Saturday, November 16, 2024

Gurukula school admissions: గురుకుల పాఠశాలలో ప్రవేశాలకు దరఖాస్తులు

డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ గురుకులాల్లో ప్రవేశం పొందేందుకు సమయం ఆసన్నమైంది. 5వ తరగతి, ఇంటర్మీడియట్‌లో చేరేందుకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఇతర సామాజిక వర్గాలకు చెందిన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
గురుకులాల్లో ఉచిత వసతి కల్పించి, కార్పొరేట్‌కు దీటుగా విద్యాబోధన అందిస్తున్నారు.

గతేడాది నుంచి సీబీఎస్‌ఈ సిలబస్‌ బోధన సాగుతుండటంతో గురుకులాల్లో అడ్మిషన్లు పొందేందుకు విద్యార్థులు మరింత ఆసక్తి చూపుతున్నారు. రుచికరమైన పౌష్టికాహారం, విద్యాలయ ప్రాంగణంలో సీసీ కెమెరాల పర్యవేక్షణ, ఇంటర్మీడియట్‌ స్థాయిలో ఐఐటీ, జేఈఈ వంటి పోటీ పరీక్షలకు సైతం ప్రత్యేక శిక్షణ నిర్వహిస్తుండటంతో.. వీటిలో సీటు దక్కించుకునేందుకు విద్యార్థులు పోటీపడుతున్నారు.

సీట్ల రిజర్వేషన్‌ ఇలా..

ఎస్సీ-75 శాతం, ఎస్సీ-కన్వర్టర్డ్‌ క్రిస్టియన్‌(బీసీ-సీ)-12 శాతం, ఎస్టీ-6 శాతం, బీసీ-5 శాతం, ఓసీ -2 శాతం చొప్పున సీట్లు కేటాయించారు. ఎస్సీ గురుకులాల్లో చదివిన విద్యార్థులతో 60 శాతం సీట్లు, మిగతా 40 సీట్లు ఇతర స్కూళ్లలో చదివిన విద్యార్థులతో భర్తీ చేస్తారు.

ఇదీ షెడ్యూల్ 

ఈ నెల 25న నోటిఫికేషన్‌ జారీ అయింది. ఆన్‌లైన్‌ ద్వారా విద్యార్థులు దరఖాస్తు చేసుకునేందుకు ఫిబ్రవరి 23 వరకు గడువు ఉంది. మార్చి10న ఉదయం10 నుంచి 12గంటల వరకు 5వ తరగతిలో ప్రవేశాలకు, మధ్యాహ్నం 2 నుంచి 4.30గంటల వరకు ఇంటర్మీడియట్‌ ప్రవేశానికి ప్రవేశ పరీక్ష ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన కామన్‌ ఎంట్రన్స్‌ టెస్టులో మంచి మార్కులు సాధించిన వారి జాబితాను ప్రకటించి, మెరిట్‌ ఆధారంగా సీట్లు భర్తీ చేస్తారు.

● అనకాపల్లిలో బాలురు దేవరాపల్లి, గొలుగొండ, సబ్బవరం, బాలికలు నక్కపల్లి, కోనాం, నర్సీపట్నం, తాళ్లపాలెం, కొక్కిరాపల్లి గురుకులాల్లో అడ్మిషన్లు పొందవచ్చు. ఒక్క సబ్బవరంలో మాత్రం ఎంఈసీ, సీఈసీలో 40 చొప్పున సీట్లు ఉండగా, మిగతా అన్ని కాలేజీల్లోనూ ఎంపీసీ, బైపీసీ కోర్సుల్లో 40 చొప్పున సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఐదో తరగతిలో 80 మంది చొప్పున అవకాశం ఉంది.

● విశాఖపట్నం జిల్లా పరిధిలో శ్రీకృష్ణాపురం(బాలురు), మేహాద్రి గెడ్డ(బాలికలు), మధురవాడ(బాలికలు)లో గురుకుల విద్యాలయాలు ఉన్నాయి. ఒక్కో గురుకులంలో 5వ తరగతిలో 80 సీట్లు, ఇంటర్‌లో బైపీసీ-40, ఎంపీసీ-40 సీట్ల చొప్పున ఉన్నాయి.

అర్హతలివీ..

5వ తరగతిలో ప్రవేశానికి ఎస్సీ, ఎస్టీ విద్యార్థులైతే 2011 సెప్టెంబర్‌ ఒకటి నుంచి 2015 ఆగస్టు 31 మధ్య, ఓసీ, బీసీ, ఎస్సీ(కన్వర్టడ్‌ క్రిస్టియన్‌) విద్యార్థులు 2013 సెప్టెంబర్‌ ఒకటి నుంచి 2015 ఆగస్టు 31 మధ్య జన్మించి ఉండాలి. 3, 4 తరగతులు గుర్తింపు పొందిన పాఠశాలల్లో చదివి ఉండాలి. ఇంటర్మీడియట్‌లో ప్రవేశానికి 2023-24 విద్యా సంవత్సరంలో 10వ తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. 2024 ఆగస్టు 31 నాటికి 17 సంవత్సరాలు వయసు మించకూడదు. ఎస్సీ గురుకులాల్లో చదువుకున్న విద్యార్థులకై తే ఒక ఏడాది సడలింపు ఇస్తారు. విద్యార్థి తల్లిదండ్రుల ఆదాయం ఏడాదికి రూ.లక్ష ఉండాలి.ఐదో తరగతి ప్రవేశానికి  https://apgpcet.apcfss.in, ఇంటర్మీడియట్‌లో ప్రవేశానికి https://apgpcet.apcfss.in/inter వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

సద్వినియోగం చేసుకోవాలి

గురుకులాల్లో అడ్మిషన్లుకు గతంలో కన్నా.. ఇప్పుడు పోటీ ఉంది. విద్యార్థుల భద్రతకు అత్యంత ప్రాధాన్యమిచ్చేలా అన్ని గురుకులాల్లో సీసీ కెమెరాల పర్యవేక్షణ ఉంది. ఐదో తరగతి, ఇంటర్మీడియట్‌లో ప్రవేశాలకు అర్హులైన, ఆసక్తి ఉన్న విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి.

ప్రతి విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ధ

విద్యార్థులకు నాణ్యమైన చదువులు అందించడమే లక్ష్యంగా.. ప్రతి ఒక్కరిపై వ్యక్తి గత శ్రద్ధ తీసుకుంటాం. చదువులతో పాటు, ఇతర అంశాల్లోనూ రాణించేలా తర్ఫీదు ఇస్తాం. మా విద్యార్థులు వివిధ పోటీ పరీక్షల్లో రాష్ట్ర, జాతీయ స్థాయిలో ప్రతిభ చాటారు. ఉపాధ్యాయులంతా సమన్వయంతో పనిచేస్తున్నాం.

-వి.రత్నవల్లి, ప్రిన్సిపాల్‌, శ్రీకృష్ణపురం

AP News: ఇదేంటి పోలీసును నిందితుడిలా నిలబెట్టారు.. అక్కడే ఉంది అసలు ట్విస్ట్..

పోలీసుకు అలా ముసుగువేసి అలా నిందితుడిలా నిలబెట్టారు. ఆయన ఏం చేశాడు..? అనేగా మీ డౌట్. అక్కడికే వస్తున్నాం. ఆయన అసలు పోలీసాయన కాదు.
నకిలీ పోలీస్. మాంచిగా ఇస్త్రీ చేసిన పోలీస్ యూనిఫాం వేసుకుని.. చేతిలో వాకీ టాకీ పట్టుకుని.. రోజు ఓ సెంటర్‌ దగ్గర కాపు కాసి వసూళ్లకు తెగబడుతున్నాడు. ఈ విషయం అసలు ఖాకీలకు తెలిసింది. దీంతో వెంటనే అక్కడికి చేరుకుని నకిలీ పోలీస్ డ్రామాను రట్టు చేశారు.

వివరాల్లోకి వెళ్తే.. అన్నమయ్య జిల్లా రాజంపేటలో బద్వేలుకు చెందిన మాడపూరు శివయ్య.. నకిలీ పోలీస్ అవతారం ఎత్తాడు. విద్యానగర్‌కు వెళ్లే దారిలో ఇతను బైక్స్, కార్లు ఆపి డబ్బులు వసూళ్లకు పాల్పడుతున్నాడు. పక్కా సమాచారం పోలీసులకు రావడంతో టౌన్ ఎస్‌ఐ తన సిబ్బందితో సంఘటన స్ధలానికి చేరుకుని రెడ్‌హ్యాండెడ్‌గా నిందితుడ్ని పట్టుకున్నారు. పోలీసు యూనిఫాంలో ఉన్న నకిలీ పోలీసు.. స్థానిక పోలీసులను చూసి పారిపోయేందుకు ట్రై చేశాడు. పోలీసులు చాకచక్యంగా పట్టుకుని స్టేషన్‌కు తరలించారు. పోలీసు శాఖతో అతనికి ఎలాంటి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చారు.
అంతే కాదండోయ్. రాజంపేట టౌన్ పోలీసు స్టేషన్‌లో హోంగార్డుగా పనిచేస్తున్నానని చీట్ చేసి.. ఓ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. పట్టణంలో అప్పుడప్పుడు ఖాకీ వేషంలో ప్రజలను మోసం చేస్తూ తిరుగుతున్నాడు. శివయ్య నుంచి పోలీసు యూనిఫాం, పోలీసు శాఖకు సంబంధించిన నేమ్‌ప్లేట్‌, ఫేక్‌ ఐడీ, చార్జర్‌, వాకీటాకీ స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాపు చేస్తున్నారు.

అక్కడ నొక్కితే ఎందుకు హాయిగా ఉంటుంది.. SP6 పాయింట్ అంటే ఏమిటి?

మీరు తీవ్రమైన ఒత్తిడిలో ఉంటారు. తలనొప్పిగా అనిపిస్తుంది. ఆ క్షణంలో మీ కుటుంబ సభ్యుల్లో ఎవరైనా ఉంటే ఏం చేస్తారు? . జండు బామ్ రాయడమో, తలపై, నుదుటిపై, అరచేతులపై, కాలి మడమకు పైభాగంలో మృదువుగా నొక్కడమో చేస్తారు.
కొద్ది క్షణాల్లో రిలాక్స్ అయి పోతుంది. చక్కగా నిద్రపడుతుంది. అద్భుతం కదా!.. ఏ మెడిసిన్ వేసుకోకుండానే మీలోని స్ట్రెస్, తలనొప్పి ఎలా పారిపోయింది? ఇదే ఆక్యుప్రెషర్ థెరపీకి చక్కటి ఉదాహరణ అంటున్నారు కొందరు నిపుణులు.

ఆనందాన్ని కలిగిస్తుంది

ఆక్యుప్రెషర్ థెరపీకి సంపూర్ణ మద్దతు ఇచ్చే శాస్త్రీయ ఆధారాలైతే పెద్దగా ఉండవు కానీ, కొన్ని సందర్భాల్లో అది ఓ టానిక్‌లా పనిచేస్తుందని, మానసిక ఆనందాన్ని కలిగిస్తుందని పలువురు చెప్తుంటారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో దీని గురించి కొందరు డిస్కస్ చేస్తున్నారు. డీ హైడ్రేషన్, స్టమక్ ఇష్యూస్, నిద్రలేమి వంటి రోజువారీ ఆందోళనలను పరిష్కరించేందుకు కొన్ని ప్రత్యేకమైన పరిష్కారాలను కూడా ఈరోజుల్లో సోషల్ మీడియా సూచిస్తోంది. అంటే అందులో నిపుణులు కనెక్ట్ అయి ఉండటంవల్ల పలు సలహాలు ఇస్తుంటారు. ప్రస్తుతం ఒత్తిడి నుంచి ఉపశమనానికి, నిద్రలేమి సమస్యకు పరిష్కారంగా దీనిని ఎస్పీ6 పాయింట్‌ను సూచిస్తున్నారు.

నిద్రలేమికి చెక్

ఇటీవల నిద్రలేమితో బాధపడేవారికి పలువురు ఆక్యుప్రెషర్ నిపుణులు, అనుభవజ్ఞులు అరికాలిపై లేదా చీలమండలం భాగంలో ఒక నిర్ధిష్ట ప్రదేశంలో నొక్కడంవల్ల చక్కటి పరిష్కారం లభిస్తుందని చెప్తున్నారు. దీనిని SP6 పాయింట్ అని పిలుస్తున్నారు. చీలమండలంపై నాలుగు వేళ్ల వెడల్పు గల కాలి ఎముక వెనుక ఇది ఉంటుంది. దీనిని నొక్కడంవల్ల త్వరగా నిద్రపట్టడం, అలాగే మహిళలు అయితే మెన్‌స్ట్రువల్ ఇరిటేషన్ వంటి సమస్యల నుంచి వేగంగా రిలాక్స్ పొందుతారు.

అలసటను దూరం చేస్తుంది
తల నిమరడం, తలపై వెంట్రుకలు సున్నితంగా లాగడం, అరికాళ్లను స్పృశించడం వంటివి కూడా ఒత్తిడి నుంచి విముక్తి కలిగిస్తుంటాయి. నిద్రలేమి సమస్యకు పరిష్కారంగా ఉంటాయి. ఇవన్నీ ఆక్యుప్రెషర్ థెరపీలోను చిన్న భాగాలేనని నిపుణులు చెప్తున్నారు. నిర్దిష్ట పాయింట్‌లో నొక్కడం లేదా మర్దన చేయడం శారీరక, మానసిక అలసటను దూరం చేస్తుందని, చక్కగా నిద్రపట్టడంలో, శరీరంలోని అన్ని భాగాలకు రక్త ప్రసరణ జరగడంలో సహాయపడుతుందని కొందరు అనుభవజ్ఞులు కూడా చెప్తుంటారు.

