Saturday, November 16, 2024

NDA: నేషనల్ డిఫెన్స్ అకాడమీలో 198 గ్రూప్ ‘సి’ ఉద్యోగాలు, ఈ అర్హతలుండాలి

National Defence Academy Recruitment: పూణేలోని ఖడక్వాస్లా నేషనల్ డిఫెన్స్ అకాడమీ గ్రూప్ ‘సి’ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా బ్యాక్లాగ్ పోస్టులతో కలిపి మొత్తం 198 ఖాళీలను భర్తీచేయనున్నారు.

పోస్టులవారీగా అర్హతలు నిర్ణయించారు. ఈ పోస్టుల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ జనవరి 27న ప్రారంభమైంది. అభ్యర్థులు ఫిబ్రవరి 16 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. పోస్టులను అనుసరించి రాత పరీక్ష, స్కిల్/ ప్రాక్టికల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు

వివరాలు..

* గ్రూప్-సి పోస్టులు

ఖాళీల సంఖ్య: 198 పోస్టులు

➥ లోయర్ డివిజన్ క్లర్క్: 16 పోస్టులు
అర్హత: ఇంటర్ ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: 18-27 సంవత్సరాల మధ్య ఉండాలి.
జీతం: రూ.19,900 – రూ.63,200.

➥ స్టెనోగ్రాఫర్ గ్రేడ్-2: 01 పోస్టు
అర్హత: ఇంటర్ ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: 18-27 సంవత్సరాల మధ్య ఉండాలి.
జీతం: రూ.25,500 – రూ.81,100.

➥ డ్రాఫ్ట్స్మ్యాన్: 02 పోస్టులు
అర్హత: ఇంటర్ ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత విభాగంలో డిప్లొమా లేదా ఐటీఐ సర్టిఫికేట్ కలిగి ఉండాలి. రెండేళ్ల అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 18-25 సంవత్సరాల మధ్య ఉండాలి.
జీతం: రూ.25,500 – రూ.81,100.

➥ సినిమా ప్రొజెక్షనిస్ట్-II: 01 పోస్టు
అర్హత: ఇంటర్ ఉత్తీర్ణులై ఉండాలి. రెండేళ్ల అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 18-25 సంవత్సరాల మధ్య ఉండాలి.
జీతం: రూ.19,900- రూ.63,200.

➥ కుక్: 14 పోస్టులు
అర్హత: ఇంటర్ ఉత్తీర్ణులై ఉండాలి. లేదా సంబంధిత విభాగంలో ఐటీఐ సర్టిఫికేట్ కలిగి ఉండాలి. రెండేళ్ల అనుభవం తప్పనిసరి.
వయోపరిమితి: 18-25 సంవత్సరాల మధ్య ఉండాలి.
జీతం: రూ.19,900- రూ.63,200.

➥ కంపోజిటర్-కమ్ ప్రింటర్: 01 పోస్టు
అర్హత: ఇంటర్ ఉత్తీర్ణులై ఉండాలి. రెండేళ్ల అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 18-25 సంవత్సరాల మధ్య ఉండాలి.
జీతం: రూ.19,900- రూ.63,200.

➥ సివిలియన్ మోటార్ డ్రైవర్ (ఓజీ): 03 పోస్టులు
అర్హత: ఇంటర్ ఉత్తీర్ణులై ఉండాలి. రెండేళ్ల అనుభవం ఉండాలి. సివిలియన్ డ్రైవింగ్ లైసెన్స్ (హెవీ వెహికిల్) కలిగి ఉండాలి.
వయోపరిమితి: 18-27 సంవత్సరాల మధ్య ఉండాలి.
జీతం: రూ.19,900- రూ.63,200.

➥ కార్పెంటర్: 02 పోస్టులు
అర్హత: ఇంటర్ ఉత్తీర్ణులై ఉండాలి. లేదా సంబంధిత విభాగంలో ఐటీఐ సర్టిఫికేట్ కలిగి ఉండాలి. రెండేళ్ల అనుభవం తప్పనిసరి.
వయోపరిమితి: 18-25 సంవత్సరాల మధ్య ఉండాలి.
జీతం: రూ.19,900- రూ.63,200.

➥ ఫైర్మ్యాన్: 02 పోస్టులు
అర్హత: పదోతరగతి ఉత్తీర్ణులై ఉండాలి. సివిలియన్ డ్రైవింగ్ లైసెన్స్ (హెవీ వెహికిల్) కలిగి ఉండాలి. సంబంధిత విభాగంలో కనీసం 6 నెలల సర్టిఫికేట్ కోర్సు చేసి ఉండాలి. నిర్దేశిత శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.
వయోపరిమితి: 18-27 సంవత్సరాల మధ్య ఉండాలి.
జీతం: రూ.19,900- రూ.63,200.

