరిగా లభిస్తుంది. ఈ ఉప్పులో ఉండే మెగ్నీషియం అణువులు మన స్నానం చేసినప్పుడు మన శరీరంలోకి వెళ్లి వెంటనే పని చేయడం ప్రారంభిస్తాయి.

దీంతో కీళ్ల నొప్పులు, వాపులు, కండరాల నొప్పులు వెంటనే తగ్గుతాయి. దీంతో మన శరీరం తేలిక పడి చక్కటి నిద్ర పడుతుంది.

Epsom Salt Bath

అంతేకాకుండా ఈ ఉప్పు వేసిన నీటితో స్నానం చేయడం వల్ల శరీరం నుండి దుర్వాసన రాకుండా ఉంటుంది. చర్మం పొడి బారకుండా ఉంటుంది. ఈ ఎప్సమ్‌ ఉప్పుతో ఇతర ప్రయోజనాలు కూడా ఉన్నాయి.

రోజుకు రెండు పూటలా ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో ఒక టీ స్పూన్ ఎప్సమ్‌ ఉప్పును వేసి కలిపి తీసుకోవడం వల్ల ఆర్థరైటిస్ వల్ల కలిగే నొప్పులు తగ్గుతాయి. ఎముకలు కూడా దృఢంగా మారతాయి.

ఈ ఉప్పులో మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో పోషకాలు ఉంటాయి. రక్తప్రసరణ వ్యవస్థను మెరుగుపరచడంలో, గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో కూడా ఎప్సమ్‌ ఉప్పు మనకు సహాయపడుతుంది.

ఈ ఎప్సమ్‌ ఉప్పును తీసుకోవడం వల్ల శరీరం డీ హైడ్రేషన్ కు గురి కాకుండా ఉంటుంది. మలబద్దకం సమస్య తగ్గుతుంది. మైగ్రేన్ తలనొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది. రక్తపోటు అదుపులో ఉంటుంది.

ఈ విధంగా ఎప్సమ్‌ ఉప్పు మనకు ఎంతగానో ఉపయోగపడుతుందని దీనిని వాడడం వల్ల మనం చక్కటి ఫలితాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.

Nerve Weakness : నరాల బలహీనతను తగ్గించుకోవాలంటే.. దీన్ని రోజూ ఉదయం, సాయంత్రం తీసుకోవాలి..

Nerve Weakness : మనలో చాలా మందిని వేధిస్తున్న అనారోగ్య సమస్యల్లో నరాల బలహీనత సమస్య కూడా ఒకటి. ఈ సమస్య ఉన్న వారిలో కాళ్లు, చేతులు వణకడం, కళ్ల నుండి నీరు కారడం, గుండెదడ ఎక్కువగా ఉండడం, బరువులు మోయలేకపోవడం వంటి లక్షణాలు ఎక్కువగా కనిసిస్తాయి.
ఈ వ్యాధి నుండి బయట పడడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఎన్ని చేసినా నరాల బలహీనత సమస్యను అరికట్టలేక బాధపడే వారు మనలో చాలా మంది ఉండే ఉంటారు.

కొన్ని రకాల చిట్కాలను వాడడం వల్ల మనం నరాల బలహీనత సమస్య నుండి ఉపశమనాన్ని పొందవచ్చని నిపుణులు తెలియజేస్తున్నారు.

మనిషికి అష్టైశ్వర్యాలు ఉన్నా ఆరోగ్యం లేకపోతే వ్యర్థమే. అందుకే ఎప్పుడూ సంపాదన కోసం పాకులాడడమే కాదు ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా కాపాడుకోవాలని పెద్దలు చెబుతుంటారు.

మనిషిని పీడించే వ్యాధులు ఎన్ని ఉన్నా ఒక్క నరాల బలహీనత వ్యాధి ఉన్న వారి బాధలు వర్ణాతీతం అనే చెప్పాలి. ఎన్ని రకాల మందులు వాడినా నరాల బలహీనతను అరికట్టలేకపోతున్నారు.

ఈ సమస్యతో బాధపడే వారు క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. చెప్పులు లేకుండా గడ్డిలో నడవడం అలవాటు చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల నరాల్లో కదలికలు వచ్చి రక్తప్రసరణ మెరుగుపడి మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది.

Nerve Weakness

అలాగే ప్రతిరోజూ సూర్యోదయ సమయంలో వచ్చే ఎండలో ఉండాలి. మెగ్నీషియం అధికంగా ఉండే ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి. వాల్ నట్స్, పుచ్చకాయ, బచ్చలికూర, అరటి పండు వంటి ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి.

ఈ ఆహార పదార్థాలన్నీ నరాలను గట్టి పరచడంలో సహాయపడతాయి. అలాగే ప్రతిరోజూ కొద్ది దూరం నడవాలి. పాలల్లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది కనుక తప్పకుండా పాలను తాగాలి. గోరు వెచ్చని నీటిలో కొద్దిగా తేనె, నిమ్మరసం కలిపి తాగాలి.

అలాగే శరీరానికి కూడా మర్దనా చేసుకుంటూ ఉండాలి. షుగర్ వ్యాధి ఉన్నవారిలో, మద్యం తాగే వారిలోనూ, శాకాహారుల్లోనూ నరాల బలహీనత వ్యాధి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది.

కొన్ని రకాల జ్వరాల వల్ల కూడా నరాల బలహీనత సమస్య తలెత్తుతుంది. అలాంటి సమయంలో కొన్ని రకాల ఇన్ జెక్షన్ లను చేయించుకోవడం, ఫిజియోథెరపీ చేయించుకోవడం వంటివి చేయాలి.

అందరికీ కూడా ఇవి చేయించుకోవడం కూడా సాధ్యం కాదు. అలాంటి వారు ఈ ఇంటి చిట్కాలను పాటించడం వల్ల చక్కటి ఫలితాలను పొందవచ్చు. నరాల బలహీనతలను తగ్గించే ఇంటి చిట్కాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఇందుకోసం మనం నల్ల జీలకర్రను, మెంతులను, అశ్వగంధ వేరును ఉపయోగించాల్పి ఉంటుంది. ముందుగా ఒక జార్ లో 50 గ్రా.ల జీలకర్రను, 50 గ్రా. మెంతులను, 50 గ్రా.ల అశ్వగంధ వేరును వేసి మెత్తని పొడిలా చేసుకోవాలి.

ఈ పొడిని గోరు వెచ్చని నీటిలో కలిపి ఉదయాన్నే పరగడుపున తాగాలి. అలాగే రాత్రి భోజనం చేయడానికి అరగంట ముందు తాగాలి.

ఇలా క్రమం తప్పకుండా 21 రోజుల పాటు చేయడం వల్ల నరాల బలహీనత, వంటి నొప్పులు, ఉదర సంబంధిత సమస్యలు తగ్గు ముఖం పడతాయి.

పైన తెలిపిన చిట్కాలతో పాటు ఈ ఇంటి చిట్కాను కూడా పాటించడం వల్ల నరాల బలహీనత సమస్య నుండి త్వరితగతిన ఉపశమనం కలుగుతుందని వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు.

పెరిగే వయసుకు కళ్లెం వెయ్యాలా? ఇవి తప్పక తీసుకోవాల్సిందే!

ఏజింగ్ అనేది ఎవరికీ ఇష్టం లేకపోయినా జీవితంలో తప్పని తతంగం. వయసు పెరగడం ఎవరికి ఇష్టం ఉంటుంది చెప్పండి. రోజుల గడిచే కొద్దీ తప్పకుండా వయసు పెరుగుతుంది.
అందుకు అనుగుణంగా శరీరంలో మార్పులు తప్పవు. శరీరంలో శక్తి సన్నగిల్లడం, మతి మరుపు, కొన్ని సార్లు దంతాలు ఊడి పోవడం, మాటల్లో స్పష్టత లోపించడం, దీర్ఘకాలికంగా వేదించే ఒళ్లు నొప్పులు ఇలా రకరకాల సమస్యలు వేధిస్తూనే ఉంటాయి. అందుకే వయసు పెరగడం ఎవరికి సంతోషంగా ఉండదు.

అయితే మన శరీరాలను బాగా చూసుకుంటే కొన్నాళ్లయినా వయస్సును వెనక్కి నెట్టవచ్చు. కింగ్ నాగార్జునలా యవ్వనంగా కనిపించవచ్చు. సమతుల ఆహారం తీసుకుంటూ క్రమం తప్పకుండా వ్యాయామం చెయ్యడం ద్వారా పెరిగే వయసు పెద్దగా బాధించదనేది నిపుణుల అభిప్రాయం.