LLT 20 2024: క్రికెట్‌ చరిత్రలోనే సంచలన క్యాచ్‌.. పక్షిలా ఎగురుతూ! వీడియో వైరల్‌

ఇంటర్నేషనల్ లీగ్ 2024లో భాగంగా ఆదివారం అబుదాబి వేదికగా ఎంఐ ఎమిరేట్స్‌, అబుదాబి నైట్ రైడర్స్‌ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో ఎంఐ ఎమిరేట్స్‌ ఆటగాడు ట్రెంట్ బౌల్ట్ అద్బుతమైన క్యాచ్‌తో మెరిశాడు.
అబుదాబి బ్యాటర్‌ లారీ ఎవాన్స్‌ను సంచలన క్యాచ్‌తో బౌల్ట్‌ పెవిలియన్‌కు పంపాడు. అబుదాబి ఇన్నింగ్స్‌ 18 ఓవర్‌ వేసిన ఫజల్హాక్ ఫరూఖీ బౌలింగ్‌లో ఎవాన్స్‌ లాంగ్‌ ఆఫ్‌ మీదగా భారీ షాట్‌ ఆడటానికి ప్రయత్నించాడు.

అయితే షాట్‌ సరిగ్గా కనక్ట్‌ కాకపోవడంతో బంతి గాల్లోకి లేచింది. ఈ క్రమంలో లాంగ్‌ ఆఫ్‌లో ఉన్న బౌల్ట్‌ వెనక్కి పరిగెత్తుకుంటూ వెళ్లి డైవ్‌ చేస్తూ ఒంటి చేత్తో స్టన్నింగ్‌ క్యాచ్‌ను అందుకున్నాడు. ఇది చూసిన ఎవాన్స్‌ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. బౌల్ట్‌ క్యాచ్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరలవుతోంది. కాగా ఈ మ్యాచ్‌లో అబుదాబి నైట్ రైడర్స్‌పై 8 వికెట్ల తేడాతో ఎంఐ ఎమిరేట్స్‌ విజయం సాధించింది.

తెలంగాణలో తెల్ల రేషన్ కార్డ్ లేకపోయినా ఆరోగ్యశ్రీ..!

తెలుగు రాష్ట్రాల్లో ఆరోగ్యశ్రీ పథకం ద్వారా లబ్ధి పొందాలంటే తెల్ల రేషన్ కార్డ్ తప్పనిసరి. అయితే తెలంగాణలో మాత్రం ఈ నిబంధన సడలించేందుకు ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది.
ఈమేరకు అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఆరోగ్యశ్రీకి తెల్ల రేషన్ కార్డ్ తప్పనిసరి అనే నిబంధన సడలించాలన్నారు. దీనిపై సాధ్యాసాధ్యాలను పరిశీలించి నివేదిక సమర్పించాలని చెప్పారాయన.

ఎందుకంటే..?

రేషన్ కార్డ్ ద్వారా ఆరోగ్యశ్రీనే కాదు, అనేక ఇతర అదనపు ప్రయోజనాలుంటాయి. అందుకే చాలామంది అనర్హులైనా కూడా ఏదో ఒక మార్గంలో రేషన్ కార్డ్ సాధించాలని అనుకుంటారు. ఇటీవల కాంగ్రెస్ ఆరు గ్యారెంటీల పుణ్యమా అని తెలంగాణలో రేషన్ కార్డులకు దరఖాస్తులు భారీగా పెరిగాయి. అదే సమయంలో అనర్హుల కార్డులు ఏరివేసేందుకు అధికారులు ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ దశలో ఆరోగ్యశ్రీకి రేషన్ కార్డ్ తో లింకు లేకుండా ఉంటే.. చాలామంది కార్డుల జోలికి వెళ్లరనేది సీఎం రేవంత్ రెడ్డి ఆలోచన.

తెలంగాణలో ఆరోగ్యశ్రీ పరిమితిని ఇటీవలే రూ.10లక్షలకు పెంచారు. దీంతో చాలామంది ఈ అవకాశాన్ని వినియోగించుకోడానికి రేషన్ కార్డులకోసం దరఖాస్తులు చేశారు. సీఎం ఆదేశాల మేరకు ఇప్పుడు ఈ నిబంధనను సడలించబోతున్నారు. కేవలం ఆరోగ్యశ్రీకోసమే అయితే రేషన్ కార్డ్ అవసరం లేదు అనే విషయంపై అధికారులు ప్రజల్లో అవగాహన తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తారు. దీంతో రేషన్ కార్డులు తీసుకోవాలనుకునేవారి సంఖ్య తగ్గుతుందని అంటున్నారు.

డిజిటల్ కార్డ్ లు..

తెలంగాణలో ప్రతి ఒక్కరికి డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ సిద్ధం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ కార్డును ఒక యునిక్ నంబర్ తో అనుసంధానం చేయాలని సూచించారు. దీంతో అత్యవసర పరిస్థితుల్లో సరైన వైద్యం అందించే వీలుంటుందని అన్నారు. ఈ హెల్త్ ప్రొఫైల్ కార్డుతో ఆరోగ్యశ్రీ ని అనుసంధానం చేయాలని సూచించారు. రాష్ట్రంలో మెడికల్ కాలేజీలకు అనుబంధంగా నర్సింగ్, ఫిజియోథెరపీ, పారా మెడికల్ కాలేజీలు ఉండేలా చర్యలు తీసుకోవాలని, ఇందుకోసం కామన్ పాలసీని తీసుకురావాలని కూడా ఆదేశించారు రేవంత్ రెడ్డి. వైద్య, ఆరోగ్య శాఖపై జరిగిన ఉన్నత స్థాయి సమీక్షలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

Indian Army: బరువు పెరిగితే సెలవులు కట్‌!

సైనికాధికారులు, సిబ్బందిలో తగ్గుతున్న శారీరక సామర్థ్యాన్ని దృష్టిలో ఉంచుకుని భారత సైన్యం కొత్త ఫిట్‌నెస్ విధానాన్ని రూపొందించింది. దీని ప్రకారం సైన్యంలో పనిచేస్తున్న ప్రతీఒక్కరికీ ఆర్మీ ఫిజికల్ ఫిట్‌నెస్ అసెస్‌మెంట్ కార్డ్ (ఏపీఏసీ) ప్రవేశపెట్టనున్నారు.
ఆర్మీలో తాజాగా రూపొందించిన శారీరక ప్రమాణాలకు అనుగుణంగా లేని సైనికులకు మెరుగుదల కోసం 30 రోజుల గడువు ఇవ్వనున్నారు. అప్పటికీ విఫలమైతే, ఆ సైనికుని సెలవులను తగ్గించనున్నారు. నూతన మార్పుల ప్రకారం త్రైమాసికానికి ఒకసారి జరిగే ట్రయల్స్‌లో కమాండింగ్ ఆఫీసర్‌కు బదులుగా బ్రిగేడియర్ ర్యాంక్ అధికారి ప్రిసైడింగ్ ఆఫీసర్‌గా వ్యవహరించనున్నారు. ఈ కొత్త విధానంలో 30 రోజులలోపు మెరుగుదల కనిపించకపోతే అధిక బరువు కలిగిన ఆర్మీ సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోనున్నారు. ఇప్పటికే ఉన్న పరీక్షలతో పాటు అదనంగా మరికొన్ని పరీక్షలను కూడా నిర్వహించనున్నారు.
ఈ కొత్త విధానం ఉద్దేశ్యం సైన్య సిబ్బంది పరీక్షల ప్రక్రియలో ఏకరూపతను తీసుకురావడం, శారీరకంగా అన్‌ఫిట్ లేదా స్థూలకాయంగా మారే ముప్పును తగ్గించడం, జీవనశైలి వ్యాధులు నివారణ. ప్రస్తుతం సైన్యం ప్రతి మూడు నెలలకు ఒకసారి బ్యాటిల్ ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (బీపీఈటీ), ఫిజికల్ ప్రొఫిషియన్సీ టెస్ట్ (పీపీటీ) నిర్వహిస్తోంది. బీపీఈటీ పరీక్షలో సిబ్బంది నిర్ణీత సమయంలో 5 కిలోమీటర్లు పరుగెత్తాలి. తాడు పైకి ఎక్కి తొమ్మిది అడుగుల గొయ్యిని దాటాలి. ఇక్కడ వయస్సు ఆధారంగా సమయం నిర్ణయిస్తారు. పీపీటీలో 2.4 కిలోమీటర్ల రన్, 5 మీటర్ల షటిల్, పుష్ అప్స్, చిన్ అప్స్, సిట్ అప్స్, 100 మీటర్ల స్ప్రింట్ ఉంటాయి. ఇది కాకుండా కొన్ని చోట్ల స్విమ్మింగ్ టెస్ట్ కూడా నిర్వహిస్తారు. ఈ పరీక్షల ఫలితాలు వార్షిక రహస్య నివేదిక (ఏసీఆర్‌)లో పొందుపరుస్తారు.
కొత్త నిబంధనల ప్రకారం ప్రతి మూడు నెలలకు ఒక బ్రిగేడియర్ ర్యాంక్ అధికారితో పాటు ఇద్దరు కల్నల్‌లు, ఒక మెడికల్ ఆఫీసర్ అసెస్‌మెంట్ నిర్వహిస్తారు. బీపీఈటీ, పీపీటీలు కాకుండా సైనికులకు కొన్ని ఇతర పరీక్షలు కూడా నిర్వహిస్తారు. వీటిలో ప్రతి ఆరు నెలలకు 10 కిలోమీటర్ల స్పీడ్ మార్చ్ , 32 కిలోమీటర్ల రూట్ మార్చ్ ఉంటాయి. అదనంగా 50 మీటర్ల స్విమ్మింగ్ టెస్ట్ కూడా నిర్వహించనున్నారు.

పెన్షన్లపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం

కుటుంబ పెన్షన్‌పై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ మహిళా ఉద్యోగులు, మహిళా పెన్షన్‌దారులు తమ మరణానంతరం వచ్చే పెన్షన్‌.. భర్తకు కాకుండా కూతురు లేదా కుమారుడికి చెందేట్లు వారిని నామినేట్‌ చేయొచ్చు.
ఇంతవరకు తన మరణాంతరం కేవలం భర్తను మాత్రమే నామినేట్‌ చేసే అవకాశం ఉండేది. అతడూ కూడా మరణిస్తే పిల్లలకు పెన్షన్‌ ఇచ్చేవారు. ఇకపై భర్తకు కాకుండా నేరుగా పిల్లలకే పెన్షన్‌ చెల్లించడానికి అవకాశం కలిగింది. దీని కోసం సీసీఎస్‌ (పెన్షన్) రూల్స్, 2021కి కేంద్రం సవరణను ప్రవేశపెట్టింది

మహిళా ఉద్యోగికి తన భర్తకు బదులుగా వారి కొడుకు(లు) లేదా కుమార్తె(ల)ని కుటుంబ పెన్షన్ కోసం నామినేట్ చేసే హక్కును కల్పిస్తూ ప్రభుత్వం సోమవారం నిబంధనలను సవరించింది. పెన్షన్లు మరియు పెన్షనర్ల సంక్షేమ శాఖ (DoP&PW) ఒక సవరణను ప్రవేశపెట్టిందని కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. సీసీఎస్(పెన్షన్) రూల్స్, 2021 ఇప్పుడు మహిళా ప్రభుత్వ ఉద్యోగులు లేదా పెన్షనర్లు వారి జీవిత భాగస్వామికి బదులుగా, వారి స్వంత మరణం తర్వాత వారి అర్హతగల బిడ్డ/పిల్లలకు కుటుంబ పెన్షన్‌ను మంజూరు చేయడానికి అనుమతిస్తుంది.
వివాహ వైరుధ్యాలు విడాకుల ప్రక్రియకు దారితీసే పరిస్థితులను లేదా గృహ హింస నుండి మహిళల రక్షణ చట్టం, వరకట్న నిషేధ చట్టం లేదా భారతీయ శిక్షాస్మృతి వంటి చట్టాల కింద నమోదైన కేసులను ఈ సవరణ పరిష్కరిస్తుంది అని ఆయన అన్నారు.

గతంలో మరణించిన ప్రభుత్వోద్యోగి లేదా పెన్షనర్ జీవిత భాగస్వామికి కుటుంబ పింఛను మంజూరయ్యేదని, ఇతర కుటుంబ సభ్యులు జీవిత భాగస్వామి అనర్హత లేదా మరణానంతరం మాత్రమే అర్హులుగా ఉండేది. “మహిళా ప్రభుత్వోద్యోగులు లేదా పెన్షనర్లు తమ జీవిత భాగస్వామికి బదులుగా వారి మరణం తర్వాత వారి అర్హతగల బిడ్డ/పిల్లలకు కుటుంబ పెన్షన్ మంజూరు చేయమని అభ్యర్థించడానికి సవరణ అనుమతిస్తుంది,” అని ఆయన చెప్పారు..