➥ టెక్నికల్ అటెండెంట్-బేకర్ & కాన్ఫెక్షనర్: 01 పోస్టు
అర్హత: ఐటీఐ లేదా పదోతరగతి ఉత్తీర్ణులై ఉండాలి. ఏడాది అనుభవం తప్పనిసరి.
వయోపరిమితి: 18-25 సంవత్సరాల మధ్య ఉండాలి.
జీతం: రూ.18,000- రూ.56,900.

➥ టెక్నికల్ అటెండెంట్- సైకిల్ రిపేరర్: 02 పోస్టులు
అర్హత: ఐటీఐ లేదా పదోతరగతి ఉత్తీర్ణులై ఉండాలి. ఏడాది అనుభవం తప్పనిసరి.
వయోపరిమితి: 18-25 సంవత్సరాల మధ్య ఉండాలి.
జీతం: రూ.18,000- రూ.56,900.

➥ టెక్నికల్ అటెండెంట్- ప్రింటింగ్ మెషిన్ ఆపరేటర్: 01 పోస్టు
అర్హత: ఐటీఐ లేదా పదోతరగతి ఉత్తీర్ణులై ఉండాలి. ఏడాది అనుభవం తప్పనిసరి.
వయోపరిమితి: 18-25 సంవత్సరాల మధ్య ఉండాలి.
జీతం: రూ.18,000- రూ.56,900.

➥ టీఏ- బూట్ రిపేరర్: 01 పోస్టు
అర్హత: ఐటీఐ లేదా పదోతరగతి ఉత్తీర్ణులై ఉండాలి. ఏడాది అనుభవం తప్పనిసరి.
వయోపరిమితి: 18-25 సంవత్సరాల మధ్య ఉండాలి.
జీతం: రూ.18,000- రూ.56,900.

➥ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఆఫీస్ అండ్ ట్రైనింగ్: 151 పోస్టులు
అర్హత: ఐటీఐ లేదా పదోతరగతి ఉత్తీర్ణులై ఉండాలి. ఏడాది అనుభవం తప్పనిసరి.
వయోపరిమితి: 18-25 సంవత్సరాల మధ్య ఉండాలి.
జీతం: రూ.18,000- రూ.56,900.

దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా.

ఎంపిక విధానం:పోస్టును అనుసరించి రాత పరీక్ష, స్కిల్/ ప్రాక్టికల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

ముఖ్యమైన తేదీలు..

* ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 27.01.2024.

* ఆన్లైన్ దరఖాస్తుకు చివరితేది: 16.02.2024.

Notification 

Online Application

Website

Health Tips : ఉడికించిన కోడిగుడ్డు మంచిదా.? ఆమ్లెట్ మంచిదా.? ఏది ఆరోగ్యకరమైనది..!!

Health Tips : గుడ్డుతో అసలు ఆరోగ్య లాభాలు ఉన్నాయా.. ఆమ్లెట్ తో ఆరోగ్య లాభాలు ఉన్నాయా అనే విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ప్రతి ఒక్కరు ఎక్కువగా ఇష్టపడే ఆహార పదార్థాల్లో కోడి గుడ్డు కూడా ఒక్కటే..
అందరికీ మరీ ఎక్కువగా ఇష్టముంటుంది. అయితే ఈ కోడి గుడ్డు వలన కలిగే ఆరోగ్య లాభాలు ఏంటి.? గుడ్డులో ఖనిజాలు పుష్కలంగా లభిస్తాయని వైద్యులు చెబుతున్నారు. సంపూర్ణ మాంసకృతుల పరంగా చూస్తే గుడ్డు మొదటి స్థానంలో ఆ తర్వాత పాలు, మాంసాహారం ఉన్నాయి. అయితే పప్పు మాంసాహారంలోని ప్రోటీన్ల కంటే గుడ్డులోనివి తేలిగ్గా జీర్ణం అవుతాయి.