ఇక న్యూట్రిషన్ విషయానికి వస్తే ఆరోగ్యవంతంగా యవ్వనంగా కనిపించేందుకు కొన్ని ప్రత్యేకమైన ఆహార పదార్థాలు ఉన్నాయట. ఒమెగా 3 ఫ్యాటీ ఆసిడ్లతో నిండివున్న గింజలు అవే అవిసెలు లేదా అవిసెగింజలు వీటినే ఫ్లాక్ సీడ్స్ అంటారు.

ఈ గింజలు క్రమం తప్పకుండా తీసుకుంటే దీర్ఘాయువు సాధ్యమే అని నిపుణులు అంటున్నారు. యువకుల నుంచి వృద్ధుల వరకు అందరూ రోజువారీ ఆహారంలో ఒకటి రెండు స్పూన్ల అవిసెగింజలను చేర్చుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిదని అంటున్నారు.

సలాడ్లో లేదా ఓట్మీల్ మిక్చర్ లో వీటిని కలుపుకోవడం వల్ల మరింత మంచి ఫలితాలు ఉంటాయట. ఇది పొడిగా తీసుకున్నా ఫర్వాలేదంటున్నారు.

రెండు స్పూన్ల అవిసె గింజల్లో ఉండే పోషకాలు

2.6 గ్రా. ప్రొటీన్

37 కాలరీలు

2 గ్రాముల డైటరీ ఫైబర్

2 గ్రాముల ఒమెగా 3 ఫ్యాటీ ఆసిడ్స్

అవిసె గింజల పొడి కూడా చాలా ఆరోగ్యకరం. ఇలా పొడి రూపంలో తీసుకున్నపుడు జీర్ణం కావడానికి సులభంగా ఉంటుంది. పొడి రూపంలో వీటిలోని పోషకాలను శరరీం త్వరగా గ్రహిస్తుంది. కొద్దిగా వేయించి పొడి చేసి పెట్టుకుంటే వాడుకునేందుకు సులభంగా ఉంటుంది.

యవ్వనంగా ఉంచడంలో అవిసె గింజల ప్రాధాన్యత

మధ్య వయసు చివరలో ఉన్న వారిలో ఏజింగ్ కు సంబంధించిన సమస్యలు నెమ్మదిగా బాధించడం మొదలవుతుంది. ఇలాంటి సమస్యలను వాయిదా వెయ్యడంలో అవిసెగింజలు మంచి పాత్ర పోషిస్తాయి.

వీటిలో ఉంటే పోషకాలు ఒబెసిటిని తగ్గిస్తాయి.

దీర్ఘకాలంగా వేధించే డయాబెటిస్ వంటి సమస్యలను ఎదుర్కోడానికి తోడ్పడుతాయి.

శరీరంలో ఇన్ప్లమేషన్ తగ్గిస్తాయి.

ఇవి మంచి యాంటీ క్యాన్సరస్ ఆహారం.

కిడ్ని ఆరోగ్యానికి కూడా మంచిది.

గుండె ఆరోగ్యానికి దోహదం చేసి హార్ట్ ఎటాక్ రిస్క్ లేకుండా చేస్తాయి.

కొలెస్ట్రాల్, బీపి ని అదుపులో ఉంచుతాయి.

మెదడు పని తీరును కూడా మెరుగు పరిచి డిమెన్షియా, అల్జైమర్స్ నుంచి రక్షిస్తాయి.

కండరాల క్షీణతను వాయిదా వేసి మొబిలిటి సమస్యలు రాకుండా కాపాడుతాయి.

Milk and Dry grapes: జ్ఞాపకశక్తికి అద్భుతమైన దివ్యౌషధం ఇదే, ఇలా తీసుకుంటే చాలు

Milk and Dry grapes: సాధారణంగా పాలను సూపర్ ఫుడ్‌గా పిలుస్తారు. అదే పాలలో కొద్దిగా ఎండు ద్రాక్ష మిక్స్ చేస్తే..ఇక దివ్యౌషధమే. ఈ రెంటి మిశ్రమం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు చూద్దాం..
ఆహారపు అలవాట్లు, జీవనశైలి ఆధారంగా ఆరోగ్య స్థితి ఉంటుంది. ఆహారపు అలవాట్లు బాగుంటే ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. లేకుంటే అనారోగ్య సమస్యలు వెంటాడుతాయి.

మెరుగైన ఆరోగ్యం కోసం డైట్‌లో పాలు, ఎండుద్రాక్ష చేర్చుకుంటే చాలని..అద్భుత ప్రయోజనాలు కలుగుతాయంటున్నారు వైద్య నిపుణులు.

ఎండుద్రాక్ష, పాలు. రెండూ ఆరోగ్యానికి చాలా మంచివి. రెండింట్లోనూ పోషక పదార్ధాలు పుష్కలంగా లభిస్తాయి. ఎండుద్రాక్షలో హెల్తీ ఫ్యాట్స్, ఫైబర్, కాపర్, ఐరన్, కాల్షియం, పొటాషియం పుష్కలంగా ఉంటే..పాలలో కాల్షియం, ప్రోటీన్లు, విటమిన్ డి అత్యధికంగా ఉంటాయి.

అందుకే ఈ రెండూ కలిపి ప్రతిరోజూ తాగితే శరీరంలో పోషక పదార్ధాల లేమి తలెత్తదు. ఫలితంగా గంభీరమైన రోగాలు దూరమౌతాయి. ఆరోగ్యం బాగుంటుంది. పాలు, ఎండుద్రాక్ష కలిపి తాగడం వల్ల ఏయే ప్రయోజనాలున్నాయో చూద్దాం..

జ్ఞాపక శక్తి

రోజూ క్రమం తప్పకుండా పాలు, ఎండుద్రాక్ష కలిపి తీసుకోవడం వల్ల ఆందోళన, ఒత్తిడి వంటి సమస్యల్ని జయించవచ్చు. ముఖ్యంగా మెమెరీ పెరుగుతుంది. మెదడు పనితీరు అద్భుతంగా ఉంటుంది. ఒక్కమాటలో చెప్పాలంటే బుద్ధి వికసితమౌతుంది.

రాత్రి పడుకునేముందు పాలలో ఎండుద్రాక్ష కలిపి తాగడం వల్ల సుఖమైన నిద్ర పడుతుంది. నిద్రలేమి సమస్యతో బాధపడేవారికి ఇదొక మంచి ఔషధం కాగలదు. త్వరగా పడుకునేందుకు కూడా దోహదమౌతుంది.

ఎముకలు పటిష్టం

పాలు, ఎండుద్రాక్ష రెండింట్లోనూ కాల్షియం పుష్కలంగా ఉంటున్నందున..ఈ రెండు కలిపి తీసుకోవడం ద్వారా ఎముకలకు బలం చేకూరుతుంది. ఎండుద్రాక్షలో ఉండే బోరాన్ అనే కెమికల్ ఎముకలకు చాలా లాభదాయకం. అటు కీళ్ల నొప్పులు కూడా తగ్గుతాయి.

ఫ్రాక్చర్ కారణంగా ఏర్పడే గాయాలు తగ్గుతాయి. ఇతర చాలా గంభీరమైన రోగాలకు పాలు-ఎండుద్రాక్ష మిశ్రమం అద్భుతంగా పనిచేస్తుంది.

ఎండుద్రాక్షలో జీర్ణానికి తోడ్పడే ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపర్చడమే కాకుండా మెటబోలిజంను వృద్ధి చేస్తుంది.

శరీరంలో మంచి బ్యాక్టీరియాను పెంచుతుంది. కోలన్ పనితీరు మెరుగుపడుతుంది. శరీరాన్ని ఎప్పటికప్పుడు డీటాక్సిఫై చేయడం వల్ల ఆరోగ్యంగా ఉంటాము.

Benefits of Barley Seeds: బార్లీ గింజలను నానబెట్టి తినడం వల్ల కలిగే లాభాలు.!

Benefits of Barley Seeds: బార్లీ గింజలు మనకు ఆహారంగా, ఔషధంగా కూడా ఉపయోగపడతాయి.
ఇవి గడ్డి జాతి గింజలు. వీటిలో పిండి పదార్థాలు, పీచు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. బార్లీ గింజలను తడి లేని, గాలి తగలని డబ్బాలో నిల్వ చేసుకోవడం వల్ల పోషకాలను కోల్పోకుండా కొన్ని నెలల వరకు తాజాగా ఉంటాయి.బార్లీ గింజలు అరుగుదల శక్తిని పెంచడంలో ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి.

Health Benefits of Barley Seeds.