ముఖంపై మచ్చలను సహజంగా తొలగించడానికి ఉత్తమ ఇంటి చిట్కాలు మీకోసం

ముఖంపై చాలా మందికి ముదురు రంగు మచ్చలు ఉంటాయి. ఎన్ని రకాల క్రీములు, సీరంలను రాసినా కూడా ఇవి ఓ పట్టాన పోవు. ఈ మచ్చలు ముఖంలో మెరుపును దూరం చేస్తాయి.
చర్మం( Skin ) ఎంత తెల్లగా మృదువుగా ఉన్నా కూడా కాంతిహీనంగానే కనిపిస్తుంది. అందుకే ముఖంపై మచ్చలను వదిలించుకునేందుకు ముప్ప తిప్పలు పడుతుంటారు. అయితే ముఖంపై మచ్చలు( Dark Spots ) సహజంగా తొలగించడానికి కొన్ని ఉత్తమ ఇంటి చిట్కాలు కొన్ని ఉన్నాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్లు టొమాటో ప్యూరీ( Tomato Puree ) వేసుకోవాలి. అలాగే వన్ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్( Lemon Juice ) వేసి బాగా మిక్స్ చేసి ముఖానికి అప్లై చేసుకోవాలి. 15 నిమిషాల పాటు ఆరబెట్టుకుని ఆపై వాటర్ తో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. టొమాటో మరియు నిమ్మరసంలో ఉండే పలు సమ్మేళనాలు మొండి మచ్చలకు వ్యతిరేకంగా పోరాడతాయి. కొద్ది రోజుల్లోనే క్లియర్ అండ్ గ్లోయింగ్ స్కిన్ ను అందిస్తాయి.

అలాగే వన్ టేబుల్ స్పూన్ మెంతులను( Fenugreek Seeds ) నైట్ అంతా వాటర్ లో నానబెట్టి ఉదయాన్నే మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలో వన్ టేబుల్ స్పూన్ స్వీట్ ఆల్మండ్ ఆయిల్( Sweet Almond Oil ) మిక్స్ చేసి ముఖానికి అప్లై చేసుకోవాలి. పూర్తిగా డ్రై అయ్యాక కడిగేయాలి. ఇలా రోజు చేసినా కూడా ముఖం పై ఏర్పడిన మచ్చలు మాయం అవుతాయి. మరియు చర్మం యవ్వనంగా మారుతుంది. ఇక మరొక చిట్కా కూడా ఉంది. దానికోసం వన్ టేబుల్ స్పూన్ బార్లీ గింజల పొడిలో పావు టీ స్పూన్ పసుపు మరియు రెండు స్పూన్ల పెరుగు వేసి బాగా కలిపి ముఖానికి పట్టించాలి. 15 నిమిషాల పాటు ఆరబెట్టుకుని ఆపై వాటర్ తో క్లీన్ చేసుకోవాలి. ముదురు రంగు మచ్చలతో బాధపడుతున్న వారు ఈ రెమెడీని పాటిస్తే మంచి రిజల్ట్ ఉంటుంది.

Mosquitoes: దోమలను తరిమికొట్టడానికి నిమ్మకాయను ఇలా వాడండి.. నిమిషంలో మాయం అవుతాయి

Mosquitoes Home Remedies: వానాకాలం మొదలు అయింది. ఈ సీజన్ లో వానలతో పాటు దోమలు కూడా చాలా ఎక్కువగానే ఉంటాయి. దోమలను తరిమి కొట్టటానికి ఎన్నో రకాల ప్రయత్నాలను చేసి విసిగి పోతాము.
మార్కెట్ లో దొరికే ఎన్నో ప్రొడక్ట్స్ వాడుతూ ఉంటాం. అయినా పెద్దగా పలితం ఉండదు.

అలా కాకుండా మన ఇంటిలో దొరికే కొన్ని పదార్ధాలతో చాలా సులభంగా దోమలను తరిమి కొట్టవచ్చు. కాస్త ఓపికగా చేసుకుంటే చాలా సమర్ధవంతంగా పనిచేస్తాయి. ఈ చిట్కాలను ఫాలో అయితే ఈ వానాకాలంలో దోమలు లేకుండా హాయిగా ఉండవచ్చు. దోమల కారణంగా ఎన్నో వ్యాధులు వస్తున్నాయి. వాటిని కూడా అరికట్టవచ్చు.

నిమ్మకాయ,లవంగాలు దోమల నివారణలో చాలా అద్భుతంగా పనిచేస్తాయి. నిమ్మకాయను సగానికి కట్ చేసి పది లవంగాలను గుచ్చి గదిలో లేదా హాల్ లో పెట్టాలి. ఆ వాసనకు దోమలు పారిపోతాయి. ప్రతి రోజు నిమ్మకాయ,లవంగాలను మార్చుతూ ఉండాలి.
వెల్లుల్లి కూడా దోమలను తరిమి కొడుతుంది. వెల్లుల్లి రెబ్బలను నీటిలో నానబెట్టి నీటిని పోసి మెత్తని పేస్ట్ గా చేసి నీటిలో కలిపి దోమలు ఉన్న ప్రదేశంలో స్ప్రే చేస్తే దోమలు పారిపోతాయి. వెల్లుల్లిలో ఉండే సల్పర్ దోమలనే కాకుండా ఈగలు మరియు కీటకాలు ఏమి రాకుండా చేస్తుంది.

కర్పూరం కూడా దోమలను,ఈగలను తరిమి కొడుతుంది. ఒక గిన్నెలో నీటిని పోసి కొన్ని కర్పూరం బిళ్ళలు వేసి గది లేదా హాల్ లో పెడితే దోమలు ఆ వాసనకు బయటకు పోవటమే కాకుండా…బయట దోమలు కూడా లోపాలు రావు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

ఆత్మహత్యకు భయపడి రెండో పెళ్లి చేసుకొని నరకం అనుభవించిన ఘంటసాల

సినిమా రంగంలో ఒక భార్యకు మించి ఉన్నవారు చాలా మందే కనిపిస్తారు. అలా రెండు, మూడు పెళ్లిళ్లు చేసుకోవడం సర్వసాధారణంగా మారిపోయింది చిత్ర పరిశ్రమలో.
ఈ సంప్రదాయం ఇప్పటిది కాదు, తెలుగు సినిమా పుట్టిన నాటి నుంచి పలువురు సినీ ప్రముఖుల జీవితాల్లో జరిగిందే. రెండేసి పెళ్లిళ్లు చేసుకున్నవారు కొందరు సఖ్యతగా, సంతోషంగా ఉంటే మరికొందరికి అది నరకప్రాయంగా ఉండేది. దీనికి ఉదాహరణగా మహా గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావును తీసుకోవచ్చు. ఘంటసాల మొదటి భార్య పేరు సావిత్రి.

ఆమెకు ఐదుగురు పిల్లలు. ఆయన రెండో భార్య పేరు సరళ. ఆమెకు ముగ్గురు సంతానం. అయితే ఘంటసాలకు రెండో భార్య, పిల్లలు ఉన్నారన్న విషయం ఎవ్వరికీ తెలియకుండా జాగ్రత్త పడేది సావిత్రి.

ఒకవైపు ఘంటసాల తన రెండో భార్యను, పిల్లల్ని మొదటి భార్య దగ్గరకు తీసుకురావాలని, అందరూ కలిసి మెలిసి ఉంటే చూడాలని ఆశపడేవారు. కానీ, దానికి సావిత్రి ఒప్పుకునేది కాదు. ఈ విషయంలో ఘంటసాలకు ఎంతో మానసిక క్షోభను కలిగించేది సావిత్రి. ఘంటసాల రెండో పెళ్లి చేసుకోవడానికి ఒక విధంగా మొదటి భార్య సావిత్రే కారణం.

సరళ తమ పక్క వాటాలో నివసించే కుటుంబానికి చెందిన అమ్మాయి. ఒకరోజు సరళను ఘంటసాలకు పరిచయం చేసింది సావిత్రి. ఎప్పుడూ ఇంటికి వస్తూ పోతున్న తరుణంలో ఘంటసాల ఆమెకు దగ్గరయ్యారు. వారి మధ్య స్నేహం చిగురించింది.

ఆ తర్వాత అది ప్రేమగా మారింది. తనను పెళ్లి చేసుకోవాల్సిందిగా ఘంటసాలను కోరింది సరళ. అంతకుముందు అలాంటి ఘటనే ఘంటసాల జీవితంలో జరిగింది. ఒక యువతి ఘంటసాలను ప్రేమించింది.

తనను పెళ్లి చేసుకోవాల్సిందిగా కోరింది. దానికి ఘంటసాల ఒప్పుకోకపోవడంతో ఆమె ఆత్మహత్య చేసుకుంది. ఇప్పుడు సరళ కూడా అదే కోరిక కోరుతోంది. కాదంటే ఆమె కూడా ఆత్మహత్య చేసుకుంటుందేమోనని భయపడి పెళ్లికి ఒప్పుకున్నారు.

ఆ తర్వాత జరిగిన పరిణామాలు, ఘంటసాల జీవితంలోని విశేషాలను తెలియజేస్తూ ఆయన కుమార్తె డా.శ్యామల ఒక ఆన్‌లైన్‌ పత్రికలో సీరియల్‌గా రాస్తుండగా, దానిపై ఆమె తల్లి సావిత్రే కోర్టుకెక్కింది. సీరియల్‌ ఆపించేసింది. జీవిత కథలనేవి నిజాయితీగా వాస్తవాలను ప్రతిబింబించేలా ఉండాలని వాదించి ఆ కేసులో గెలుపొందారు శ్యామల. ఆ తర్వాత తను ఘంటసాల గురించి తెలియజేయాలనుకున్న అంశాలన్నింటినీ ఒక పుస్తక రూపంలో తీసుకొచ్చారు. ‘నేనెరిగిన నాన్నగారు’ పేరుతో ఆ పుస్తకాన్ని ప్రచురించారు. రెండో పెళ్లి చేసుకున్న తర్వాత ఘంటసాల జీవితంలో మనశ్శాంతి కరువైందని, ఇద్దరు భార్యలతో ఆయన నరకం అనుభవించారని డా.శ్యామల తన రచనలో పేర్కొన్నారు.

ఎన్నికల వరాలపై జగన్ కసరత్తు – మహిళలకు ఉచిత ప్రయాణం, రుణమాఫీ, ఐఆర్..!?

సీఎం జగన్ వైనాట్ 175 నినాదంతో ముందుకు వెళ్తున్నారు. పార్టీ అభ్యర్దుల ఎంపికపై ముఖ్యమంత్రి కసరత్తు తుది దశకు చేరింది. ఈ రోజు లేదా రేపు ఇంచార్జ్ మార్పుల చివరి జాబితా విడుదల చేసే అవకాశం ఉంది.
ఇదే సమయంలో ఎన్నికల్లో మహిళలు, ఉద్యోగులు, రైతులు లక్ష్యంగా కీలక నిర్ణయాల దిశగా ఆలోచన చేస్తున్నట్లు చెబుతున్నారు. ఈ నెల 31న జరిగే మంత్రివర్గంలో ఆమోదం దిశగా సమావేశ అజెండా పై సీఎం జగన్ నేరుగా సమీక్ష చేయటం ఆసక్తి కరంగా మారుతోంది.

కీలక నిర్ణయాలు: ముఖ్యమంత్రి జగన్ మరోసారి అధికారంలోకి రావాలనే పట్టుదలతో ఉన్నారు. కొత్త వ్యూహాలతో ముందుకు వెళ్తున్నారు. ఇప్పటికే భీమిలి సిద్దం సభ ద్వారా ఎన్నికల సమరశంఖం పూరించారు. 2019 ఎన్నికల సమయంలో 99 శాతం జగన్ అమలు చేసారు. అటు ప్రతిపక్ష పార్టీలు పొత్తులతో..సంక్షేమ హామీలతో ఎన్నికల బరిలోకి దిగుతున్నాయి.
దీంతో..జగన్ అలర్ట్ అయ్యారు. ప్రతిపక్షాలకు అవకాశం లేకుండా చేయాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నారు. అందులో భాగంగా ఈ నెల 31న మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసారు. ఎన్నికల వేళ రైతులు, మహిళలు, ఉద్యోగులకు కొత్త వరాలు ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతో, కేబినెట్ అజెండాలో చేర్చాల్సిన అంశాల పైన ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష చేస్తున్నారు.

మంత్రివర్గంలో ఆమోదం: వచ్చే నెల 20 తరువాత ఏ క్షణమైనా ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. దీంతో, ఫిబ్రవరి 6వ తేదీ నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలనేది ప్రభుత్వ ఆలోచనగా తెలుస్తోంది. ఓట్ ఆన్ ఎకౌంట్ బడ్జెట్ ప్రవేశ పెట్టేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ ప్రతిపాదనల తరువాత ఏపీ బడ్జెట్ కు తుది రూపు ఇవ్వనున్నారు.
ఈ సారి మంత్రివర్గ సమావేశంలో డీఎస్సీ నిర్వహణ పైన ఈ సమావేశంలోనే నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. అదే విధంగా ఉద్యోగులకు కొత్త పీఆర్సీ పైన ప్రభుత్వం ఇప్పటికే కమిటీ ఏర్పాటు చేసింది. కమిటీ నివేదిక ఇచ్చేందుకు మరింత సమయం అవసరం. ఈ లోగా ఉద్యోగులకు ఐఆర్ (మధ్యంతర భృతి) ఇవ్వాలని ప్రభుత్వ ఆలోచనగా తెలుస్తోంది. దీని పైన ఉద్యోగ సంఘాలతోనూ ప్రభుత్వం చర్చలు చేపట్టనున్నట్లు సమాచారం.