గుడ్డులో కొలెస్ట్రాల్ నేరుగా రక్తంలో కలవకుండా గుడ్డులోని లెస్సితిన్ వంటి రసాయనాలు కాపాడతాయి. ఆమ్లెట్ చూసుకున్నట్లయితే అందులో ఏమేమి కలిపి ఆమ్లెట్ గా వేస్తారని దానిపై అది ఆరోగ్యమా.. అనారోగ్యమా అనేది ఆధారపడి ఉంటుంది. ఆమ్లెట్ డిష్ తయారు చేసేటప్పుడు జోడించిన పదార్థాలపై ఆధారపడి ఉంటుంది. గుడ్డు ఆమ్లెట్లు కేవలం కూరగాయలను మాత్రమే జోడిస్తే అది పోషకాహారాన్ని కలిగి ఉంటుంది. అలాంటప్పుడు అది ఉడికించిన గుడ్ల కంటే మరింత ఆరోగ్యకరమైనదిగా ఉంటుంది. దీనికి విరుద్ధంగా ఆమ్లెట్ ను ఎక్కువ నూనె అనారోగ్యకరమైన కొవ్వుతో కలిపితే అది రుచికరమైన ఆమ్లెట్ అవుతుంది.

కానీ శరీరానికి పెద్ద శత్రువుగా మారుతుంది. కొందరు ఆమ్లెట్ తింటే బరువు తగ్గొచ్చు అనుకుంటారు. ఆరోగ్యకరమైన ఆమ్లెట్ తో సహా ఏ ప్రత్యేకమైన ఆహారము బరువు తగ్గిస్తుందని హామీ ఉండదు. బరువు తగ్గాలంటే రోజు వారి కార్యకలాపాల సమయంలో కాలరీ లు ఖర్చు చేసే దానికంటే తక్కువ కాలరీలు తినాల్సి ఉంటుంది. గుడ్లతో సహా కొన్ని ఆహారాలు బరువు తగ్గడానికి సాయపడతాయి. అయితే వాటిని ఎలా తీసుకుంటున్నారని దానిపై ఆధారపడి ఉంటుంది. గుడ్డును ఉడికించేటప్పుడు గుడ్డులోని చాలా పోషకాలు అలాగే నిక్షిప్తమై ఉంటాయి. ఈ కారణంగా గుడ్లు తినడం చాలా ఆరోగ్యకరమైనది.. అంటే ఆమ్లెట్ కన్నా ఉడకబెట్టిన గుడ్డి శ్రేయష్కరం అని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు.

Central Govt jobs : 12th పాస్ చాలు.. వ్యవసాయ శాఖలో జాబ్ మేళా.. అప్లై చేయండి.. జాబ్ కొట్టండి.!

Central Govt jobs : మనకి చాలా రోజుల తర్వాత 12th అర్హతతో పెర్మనెంట్ జాబ్స్ కోసం ఎదురుచూసినటువంటి అభ్యర్థులకు ఒక భారీ నోటిఫికేషను అయితే వచ్చింది.
వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి సంస్థలు ఈ యొక్క ఉద్యోగాన్ని రిక్రూట్మెంట్ అయితే చేస్తారు. ఇంటర్ పాస్ అయితే సరిపోతుంది. ఎటువంటి ఎక్స్ప్రెస్ కూడా అవసరం లేదు. రాత పరీక్ష లేకుండా మనకి సెలక్షన్ చేసి పెర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ అయితే ఇస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మేల్ అండ్ ఫిమేల్ కనెక్షన్ అందరు కూడా రిక్రూట్మెంట్ కి అప్లై చేసుకోవచ్చు. ఈ యొక్క రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ కి సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలి. సెలెక్షన్ ప్రాసెస్ అనేది ఇలా ఉంటుంది.

గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అగ్రికల్చరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ కింద పని చేసినటువంటి కృషి విజ్ఞాన కేంద్రాన్ని ఒక సంస్థ నుంచి పర్మనెంట్ ఉద్యోగాలకు సంబంధించి ఒక నోటిఫికేషన్ మీరు ఏ రాష్ట్రానికి చెందిన మేల్ అండ్ ఫిమేల్ కైనా వేకెన్సీస్ కి అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా మీరు మనకి డైరెక్టర్ జాబ్స్ సంబంధించినటువంటి స్కిల్ సపోర్టింగ్ స్థాపన చెప్పేసి ఈ యొక్క ఉద్యోగాన్ని రిక్రూట్మెంట్ చేస్తారు.
క్వాలిఫికేషన్ వచ్చేసి మినిమం మనకి ఇంటర్ పాస్ అయితే సరిపోతుంది. మీరు ఈ ఉద్యోగానికి అప్లై చేయాలంటే మీకు 18 సంవత్సరాలు నుండి 40 సంవత్సరాల వరకు వయసు అర్హత కలిగి ఉండాలి.