వీటిలో ఉండే బి విటమిన్స్ నీటిలో కరిగే తత్వాన్ని కలిగి ఉంటాయి. కనుక వీటిని నీటిలో ఉడికించినప్పుడు నీటితో సహా తీసుకోవాలి.

ఒక కప్పు ఉడికించిన బార్లీ గింజల్లో 4.5 గ్రా.ల పీచు పదార్థాలు, 12.5 మిల్లీ గ్రాముల పోలేట్ ఉంటాయి. అంతేకాకుండా ఈ బార్లీ గింజల్లో మన శరీరానికి అవసరమయ్యే విటమిన్స్, మినరల్స్ కూడా అధికంగా ఉంటాయి.

గ్లూటెన్ పదార్థాల ఎలర్జీ ఉన్న వారు వీటిని తీసుకోకూడదు. బార్లీ గింజలను నాన బెట్టిన నీటిని రోజూ తాగడం వల్ల శరీరంలో ఎక్కువగా ఉన్న నీటి శాతం తగ్గుతుంది. ఒంట్లో నీరు చేరిన గర్భిణీ స్త్రీలు ఈ బార్లీ గింజలను నానబెట్టిన నీటిని తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

అంతే కాక అనారోగ్య సమస్యల కారణంగా బలహీనంగా, నీరసంగా ఉన్న వారు ఈ బార్లీ నీటిని తాగడం వల్ల నీరసం తగ్గుతుంది. జ్వరం వచ్చిన వారికి ఆహారంలో భాగంగా బార్లీని ఇవ్వడం వల్ల జ్వరం నుండి త్వరగా కోలుకుంటారు.

బార్లీని పాలతో కలిపి తీసుకోవడం వల్ల బాలింతల్లో పాలు ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి.మన శరీరంలో ఉండే కాలేయంలో, రక్తంలో కొవ్వు చేరకుండా చేయడంలో ఈ బార్లీ గింజలు ఎంతగానో సహాయపడతాయి. రెండున్నర లీటర్ల నీటిలో ఒక కప్పు బార్లీ గింజలను వేసి సగం అయ్యే వరకు మరిగించి వడకట్టాలి.

Benefits of Barley seeds(water)

ఇలా వడకట్టిన నీటిని తాగడం వల్ల ప్రేగు కదలికలు పెరిగి జీర్ణ సంబంధిత సమస్యలు తగ్గుతాయి. బార్లీ గింజల నుండి చేసిన గంజిలో మజ్జిగను, నిమ్మ రసాన్ని కలిపి తీసుకోవడం వల్ల మూత్ర సంబంధిత సమస్యల నుండి ఉపశమనం కలుగుతుంది.

మూత్ర విసర్జన కష్టంగా ఉన్న వారు బార్లీ గింజల కషాయంలో బెల్లం, నిమ్మరసం కలిపి తీసుకోవడం వల్ల ఈ సమస్య నుండి బయటపడవచ్చు. అంతే కాకుండా మద్యపానం తయారీలో కూడా ఈ బార్లీ గింజలను ఉపయోగిస్తారు.

పిల్లలకు ఆహారంలో భాగంగా ఇచ్చే పాలలో, సూప్ లలో బార్లీ గింజలను ఉపయోగించడం వల్ల వారిలో ఎదుగుదల చక్కగా ఉంటుంది.

బార్లీ గింజల నుండి తీసిన నూనెను వాడడం వల్ల శరీరంలో కొలెస్త్రాల్ స్థాయిలు నియంత్రణలో ఉంటాయి.వివిధ రకాల సూప్ ల తయారీలో కూడా బార్లీ గింజలను ఉపయోగిస్తారు.

Morning Drinks: టీ, కాఫీలు కాదు – ఉదయాన్నే ఈ పానీయాలు తాగితే బోలెడంత ఆరోగ్యం!

ఉదయం నిద్ర లేవగానే చాలా మంది కాఫీ లేదా టీ తాగడానికి ఇష్టపడతారు. బరువు తగ్గాలని అనుకునే వాళ్ళు మాత్రం గోరు వెచ్చని నీటిలో నిమ్మకాయ రసం కలుపుకుని తాగుతారు.
రాత్రంతా నిద్రపోవడం వల్ల మరుసటి రోజు రీఫ్రెష్ గా ఉండాలంటే ఆరోగ్యకరమైన పానీయాలు తాగాలి. వాటితో రోజు ప్రారంభించడం వల్ల ఆరోగ్యకరమైన జీవితాన్ని పొందగలుగుతారు.

అందుకే ఉదయం లేవగానే ఒక గ్లాసు మంచి నీళ్ళు తాగితే చాలా మంచిదని నిపుణులు చెబుతారు. వివిధ ఆరోగ్యకరమైన పానీయాలు కూడా ఒక్కోసారి శరీరాన్ని డీ హైడ్రేట్ కి గురి చేస్తాయి. అందుకే ముందుగా నీరు తాగిన తర్వాత ఏదైనా కాఫీ లేదా టీ తీసుకోవాలని అంటారు.

నీళ్ళు తాగడం వల్ల డీహైడ్రేట్ నుంచి నుంచి ఉపశమనం లభిస్తుంది. అందుకే నీటితో పాటు మరికొన్ని పానీయాలు తీసుకోవడం కూడా ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అవేమిటంటే..

యాపిల్ సిడర్ వెనిగర్

ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా మేలు చేసే వాటిలో యాపిల్ సిడర్ వెనిగర్ ముందు వరుసలో ఉంటుంది. దీన్ని నీటితో కలిపి తీసుకోవడం వల్ల యాంటీ ఆక్సిడెంట్లు శరీరానికి పుష్కలంగా అందుతాయి.

ఇవి తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఈ సాధారణ పానీయం జీర్ణక్రియని మెరుగుపరిచేందుకు కూడా సహాయపడుతుంది.

గ్రీన్ టీ

గ్రీన్ టీ ఆరోగ్యానికి మంచిది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండటం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలని అందిస్తుంది. జీవక్రియని పెంచి కొవ్వుని కరిగించేందుకు సహాయపడుతుంది. మెదడు పని తీరుకి సహాయపడుతుంది. క్యాన్సర్ నుంచి రక్షణగా నిలుస్తుంది. గుండె జబ్బుల ప్రమాదాన్ని నివారిస్తుంది.

బ్లాక్ కాఫీ

అపారమైన ప్రయోజనాలతో కూడిన ఆరోగ్యకరమైన పానియాలలో కాఫీ ఒకటి. అది కూడా బ్లాక్ కాఫీ తాగడం అన్నీ విధాలుగా మంచిది. ఉదయం కాఫీని తీసుకోవడం వల్ల కారిస్టల్ అనే హార్మోన్ ని ప్రోత్సహించడంలో సహాయపడుతుంది. కార్టిసాల్ అనేది కిడ్నీలోని అడ్రినల్ గ్రంథులు ఉత్పత్తి చేసే స్టెరాయిడ్ హార్మోన్.

రక్తంలో చక్కెర స్థాయిలని నియంత్రించడంలో సహాయపడుతుంది. రక్తపోటుని ప్రభావితం చేస్తుంది. జ్ఞాపక శక్తిని పెంచేందుకు దోహదపడుతుంది. రోగనిరోధక శక్తిని పెంచి జీవక్రియని మెరుగుపరుస్తుంది.

ఆలోవెరా జ్యూస్

గాయాలు, చర్మ సమస్యలను నయం చేయడానికి ఆలోవెరాకి మించిన గొప్ప ఔషధం లేదు. శరీర ఆరోగ్యానికే కాదు అందానికి కూడా కలబంద చాలా మంచిది. కలబంద రసంలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. ఇవి జీర్ణాశయాంతర పేగుల వాపును తగ్గించడంలో సహాయపడుతుంది.

పేగుల్లో వచ్చే వ్యాధులని నియంత్రించడంలో కీలక పాత్ర వహిస్తుంది. మధుమేహ రోగులకి కలబంద చాలా ప్రయోజనాలు అందిస్తుంది. ఉదయాన్నే కొద్దిగా కలబంద గుజ్జు నీటిలో వేసి బాగా మరిగించి ఆ నీటిని తాగితే రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.

టమాటో రసం

టమాటో జ్యూస్‌తో రోజును ప్రారంభించడం వల్ల శరీరాన్ని హైడ్రేట్ చేయడంలో సహాయపడుతుంది. అసిడిటీ సమస్యని ఎదుర్కోవడమే కాకుండా సులభంగా లభించే పోషకాలను సరఫరా చేయడం ద్వారా అవయవాలను సక్రియం చేస్తుంది.

ఈ డ్రై ఫ్రూట్స్ ను నానబెట్టకుండా అస్సలు తినకండి.. లేదంటే?