ఎన్నికల వరాలు: ఇక, రైతులకు రుణమాఫీ దిశగా ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు అధికర వైసీపీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. అదే విధంగా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం పైన కర్ణాటక, తెలంగాణలో ఆదరణ కనిపిస్తోంది. ఏపీలో ఈ పథకం అమలు పైన ఇప్పటికే ఆర్టీసీ అధికారులు ఇతర రాష్ట్రాలో అధ్యయనం చేసారు. ఆర్దిక భారం, లాభ నష్టాల పైన ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు.
దీని పైన ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అదే విధంగా ఎన్నికల మేనిఫెస్టో కమిటీ ఏర్పాటు దిశగా సీఎం జగన్ కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో..ఎన్నికల ముందే హామీలను ప్రకటించటం..అమలు చేయటం పైన సీఎం జగన్ కీలక నిర్ణయాలు తీసుకొనే అవకాశం కనిపిస్తోంది.

Four Working Days: ఉద్యోగులకు శుభవార్త.. ఇక కేవలం నాలుగంటే 4 రోజులు పని చేస్తే చాలు

Four Days Working: ప్రపంచవ్యాప్తంగా పని దినాల విషయంలో కొత్త కొత్త నిబంధనలు వస్తున్నాయి. కొన్ని సంస్థలు అత్యధిక పని గంటలు ఉండాలని నిర్ణయాలు తీసుకుంటుంటే..
మరికొన్ని కంపెనీలు సాధ్యమైనంత ఉద్యోగులకు తక్కువ పని గంటలు ఇచ్చి నాణ్యమైన సేవలు పొందాలని భావిస్తున్నాయి. ఈ క్రమంలోనే జర్మనీలో కొన్ని కంపెనీలు ఉద్యోగులకు ఊహించని తీపి కబురు అందిస్తున్నాయి. కేవలం నాలుగు రోజులే పని దినాలు ఉండేలా చూస్తున్నాయి. ఈ మేరకు పైలెట్‌ ప్రాజెక్టుగా కొన్ని కంపెనీలు అమలు చేసి చూడాలని నిర్ణయించాయి. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ఈ విధానం అమలు చేసేందుకు సిద్ధమయ్యాయి.

ప్రస్తుతం జర్మనీలో ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటోంది. నైపుణ్యం కలిగిన కార్మికుల కొరతతో విలవిలలాడుతోంది. ఈ సమయంలో అధిక పని దినాలు ఉంటే ఉద్యోగులు సక్రమంగా సేవలు అందించడం లేదని పలు సంస్థలు గుర్తించాయి. పని దినాలు అధికంగా ఉండడం వలన ఉద్యోగుల ఆరోగ్యం, పనితీరు సక్రమంగా లేదని గ్రహించారు. ఈ నేపథ్యంలోనే నాలుగు రోజుల పనిదినాలు అమలు చేయాలని పలు జర్మన్‌ కంపెనీలు నిర్ణయించాయి. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ఆరు నెలల వరకు ఈ విధానాన్ని అమలు చేయడానికి 45 కంపెనీలు సిద్ధమయ్యాయి.
వారానికి నాలుగు దినాలే పనులు చేసినా జీతం మాత్రం పూర్తి నెలకు చెల్లిస్తారు. ప్రయోగాత్మకంగా అమలుచేస్తున్న ఈ విధానం ద్వారా ఉద్యోగుల నుంచి నాణ్యమైన ఉత్పాదకత, సేవలు పొందవచ్చని 4డే వీక్‌ గ్లోబల్‌ అనే సంస్థ పేర్కొంది. కొన్ని గంటల పని విధానం ద్వారా ఉద్యోగులపై ఒత్తిడి తగ్గుతుందని.. వారి ఆరోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయని వెల్లడించింది. దీంతోపాటు ఉద్యోగుల సెలవుల విషయమై ఎలాంటి పేచి ఉండదని ఆ సంస్థ చెబుతోంది.

Big Breaking : రాజ్యసభ షెడ్యూల్ విడుదల.. పోలింగ్ ఎప్పుడంటే?

దేశంలో ఖాళీగా ఉన్న రాజ్యసభ స్థానాలకు కేంద్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసింది. పదిహేను రాష్ట్రాల్లో 56 స్థానాలకు సంబంధించిన షెడ్యూల్ విడుదలయింది.
ఫిబ్రవరి 8వ తేదీన రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల కానుంది. ఫిబ్రవరి 27న రాజ్యసభ ఎన్నికల పోలింగ్ జరగనుంది. నామినేషన్లు దాఖలు చేయడానికి ఫిబ్రవరి పదిహేనో తేదీగా నిర్ణయించింది. నామినేషన్ల పరిశీలనకు ఫిబ్రవరి 16వ తేదీగా నిర్ణయించారు.

తెలుగు రాష్ట్రాల్లో ఆరింటికి….ఆంధ్రప్రదేశ్ లో మొత్తం మూడు రాజ్యసభ స్థానాలు భర్తీ కానున్నాయి. తెలంగాణలోనూ మూడు రాజ్యసభ స్థానాలకు ఎన్నిక జరగనుంది. దీంతో రాజ్యసభ ఎన్నికలు ఫిబ్రవరి చివరి వారంలో రాజ్యసభ ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని నిర్ణయించింది. పోలింగ్ జరిగే రోజు కౌంటింగ్ జరగనుంది. ఉదయం పది గంటల నుంచి రాజ్యసభకు సంబంధించి నామినేషన్లు స్వీకరిస్తారు.

AP TET 2024: నిరుద్యోగులకు గమనిక.. టెట్‌ పేపర్‌-1, పేపర్ 2 అర్హతలు సవరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు..

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం త్వరలో నిర్వహించనున్న ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్‌) రాసేందుకు అర్హతలను సవరిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.
ఒకటి నుంచి 5 తరగతులకు బోధించే సెకండరీ గ్రేడ్‌ టీచర్స్‌ (SGT)కు నిర్వహించే టెట్‌-1 పేపర్‌ పరీక్ష, ఆరు నుంచి పదో తరగతి వరక బోధించేందుకు నిర్వహించే పేపర్‌ 2 పరీక్షకు హాజరయ్యేందుకు అర్హతలను సవరించింది. రెండేళ్ల డిప్లొమా ఇన్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌ (DELED), నాలుగేళ్ల బ్యాచిలర్‌ ఆఫ్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌ (BELED) చేసిన వారు మాత్రమే పేపర్‌ 1 పరీక్ష రాసేందుకు అర్హులని పేర్కొంది. ఇంటర్మీడియట్‌, తత్సమాన విద్యార్హతలో ఓసీ అభ్యర్ధులకు 50 శాతం మార్కులు తప్పనిసరిగా ఉండాలనే నిబంధన పెట్టింది.

ఈ మార్కుల నుంచి ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులకు 5 శాతం మినహాయింపునిచ్చి, 45 శాతం మార్కులు ఉంటే సరిపోతుందని పేర్కొంది. బీఈడీ చేసిన వారు కూడా ఎస్జీటీ పోస్టులకు అర్హులేనంటూ జాతీయ ఉపాధ్యాయ విద్యామండలి 2018లో ఇచ్చిన నోటిఫికేషన్‌ను సుప్రీంకోర్టు రద్దు చేసినందున ఈ సవరణ ఉత్తర్వులు జారీ చేసినట్లు ప్రభుత్వం పేర్కొంది.టెట్‌ పరీక్ష నిర్వహణ వ్యయాన్ని కూడా అభ్యర్థుల దరఖాస్తు ఫీజుల నుంచే భరించాలని ఈ సందర్భంగా సూచించింది. గతంలో ఏడాదికి రెండుసార్లు టెట్‌ నిర్వహించాలనే నిబంధన ఉండేది. కానీ 2021 నుంచి ఏడాదికి ఒక్కసారే ఈ పరీక్షను నిర్వహించాలని ప్రభుత్వం సవరించింది.

పేపర్‌ – 2 అర్హత మార్కుల్లో మినహాయింపు.. ఎంతంటే

టెట్‌ పేపర్‌ – 2 కు హాజరయ్యే ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగ అభ్యర్థులకు డిగ్రీలో అర్హత మార్కులను 40 శాతానికి కుదించారు. అయితే ఈ ఒక్కసారికి మాత్రమే ఈ మినహాయింపు ఇస్తున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. గతంలో టెట్‌ రాసేందుకు అర్హత మార్కులు 45 శాతం ఉండేది. తాజాగా దీన్ని 5 శాతానికి తగ్గించింది. డిగ్రీలో 40 శాతం మార్కులతో బీఈడీ చేసేందుకు అనుమతిస్తున్నందున.. టెట్‌ రాసేందుకు 45శాతం ఉండాలనే నిబంధన గతంలో పెట్టారు. దీనిపై అనేక ఫిర్యాదులు రావడంతో మినహాయింపులు ఇస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో తాజా టెట్‌ పరీక్షకు కూడా పేపర్ 2 రాసేందుకు 5 మార్కులు మినహాయించి 40 మార్కులకు కుదించారు. కాగా అందిన సమాచారం మేరకు టెట్‌ నోటిఫికేషన్‌ నేడో రేపో విడుదలకానుంది.

షుగర్, బీపీ ఉన్నవారు జామపండు తినొచ్చా?

జామపండు ధర తక్కువ ఆరోగ్య ప్రయోజనాలు ఎక్కువ అనే విషయం దాదాపు అందరికి తెలిసిందే. పల్లెటూరిలో ఉండే ప్రతి ఇంట్లో కూడా దాదాపు జామ చెట్టు ఉండే ఉంటుంది.
జామచెట్టు పండ్లు మాత్రమే కాదు ఆకులు కూడా ఆరోగ్యానికి మంచివి,జామ ఆకులతో పంటి నొప్పికి వైద్యం చేస్తారు. ఈ ఆకులతో చేసిన టీ తాగితే బరువు తగ్గుతారు. హార్మోన్ల అసమతుల్యత కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నవారికి కూడా జామపండు అద్భుతమైన ఔషధంలా పనిచేస్తుంది. జామకాయలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది.

ఇందులో ఫోలేట్ పుష్కలంంగా ఉంటుంది. ఇది సంతానోత్పత్తిని ప్రోత్సహిస్తుంది. పీసీఓఎస్ తో బాధపడే మహిళలు జామకాయ తింటే జామలో సమృద్ధిగా ఉండే రాగి హార్మోన్ల ఉత్పత్తి, శోషణకు సహాయపడుతుంది. జామపండులో బీటా కెరోటిన్ అధికంగా ఉంటుంది.
ఇది కంటిచూపునకు తోడ్పడే విటమిన్. రక్తనాళాల్లో మ్యూకస్ అనే పొరను రక్షిస్తుంది. రెటీనాలో వర్ణద్రవ్యాల్ని ఏర్పరచడానికి ఉపయోగపడుతుంది. మొక్కల్లో విటమిన్ A బీటా కెరోటిన్ రూపంలో ఉంటుంది.

మీ డైట్లో జామపండు చేర్చుకుంటే కళ్లు ఆరోగ్యంగా ఉంటాయి, దృష్టి సమస్యల నుంచి రక్షణ లభిస్తుంది. క్యాటరాక్ట్ సమస్య రాకుండా అదుపు చేస్తుంది. జామపండులో విటమిన్ B3, B6 ఉంటాయి. ఈ పోషకాలు మెదడు రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది, మీ నరాలకు విశ్రాంతిని అందిస్తుంది.

తద్వారా మెదడు పనితీరును ప్రోత్సహిస్తుంది. మానసిక ఒత్తిడి తగ్గుతుంది. గర్భిణులు జామపండు తింటే.. తల్లీ, బిడ్డ ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని నిపుణులు అంటున్నారు.
జామకాయలో విటమిన్లు B, C, A, E, టోకోఫెరోల్, ఐసోఫ్లేవనాయిడ్స్ వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. జామకాయలో ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది, ఇది జీర్ణక్రియకు మేలు చేస్తుంది, కండరాల ఒత్తిడిని తగ్గిస్తుంది, గర్భిణీ స్త్రీలలో మలబద్ధకాన్ని నివారిస్తుంది. ఇవి తినడం వల్ల గర్భిణులకు అవసరమైన ఫోలిక్ యాసిడ్ అందుతుంది. ముఖ్యంగా న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్ సమస్య ఉన్న స్త్రీలలో గర్భస్రావం, శిశు మరణాల్లాంటివి సాధారణం.

జామకాయలు ఆ సమస్యను చాలా వరకూ నివారిస్తాయని అధ్యయనాల్లో తేలింది. జామపండులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, గ్లైసమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. అందువల్లే మనకు అకస్మాత్తుగా చక్కెర నిల్వలు పడిపోకుండా చేసి సమతుల్యంగా ఉంచుతుంది. అలాగే రక్తపోటునూ అదుపులో ఉంచుతుంది. ఇందులోని ట్రైగ్లిజరాయిడ్లు చెడు కొవ్వుని తగ్గించి గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. మరి ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన జామకాయ లేదా పండుని రోజువారి ఆహారంలో తప్పక చేర్చుకొండిక.