అలాగే ప్రభుత్వ రూల్స్ ప్రకారం ఎస్టి, ఎస్సీలకు ఐదు సంవత్సరాలు ఓబీసీలకు మూడు సంవత్సరాలు ఉండవచ్చు.. ఈ యొక్క సిలబస్ ఏంటి అంటే.. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుండి విడుదలైన ఈ ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్ష లేకుండా మెరిట్ మార్కుల కింద సెలక్షన్ చేసి జాబు ఇవ్వనున్నారు.. ఇక అప్లై చేసుకునే విధానం మీరు ప్రభుత్వ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే Official వెబ్సైట్లోకి వెళ్లి మీ వివరాలను కరెక్టుగా ఫీల్ చేస్తే చాలు.. వారు మీ అప్లికేషన్ చూసి మీకు కాల్ చేసి ఇంటర్వ్యూకు పిలుస్తారు.. ఒకవేళ ఈ ఉద్యోగం మీకు వచ్చినట్లయితే 15000 నుండి 55 వేల రూపాయల వరకు ప్రతి నెల జీతం ఇవ్వడం జరుగుతుంది…

Bamboo Rice: ఈ బియ్యం తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు.. ఇవి ఏ చెట్టునుండి లభిస్తాయో తెలుసా..

దక్షిణ భారతదేశంలో రైస్ ను ఇష్టపడే వారు చాలా మంది ఉంటారు. రోజంతా ఏమి తిన్నా అన్నం తినకపోతే మాత్రం ఏదో లోటుగా కనిపిస్తోంది. అయితే రైస్ ఎక్కువ తింటే మధుమేహం వ్యాధి బారిన పడతారని అంటుంటారు.
అయితే వెదురు బియ్యం తింటే మాత్రం ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంట. వెదురు బియ్యం చాలా అరుదైన బియ్యం రకం. ఇందులో పోషకాలు ఎక్కువుగా ఉంటాయి. చాలామందికి వైట్ రైస్ గురించి తెలుసు. అలాగే బ్రౌన్ రైస్, బ్లాక్ రైస్ అని రకరకాలు ఉన్నా, అవన్నీ వరి నుంచి వచ్చిన ధాన్యాలే. కానీ వెదురు రైస్ గురించి చాలామందికి తెలియదు. బాంబో చికెన్ అంటే వెదరు బొంగులో వండే చికెన్ ను బాంబో చికెన్ అంటారు. మరి వెదురు బియ్యం అంటే వెదురు బొంగుల్లో వండే రైస్ కాదు. నేరుగా వెదురు చెట్టుకే పండే రైస్ ను వెదురు బియ్యం అంటారు. వెదురు బియ్యాన్ని ములయారి రైస్ అని కూడా పిలుస్తారు. సాధారణంగా వెదురు చెట్టు వయసు చివరి దశకు వచ్చి, అది చనిపోయేటపుడు కొత్త చెట్లు మొలకెత్తడానికి పెద్ద మొత్తంలో పుష్పించడం,విత్తనాలను ఉత్పత్తి చేయడం ప్రారంభిస్తుంది. వెదురు కంకులు ఉద్భవిస్తాయి. ఈ వెదురు కంకులను కోసి తీస్తే అందులో విత్తనాలు బయటకు వస్తాయి, ఇలా తీసిన విత్తనాలనే వెదురు బియ్యం అంటారు. ఈ వెదురు బియ్యం చాలా అరుదుగా దొరుకుతాయి. వీటి ఉత్పత్తి కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే వెదురు చెట్టు జీవితకాలం ముగియటానికి కొన్ని సంవత్సరాల నుంచి 100 సంవత్సరాలు కూడా పట్టవచ్చు. అప్పటికి గానీ ఆ చెట్టు వెదురు కంకులను ఉత్పత్తి చేయదు. అందుకే వెదురు బియ్యం చాలా అరుదుగా దొరుకుతాయి.

వెదురు బియ్యం చూడటానికి మామూలు వరి నూకల బియ్యం లాగా ఉంటుంది. అయితే ఆకుపచ్చ రంగులో ఉంటుంది. దీనిని మామూలు బియ్యంలాగే వండుకోవాలి. వండిన తర్వాత దాని ఆకృతిలో తేడా ఉంటుంది. ఈ బియ్యంతో వండిన అన్నం కొద్దిగా జిగటగా ఉంటుంది, సువాసనగా ఉంటుంది. రుచిలో గోధుమ ధాన్యాల రుచిని కలిగి ఉంటుంది,తియ్యగానూ ఉంటుంది. ఈ బియ్యంను కిచిడి చేయటానికి లేదా ఖీర్ చేయటానికి ఎక్కువుగా ఉపయోగిస్తారు.