ఆరోగ్యంగా ఉండేందుకు డ్రై ఫ్రూట్స్ ను తింటుంటారు. అయితే కొంతమంది వీటిని నానబెట్టి తింటే మరి కొంత మంది మాత్రం అలాగే పచ్చిగానే తినేస్తుంటారు.
కానీ డ్రై ఫ్రూట్స్ ను నానబెట్టకుండా అస్సలు తినకూడదని నిపుణులు చెబుతున్నారు.

మన ఆరోగ్యానికి డ్రై ఫ్రూట్స్ చాలా అవసరం. ఎందుకంటే వీటిలో పోషకాలు ఉంటాయి. ఇవి మనలో ఎన్నో రకాల పోషకాల లోపాలను పోగొడుతాయి. ఇవి టేస్టీగా కూడా ఉంటాయి. అందుకే చాలా మంది వీటిని స్నాక్స్ గా తింటుంటారు. డ్రై ఫ్రూట్స్ ను రోజూ తినడం వల్ల శరీర శక్తి స్థాయిలు పెరుగుతాయి.

రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. అయితే కొంతమంది వీటిని నానబెట్టే తింటే.. ఇంకొంత మంది మాత్రం నానబెట్టకుండా పచ్చిగానే అలాగే తింటుంటారు. కానీ కొన్ని రకాల డ్రై ఫ్రూట్స్ ను నానబెట్టకుండా అస్సలు తినకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అవేంటో తెలుసుకుందాం పదండి.

ఎండుద్రాక్ష

ఎండుద్రాక్షలు ఔషదం కంటే తక్కువేం కాదు. వీటిని తినడం వల్ల మలబద్దకం సమస్య నుంచి బయటపడతారు. దీనిలో ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. రాత్రంతా నానబెట్టి ఉదయమే వీటిని తింటే పొట్టకు సంబంధించిన సమస్యలన్నీ తొలగిపోతాయి. ఎసిడిటీ సమస్య కూడా తొలగిపోతుంది.

ఫిగ్

డ్రై ఫ్రూట్స్ లో ఒకటైన ఫిగ్ ఎంతో టేస్టీగా ఉంటుంది. దీనిలో ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. అలాగే దీనిలో ఆరోగ్యకరమైన కొవ్వులు, కొలెస్ట్రాల్ ఉంటాయి. ఈ పండు నుంచి పోషకాలను పొందాలంటే మాత్రం వీటిని ఖచ్చితంగా నానబెట్టే తినాలి. నానబెట్టకుండా తింటే ప్రమాదకరం.

ఖర్జూరాలు

ఖర్జూరాల్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఖర్జూరాల్లో ఉండే ఐరన్ రక్తహీనత సమస్యను పోగొడుతుంది. అలాగే వీటిలో పుష్కలంగా ఉండే పొటాషియం నాడీవ్యవస్థను మెరుగుపరుస్తుంది. ఈ ప్రయోజనాలను పొందాలంటే ఖర్జూరాలను నానబెట్టే తినాలి. గుండె ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.

బాదంపప్పులు

బాదం పప్పులు మన ఆరోగ్యానికి చాలా మంచివి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఇ, విటమిన్ సి, విటమిన్ ఎ, జింక్ , పొటాషియం, మెగ్నీషియం లు పుష్కలంగా ఉంటాయి.

అయితే బాదం పప్పులను పచ్చిగానే కాకుండా నానబెట్టి తినడమే మంచిది. అలా తింటేనే వాటిలో ఉండే పోషాకాలన్నీ అందుతాయి. ఆరోగ్యం బాగుంటుంది. చర్మం ప్రకాశవంతంగా మెరుస్తుంది.

Green Tea: పరగడుపున గ్రీన్ టీ తాగుతున్నారా..? అస్సలు మంచిది కాదంట.. ఈ విషయాలను తెలుసుకోండి..

ఉరుకులు పరుగుల జీవితంలో ఎన్నో సమస్యలు చుట్టుముడుతున్నాయి. అందుకే.. ఈ రోజుల్లో ఫిట్‌నెస్‌పై శ్రద్ధ వహించే వారు టీకి బదులుగా గ్రీన్ టీ తాగడానికి ఇష్టపడుతున్నారు.
బరువు తగ్గడం కోసం కొందరు గ్రీన్ టీ తాగుతున్నారు. వాస్తవానికి గ్రీన్ టీ తాగడం వల్ల ఊబకాయం తగ్గుతుంది. దీంతో చర్మంలో గ్లో పెరుగుతుంది. గ్రీన్ టీ తాగడం వల్ల రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంతోపాటు జీర్ణవ్యవస్థ కూడా బలపడుతుంది. గ్రీన్ టీ వల్ల కలిగే ఇన్ని ప్రయోజనాలను తెలుసుకున్న తర్వాత చాలామంది గ్రీన్ టీని ఎక్కువగా తాగడం మొదలుపెట్టారు. ఆఫీసులో ఉన్నవారు రోజుకు చాలాసార్లు గ్రీన్ టీ తాగుతారు. కొంతమంది భోజనం చేసిన వెంటనే గ్రీన్ టీ తాగుతుంటారు. ఈ విధంగా, గ్రీన్ టీ తాగడం వల్ల ప్రయోజనం కాకుండా హాని కలిగిస్తుంది. గ్రీన్ టీని ఎప్పుడు తాగాలి, ఎలాంటి వారు దానికి దూరంగా ఉండాలి.? అనే విషయాలను ఎప్పుడు తెలుసుకుందాం..

గ్రీన్ టీ ఇలా తాగడం వల్ల ప్రయోజనం కంటే హాని కలుగుతుంది..

ఖాళీ కడుపుతో తాగకండి: కొంతమంది తమ రోజును గ్రీన్ టీతో ప్రారంభిస్తారు. ఇది హాని కలిగిస్తుంది. ఎప్పుడూ ఖాళీ కడుపుతో గ్రీన్ టీ తాగకండి. ఇది ఎసిడిటీ సమస్యకు కారణం అవుతుంది. ముందుగా ఏదైనా తినండి.. అనంతరం 1 గంట తర్వాత గ్రీన్ టీ తాగండి.
ఎక్కువ గ్రీన్ టీతో హాని: బరువు తగ్గాలనే లక్ష్యంతో ప్రజలు గ్రీన్ టీని రోజుకు చాలాసార్లు తాగుతారు. అయితే 1 కప్పు గ్రీన్ టీలో 24-25 మి.గ్రా కెఫిన్ ఉంటుంది. రోజుకు 4-5 కప్పుల గ్రీన్ టీ తాగితే, అది శరీరంలో కెఫిన్ స్థాయి మొత్తాన్ని పెంచుతుంది. ఇది ఆందోళన-భయం, గుండెల్లో మంట, తల తిరగడం, మధుమేహం, నిద్రలేమికి దారితీస్తుంది.
ఆహారంతో పాటు గ్రీన్ టీని తాగవద్దు: కొంతమంది ఆహారంతో పాటు లేదా ఆహారం తిన్న వెంటనే గ్రీన్ టీ తాగుతారు. ఇలా చేస్తే హాని కలుగుతుంది. తిన్న వెంటనే కొంత గ్యాప్ (40 నిమిషాల నుంచి ఒక గంట) తీసుకోని గ్రీన్ టీ తీసుకోవాలి. గ్రీన్ టీలో కాటెచిన్స్ ఉంటాయి. దీని కారణంగా శరీరం ఐరన్‌ను సరిగ్గా గ్రహించదు. గ్రీన్ టీ ఎక్కువగా తాగడం వల్ల శరీరంలో ఐరన్ లోపం ఏర్పడుతుంది. కావున ఆహారం తిన్న తర్వాత గ్రీన్ టీని తాగకూడదు.
మందులతో గ్రీన్ టీ తాగొద్దు: ఏదైనా సమస్యకు మందులు తీసుకుంటే వాటితో గ్రీన్ టీ తాగవద్దు. ముఖ్యంగా నాడీ వ్యవస్థకు సంబంధించినవి.. పలు మందులతో గ్రీన్ టీ తీసుకోవడం మానేయాలి. మందులతో కలిపి గ్రీన్ టీ తాగడం హాని కలిగించవచ్చు.
గర్భధారణ సమయంలో గ్రీన్ టీ తాగవద్దు: గర్భధారణ సమయంలో గ్రీన్ టీ తాగకూడదు. ఇది కాకుండా, తల్లులు కూడా దీనికి దూరంగా ఉండాలి. గ్రీన్ టీ ఎక్కువగా తాగడం వల్ల పుట్టబోయే బిడ్డకు హాని కలుగుతుంది. గ్రీన్ టీలో ఉండే కెఫిన్ పాల ద్వారా పిల్లల శరీరంలోకి చేరుతుంది. ఇది ఆరోగ్యానికి మంచిది కాదు.
గ్రీన్ టీ త్రాగడానికి సరైన మార్గం..

