AP TET 2024: నిరుద్యోగులకు గమనిక.. టెట్‌ పేపర్‌-1, పేపర్ 2 అర్హతలు సవరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు..

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం త్వరలో నిర్వహించనున్న ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్‌) రాసేందుకు అర్హతలను సవరిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.
ఒకటి నుంచి 5 తరగతులకు బోధించే సెకండరీ గ్రేడ్‌ టీచర్స్‌ (SGT)కు నిర్వహించే టెట్‌-1 పేపర్‌ పరీక్ష, ఆరు నుంచి పదో తరగతి వరక బోధించేందుకు నిర్వహించే పేపర్‌ 2 పరీక్షకు హాజరయ్యేందుకు అర్హతలను సవరించింది. రెండేళ్ల డిప్లొమా ఇన్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌ (DELED), నాలుగేళ్ల బ్యాచిలర్‌ ఆఫ్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌ (BELED) చేసిన వారు మాత్రమే పేపర్‌ 1 పరీక్ష రాసేందుకు అర్హులని పేర్కొంది. ఇంటర్మీడియట్‌, తత్సమాన విద్యార్హతలో ఓసీ అభ్యర్ధులకు 50 శాతం మార్కులు తప్పనిసరిగా ఉండాలనే నిబంధన పెట్టింది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Join Now
Facebook Page Join Now

ఈ మార్కుల నుంచి ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులకు 5 శాతం మినహాయింపునిచ్చి, 45 శాతం మార్కులు ఉంటే సరిపోతుందని పేర్కొంది. బీఈడీ చేసిన వారు కూడా ఎస్జీటీ పోస్టులకు అర్హులేనంటూ జాతీయ ఉపాధ్యాయ విద్యామండలి 2018లో ఇచ్చిన నోటిఫికేషన్‌ను సుప్రీంకోర్టు రద్దు చేసినందున ఈ సవరణ ఉత్తర్వులు జారీ చేసినట్లు ప్రభుత్వం పేర్కొంది.టెట్‌ పరీక్ష నిర్వహణ వ్యయాన్ని కూడా అభ్యర్థుల దరఖాస్తు ఫీజుల నుంచే భరించాలని ఈ సందర్భంగా సూచించింది. గతంలో ఏడాదికి రెండుసార్లు టెట్‌ నిర్వహించాలనే నిబంధన ఉండేది. కానీ 2021 నుంచి ఏడాదికి ఒక్కసారే ఈ పరీక్షను నిర్వహించాలని ప్రభుత్వం సవరించింది.

పేపర్‌ – 2 అర్హత మార్కుల్లో మినహాయింపు.. ఎంతంటే

Related News

టెట్‌ పేపర్‌ – 2 కు హాజరయ్యే ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగ అభ్యర్థులకు డిగ్రీలో అర్హత మార్కులను 40 శాతానికి కుదించారు. అయితే ఈ ఒక్కసారికి మాత్రమే ఈ మినహాయింపు ఇస్తున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. గతంలో టెట్‌ రాసేందుకు అర్హత మార్కులు 45 శాతం ఉండేది. తాజాగా దీన్ని 5 శాతానికి తగ్గించింది. డిగ్రీలో 40 శాతం మార్కులతో బీఈడీ చేసేందుకు అనుమతిస్తున్నందున.. టెట్‌ రాసేందుకు 45శాతం ఉండాలనే నిబంధన గతంలో పెట్టారు. దీనిపై అనేక ఫిర్యాదులు రావడంతో మినహాయింపులు ఇస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో తాజా టెట్‌ పరీక్షకు కూడా పేపర్ 2 రాసేందుకు 5 మార్కులు మినహాయించి 40 మార్కులకు కుదించారు. కాగా అందిన సమాచారం మేరకు టెట్‌ నోటిఫికేషన్‌ నేడో రేపో విడుదలకానుంది.

Related News