ఆరోగ్య ప్రయోజనాలు

అరుదైన రకానికి చెందిన వెదురు బియ్యంలో పోషకాలు, ఔషధ గుణాలు ఎక్కువుగా ఉంటాయి. వీటిలో మాంసకృత్తులు పుష్కలంగా ఉంటాయి. ఈ బియ్యం వండుకొని తింటే వెన్నునొప్పి, కీళ్ల నొప్పులు నయమవుతాయని ఒక అధ్యయనంలో తేలింది. కొలెస్ట్రాల్ సమస్యలతో బాధపడేవారు తింటే శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. ఇందులో యాంటీ డయాబెటిక్ గుణాలు కూడా ఉన్నాయి. కాబట్టి షుగర్ పేషెంట్లకు ఇది మేలు చేస్తుంది. విటమిన్ లోపం ఉన్న గర్భిణులకు ఈ వెదురు బియ్యం ఆరోగ్యకరం. ఈ బియ్యంలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండటం వల్ల మధుమేహాన్ని నియంత్రణలో ఉంచడంతో పాటు షుగర్ వ్యాధి ప్రమాదాన్ని తగ్గిస్తుంది. వెదురు గింజల్లో ఎలాంటి కొవ్వు ఉండదు. ఇప్పటికే ఉన్న శరీర కొవ్వును కరిగించడానికి దోహదపడుతుంది. అదనంగా ఈ బియ్యంలో ఐరన్, ఫాస్పరస్ వంటి మూలకాలు ఉంటాయి. ఇది గుండె ఆరోగ్యానికి ఎంతో మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. వెదురుబియ్యం రక్తపోటును నియంత్రిస్తుంది, వెదురు బియ్యం స్థిరంగా తీసుకోవడం వల్ల రక్తపోటు సాధారణ పరిధిలోకి వస్తుంది. మెదడుకు సరైన పోషకాలు అందించి, మెదడును, గుండెను సమన్వయ పరుస్తుంది. వెదురు బియ్యం తింటే ఎముకలు దృఢంగా ఉంటాయి. వీటిలో కాల్షియం, భాస్వరం, ఇనుము వంటి మూలకాలతో పాటు ఫ్లేవనాయిడ్‌లు, ఆల్కలాయిడ్‌లు ఉంటాయి. ఈ బియ్యంలోని బయోయాక్టివ్ పదార్థాలు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్లు కీళ్లవాపును తగ్గిస్తాయి. రుమటాయిడ్ ఆర్థరైటిస్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది. ముఖ్యమైన బి విటమిన్లు, ముఖ్యంగా బి6 వెదురు బియ్యంలో పుష్కలంగా ఉంటాయి. ఎర్ర రక్త కణాల సంశ్లేషణ,నరాల ఆరోగ్యం, అభిజ్ఞా పెరుగుదలకు ఇవి మంచివి. రక్తహీనత, మూర్ఛలు, అల్జీమర్స్ వంటి అనారోగ్యాలను నివారిస్తాయి. దంత క్షయాలు లేదా కావిటీలను నివారించడంలో సహాయపడే పోషకాలు వెదురు బియ్యంలో ఉంటాయి.

ఈ వెదురు బియ్యం సాధారణంగా మార్కెట్లో లభించవు. కేరళలోని కొండప్రాంతాలు, వెదురు బొంగులు ఎక్కువగా ఉండే అభయారణ్యాల ప్రాంతాలలో నివసించే గిరిజనుల వద్ద ఈ బియ్యం అరుదుగా లభిస్తాయి.

Onion And Clay Pot : పచ్చి ఉల్లిపాయ.. మట్టి పాత్ర.. అంతే.. షుగర్ దెబ్బకు అదుపులోకి వస్తుంది..!

Onion And Clay Pot : డయాబెటిస్.. దీనినే షుగర్ వ్యాధి, మధుమేహం అని కూడా అంటారు. పేరు ఏదైనా ఈ వ్యాధి బారిన పడే వారి సంఖ్య రోజురోజుకూ ఎక్కువవుతుంది.
డయాబెటిస్ అనేది రక్తంలో చక్కెర స్థాయిలు అసాధారణ గరిష్ట స్థాయిలో ఉండే చాలా అసాధారణమైన వ్యాధిగా చెప్పుకోవచ్చు. ఈ వ్యాధి బారిన పడిన వారిలో కనిపించే లక్షణాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

డయాబెటిస్ బారిన పడిన వారిలో కనిపించే లక్షణాలలో అధిక దాహం ఒకటి. ఈ వ్యాధి బారిన పడిన వారికి తరచూ దాహం వేస్తూ ఉంటుంది. సాధారణంగా అధిక దాహం, తరచూ మూత్ర విసర్జన చేయడం వంటివి మధుమేహం యొక్క అత్యంత ఖచ్చితమైన లక్షణాలుగా చెప్పవచ్చు.