రోజుకు 2-3 కప్పుల కంటే ఎక్కువ గ్రీన్ టీని తాగకూడదు. భోజనం చేసిన 1 గంట తర్వాత మాత్రమే గ్రీన్ టీ తాగాలి. ఖాళీ కడుపుతో గ్రీన్ టీ తాగడం మానుకోండి. నిద్రపోయే ముందు గ్రీన్ టీ తాగకూడదు. మీరు 10-11 గంటల మధ్య అల్పాహారం తర్వాత తాగవచ్చు. సాయంత్రం 5-6 గంటలకు గ్రీన్ టీ తీసుకోవచ్చు.

Heatlh: ఉప్పు నీటిని నోటిలో వేసుకుని పుకిలిస్తున్నారా.. లేకుంటే వెంటనే అలవాటు చేసుకోండి.. ఎన్నో ప్రయోజనాలు..

వెదర్ (Weather) చేంజ్ అయింది. వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జలుబు, దగ్గు సమస్యలు ఆహ్వానించని అతిథుల్లా వచ్చేస్తున్నాయి. అయితే బాగా వేధించే సమస్య గొంత నొప్పి.
దీని కోసం డాక్టర్లు, ఆస్పత్రులకు వెళ్లా్ల్సిన పని లేకుండా ఇంట్లోనే ఉండే పదార్థాలతో ఆరోగ్య చిట్కాలు పాటించవచ్చు. వంటింట్లో ఉండే ఉప్పును అధికంగా వాడటం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయన్న విషయం మనకు తెలిసిందే. కానీ నిర్ణీత పరిమాణంలో ఉపయోగిస్తే చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. ఉప్పు నీటిని (Salt Water) గొంతులో పోసుకొని పుక్కిలించడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. గొంతు సమస్యలు ఉన్నా , శ్వాసకోశ సమస్యలు ఉన్నా ఉప్పు నీరు దివ్య ఔషదంగా పనిచేస్తుంది. కేవలం గొంతు సమస్య వచినప్పుడు మాత్రమే కాకుండా నిత్యం ఇలా చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. రోజూ బ్రష్‌ చెసుకున్న తర్వాత ఉప్పు నీటిని నోట్లో వేసుకొని పుక్కిలించడం మంచిదని వైద్యులు చెబుతున్నారు. గొంతులో ఉండే బాక్టిరియాలు, వైరస్ లు వంటి హానికారకమైన సూక్ష్మజీవుల బారి నుంచి రక్షిస్తుంది. యాసిడ్ లెవెల్స్ ను తటస్థంగా ఉంచుతుంది. ఫలితంగా ఫీహెచ్ స్తాయిలు సమతుల్యం అవుతాయి. ఇలా చెయడం వలన నోటిలో ఉన్న బ్యాక్టీరియా నశించి, నోరు దుర్వాసన రాకుండా ఉంటుంది.

ఉప్పు నీటిని పుక్కిలించడం ద్వారా ముక్కు దిబ్బడ తగ్గుతుంది. నోటిలో పొక్కులు, పుండ్లు ఉన్న వారు ఇలా చెస్తే, అవన్నీ పోయి నోరు చాలా శుభ్రంగా అవుతుంది. శ్వాసకోశ ఇన్ఫెక్షన్స్ ఉన్నవారు రోజుకు 3 సార్లు ఉప్పు నీటిని గొంతులో పోసుకొని పుక్కిలించడం వల్ల ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. చిగుళ్ల వాపు, చిగుళ్ల నుంచి రక్త స్రావం అయ్యేవారు, పంటి నొప్పితో బాధపడే వారికి అద్భుత ప్రయోజనాలు కలిగిస్తుంది. బాక్టిరియాలు, వైరస్ లు చేరడం వలన గొంతులో ఉన్న టాన్సిల్స్ వాపునకు గురవుతాయి. ఆహారం తినాలన్నా, ద్రవాలను తాగాలన్నా చాలా ఇబ్బంది అవుతుంది, ఉప్పు నీటిని గొంతులో పోసుకొని పుక్కిలించడం వలన ఈ సమస్య నుంచి బయటపడవచ్చు.

Pulipirlu : పులిపిర్లను తగ్గించే సహజసిద్ధమైన చిట్కాలు ఇవి.. తప్పక పనిచేస్తాయి..!

Pulipirlu : మనల్ని వేధించే చర్మ సంబంధిత సమస్యల్లో పులిపిర్లు కూడా ఒకటి. మనలో చాలా మంది ఈ పులిపిర్లతో ఇబ్బంది పడుతుంటారు. పులిపిర్ల వల్ల మనకు ఎటువంటి హాని కలగనప్పటికి ఇవి చూడడానికి అందవిహీనంగా ఉంటాయి.
ఇవి మెడ భాగంలో, ముఖం మీద ఎక్కువగా వస్తూ ఉంటాయి. శరీరంలో వ్యాధినిరోధక శక్తి తక్కువగా ఉండడం వల్ల కూడా పులిపిర్లు వస్తాయి. కొన్ని రకాల పులిపిర్లు క్యాన్సర్ కు దారి తీస్తాయి. ఈ పులిపుర్లను తొలగించుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాయి. కొంతమంది వీటిని చాకుతో లేదా బ్లేడుతో కోస్తుంటారు. అలా చేయడం ఏ మాత్రం మంచి పద్దతి కాదు. ఈ పులిపిర్లను కొన్ని రకాల చిట్కాలను వాడడం వల్ల చాలా సులభంగా తగ్గించుకోవచ్చు. పులిపిర్లను తగ్గించే చిట్కాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

పులిపిర్లను తొలగించడంలో వెల్లుల్లి రసం చాలా బాగా ఉపయోగపడుతుంది. వెల్లుల్లి రెబ్బల నుండి రసాన్ని తీసి దాన్ని పులిపిర్ల మీద రాయాలి. ఇలా తరచూ చేయడం వల్ల పులిపిర్లు తొలగిపోతాయి. అలాగే ఆపిల్ సైడ్ వెనిగర్ ను ఉపయోగించి కూడా మనం పులిపిర్లను తగ్గించుకోవచ్చు. ఒక గిన్నెలో నీటిని తీసుకుని దానిలో ఆపిల్ సైడ్ వెనిగర్ ను వేసి కలపాలి. ఈ మిశ్రమంలో దూదిని ముంచి పులిపిర్ల మీద రాయాలి. ఇలా క్రమం తప్పకుండా పులిపిర్ల మీద రాస్తూ ఉండడం వల్ల పులిపిర్లు తగ్గిపోతాయి. పులిపిర్లను తగ్గించడంలో అరటి పండు కూడా మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ముందుగా అరటి పండును అలాగే అరటి పండు తొక్కను ముక్కలుగా చేయాలి. రాత్రి పడుకునే ముందు పులిపిర్ల మీద అరటి పండు ముక్కను ఉంచి దాని మీద అరటి పండు తొక్కను ఉంచాలి. వీటి మీద ప్లాస్టర్ ను వేయాలి. ఉదయం లేవగానే దీనిని తీసి వేయాలి. ఇలా కొన్ని రోజుల పాటు క్రమం తప్పకుండా చేయడం వల్ల పులిపిర్లు తగ్గిపోతాయి.
పులిపిర్లను తొలగించడంలో కొత్త సున్నం చక్కగా పని చేస్తుంది. కొత్త సున్నంలో అల్లం రసం కలిపి పులిపిర్ల మీద రాస్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల పులిపిర్లు రాలిపోతాయి. అలాగే ఉల్లిపాయ, రాతి ఉప్పును ఉపయోగించి కూడా మనం పులిపిర్లను తగ్గించుకోవచ్చు. ఉల్లిపాయను అడ్డంగా కోసి దానికి రాతి ఉప్పును అద్ది పులిపిర్ల మీద రుద్దాలి. ఇలా చేయడం వల్ల కూడా పులిపిర్లు తగ్గిపోతాయి. ఉత్తరేణి ఆకులను, తులసి ఆకులతో కలిపి నూరాలి. ఈ మిశ్రమానికి ఆవు నెయ్యిని కలిపి పులిపిర్ల మీద రాయాలి. ఇలా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. పులిపిర్లను నివారించడంలో విటమిన్ ల పాత్ర ఎంతో ఉంటుంది. విటమిన్ ఎ మరియు విటమిన్ సి ఎక్కువగా ఉండే క్యారెట్, ఉసిరికాయను ఉపయోగించి పులిపిర్లను తగ్గించుకోవచ్చు.
ముందుగా ఒక గిన్నెలో క్యారెట్ రసాన్ని తీసుకోవాలి. తరువాత అందులో ఉసిరికాయ రసాన్ని కలపాలి. ఈ మిశ్రమాన్ని పులిపిర్ల మీద రాయాలి. ఇలా తరచూ చేయడం వల్ల పులిపిర్లను నివారించుకోవచ్చు. పులిపిర్లను, వాటి మచ్చలను తొలగించడంలో కలబంద గుజ్జు ఎంతగానో ఉపయోగపడుతుంది. కలబంద గుజ్జులో దూదిని ముంచి పులిపిర్ల ఉంచి టేప్ ను అతికించాలి. రాత్రి పడుకునే ముందు ఇలా చేసి ఉదయాన్నే దీనిని తొలగించాలి. ఈ చిట్కాలను పాటించడం వల్ల ఎటువంటి హాని లేకుండా చాలా సులభంగా పులిపిర్లను, పులిపిర్ల వల్ల కలిగే మచ్చలను తగ్గించుకోవచ్చు.