NPS: నేషనల్ పెన్షన్ స్కీమ్ కు మీరు అర్హులా.. ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే..

నేషనల్ పెన్షన్ స్కీమ్ కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నగదు జమ చేయడం, విత్ డ్రాలు చేసుకునే వెసులుబాటు ఉన్న ఈ పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలో వెల్లడించింది.
నేషనల్ పెన్షన్ సిస్టమ్ అనేది పదవీ విరమణ పొదుపు పథకం. దీనిని ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ( PFRDA ) నియంత్రిస్తుంది. ఈ ఖాతాను ఎలా తెరవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా అధికారిక eNPS వెబ్‌సైట్ ( https://enps. nsdl.com/eNPS/NationalPension-System.html ) లేదా NPS సేవలను అందించే ఏదైనా అధీకృత బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థల వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయాలి. రిజిస్ట్రేషన్ పై క్లిక్ చేసి, న్యూ రిజిస్ట్రేషన్ ఆప్షన్ ను ఎంచుకోవాలి. దరఖాస్తుదారు తన ఆధార్ లేదా పాన్ నంబర్, మొబైల్ నంబర్, ఇ-మెయిల్ ఐడీ ఎంటర్ చేయాలి. OTP ధ్రువీకరణ తర్వాత, వ్యక్తిగత వివరాలను పూరించాలి. ఇటీవలి ఫొటో, సంతకం, రద్దయిన చెక్కు లేదా బ్యాంక్ స్టేట్‌మెంట్‌ను అప్‌లోడ్ చేయాలి.
ఖాతా ఎంపిక తర్వాత ఖాతా రకాన్ని టైర్ I లేదా టైర్ II లేదా రెండింటినీ ఎంచుకోవలసి ఉంటుంది. టైర్ I అనేది పన్ను ప్రయోజనాలను అందించే తప్పనిసరి ఖాతా. కానీ ఉపసంహరణలపై పరిమితులను కలిగి ఉంటుంది. టైర్ II అనేది మరింత ప్రయోజనాలు అందించే స్వచ్ఛంద ఖాతా. దీనికి ఎలాంటి పన్ను ప్రయోజనాలు లేవు. టైర్ I కోసం కనీసం రూ.500, టైర్ II ఖాతా కోసం రూ.1,000 తో ప్రారంభించవచ్చు. అనంతరం దరఖాస్తుదారుడు 12-అంకెల శాశ్వత పదవీ విరమణ ఖాతా సంఖ్య (PRAN) పొందుతాడు. ఈ ఖాతాను పూర్తి చేసేందుకు ఇ-సైన్ లేదా ఓటీపీ ఎంటర్ చేయాలి.
ఈపీఎఫ్ఓతో సమానంగా జాతీయ పెన్షన్ స్కీమ్‌లోనూ చందాదారులకు పన్ను ప్రయోజనాలు కల్పించాలని ఇప్పటికే పెన్షన్ ఫండ్‌ రెగ్యులేటరీ సంస్థ పీఎఫ్‌ఆర్‌డీఏ కేంద్రాన్ని కోరింది. ఎన్ పీఎస్ చందాదారులుగా ఉన్న 75 ఏళ్ల వయసు పైబడిన వారికి అదనపు ప్రయోజనాలు కల్పించాలని కేంద్రం యోచిస్తున్నట్లు సమాచారం. వీరికి రూ.50 వేల వరకూ పన్ను రాయితీ లభిస్తోంది.

Tirumala : తిరుమలకు భక్తులు రావొద్దు.. టిటిడి సూచన.

Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. లక్షలాదిమంది భక్తులు శ్రీవారిని దర్శించుకునేందుకు తిరుమల వస్తున్నారు. వరుసగా మూడు రోజులు పాటు సెలవులు రావడంతో తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక నుంచి భారీగా భక్తులు తరలిరావడం కనిపిస్తోంది.
దీంతో టీటీడీ దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. నడక మార్గంలో ఆంక్షలు విధించింది. ఏకంగా నాలుగు వేల టోకెన్లను రద్దు చేసింది. నడక మార్గంలో వచ్చే వారి విషయంలో టోకెన్ల కుదింపు విధించింది. శని, ఆదివారాల్లో ఈ టోకెన్ల రద్దు కొనసాగింది.

ప్రస్తుతం తిరుమలకు మెట్ల మార్గం, రోడ్డు మార్గం గుండా భారీ స్థాయిలో భక్తులు చేరుకుంటున్నారు. దక్షిణాది రాష్ట్రాల నుంచి భక్తుల రాక అధికంగా ఉంది. దీంతో తిరుమల గోవింద నామస్మరణతో మార్మోగుతోంది. శుక్రవారం ప్రభుత్వ సెలవు దినం రావడం, మధ్యలో శనివారం వీకెండ్ కావడం, ఆదివారం సెలవు కలిసి రావడంతో అలిపిరి, శ్రీవారి మెట్ల మార్గం నుంచి వేలాది మంది భక్తులు వస్తున్నారు. ఎటు చూసినా గోవిందా గోవిందా అంటూ నామస్మరణ కనిపిస్తోంది. అటు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో అన్ని కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. నారాయణగిరి ఉద్యానవనంలోని తొమ్మిది షెడ్లు భక్తులతో నిండి.. బాట గంగమ్మ ఆలయం వరకు క్యూ లైన్ వ్యాపించింది. సోమవారం సాయంత్రం వరకు ఈ రద్దీ ఉంటుందని టిటిడి భావిస్తోంది.

శ్రీవారి దర్శనం 24 గంటల నుంచి 30 గంటల వరకు పడుతోంది. దీంతో భక్తులు క్యూ లైన్ లలో గంటల తరబడి వేచి ఉండడం కనిపిస్తోంది. ఈ తరుణంలో భక్తులకు టిటిడి ప్రత్యేక వస్తువులు కల్పిస్తోంది. అన్న ప్రసాదం, పాలు, మజ్జిగ, సుండల్ అందిస్తోంది. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులపై టీటీడీ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. ఇప్పటివరకు నడక మార్గంలో దాదాపు నాలుగు వేల టోకెన్లు టిటిడి రద్దు చేసింది. సోమవారం సైతం టోకెన్లు రద్దయ్యే అవకాశం ఉంది. ఈ అంతరాయాన్ని భక్తులు గమనించాలని.. వీలైనంతవరకు రద్దీని దృష్టిలో పెట్టుకొని తిరుమల రావద్దని పరోక్షంగా టిటిడి సూచించింది. కానీ ఇప్పటికే ప్రయాణ ఏర్పాటు చేసుకున్న భక్తులు పెద్ద ఎత్తున తిరుమలకు చేరుకోవడం విశేషం.

Smart TV: భారీ డిస్కౌంట్ తో 27 వేలకే లభిస్తున్న 55 ఇంచ్ బ్రాండెడ్ బిగ్ స్మార్ట్ టీవీ.!

Smart TV: భారీ డిస్కౌంట్ తో 27 వేలకే లభిస్తున్న 55 ఇంచ్ బ్రాండెడ్ బిగ్ స్మార్ట్ టీవీ ఆఫర్ గురించి ఈరోజు మీకు చెప్పబోతున్నాను. ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుండి ఈ బెస్ట్ స్మార్ట్ టీవీ ఆఫర్ అందుబాటులో వుంది.
55 ఇంచ్ బిగ్ స్మార్ట్ టీవీని చవక ధరకే అందుకోవాలని చూస్తున్న వారిలో మీరు కూడా ఉన్నట్లయితే, ఈ ఆఫర్ పైన ఒక లుక్కేయండి.

Smart TV Offer:

MOTOROLA స్మార్ట్ టీవీ సిరీస్ EnvisionX నుండి వచ్చిన 55 ఇంచ్ 4K స్మార్ట్ టీవీ మోడల్ నెంబర్ 55UHDGDMBSXP ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుండి 50% డిస్కౌంట్ తో కేవలం రూ. 27,999 ఆఫర్ ధరకే లభిస్తోంది. ఈ స్మార్ట్ టీవీని Canara Bank మరియు Citi-branded క్రెడిట్ కార్డ్స్ తో కొనేవారికి 10% అధనపు ద్కసౌంట్ కూడా లభిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ ఆఫర్ చేసే స్పెక్స్ మరియు ఫీచర్లని ఈ క్రింద చూడవచ్చు.
MOTOROLA EnvisionX

మోటోరోలా ఎన్ విజన్ ఎక్స్ 55 ఇంచ్ 4K UHD స్మార్ట్ టీవీ HDR10 సపోర్ట్ మరియు 60Hz రిఫ్రెష్ రేట్ కలిగిన డిస్ప్లేతో వస్తుంది. ఇది Dual Band Wi-Fi, 3 HDMI మరియు 2USB వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి వుంది. ఈ స్మార్ట్ టీవీలో 20W సౌండ్ అందించ గల రెండు స్పీకర్లు, Dolby Digital, Dolby Digital Plus మరియు DTS True Surround సౌండ్ సపోర్ట్ కూడా కలిగి వుంది.

ఈ మోటోరోలా స్మార్ట్ టీవీ MediaTek 9602 ప్రోసెసర్ తో పని చేస్తుంది మరియు జతగా 2 GB RAM మరియు 16GB ఇంటర్నల్ స్టోరేజ్ కూడా ఉన్నాయి. ఈ స్మార్ట్ టీవీ Google TV OS పైన పని చేస్తుంది.

IMPS new rules | మొబైల్ నెంబర్స్‌తోనే ట్రాన్సాక్షన్స్.. ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి

ఫిబ్రవరి 1 నుంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్‌ విషయంలో కొత్త నిబంధన అమల్లోకి రానుంది. నేరుగా లబ్దిదారుడి ఫోన్‌ నెంబర్‌తో 5 లక్షల రూపాయల వరకు పంపించుకోవచ్చు.
ఇందుకు లబ్దిదారుడి బ్యాంక్‌ అకౌంట్‌ నెంబర్‌, ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌ వంటివి ఎంటర్‌ చేయాల్సిన అవసరం లేదు. నేషనల్‌ పేమెంట్స్‌ కార్పోరేషన్‌ ఇఫ్‌ ఇండియా (ఎన్‌పీసీఐ) ఈ మేరకు కొత్త రూల్‌ను తీసుకు వచ్చింది. ఫిబ్రవరి 1 నుంచి ఇమిడియట్‌ పేమెంట్‌ సర్వీస్‌ (ఐఎంపీఎస్‌) కీలకమైన మార్పులు చేయనుంది.

బ్యాంక్‌ అకౌంట్ల మధ్య జరిగే డబ్బు ట్రాన్స్‌ఫర్‌ విషయంలో ఈ మార్పులు చేస్తోంది. నగదును మరింత సులభంగా బదిలీ చేసేందుకు అనుగుణంగా మార్పులు చేస్తోంది. ఈ కొత్త రూల్‌ ప్రకారం నగదు పంపించాల్సిన వారి పేరు, బ్యాంక్‌ అకౌంట్‌, ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌ వంటి వివరాలు అవసరం లేకుండానే కేవలం అకౌంట్‌తో లింక్‌ అయిన ఫోన్‌ నెంబర్‌ ద్వారా 5 లక్షల రూపాయల వరకు ఒకేసారి బదిలీ చేయవచ్చు.
ఈ కొత్త నిబంధన మూలంగా డబ్బులు అందుకునే వారి వివరాలు నమోదు చేసిన సమయంలో ఎలాంటి తప్పులు దొర్లకుండా ఉండేందుకు, అకౌంట్‌ యాడ్‌ చేసుకున్న తరువాత జరిగే జాప్యాన్ని నివారించేందుకు ఉపయోగపడుతుంది. డబ్బు ట్రాన్స్‌ఫర్‌ కావడానికి ముందే రియల్‌ టైమ్‌లో లబ్దిదారుడి వివరాలను చెక్‌ చేస్తుంది. దీని వల్ల పొరపాట్లు దొర్లకుండా నివారించవచ్చని ఐఎంపీఎస్‌ తెలిపింది.

మెరుగుపరిచిన ఈ విధానం పూర్తిగా యూజర్‌ ఫ్రెండ్లీగా ఉంటుందని తెలిపింది. ఐఎంపీఎస్‌ సర్వీస్ 24 గంటలు పని చేస్తుంది. ఆన్‌లైన్‌ ఆర్ధిక లావాదేవీలు మరింతగా పెరిగేందుకు ఇది దోహద పడుతుందని పేర్కొంది. దీన్ని వినియోగించుకునేందుకు యూజర్లు మొబైల్‌ బ్యాంకింగ్‌ యాప్‌లోకి వెళ్లి ఫండ్‌ ట్రాన్స్‌ఫర్‌ సెక్షన్‌పై క్లిక్‌ చేయాల్సి ఉంటుంది. ఇందులో ఫండ్‌ ట్రాన్స్‌ఫర్‌ కోసం ఐఎంపీఎస్‌ విధానాన్ని ఎంపిక చేసుకోవాలి. తరువాత మీరు డబ్బు పంపించాల్సిన వారి మొబైల్‌ నెంబర్‌ను ఎంటర్‌ చేసి, లబ్దిదారుడి బ్యాంక్‌ పేరును ఎంపిక చేయాలి. బ్యాంక్‌ అకౌంట్‌ నెంబర్‌ కాని, ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌ కాని అవసరంలేదు. మొబైల్‌ నెంబర్‌ ఎంటర్‌ చేసిన తరువాత 5 లక్షల పరిమితికి లోబడి ఎంత ట్రాన్స్‌ఫర్‌ చేస్తున్నారో ఆ మొత్తాన్ని ఎంటర్‌ చేసి ట్రాన్స్‌ఫర్‌ చేసుకోవచ్చు. లావాదేవీ పూర్తి అయ్యేందుకు మీకు వచ్చే ఓటీపీని ఎంటర్‌ చేయాల్సి ఉంటుంది.