ఈ వ్యాధి బారిన పడిన వారిలో కంటి చూపు తగ్గుతుంది. మధుమేహం కు తగిన చికిత్స తీసుకోకపోతే కంటిచూపుపై తీవ్ర ప్రభావం పడుతుంది. చూపు కోల్పోవడం, అంధత్వం వంటి వాటికి కూడా షుగర్ వ్యాధి దారి తీస్తుంది.

అలాగే మన శరీరంలో కణాలు తగినంత గ్లూకోజ్ పొందడానికి శక్తి కోసం కొవ్వు కణాలను విచ్ఛిన్నం చేస్తాయి. దీంతో మనం బరువు తగ్గుతాము. అలాగే ఎక్కువగా ఆకలి వేయడం కూడా మధుమేహ వ్యాధి గ్రస్తుల్లో కనిపించే ఒక లక్షణం. అలాగే రక్తంలో చక్కెర అధిక స్థాయిలో ఉండడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది.

దీంతో మనం అనేక వ్యాధుల బారిన పడడం, శరీరానికి తగిలిన గాయాలు, దెబ్బలు త్వరగా మానకపోవడం వంటివి జరుగుతాయి. ఈ షుగర్ వ్యాధిని కొన్ని రకాల ఇంటి చిట్కాలను ఉపయోగించి నయం చేసుకోవచ్చు.

Onion And Clay Pot

షుగర్ వ్యాధిని తగ్గించే ఇంటి చిట్కాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వకాలంలో మట్టిపాత్రల్లో వండుకుని తినే వారు. ఇలా మట్టి పాత్రల్లో వండుకుని తినడం వల్ల మనం చేసే వంటలు రుచిగా ఉండడమే కాకుండా మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు.

మట్టి పాత్రలో వండుకున్న పదార్థాలు చాలా సమయం వరకు వాటి రుచిని కోల్పోకుండా తాజాగా ఉంటాయి. మట్టిలో మన ఆరోగ్యానికి కావల్సిన 18 రకాల మైక్రో న్యూట్రియన్స్ ఉంటాయి. ఈ మట్టి పాత్రలను వేడి చేయగానే మన కంటికి కనిపించని కిరణాలు ఉత్పత్తి అవుతాయి.

ఇవి మన శరీరంలో ఉండే వ్యర్థాలను బయటకు పంపి రక్తాన్ని శుద్ధి చేయడంలో సహాయపడతాయి. ఈ పాత్రల్లో వండుకుని తినడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.

ఈ మట్టి పాత్రల్లో వండిన ఆహారాన్ని షుగర్ వ్యాధి గ్రస్తులు తీసుకోవడం వల్ల వారిలో రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. దీంతో వారు డయాబెటిస్ నుండి ఉపశమనాన్ని పొందవచ్చు. ఒక నెల రోజుల పాటు మట్టి పాత్రల్లో వండుకుని తినడం వల్ల మధుమేహాన్ని తగ్గించుకోవచ్చు.

అలాగే ఉల్లిపాయను ఉపయోగించడం వల్ల షుగర్ వ్యాధిని అదుపులో ఉంచుకోవచ్చట. ఒక్క ఉల్లిపాయతో షుగర్ వ్యాధిని తగ్గించుకోవచ్చని సంప్రదాయ ఆయుర్వేదం చెబుతుంది. మందులకు సైతం తగ్గని షుగర్ వ్యాధిని 50 గ్రాముల ఉల్లిపాయ తగ్గిస్తుంది.

దీని కోసం మనం చేయాల్సిందల్లా రోజుకు ఒక ఉల్లిపాయను తినడమే. ఇలా ఏడు రోజుల పాటు చేయడం వల్ల షుగర్ వ్యాధిలో వచ్చే మార్పులను మనం గమనించవచ్చని నిపుణులు చెబుతున్నారు.

రోజుకు 50 గ్రాముల పచ్చి ఉల్లిపాయను తీసుకోవడం వల్ల షుగర్ వ్యాధిని నియంత్రించుకోవచ్చు. 50 గ్రాముల పచ్చి ఉల్లిపాయ 20 యూనిట్ల ఇన్సులిన్ తో సమానం.

ఈ ఉల్లిపాయను ఏడు రోజుల పాటు క్రమం తప్పకుండా తీసుకుంటే చాలు ఎంతో కాలం నుండి వేధిస్తున్న షుగర్ వ్యాధి నియంత్రణలోకి వస్తుంది. 50 గ్రాములు ఒకేసారి తినకపోతే ఉదయం కొద్దిగా, మధ్యాహ్నం కొద్దిగా, సాయంత్రం కొద్దిగా తింటూ ఉండాలి.