High Court : కోదండరాంకు ఊహించని షాక్…!

ఎమ్మెల్సీ నియామకంపై ప్రొఫెసర్ కోదండరాంకు ఊహించని షాక్ ఇచ్చింది హైకోర్టు. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ఎన్నికైన కోదండరాం, అమీర్ అలీఖాన్ ప్రమాణస్వీకారానికి బ్రేక్ ఇచ్చింది.
గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీల నియామకాలపై గతంలో తాము వేసిన పిటిషన్ విచారణ తేలేంత వరకు ఎమ్మెల్సీల నియామకం ఆపాలంటూ దాసోసు శ్రవణ్, కుర్ర సత్యనారాయణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు ఎమ్మెల్సీల ప్రమాణానికి బ్రేక్ ఇచ్చింది. ఫిబ్రవరి 8వ తేదీ వరకు యథాస్థితి కొనసాగించాలని ఆదేశాలు జారీ చేసింది.

గత ప్రభుత్వంలో దాసోజు శ్రవణ్ కుమార్, కుర్ర సత్యనారాయణను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగ ప్రతిపాదించింది బీఆర్ఎస్ ప్రభుత్వం. అయితే వీటిని గవర్నర్ తమిళిసై అభ్యంతరం తెలిపారు. రాజకీయ పార్టీ నేపథ్యం ఉన్నవాళ్లకు ఎమ్మెల్సీ కోటాలో ఇవ్వలేనంటూ తిరస్కరించారు. దీంతో అప్పుడే వీళ్లు హైకోర్టును ఆశ్రయించారు. అయితే ప్రస్తుతం ప్రభుత్వం మారడంతో కాంగ్రెస్ ప్రభుత్వం కోదండరాం, అమీర్ అలీఖాన్ పేర్లను ప్రతిపాదిస్తూ పంపింది. దీంతో ప్రభుత్వ ప్రతిపాదనను ఆమోదిస్తూ గవర్నర్ తమిళిసై నిర్ణయం తీసుకున్నారు. దీనిపై అభ్యంతరం తెలుపుతూ శ్రవణ్, సత్యనారాయణ హైకోర్టును ఆశ్రయించారు. రాజకీయ నేపథ్యం కారణంగా తమను ఆపివేశారని, ఇప్పుడు ఓ రాజకీయ పార్టీ అధ్యక్షుడికి ఎలా కేటాయించారంటూ సర్వత్ర విమర్శలు వస్తున్నాయి.

Kodi Kathi Case: కోడి కత్తి శ్రీను తల్లి పాదయాత్ర

Kodi Kathi Case: ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై (jagan mohan reddy) కోడి కత్తితో దాడి చేసిన శ్రీను తల్లి సావిత్రమ్మ పాదయాత్ర చేపట్టనున్నారు. ఫిబ్రవరి 2 నుంచి ఏపీ వ్యాప్తంగా పాదయాత్ర చేయాలని నిర్ణయించుకున్నారు.
కోనసీమ జిల్లా ఠాణేలంకలో యాత్ర ప్రారంభం కానుంది. తమకు జరిగిన అన్యాయాన్ని ప్రతిగడపకూ వివరిస్తామని జగన్ కోర్టుకు హాజరై కేసులో సాక్ష్యం చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నారు.

పాదాలలో అధిక కొలెస్ట్రాల్ లక్షణాలు..!ఈ లక్షణాలు ఏమాత్రం విస్మరించినా హార్ట్ అటాక్..స్ట్రోక్ ..జాగ్రత్త

Symptoms of High Cholesterol in Feet: శరీరంలో కొలెస్ట్రాల్ కొవ్వు రూపంలో పేరుకుపోవడం ప్రారంభించినప్పుడు, దానిని అధిక కొలెస్ట్రాల్ అంటారు. ఆరోగ్యకరమైన కణాల ఏర్పాటుకు కొలెస్ట్రాల్ అవసరం, అయితే, కొలెస్ట్రాల్ స్థాయి పెరిగేకొద్దీ, గుండె జబ్బుల ప్రమాదం కూడా వేగంగా పెరుగుతుంది.

కొవ్వు పదార్ధాలు, తక్కువ నిద్ర, ఊబకాయం, ధూమపానం మరియు మద్యపానం అధిక కొలెస్ట్రాల్ కారణాలు. కొన్నిసార్లు ఇది జన్యుపరమైనది కూడా కావచ్చు.

శరీరంలో కొలెస్ట్రాల్ పెరగడం మంచిది కాదు. ఇది హృదయ సంబంధ వ్యాధులను అభివృద్ధి చేసే అవకాశాలను పెంచుతుంది. అంతేకాకుండా, కొరోనరీ ఆర్టరీ వ్యాధి మరియు స్ట్రోక్ ప్రమాదం కూడా పెరుగుతుంది. కొలెస్ట్రాల్‌లో మంచి మరియు చెడు కొలెస్ట్రాల్ అనే రెండు రకాలు ఉన్నాయి. చెడు కొలెస్ట్రాల్ పరిమాణం పెరగడం వల్ల శరీరంలో అనేక రకాల లక్షణాలు కనిపిస్తాయి మరియు ఈ లక్షణాలు మీ పాదాలలో కూడా కనిపిస్తాయి.

అయితే, అధిక కొలెస్ట్రాల్ స్థాయి యొక్క లక్షణాలు చాలా మందిలో త్వరగా కనిపించవు, అందుకే దీనికి సైలెంట్ కిల్లర్ అని పేరు పెట్టారు. అధిక కొలెస్ట్రాల్ స్థాయిని రక్త పరీక్ష ద్వారా గుర్తించవచ్చు. అధిక బరువు మరియు శరీర కొవ్వు ఉన్నవారిలో కొలెస్ట్రాల్ పెరిగే అవకాశం ఉంది. అయితే, మీ కాళ్లలో కొన్ని సంకేతాలు మరియు లక్షణాలు కూడా మీ కొలెస్ట్రాల్ అధికమైందని సూచిస్తున్నాయి. మీ శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయి పెరిగిందని పాదాలలో కనిపించే సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటో తెలుసుకోండి.

పాదాలలో అధిక కొలెస్ట్రాల్ యొక్క లక్షణాలు :

చల్లని అరికాళ్ళు అధిక కొలెస్ట్రాల్‌కు సంకేతం.

TOIలో ప్రచురించబడిన ఒక వార్త ప్రకారం, మీ పాదాలు మరియు అరికాళ్ళు ఎల్లప్పుడూ చల్లగా ఉంటే, అది అధిక కొలెస్ట్రాల్‌కు సంకేతం కావచ్చు. కొంతమందికి వేసవిలో లేదా ప్రతి సీజన్‌లో అరికాళ్లు చల్లగా ఉంటాయి, అలాంటి వారు ఖచ్చితంగా వైద్యుడిని సంప్రదించాలి. ఇది అధిక కొలెస్ట్రాల్ స్థాయి సమస్య అని అవసరం లేకపోయినా, జలుబు అరికాళ్ళు అనేక ఇతర సమస్యల వలన సంభవించవచ్చు. వైద్యులను సంప్రదించి కొలెస్ట్రాల్ స్థాయిని పరీక్షించుకోవడం మంచిది.