మీతో మీరే పోటీ పడండి: ఫోన్ వాడకంపై పరీక్షా పే చర్చలో ప్రధాని మోడీ కీలక సూచనలు

#WATCH | Delhi: A lot of parents keep on giving examples of other children to their children. Parents should avoid doing these things… We have also seen that those parents who have not been very successful in their lives, have nothing to say or want to tell the world about their successes, and achievements, make the report card of their children as their visiting card. Whenever they meet someone, they will tell them the story of their children: PM Modi at ‘Pariksha Pe Charcha’ 2024

Watch Video 

న్యూఢిల్లీ: పరీక్షల సమయంలో విద్యార్థులపై తల్లిదండ్రులు ఒత్తిడి పెంచకూడదని ప్రధాని నరేంద్ర మోడీ సూచించారు. సోమవారం జరిగిన పరీక్షా పే చర్చ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు కీలక సూచనలు చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఢిల్లీలోని భారత్ మండపంలో ఈ కార్యక్రమం జరిగింది.
పిల్లలు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేలా చూడాలని ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు. విద్యార్థుల ప్రోగ్రెస్ రిపోర్ట్​లను వారి విజిటింగ్ కార్డులుగా తల్లిదండ్రులు పరిగణించకూడదని ప్రధాని మోడీ స్పష్టం చేశారు. విద్యార్థులు తమతో తామే పోటీ పడాలని, ఎదుటివారితో కాదని ప్రధాని స్పష్టం చేశారు.
తల్లిదండ్రులు ప్రతిసారి వారి పిల్లలకు తోటి విద్యార్థుల గురించి ఉదాహరణలు ఇస్తుంటారు. ఎప్పుడూ ఇతరుల గురించి చెబుతుంటారు. దయచేసి తల్లిదండ్రులు ఈ విషయాల నుంచి దూరంగా ఉండాలని ప్రధాని మోడీ సూచించారు. ఇక, విద్యార్థులతో ఉపాధ్యాయుల సంబంధాలు పాఠశాలల్లో తొలి రోజు నుంచి పరీక్షల వరకు కొనసాగాలని మోడీ పేర్కొన్నారు. అప్పుడే విద్యార్థులకు పరీక్షల్లో ఒత్తిడి ఉండదని తెలిపారు.
సిలబస్ వరకే పరిమితం కాకుండా విద్యార్థులతో మమేకం కావడం ముఖ్యమని ప్రధాని మోడీ ఉపాధ్యాయులకు సూచించారు. అప్పుడే విద్యార్థులు తమ చిన్న చిన్న సమస్యలను కూడా ఉపాధ్యాయులతో చెప్పుకోగలుగుతారని అన్నారు. వారి సమస్యలను శ్రద్ధగా విని పరిష్కారం చూపిస్తేనే విద్యార్థులు పైకి ఎదుగుతారని స్పష్టం చేశారు.
మొబైల్ ఫోన్‌​కు రీఛార్జ్ అవసరమైనట్టే శరీరానికి కూడా రీఛార్జ్ చాలా ముఖ్యమని మోడీ పేర్కొన్నారు. శరీర ఆరోగ్యానికి నిద్ర చాలా కీలకమన్నారు. ‘పడుకునే సమయాన్ని రీల్స్ చూడటానికి ఉపయోగించకండి. సమయం వృథా చేయకండి. నేను బెడ్​‌పై వాలిపోయిన 30 సెకన్లలోనే నిద్రలోకి జారుకుంటాను. మెలకువగా ఉంటే 100 శాతం ఏకాగ్రతతో పని చేస్తాను అని ప్రధాని మోడీ తెలిపారు. నిద్రతో పాటు పోషకాహారం కూడా చాలా ముఖ్యం. అవసరమైన న్యూట్రిషన్ ఉండే ఆహారం తీసుకోవాలి. సమతుల్యమైన ఆహారం తీసుకుంటూ వ్యాయామం చేస్తూ ఉండాలి అని ప్రధాని మోడీ సూచించారు.

Seven Horses Painting: ఏడు గుర్రాల పెయింటింగ్ మీ ఇంట్లో ఉందా? ఎక్కడ పెట్టాలంటే

Seven Horses Painting: ప్రతి ఒక్కరు విజయం సాధించాలి అని కోరుకుంటారు కానీ అందరికి సాధ్యం కాదు. దానికి కారణం కష్టం మాత్రమే కాదు. అదృష్టం కూడా ఉండాలి అని వింటుంటాం.
ఎంత ప్రయత్నించినా, కష్టపడ్డా కూడా కొన్ని సార్లు ఫలితాలు శూన్యమే. అయితే జీవితంలో విజయం సాధించాలంటే కర్మను విశ్వసించాల్సిందే. అంతేకాదు శక్తిమంతంగా, ఆరోగ్యంగా ఉండాలి. సానుకూల, ప్రతికూల శక్తి రెండు రకాలుగా ఉంటుందని వాస్తు వివరిస్తుంది. ఇదిలా ఉంటే ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీని తొలగించడంలో ఏడుగుర్రాల పెయింటింగ్ ప్రాధాన్యత వహిస్తుంది.

ఈ పటాన్ని ఎందుకు ఉంచాలి?
మన సంస్కృతిలో 7వ అంకెకు చాలా ప్రాముఖ్యత ఉంది. ఇంద్రధనస్సులో ఏడు రంగులు, వివాహ బంధంలో ఏడు ప్రమాణాలు, ఏడు అడుగులు, ఏడుగురు రుషులు ఇలా 7వ అంకెను సూచిస్తుంది. ఈ క్రమంలోనే ఏడు గుర్రాల పెయింటింగ్ గొప్ప ప్రాముఖ్యతను కలిగి ఉంది. దీనిని ఇంట్లో ఉంచడం వల్ల ఎన్నో ప్రయోజనాలు అందిస్తుంది. గుర్రం విజయం, శక్తిని సూచిస్తుంది. అంతేకాదు సూర్య భగవానుడికి ఏడు గుర్రాల రథం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈ పెయింటింగ్ ఎన్నో మంచి ఫలితాలను అందిస్తుంది.

ఫలితాలు..
పరుగెత్తే గుర్రాలు వేగానికి సూచన. అంటే విజయం సాధించాలంటే మనం కూడా పరుగెత్తాల్సిందే. అందుకే ఇలాంటి పటాన్ని ఉంచడం వల్ల ఇంట్లో ఉన్న వారు ఎలాంటి పనిని అయినా త్వరగా పూర్తి చేయాలనే సంకల్పంతో ఉంటారట.

ఏడు గుర్రాల పటాన్ని ఎక్కడ ఉంచాలి?
ఈ పెయింటింగ్ ను తూర్పు గోడకు వేలాడదీయాలి. ఉత్తరం వైపు కూడా దీన్ని ఉంచవచ్చు. ఇక సేవా రంగంలో ఉన్నవారికి అయితే ప్రమోషన్ కు కారణమవుతుందని టాక్. ఆ ఇంట్లో శ్రేయస్సు, సంపదను అందిస్తుంది. అంతేకాదు పేరు, కీర్తిని తెస్తాయి కాబట్టి దక్షిణ భాగంలో కూడా ఉంచవచ్చు. ఒకవేళ దక్షిణ గోడపై పెయింటింగ్ ఉంచేందుకు వీలు లేకపోతే ఇంటి కిటికీ ముందు కూడా ఉంచవచ్చు. ఒకవేళ దక్షిణ గోడపై పెయింటింగ్ ఉంచేందుకు వీలు లేకపోతే ఇంటి కిటికీ ముందు కూడా ఉంచవచ్చు. అయితే ఈ కిటికీ కచ్చితంగా ఈ పెయింటింగ్ కు ఎదురుగా ఉండేలా చూసుకోవాలి.

IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్‌ల బదిలీ

అమరావతి: ఏపీలో పలువురు ఐపీఎస్‌లకు స్థానచలనం కలిగింది. 30 మంది ఐపీఎస్‌లకు బదిలీలు (IPS Transfers), పోస్టింగ్‌లు ఇస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఈ మేరకు సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది.

బదిలీ అయిన ఐపీఎస్‌లు వీరే..

రైల్వే పోలీస్‌ అదనపు డీజీగా కుమార్‌ విశ్వజిత్‌
ఏపీఎస్పీ అదనపు డీజీగా అతుల్‌ సింగ్‌
ఆక్టోపస్‌ ఐజీగా సీహెచ్‌ శ్రీకాంత్‌ (రోడ్డు సేఫ్టీ అథారిటీ ఐజీగానూ అదనపు బాధ్యతలు)
విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఐజీగా కొల్లి రఘురామిరెడ్డి (డ్రగ్స్‌ డైరెక్టర్‌ జనరల్‌గానూ అదనపు బాధ్యతలు)
రాష్ట్రస్థాయి పోలీసు నియామక బోర్డు ఛైర్మన్‌గా రాజశేఖర్‌ బాబు (ఐజీ హోంగార్డ్స్‌గానూ అదనపు బాధ్యతలు)
సీఐడీ ఐజీగా సర్వశ్రేష్ఠ త్రిపాఠి
పోలీసు సిబ్బంది వ్యవహారాల ఐజీగా హరికృష్ణ (టెక్నికల్‌ సర్వీసెస్ ఐజీగానూ అదనపు బాధ్యతలు)
ఆక్టోపస్‌ డీఐజీగా సెంథిల్‌ కుమార్‌ (శాంతిభద్రతల డీఐజీగాను అదనపు బాధ్యతలు)
పోలీసు శిక్షణ డీఐజీగా రాహుల్‌దేవ్‌ శర్మ
విశాఖ రేంజ్‌ డీఐజీగా విశాల్‌ గున్ని
కర్నూల్‌ రేంజ్‌ డీఐజీగా సీహెచ్‌ విజయరావు
విశాఖ సంయుక్త పోలీస్‌ కమిషనర్‌గా ఫకీరప్ప
కృష్ణా జిల్లా ఎస్పీగా అద్నాన్‌ నయీం ఆస్మి
ఏపీఎస్పీ ఆరో బెటాలియన్‌ కమాండెంట్‌గా అమిత్‌ బర్దార్‌
ఇంటెలిజెన్స్‌ సెక్యూరిటీ వింగ్‌ ఎస్పీగా ఆరిఫ్‌ హఫీజ్‌
ప.గో జిల్లా ఎస్పీగా హజిత్‌ వేజెండ్ల
రాజమండ్రి విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఆఫీసర్‌గా సుబ్బారెడ్డి
కౌంటర్‌ ఇంటెలిజెన్స్‌ ఎస్పీగా వై.రిశాంత్‌ రెడ్డి (ఎర్రచందనం టాస్క్‌ఫోర్స్‌ ఎస్పీగానూ అదనపు బాధ్యతలు)
చిత్తూరు ఎస్పీగా జోషువా
ఏసీబీ ఎస్పీగా రవిప్రకాశ్‌
విశాఖ శాంతిభద్రతల డీసీపీగా సీహెచ్‌ మణికంఠ
ఏపీఎస్పీ ఐదో బెటాలియన్‌ కమాండెంట్‌గా అధిరాజ్‌ సింగ్‌ రాణా
కాకినాడ మూడో బెటాలియన్‌ కమాండెంట్‌గా కృష్ణకాంత్‌ పటేల్‌
గుంటూరు ఎస్పీగా తుషార్‌
జగ్గయ్యపేట డీసీపీగా కె.శ్రీనివాసరావు
రంపచోడవరం ఏఎస్పీగా కె.ధీరజ్‌
పాడేరు ఏఎస్పీగా ఎ.జగదీశ్‌
విజయవాడ డీసీపీగా ఆనంద్‌ రెడ్డి
విశాఖ డీసీపీగా సత్యనారాయణ

Voter ID Card: ఓటర్ ఐడీలో చిరునామా మార్చుకోవడం ఎలా? చాలా సింపుల్.. ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి చాలు..

సార్వత్రిక ఎన్నికలు సమీపించాయి. ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో లోక్ సభతో పాటు పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో ఎన్నికల కమిషన్ ఇప్పటికే తుది ఓటరు జాబితాలను విడుదల చేసింది.
మీరు ఓటు వేయాలంటే తప్పనిసరిగా ఓటర్ ఐడీ కార్డు ఉండాల్సిందే. అయితే దానిలో వివరాలు కూడా అప్ డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఓటరు ఐడీలో పాత అడ్రస్ ఉండిపోయినా.. దానిని ఇప్పటికీ మార్చుకోవచ్చు. అందుకోసం మీరు ఆన్ లైన్ లోకి వెళ్లాల్సి ఉంటుంది. నేషనల్ ఓటర్ సర్వీస్ పోర్టల్ వెబ్ సైట్ ను ఓపెన్ చేసి దానిలో కొత్త అడ్రస్ ను అప్ డేట్ చేసుకోవచ్చు. ఒక మీరు కూడా ఓటర్ ఐడీలో అడ్రస్ మార్చుకోవాలనుకుంటే ఈ సింపుల్ స్టెప్స్ ఫాలో పోండి చాలు..