ఇలా పచ్చి ఉల్లిపాయను తినలేకపోతే అదే ఉల్లిపాయతో పచ్చి పులుసు చేసుకుని అన్నంతో కలిపి తినాలి. అలాగే మన ఇంట్లో తయారు చేసుకున్నఆరోగ్యకరమైన జ్యూస్ తో కూడా మనం షుగర్ వ్యాధిని తగ్గించుకోవచ్చు.

ఈ జ్యూస్ ను తయారు చేసుకోవడానికి గానూ రెండు కట్టల కొత్తిమీరను, రెండు క్యారెట్ లను, ఒక గ్రీన్ ఆపిల్ ను, అలాగే మనకు నచ్చిన ఆకుకూరను 3 కట్టల మోతాదులో తీసుకోవాలి. ముందుగా ఈ పదార్థాలన్నింటిని శుభ్రం చేసుకుని ముక్కలుగా చేసుకోవాలి.

తరువాత వీటిని ఒక జార్ లోకి తీసుకుని ముందుగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత తగినన్ని నీళ్లు పోసి జ్యూస్ లా చేసుకోవాలి. ఈ సహజ సిద్దమైన జ్యూస్ షుగర్ వ్యాధి గ్రస్తులకు ఎంతో మేలు చేస్తుంది.

ఈ జ్యూస్ ను రోజూ ఉదయం పరగడుపున తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. దీనిని తీసుకోవడం వల్ల చాలా తక్కువ సమయంలోనే రక్తంలో చక్కెర స్థాయిలను క్రమబద్దీకరించుకోవచ్చు.

డయాబెటిక్ లక్షణాలను నివారించుకోవచ్చు. ఈ చిట్కాలను పాటించడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. తద్వారా షుగర్ అదుపులో ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

Ragi Java : రోజూ రాగి జావలో ఇది కలిపి తీసుకోండి.. ఎముకలు దృఢంగా మారుతాయి..

Ragi Java : రాగులు.. మనం ఆహారంగా తీసుకునే చిరు ధాన్యాలలో ఇవి ఒకటి. చిరు ధాన్యాలలోకెల్లా రాగులు అతి శక్తివంతమైనవి. రాగులు చాలా బలవర్దకమైన ఆహారం.
వీటిలో మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి. వీటిని రోజువారి ఆహారంలో చేర్చుకోవడం వల్ల మనం ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు. రాగులు వృద్ధాప్య ఛాయలను దూరం చేస్తాయి. వీటిలో ఉండే అమైనో యాసిడ్లు త్వరగా ఆకలి వేయకుండా చేస్తాయి. బరువు తగ్గడంలో కూడా రాగులు మనకు ఎంతగానో ఉపయోగపడతాయి. వీటిలో అధికంగా ఉండే ఫైబర్ లు కడుపు నిండిన భావనను కలిగిస్తాయి. అలాగే జుట్టు పెరుగుదలలో కూడా రాగులు మనకు దోహదపడతాయి. నడి వయసు మహిళల్లో ఎముకలు పటుత్వం తగ్గుతూ ఉంటాయి.
రాగులు ఎముకలను ధృడంగా చేస్తాయి. నిద్రలేమి, వ్యాకులత, ఆందోళన వంటి సమస్యలను దూరం చేస్తాయి. శారీరక శ్రమ ఎక్కువగా చేసే వారు రాగులను రోజూ తీసుకోవడం వల్ల తక్షణ శక్తి లభిస్తుంది. రాగులను తీసుకోవడం వల్ల మనకు తగినంత అయోడిన్ లభిస్తుంది. రాగులతో చేసిన ఏ ఆహారాన్ని తీసుకున్నా కూడా షుగర్ వ్యాధి గ్రస్తులకు మేలు కలుగుతుంది. రాగులు రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతాయి. రాగులను పిల్లలకు ఆహారంలో భాగంగా ఇవ్వడం వల్ల వారిలో ఎదుగుదల చక్కగా ఉంటుంది. రాగుల పానీయం దప్పికను అరికడుతుంది. నీరసాన్ని తగ్గిస్తుంది. రాగులను వేయించి పిండిగా చేయాలి. ఈ రాగి పిండిని బియ్యంతో కలిపి వండుకుని తింటే నీరసం తగ్గుతుంది. రాగులతో మనం రుచిగా జావను కూడా తయారు చేసుకోవచ్చు.
రాగులతో మన శరీరానికి ఎంతో మేలు చేసే రాగి జావను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా ఒక గిన్నెలో రాగి పిండిని తీసుకుని అందులో కొద్దిగా నీటిని పోసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. తరువాత ఒక గిన్నెలో నీటిని పోసి వేడి చేయాలి. నీళ్లు వేడయ్యాక ఉండలు లేకుండా కలుపుకుని రాగి పిండిని వేసి పొంగు వచ్చే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల రాగి జావ తయారవుతుంది. ఇలా తయారు చేసుకున్న రాగి జావను నేరుగా తాగవచ్చు లేదా దీనిలో మజ్జిగ, ఉప్పును వేసి కూడా తీసుకోవచ్చు.