పాదాల చర్మం రంగులో కనిపించే మార్పు

అధిక కొలెస్ట్రాల్ ఉన్నప్పుడు, శరీర భాగాలకు రక్త ప్రసరణ కూడా తగ్గుతుంది. దీని కారణంగా, చర్మం రంగులో మార్పు కనిపించవచ్చు. పోషకాలు మరియు ఆక్సిజన్‌ను మోసుకెళ్లే రక్త ప్రవాహం లేకపోవడం వల్ల కణాలకు సరైన పోషకాహారం లభించకపోవడం వల్ల ఇది జరుగుతుంది. మీరు కాళ్ళను పెంచినట్లయితే, చర్మం లేతగా కనిపించవచ్చు. అదే సమయంలో, మీరు దానిని టేబుల్‌పై వేలాడదీసినప్పుడు, చర్మం ఊదా లేదా నీలం రంగులో కనిపించవచ్చు.

కాళ్లలో నొప్పి, కొలెస్ట్రాల్ స్థాయి ఎక్కువగా ఉందా?

కొన్ని రోజులుగా కాళ్లలో నిరంతరాయంగా నొప్పి వస్తుంటే నిర్లక్ష్యం చేయకండి. కాళ్ల ధమనుల్లో అడ్డంకులు ఏర్పడినప్పుడు, ఆక్సిజన్‌తో కూడిన రక్తం అవసరమైన మొత్తంలో శరీరం యొక్క దిగువ భాగానికి చేరదు. ఇది కాళ్ళలో భారం మరియు అలసట అనుభూతిని కలిగిస్తుంది. అధిక కొలెస్ట్రాల్ కారణంగా, కొంతమంది పాదాలలో మంటతో పాటు నొప్పిని కూడా ఫిర్యాదు చేస్తారు. చాలా సార్లు ఈ నొప్పి పిరుదులు, తొడలు మరియు కాళ్ళ వరకు వస్తుంది. నొప్పి రెండు లేదా ఒక కాలులో కూడా సంభవించవచ్చు. మీరు నడుస్తున్నప్పుడు, పరుగెత్తినప్పుడు లేదా మెట్లు ఎక్కినప్పుడు ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. నొప్పి విశ్రాంతితో వెళ్లిపోవచ్చు మరియు కదలికతో పునరావృతమవుతుంది, అటువంటి పరిస్థితిలో వైద్యుడిని సంప్రదించడం మంచిది.

అధిక కొలెస్ట్రాల్ యొక్క లక్షణాలు – రాత్రి కాళ్ళ తిమ్మిరి

రాత్రి పడుకునేటప్పుడు పదే పదే కాళ్లలో తిమ్మిర్లు వస్తుంటే నిర్లక్ష్యం చేయకండి. ఇది అధిక కొలెస్ట్రాల్ వల్ల కూడా కావచ్చు. ఇది దిగువ అవయవాల ధమనులకు నష్టం కలిగిస్తుంది. ఈ సమస్య రాత్రిపూట మరింత తీవ్రమవుతుంది, దీని కారణంగా నిద్రపోవడంలో ఇబ్బంది ఉంటుంది. అరికాళ్ళు, చీలమండలు, వేళ్లు, పాదాల కండరాలలో తిమ్మిరి సంభవించవచ్చు. మీ కాళ్లను మంచం నుండి వేలాడదీయడం లేదా కూర్చోవడం వల్ల తిమ్మిరి నుండి ఉపశమనం పొందవచ్చు. ఇది గురుత్వాకర్షణ శక్తిని కాళ్ళకు రక్త ప్రసరణకు సహాయపడుతుంది.

అరికాళ్ళు లేదా పాదాలపై గాయాలు నయం కావు, అప్రమత్తంగా ఉండండి

అరికాళ్లు మరియు పాదాలపై గాయం మానకపోతే, అది అధిక కొలెస్ట్రాల్ వల్ల కూడా కావచ్చు. చాలా సార్లు రక్త ప్రసరణ సరిగా జరగకపోవడం వల్ల ఈ సమస్యలు వస్తాయి. గాయాలు చాలా నెమ్మదిగా మానడం లేదా చాలా రోజులు నయం కాకపోయినా, అధిక కొలెస్ట్రాల్ స్థాయిల కారణంగా కాళ్ళలో రక్త ప్రసరణ సరిగ్గా జరగడం లేదని అర్థం. వైద్యుడిని సంప్రదించడం మంచిది.

అధిక కొలెస్ట్రాల్‌ను ఎలా తగ్గించాలి?

* కొలెస్ట్రాల్ సంబంధిత సమస్యలను అధిగమించడానికి, మీరు క్రమం తప్పకుండా ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి.

* మీరు మీ దినచర్యలో రోజువారీ వ్యాయామాన్ని చేర్చుకోవాలి.

* కొలెస్ట్రాల్‌ను తగ్గించే అటువంటి ఆహారాలను మీ ఆహారంలో చేర్చుకోండి.

* సంతృప్త కొవ్వును తగ్గించండి మరియు అసంతృప్త కొవ్వును తినండి. దీని కోసం ఆలివ్, పొద్దుతిరుగుడు, వాల్నట్ మరియు సీడ్ ఆయిల్ ఉపయోగించండి.

7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపు ఉంటుందా? ఆ బకాయిల సంగతేంటి?

7th Pay Commission News: కేంద్ర ప్రభుత్వం తన ఉద్యోగులకు డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ), డియర్‌నెస్ రిలీఫ్‌ను నాలుగు శాతం పెంచే అవకాశం ఉంది. కొన్ని మీడియా కథనాల ప్రకారం జనవరి 31న డీఏ పెంపు ఎంత అనేది తేలనుంది.
గ్రాట్యుటీని 4 శాతం పెంచితే 50కి చేరుకుంటుంది. డీఏ, డీఆర్‌లను ఏడాదికి రెండుసార్లు సవరిస్తారు. డియర్‌నెస్ అలవెన్స్ రేటు ధరల పెరుగుదల లేదా ద్రవ్యోల్బణం ఆధారంగా లెక్కించబడుతుంది. జనవరి 1కి సంబంధించిన DA, DR రేట్లు జూలై నుండి డిసెంబర్ వరకు వినియోగదారుల ధరల సూచిక (AICPI) ఆధారంగా నిర్ణయిస్తారు.

ఈ లెక్కన నవంబర్ వరకు ఏఐసీపీఐ సూచీ 139.1 పాయింట్లు. డీఏ కాలిక్యులేటర్ ప్రకారం 49.68గా ఉంది. డిసెంబర్ నెలకు సంబంధించిన ఇండెక్స్ నంబర్ రావాల్సి ఉంది. తేడా వచ్చే అవకాశం లేదని, పర్సంటేజీ కూడా ఉంటుందని అంటున్నారు డీఏ రేటును 50గా నిర్ణయించే అవకాశం దాదాపు ఖాయమని చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వం మార్చి నెలలో డీఏ పెంపును ప్రకటించవచ్చు. ఇక్కడ ప్రస్తుతం ఉన్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల మూల వేతనానికి డీఏ లేదా డియర్‌నెస్ అలవెన్స్ వర్తిస్తుంది. అలాగే కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు డీఏ లేదా డియర్నెస్ రిలీఫ్ వర్తిస్తుంది.

జీతం ఎంత పెంచవచ్చు?

ఇక్కడ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతం రూ.60,000. బేసిక్ జీతం రూ.30,000 అని అనుకుందాం. ఇక్కడ ప్రాథమిక వేతనంలో 46% డెఫిషియన్సీ అలవెన్స్ ఉంది. అంటే రూ. 13,800 డీఏ. భత్యం 4 శాతం పెరిగితే భత్యం రూ.15,000 అవుతుంది. అంటే రూ.30,000 బేసిక్ వేతనం పొందుతున్న వారికి రూ.1,200 జీతం పెరుగుతుంది.

18 నెలల బకాయిలు అందుతాయా?

కోవిడ్ సంక్షోభం సమయంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు 18 నెలలపాటు డీఏ చెల్లించకుండా ఉంది. జనవరి 2020 నుండి జూన్ 2021 వరకు డీఏ విడుదల కాలేదు. ఈ బకాయిల విడుదలకు సంబంధించిన ప్రతిపాదనను ఇప్పుడు ఆర్థిక శాఖకు సమర్పించారు.

Kumari Aunty : కుమారి ఆంటీ క్రేజే వేరు.. నెలకు రూ. 18 లక్షలు..!