ఫారం-8ని నింపాలి..

మీరు మొదటిగా ఆన్ లైన్ లోకి వెళ్లి నేషనల్ ఓటర్ సర్వీస్ పోర్టల్ వెబ్ సైట్ ను ఓపెన్ చేయాలి. దానిలో ఫారం 8 అని కనిపిస్తుంది. ఈ ఫారం ఎనిమిది ద్వారానే ఓటర్లు తమ ఐడీల్లో మార్పులు, చేర్పులు చేసుకోవాల్సి ఉంటుంది. ఇంటి చిరునామా, ప్రస్తుతం కార్డుపై వివరాల్లో మార్పులు, కొత్త ఓటర్ ఐడీ కార్డు కావాలన్నా ఇదే ఫారం సమర్పించాల్సి ఉంటుంది.

అందుకోసం ముందుగా https://voters.eci.gov.in/ లోకి వెళ్లి లాగిన్ అవ్వాలి. ఒకవేళ మీరు అకౌంట్ లేకపోతే సైన్ అప్ చేసుకోవాలి. మీ ఫోన్ నంబర్, ఈమెయిల్ అడ్రస్, క్యాప్చాను ఎంటర్ చేసి అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత లాగిన్ చేయాలి. అప్పుడు మీరు సైట్లోకి వెళ్తారు.
హోమ్ స్క్రీన్ మెనూలో నుంచి ఫారం-8పై క్లిక్ చేయాలి. ‘షిఫ్టింగ్ ఆర్ రెసిడెన్స్/కరెక్షన్ ఆఫ్ ఎంట్రీస్ ఇన్ ఎగ్జిస్టింగ్ ఎలక్ట్రోరల్ రోల్/రిప్లేస్ మెంట్ ఆఫ్ ఈపీఐసీ/ మార్కింగ్ ఆఫ్ పీడబ్ల్యూడీ’ అని రాసి ఉండటంతో దానిపై ఫారం8 అని కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయాలి.
ఆ వెంటనే మరో పేజీలోకి మిమ్మల్ని అది తీసుకెళ్తుంది. ఆ దరఖాస్తు ఎవరికోసం అని అడుగుతుంది. ‘సెల్ఫ్’ , ‘అదర్ ఎలక్టర్’ ఆప్షన్లలో ఏదో ఒకటి ఎంచుకోవాలి. అప్లికేషన్ మీ కోసమే అయితే సెల్ప్ అని, వేరొకరి అయితే అదర్ ఎలక్టర్ అని సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ చేయాలి.
ఆ తర్వాత ఓటరు ఐడీ నంబర్ ఎంటర్ చేయమని అడుగుతుంది. అప్పుడు మీరు దానిని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు మీకు మరో డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది. దానిలో మీరు పేరు ఇతర వివరాలు కనిపిస్తాయి. అవన్నీ మీవే అని నిర్ధారించడానికి ఓకే బటన్ పై క్లిక్ చేయండి.
ఆ తర్వాత ఓపెన్ అయిన స్క్రీన్ పై షిఫ్టింగ్ ఆఫ్ రెసిడెన్స్ ఆప్షన్ ను ఎంచుకోవాలి. ఆ తర్వాత అసెంబ్లా నియోజకవర్గం పరధిలోన లేక బయట నివాసం ఉంటున్నారా అని అడుగుతుంది. మీ నివాస స్థానాన్ని బట్టి దీనిని ఎంచుకోవచ్చు.
అప్పుడు మీకు ఫారం 8 కనిస్తుంది. దానిలో మూడు పార్టులు ఉంటాయి. సెక్షన్ ఏ లో రాష్ట్రం, జిల్లా, అసెంబ్లీ/పార్లమెంట్ నియోజకవర్గం ఎంచుకోవాల్సి ఉంటుంది.
సెక్షన్ బీలో వ్యక్తిగత వివరాలు అంటే పేరు వంటివి పూర్తి చేయాలి. సెక్షన్ సీలో మీరు మార్చుకోవాలనుకుంటున్న చిరునామాను పూరించి, దరఖాస్తును సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సెక్షన్ డీలో డిక్లరేషన్ ఉంటుంది. సెక్షన్ ఈలో రివ్యూ, సబ్మిషన్ చేయాల్సి ఉంటుంది.
అయితే మీరు మార్చుతున్న చిరునామాను తగినట్లుగా ఓ రుజువు పత్రాన్ని సమర్పించాల్సి ఉంటుంది. అందుకోసం వాటర్/గ్యాస్ కనెక్షన్(కనీసం ఏడాది)ఎలక్ట్రిసిటీ బిల్, ఆధార్ కార్డు, బ్యాంకు పాస్ బుక్, ఇండియన్ పాస్ పోర్టు, రెవన్యూ డిపార్ట్ మెంట్ ల్యాండ్ ఓనింగ్ రికార్డు, రిజిష్టర్డ్ రెంట్ లీజ్ డీడ్, రిజిస్టర్డ్ సేల్ డీడ్ వంటి వంటి సమర్పించాల్సి ఉంటుంది.
ఇవన్నీ పూర్తి చేసిన తర్వాత అప్లికేషన్ ఒక్కసారి ప్రివ్యూ చూసుకొని అన్నీ సరిగ్గా ఉంటే సబ్మిట్ చేసేయండి.

Health Tips: ఈ గింజలతో చేసిన డ్రింక్ తాగితే, మీకు బీపీ, షుగర్ రెండూ రావు..అవేంటో తెలుసా..?

ఇతర దేశాలతో పోలిస్తే దేశంలో మధుమేహ వ్యాధిగ్రస్తుల సంఖ్య అత్యధికంగా ఉంది. దేశంలో వీరి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. డయాబెటిస్ అనేది ఒక వ్యాధి, దీనికి చికిత్స లేదు.
మీ ఆహారం మరియు జీవనశైలిని మెరుగుపరచడం ద్వారా మీరు దీన్ని నియంత్రణలో ఉంచుకోవచ్చు. ఇది కాకుండా, డయాబెటిక్ పేషెంట్లకు రోజువారీ వ్యాయామం కూడా ముఖ్యం.

మధుమేహాన్ని నియంత్రించడానికి, మీరు మీ రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రణలో ఉంచుకోవడం చాలా ముఖ్యం, దీని కోసం మీరు బార్లీ నీటిని ఉపయోగించవచ్చు. మధుమేహాన్ని నియంత్రించడంలో బార్లీ నీరు చాలా ఉపయోగకరంగా పరిగణించబడుతుంది. డయాబెటిస్‌లో బార్లీ వాటర్ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలను ఇప్పుడు తెలుసుకుందాం.

ఫైబర్ కంటెంట్
బార్లీలో పెద్ద మొత్తంలో కరిగే ఫైబర్ ఉంటుంది, ఇది గ్లూకోజ్ శోషణను నెమ్మదిస్తుంది, ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది.
తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్
బార్లీ నీటిలో తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కనుగొనబడింది, దీని కారణంగా రక్తంలో చక్కెర స్థాయిని పెంచడానికి అనుమతించదు.

బరువు నియంత్రణలో ఉంటుంది..
బార్లీ నీటిలో మంచి మొత్తంలో ఫైబర్ లభిస్తుంది, ఇది బరువును అదుపులో ఉంచుతుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు తమ బరువును అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం.

హృదయాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది
బార్లీ నీటిలో ఉండే ఫైబర్ చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది, ఇది తరచుగా మధుమేహ రోగులలో కనిపించే గుండె జబ్బులను నివారిస్తుంది.

జీర్ణక్రియను ఆరోగ్యంగా ఉంచుతుంది..
బార్లీ నీటిని తీసుకోవడం వల్ల జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది, ఇది డయాబెటిక్ రోగులకు మేలు చేస్తుంది.
ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతుంది..
బార్లీ నీరు ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతుందని కొన్ని పరిశోధనలు వెల్లడించాయి. అంటే ఇది గ్లూకోజ్‌ను గ్రహించడంలో కణాలకు సహాయపడుతుంది. బార్లీ నీరు కూడా షుగర్ లెవల్స్ వల్ల శరీరాన్ని డ్యామేజ్ కాకుండా కాపాడుతుంది. ఇందులో ఉండే విటమిన్ సి, సెలీనియం వంటి యాంటీఆక్సిడెంట్లు శరీరాన్ని ఆక్సీకరణ స్ట్రెస్ నుండి రక్షిస్తాయి.

Tulasi leaves: తులసి ఆకులు ఏ రోజు కోయకూడదు? కుండీలోనే తులసి మొక్క ఎందుకు పెడతారు?

Tulasi leaves: పవిత్రమైన మొక్కల జాబితాలో తులసి ముందు ఉంటుంది. ప్రతి ఒక్కరి ఇంట్లో తులసి మొక్కకి తప్పని సరిగా పూజలు చేస్తారు. వాస్తు శాస్త్రంలో కూడా తులసి మొక్కకి అధిక ప్రాధాన్యత ఉంటుంది.
శ్రీ హరి విష్ణు మూర్తికి తులసి లేకుండా భోగం సమర్పిస్తే ఆ పూజ అసంపూర్తిగా ఉన్నట్టే.

తులసిని లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. ఇంట్లోని తులసి మొక్క పచ్చగా ఉంటే ఆ కుటుంబం సుఖ సంతోషాలతో ఉంటుందని నమ్ముతారు. అయితే తులసి మొక్కని పూజించేటప్పుడు కొన్ని నియమాలు తప్పనిసరిగా తెలుసుకోవాలి. మహా విష్ణువు, లక్ష్మీదేవి ఆశీస్సులు పొందాలంటే తులసి మొక్కకి సరైన పద్ధతి ప్రకారం పూజ చేయాలి.

ఆదివారం నీళ్ళు పోయకూడదు

మత విశ్వాసాల ప్రకారం తులసిని రోజూ పూజించాలి. స్నానం చేయకుండా తులసి మొక్కని వాటి ఆకులు తాకడం చేయకూడదు. కొంతమంది తులసి ఆకులు కోసుకుని నోట్లో వేసేసుకుని తింటారు. కానీ స్నానం చేయకుండా ముట్టుకోకూడదు. ఏకాదశి, ఆదివారం రోజుల్లో నారాయణుడి కోసం తులసి మాత ఉపవాసం ఉంటుంది. అందుకే ఆ రోజు తులసి మొక్కకి నీళ్ళు పెట్టకూడదు.

నీళ్ళు పెట్టడం వల్ల తులసి దేవి ఉపవాసం విరమించినట్టు అవుతుంది. అలా చేయడం వల్ల అశుభ ఫలితాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే ఆరోజు నీళ్ళు పెట్టకూడదు. అలాగే ఆ రెండు రోజుల్లో తులసి ఆకులు కోయకూడదు. అదే విధంగా సూర్యాస్తమయం తర్వాత కూడా తులసి ఆకులు తెంపడం, కోయడం వంటివి చేయకూడదని శాస్త్రాలు చెబుతున్నాయి. ఆదివారం తులసి మొక్కకి నీళ్ళు పెట్టడం వాలల ఇంట్లోకి ప్రతికూల శక్తి ప్రవేశిస్తుందని వాస్తు శాస్త్రం చెబుతోంది.

తులసి దగ్గర నెయ్యి దీపం
ఉదయం నిద్రలేవగానే స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించిన తర్వాత తులసి మొక్కకు పూజ చేయాలి. వాటికి పసుపు, కుంకుమ, గంధం వేసి పూజించాలి. ఎరుపు లేదా గులాబీ పువ్వులు సమర్పించాలి. తర్వాత తులసి దగ్గర నెయ్యి దీపం వెలిగించాలి. కుటుంబంలో సుఖ సంతోషాలు, సౌభాగ్యం నిలవాలంటే సాయంత్రం పూట తులసి దగ్గర నెయ్యి దీపం వెలిగించాలి. తులసి మొక్కని సరైన పద్ధతిలో పూజించడం వల్ల లక్ష్మీదేవి, విష్ణుమూర్తి ఆశీస్సులు ఎల్లప్పుడూ లభిస్తాయి.

నేల మీద నాటకూడదు

తులసి మొక్కని పొరపాటున కూడా నేల మీద నాటకూడదు. ఇంటి గుమ్మం కంటే ఎక్కువ ఎత్తులోనే తులసి ఉండాలి. అందుకే చాలా మంది తులసి కోట ఎత్తుగా కట్టించుకుంటారు. తులసి మొక్క ఎండిపోకుండా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. తులసి మొక్క ఎండిపోయిందంటే ఇంట్లో దురదృష్ట సంఘటనలు ఏదో జరుగుతాయని సూచిస్తుంది. తులసి మొక్క దగ్గర ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి. ఎండిపోయిన పూలు అసలు ఉండకూడదు. నిత్యం తులసి కోట శుభ్రం చేసుకుంటూ ఉంటాలి.

ఎన్ని మొక్కలు ఉండాలి?

తులసి మొక్క ఇంట్లో ఉంటే చాలా శుభప్రదంగా భావిస్తారు. అలాగే తులసి మొక్కలు ఎన్ని ఉండాలనే దానికి వాస్తు శాస్త్రం వెల్లడించింది. బేసి సంఖ్యలోనే ఇంట్లో తులసి మొక్కలు పెట్టుకోవాలి. ఒకటి, మూడు, ఐదు ఇలా బేసి సంఖ్యలో మాత్రమే ఉండాలి. స్వచ్చత, పవిత్రతకి చిహ్నంగా తులసిని భావిస్తారు. తులసి వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ తో పోరాడేందుకు సహాయపడుతుంది.

LPG Cylinder : కేంద్రం సర్కార్ కీలక నిర్ణయం.. రూ.300 తగ్గనున్న గ్యాస్ సిలిండర్ ధర?

వంటింటి మహిళలకు త్వరలోనే కేంద్రం గుడ్ న్యూస్(Good News) చెప్పనున్నట్టు తెలుస్తోంది. ఈ రోజుల్లో గ్యాస్ సిలిండర్ లేని ఇల్లు లేదంటే అతిశయోక్తి కాదు.
గ్యాస్(LPG) వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం సిలిండర్లపై(Cylinder) సబ్సడీ ఇస్తోంది. ప్రస్తుతం దేశంలో LPG వినియోగదారుల సంఖ్య దాదాపు 33 కోట్లు. 2025-26 నాటికి మరో 75 లక్షల ఎల్‌పీజీ కనెక్షన్లు వస్తాయని గతేడాది అంచనా వేశారు. అయితే..గత రెండు మూడున్నరేళ్లుగా గ్యాస్ ధరలు పెరగడంతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ఈ నేపథ్యంలో గతేడాది ఆగస్టులో గృహోపకరణాల గ్యాస్ సిలిండర్(Domestic cylinder) ధరను కేంద్ర ప్రభుత్వం రూ.200 తగ్గించింది. ఆ తర్వాత కూడా మరో రూ.100 తగ్గించిచన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రానున్న పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని..పేద, మధ్యతరగతి ప్రజలను ఆకర్షించేలా కేంద్రం ప్రభుత్వం గ్యాస్ ధరలపై దృష్టి సారించినట్లు సమాచారం. అర్హులైన పేద కుటుంబాలకు(Poverty line) తక్కువ ధరకే ఎల్పీజీ సిలిండర్లను అందించాలని భావిస్తోందని పార్టీ వర్గాల సమాచారం.
ఈ పరిస్థితుల్లో పేద కుటుంబాలకు సబ్సిడీ మొత్తాన్ని పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతోందని చెబుతున్నారు. ఈ సబ్సిడీ రూ.300 వరకు ఉండవచ్చని తెలుస్తోంది. అప్పుడు సబ్సిడీ గ్యాస్ సిలిండర్ ధర రూ.660కే వస్తుంది. అదే జరిగితే.. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి ప్లస్ అవుతుందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

BEL Job Recruitment: ఇంజినీరింగ్‌ డిప్లొమాతో బెల్‌లో ఉద్యోగాలు.. దరఖాస్తు చేశారా?

BEL Job Recruitment | ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రభుత్వరంగ సంస్థ భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌ (BEL)లో పలు ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది.
మూడేళ్ల ఇంజినీరింగ్‌ డిప్లొమాతో పాటు ఐటీఐ అర్హతతో ఇంజినీరింగ్ అసిస్టెంట్‌ ట్రైనీ, ఐటీఐ అర్హతతో టెక్నీషియన్‌ ఉద్యోగాలకు ఆన్‌లైన్‌ దరఖాస్తుల గడువు ముగుస్తోంది. అర్హులైన, ఆసక్తికలిగిన అభ్యర్థులు జనవరి 31లోపు దరఖాస్తు చేసుకోండి. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారు ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌ యూనిట్‌లో పనిచేయాల్సి ఉంటుంది.

దరఖాస్తుల కోసం క్లిక్‌ చేయండి

నోటిఫికేషన్‌లో కొన్ని ముఖ్యాంశాలు..

మొత్తం 46 ఉద్యోగాలు కాగా.. వీటిలో ఇంజినీరింగ్‌ అసిస్టెంట్‌ ట్రైనీ అండ్‌ టెక్నీషియన్‌ పోస్టులు 22 కాగా.. టెక్నీషియన్‌ ఉద్యోగాలు 24. ఇంజినీరింగ్‌ అసిస్టెంట్‌కు మూడేళ్ల ఇంజినీరింగ్‌ డిప్లొమా అర్హత. టెక్నీషియన్‌ పోస్టులకు ఎస్‌ఎస్‌ఎల్‌సీ, ఐటీఐతో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఏడాది అప్రెంటిస్‌షిప్‌ చేసిన వారు అర్హులు.
వయె పరిమితి : 2024 జనవరి 1 నాటికి 28 ఏళ్లు మించరాదు. ఆయా వర్గాల వారీగా వయో సడలింపు అవకాశం ఉంటుంది.
వేతనం: ఇంజినీరింగ్‌ అసిస్టెంట్‌ ట్రైనీ అండ్‌ టెక్నీషియన్‌ పోస్టులకు వేతనం: రూ. 24,500- రూ.90,000; టెక్నీషియన్‌ రూ.21,500 నుంచి రూ.82,000
దరఖాస్తు రుసుం రూ.295 (జనరల్‌/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు), ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులకు ఎలాంటి రుసుం లేదు.
రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. రాత పరీక్ష ఫిబ్రవరిలో జరిగే అవకాశం ఉంది.

SBI: ఎస్‌బీఐ లో అదిరే స్కీమ్.. 7.5 శాతం వడ్డీ.. రూ.5 లక్షలు కి ఎంతంటే..?

SBI: దేశీయ దిగ్గజ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్స్ కోసం ఎన్నో సేవలను అందిస్తూనే ఉంటుంది.
ఎస్బీఐ లో డబ్బులు దాచుకోవడం సురక్షితంగా ఉంటుంది. చాలా మంది అందుకే డబ్బులు దాస్తూ వుంటారు. పైగా ఎలాంటి డిపాజిట్లు చేయాలన్నా కూడా ఎస్‌బీఐ వైపే ఎక్కువ మంది ఆసక్తి చూపుతారు. ఈ బ్యాంకుపై మంచి విశ్వాసం ఉంది ప్రజల్లో. బ్యాంకు సైతం వివిధ సేవలు అందిస్తుంటుంది.

State Bank of India scheme gives 7.5 interest

హామీతో కూడిన రాబడులు పొందాలని అనుకుంటే స్టేట్ బ్యాంకులో పెట్టుబడి పెట్టవచ్చు. ఇక దీని కోసం పూర్తి వివరాలు చూస్తే.. ప్రస్తుతం రూ. 2 కోట్ల లోపు ఉండే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై మంచి వడ్డీ రేట్లు ఆఫర్ చేస్తోంది. స్టేట్ బ్యాంక్. 7 రోజుల నుంచి 10 సంవత్సరాల టెన్యూర్ వుండే టర్మ్ డిపాజిట్లపై జనరల్ కస్టమర్లకు 3. 5 శాతం నుంచి 7 శాతం వడ్డీ ఇస్తున్నారు.
సీనియర్ సిటిజన్లకు అయితే 4 శాతం నుంచి 7. 5 శాతం దాకా వడ్డీ వస్తుంది. జనరల్ కస్టమర్లతో పోల్చితే సీనియర్ సిటిజన్లకు ఎక్కువ 50 బేసిస్ పాయింట్ల మేర వడ్డీ రేటును ఇస్తోంది బ్యాంకు. ఇది ఇలా ఉంటే 2-3 ఏళ్ల మెచ్యూరిటీ టెన్యూర్ కలిగిన ఫిక్స్‌డ్ డిపాజిట్లపై సాధారణ ఖాతాదారులకు 7 శాతం, సీనియర్ సిటిజన్లకు 7. 5 శాతం వడ్డీ ని ఆఫర్ చేస్తోంది. మూడేళ్లు తరవాత ఆరు లక్షలు పైనే వస్తాయి.

DA Hike News Updates: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షన్ దారులకు మోదీ సర్కార్ గుడ్ న్యూస్ ?

ఫిబ్రవరి 1 నుంచి ప్రారంభం కానున్న మధ్యంతర బడ్జెట్ పై అంచనాలు ఉన్నాయి.ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఈ బడ్జెట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఎన్నికలకు ముందు ప్రవేశపెట్టే ఈ బడ్జెట్ లో దీర్ఘకాలిక కరువు భత్యంపై కేంద్రం సానుకూల నిర్ణయం తీసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ నేపథ్యంలో 18 నెలలుగా నిలిచిపోయిన డీఏ బకాయిలను విడుదల చేయాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు విజ్ఞప్తి చేసినట్లు ఎకనామిక్స్ టైమ్స్ కథనం పేర్కొంది. కరోనా సంక్షోభంలో తలెత్తిన ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయని అంగీకరిస్తూనే, దేశం అంటువ్యాధి నుండి కోలుకుంది మరియు ఆర్థిక పరిస్థితులు మెరుగుపడ్డాయని అన్నారు.

Letter to be reviewed

అందుకే రానున్న బడ్జెట్ సమావేశాల్లో మూడు ఖాళీల కరువు భత్యం నిలుపుదల నిర్ణయాన్ని పునరాలోచించాలని లేఖ రాశారు. సస్పెండ్ చేసిన డీఏ బకాయిలను విడుదల చేయడం వల్ల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పదవీ విరమణ చేసిన వారి కృషిని గుర్తించడమే కాకుండా దేశానికి చిత్తశుద్ధితో సేవలందించిన వారికి ఊరట లభిస్తుందన్నారు. ముఖేష్ సింగ్ లేఖపై కేంద్రం ఎలా స్పందిస్తుందో చూడాలి.

Drought allowance stopped

కోవిడ్-19 మహమ్మారి దృష్ట్యా, జనవరి 2020 నుండి జూన్ 2021 వరకు సుమారు 18 నెలల పాటు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు చెల్లించాల్సిన డియర్నెస్ అలవెన్స్ (DA) మరియు డియర్నెస్ రిలీఫ్ (DR)ని మోడీ ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేసింది. ఆ సమయంలో కోవిడ్ -19 వ్యాప్తి చెందడం వల్ల కేంద్రం ఈ కఠినమైన నిర్ణయం తీసుకోవలసి వచ్చిందని ఫైనాన్స్ కోసం పంకజ్ చౌదరి చెప్పారు.

పాత బండి ఇవ్వండి.. కొత్త Hero Splendor Plus తీసుకెళ్లండి.. సూపర్ డీల్..

హీరో హోండా ఒకప్పుడు ఒకే కంపెనీగా ఉన్నప్పుడు స్ప్లెండర్కు ఫుల్ డిమాండ్ ఉండేది. మంచి ఫ్యామిలీ బైక్గా పేరుంది. మంచి స్పెసిఫికేషన్లు, మైలేజీతో పాటు పనితీరు..

తక్కువ ధరకే ఈ బైక్ లభ్యం కావడంతో అందరికీ నచ్చింది. ఆ తర్వాత హీరో, హోండా రెండూ విడిపోవడంతో స్ప్లెండర్ బైక్ హీరో కంపెనీ పరిధిలోకి వచ్చింది. అయినా ఈ బైక్ తగ్గలేదు. మార్కెట్లో ఉన్న అన్ని హీరో బైక్లతో పోలిస్తే, దీనికి ఎక్కువ డిమాండ్ ఉంది. హీరో కంపెనీ స్ప్లెండర్ యొక్క అనేక వేరియంట్లను కూడా విడుదల చేసింది.

ప్రస్తుతం మన దేశంలో స్ప్లెండర్ ప్లస్, స్ప్లెండర్ ప్లస్ ఎక్స్టెక్, సూపర్ స్ప్లెండర్ మరియు స్ప్లెండర్ సూపర్ ఎక్స్టెక్ వేరియంట్లు నాలుగు విభిన్న వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ ధరలు రూ. 73,400 నుండి రూ. 89,232 (ఎక్స్-షోరూమ్) మధ్య. ఈ క్రమంలో ఈ స్ప్లెండర్ను కొనుగోలు చేయాలనుకునే వారికి హీరో కంపెనీ శుభవార్త అందించింది.

పాత బండిని మార్చుకుంటే భారీ బోనస్ వస్తుందని ప్రకటించింది. అలాగే, వివిధ పద్ధతులను అనుసరించడం ద్వారా ఈ బైక్ ధరను మరింత తగ్గించవచ్చు. అదేంటో చూద్దాం.

How to get exchange bonus..

మీరు తక్కువ ధరలో హీరో స్ప్లెండర్ బైక్ను పొందవచ్చు. దాని కోసం మీరు మీ పాత మోటార్సైకిల్ను మార్చుకోవచ్చు. కానీ పరిస్థితిలో ఉండాలి. అప్పుడే మంచి రేటు వస్తుంది. ఈ నేపథ్యంలో, ఏదైనా పాత బండి మార్పిడి సమయంలో పాటించాల్సిన కొన్ని సూచనలను మేము మీకు అందిస్తున్నాము.

మీ పాత మోటార్సైకిల్ను మీరే పరిశీలించండి. ప్రతిదీ పని చేస్తుందో లేదో చూడండి. అన్నీ సక్రమంగా ఉంటేనే ఎక్స్ఛేంజ్ ఆఫర్ కింద ఆమోదించబడుతుంది.

మీ సమీపంలోని హీరో డీలర్షిప్కి వెళ్లండి, అక్కడ వారు మీ పాత మోటార్సైకిల్ను పరిశీలించి దాని విలువను లెక్కిస్తారు.

Health

సినిమా