Kumari Aunty : హైదరాబాద్‌లో చార్మినార్ ఎంత ఫెమస్సో.. ధమ్ బిర్యానీ కుడా అంతే. స్ట్రీట్‌ఫుడ్‌కు భాగ్యనగరం పెట్టింది పేరు. ఎక్కడ ఏ ఫుడ్ ఉన్నా సోషల్ మీడియా పుణ్యాన ఇట్టే తెలిసిపోతుంది.
మీరు ట్విట్టర్, ఫేస్‌బుక్, ఇన్‌స్ట్రాగ్రామ్ యూజర్లు అయితే.. ఏది ఓపెన్ చేసినా కుమారి ఆంటీ ప్రత్యక్షమైపోతుంది. రీల్స్‌లో తెగ వైరల్ అవుతుంది. నాన్న.. ఏం కావాలి. చికెన్ అయితే 120.. లివర్ అయితే 150 అంటూ ప్రేమగా మాట్లాడుతూ స్ట్రీట్ ఫుడ్ బిజినెస్‌లో దూసుకుపోతుంది. ప్రపంచంలోనే ఏదైనా బాగా సక్సెస్ అయ్యే బిజినెస్ చెప్పమంటే ఆలోచన చేయకుండా టక్కున చెప్పొచ్చు అది ఫుడ్ బిజినెస్ అని. కాబట్టి అటువంటి బిజినెస్‌నే ఎంచుకుంది మన కుమారి ఆంటీ.. ఆంధ్రప్రదేశ్‌లోని గుడివాడకు చెందిన (దాసరి సాయి కుమారి)కుమారి ఆంటీ 2011 లో హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో ఐటీసీ కోహినూర్ ఎదురుగా స్ట్రీట్‌ఫుడ్ బిజినెస్ ప్రారంభించింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 13 ఏళ్లుగా ఇదే బిజినెస్ రన్ చేస్తూ అందరూ కూడా అవాక్కయేలా చేస్తుంది కూమారి ఆంటి. కేవలం 5 కేజీల రైస్‌తో మొదలు పెట్టిన ఆమె వ్యాపారం ఇప్పుడు 100 కేజీల రైస్ వండే వరకు విస్తరించింది.
ఇక ఈరోజుల్లో సోషల్ మీడియా ఫుడ్ బ్లాగ్స్ ఎంత పెద్ద సక్సెస్ అవుతున్నాయో పెద్దగా చెప్పక్కర్లేదు. అలా కొందరి యూటుబర్స్ పుణ్యమా అంటూ.. కుమారి ఆంటీ ప్రజలకు పరిచయమైంది. తక్కువ ప్రైస్‌లో మంచి ఫుడ్ పెడుతుందని, టేస్ట్ బావుంటుందని సోషల్ మీడియాలో వీడియోస్ వైరల్ కావడంతో కుమారి ఆంటీ బండి దగ్గరికి కుర్రకారు క్యూ కట్టారు. ఆ తర్వాత సెలబ్రిటీలు సైతం తమ వ్యూస్ పెంచుకోవడానికి కుమారి ఆంటీతో ఇంటర్వ్యూలు చేయడం స్టార్ట్ చేశారు. అలా కుమారి ఆంటి ఓ ఇంటర్య్యూలో ఆమె చెప్పిన ఆదాయం చెప్పడం హాట్ టాపిక్‌గా మారింది. హైదరాబాద్‌లోని మన ఐటి ఉద్యోగులకైతే దిమ్మతిరగి మైండ్ బ్లాక్ అయ్యింది.

సాధారణంగా ఫుడ్ బిజినెస్ అయితే ఎంత వస్తుంది ఆదాయం. మహా అయితే నెలకు లక్ష రావచ్చు అనుకుంటాం. కానీ మన కుమారి ఆంటీ ఫుడ్ బిజినెస్ మీద ఎంత సంపాదిస్తుందో తెలుసా..? అక్షరాల ర.18 లక్షలు. ఏంటీ షాక్ అయ్యారా.. జోక్ అనుకుంటున్నారా..? కాదు గురూ ఇదే నిజం. ఆమె రోజుకు రూ. 60 వేలు సంపాదిస్తుంది. నెలకు రూ.18 లక్షలు.. ఈ విషయం స్వయంగా ఆమె నోటితో మన కుమారి ఆంటీనే చెప్పింది. నాన్‌వెజ్ రెండు కర్రీలు తీసుకుంటే ప్లేటు రూ.150, మూడు తీసుకుంటే 200 అలా ఐటమ్‌ను బట్టి రేటు ఉంటుంది. రోజుకు 700 మంది కుమారి ఆంటీ దగ్గర ఫుడ్ తింటారట. యావరేజ్‌గా 600 మంది కస్టమర్స్‌కు 100 రూపాల లెక్కవేసుకున్నా.. రోజుకు 60,000 వేలు వస్తాయిని తెలిపింది. పెట్టుబడి రూ.10 లక్షల నుంచి రూ.12 లక్షలు పోయినా.. 6 లక్షలు లాభమన్న మాట. ఈ లెక్కలు విన్న మన ఐటీ ఉద్యోగులు, ఇతర వ్యాపారులు ,ఉద్యోగస్తులైతే.. తూ దీనెమ్మ బతుకు తొక్కలో ఉద్యోగం.. అర్జెంట్‌గా మనము ఓ ఫుడ్ బండి పెట్టాయ్యాలని సరదాగా పోస్టులు పెట్టుకుంటున్నారట.

కుమారి ఆంటీ ఫుడ్ బిజినెస్ మధ్యాహ్నం 12 గంటలకు మొదలై 3 గంటలకు క్లోజ్ అవుతుంది. నాన్‌వెజ్‌లో చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై, లివర్ కర్రీ, బోటీ కర్రీ, మటన్ లివర్, మటన్ కర్రీ,మటన్ హెడ్, ఫిష్ ఫ్రై, ఫిష్
కర్రీ వంటి రకాలు ఉన్నాయి. వెజ్‌లో అయితే వైట్ రైస్, బగారా రైస్, టమాటా రైస్, గోంగూర రైస్, జీరా రైస్, లెమర్ రైస్, పెరుగన్నం వంటి ఐటమ్స్ ఉన్నాయి. ఇక కుమారి ఆంటీ రేంజ్ అయితే సెలబ్రిటీగా మారిపోయింది. ఎక్కడ కనిపించినా ఫోటోలు దిగుతున్నారు. మరి కుమారి ఆంటీ దగ్గర ఫుడ్ టేస్ట్ చేయాలంటే..పైసలు ఫుల్‌గా పెట్టుకొని వెళ్లి రండమ్మా.. రెండు లివర్స్ 1000 రూపాయలే కదా..!

Imran Khan: పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్‌కు పదేళ్ల జైలు.. ఇంతకీ సైఫర్ కేసు ఏమిటీ?

Pakistan: పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు, పీటీఐ పార్టీ చీఫ్ ఇమ్రాన్ ఖాన్‌కు ప్రత్యేక కోర్టు పదేళ్ల జైలు శిక్ష విధించింది. ఇమ్రాన్ ఖాన్‌తోపాటు మాజీ విదేశాంగ మంత్రి, పీటీఐ వైస్ చైర్మన్ షా మహమూద్‌ ఖురేషీలకు సైఫర్ కేసులో పదేళ్ల జైలు శిక్ష విధించింది.
ఈ కేసు ఒక రహస్య దౌత్యపరమైన లేఖకు సంబంధించింది. 2022లో పాకిస్తాన్ అధ్యక్ష పదవీచ్యుతుడైన తర్వాత ఇమ్రాన్ ఖాన్ ఓ ర్యాలీలో ఓ రహస్య లేఖను ప్రదర్శించారు. అదే ర్యాలీలో పాకిస్తాన్ ప్రభుత్వం, అమెరికాపైనా సంచలన ఆరోపణలు చేశారు.

పాకిస్తాన్ అధ్యక్షుడిగా తనను తొలగించాలని అమెరికా కోరుకుందని, తనను తొలగించడానికి అమెరికా కుట్ర చేసిందని ఇమ్రాన్ ఖాన్ పేర్కొన్నారు. అందుకు ఇదే ఆధారం అని రహస్య లేఖను చూపించారు. అమెరికా ఆదేశాలకు అనుగుణంగా పాకిస్తాన్ మిలిటరీ ప్రభుత్వం నడుచుకుందని ఆరోపణలు గుప్పించారు. ఈ వ్యవహారానికి సంబంధించిన కేసునే సైఫర్ కేసు అంటారు.
ఈ కేసు విచారించడానికి అఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్ కింద ఓ ప్రత్యేక కోర్టు ఏర్పాటైంది. ఆ కోర్టు కేసు విచారించింది. తాజాగా, పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్‌కు, మాజీ విదేశాంగ మంత్రి షామ మహమూద్ ఖురేషీకి పదేళ్ల జైలు శిక్ష విధించింది.

Health

సినిమా