ఈ విధంగా తీసుకోవడం వల్ల నీరసం, ఆందోళన తగ్గి తక్షణ శక్తి లభిస్తుంది.రాగి జావలో పంచదార, పాలను కూడా కలిపి తయారుచేయవచ్చు. ఇలా పాలు , పంచదార వేసి తయారు చేసిన రాగి జావను పిల్లలకు ఇస్తే వారిలో ఎముకలు ఎంతో పుష్టిగా తయారవుతాయి. వారి ఎదుగుదల కూడా బాగుంటుంది. జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుంది. రాగులతో చేసిన పదార్థాలను తీసుకోవడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది. మలబద్దకం వంటి సమస్య తగ్గుతుంది. రాగులు మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయని వీటిని తప్పకుండా ఆహారంలో భాగంగా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

Eye Sight : మీ కంటి చూపు అమాంతం పెరగాలంటే.. ఇలా చేయాలి..!

Eye Sight : చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ప్రస్తుత కాలంలో చాలా మంది కంటిచూపుకు సంబంధించిన సమస్యలతో బాధపడుతున్నారు. పూర్వం పెద్ద వారిలో మాత్రమే కనిపించే ఈ సమస్యలు ప్రస్తుతం చిన్న పిల్లల్లో కూడా రావడాన్ని మనం చూడవచ్చు.
పోషకాలు కలిగిన ఆహారాన్ని తీసుకోకపోవడం, సెల్ ఫోన్, టీవీ, ల్యాప్ టాప్ వంటి వాటిని ఎక్కువగా ఉపయోగించడం వంటి కారణాల వల్ల కంటి చూపు మందగించడం వంటి సమస్యలు వస్తాయి.

కొందరిలో జన్యుపరంగా కూడా ఈ సమస్యలు తలెత్తుతాయి. చాలా మంది కళ్లద్దాలే ఈ సమస్యకు పరిష్కారం అని భావిస్తారు. కానీ ఇంటి చిట్కాను ఉపయోగించి కూడా మనం కంటిచూపును మెరుగుపరుచుకోవచ్చు.

కంటి చూపును మెరుగుపరిచే ఇంటి చిట్కా ఏమిటి.. దీనిని తయారు చేసుకోవడానికి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అలాగే ఈ చిట్కాను ఎలా ఉపయోగించాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. కంటి చూపుకు సంబంధించిన సమస్యలతో బాధపడే వారు ఈ చిట్కాను పాటించడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది.

ఈ చిట్కాను పాటించడానికి మనం బాదం పప్పును, సోంపూ గింజలను, పాలను ఉపయోగించాల్సి ఉంటుంది. దీని కోసం ముందుగా బాదం పప్పును నీటిలో నానబెట్టాలి. బాదం పప్పు నానిన తరువాత వాటిపై ఉండే పొట్టును తీయాలి. ఇప్పుడు ఈ బాదం పప్పును జార్ లో వేసి పొడి గా చేసుకోవాలి.

Eye Sight

తరువాత సోంపు గింజలను కూడా పొడిగా చేసుకోవాలి. ఇప్పుడు ఒక గ్లాస్ పాలల్లో ఒక టీ స్పూన్ బాదం పొడిని, అర టీ స్పూన్ సోంపు గింజల పొడిని వేసి కలపాలి. రుచి కొరకు దీనిలో పట్టిక బెల్లాన్ని కూడా వేసుకోవచ్చు.

ఇలా తయారు చేసుకున్న పాలను రోజూ ఉదయం అల్పాహారానికి ముందు తీసుకోవాలి. అలాగే ఈ పాలను తీసుకున్న అరగంట వరకు ఎటువంటి ఆహారాన్ని తీసుకోకూడదు.

ఈ విధంగా తయారు చేసుకున్న పాలను నెలరోజుల పాటు తీసుకోవడం వల్ల కంటి చూపు మెరగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు.

బాదం పప్పులో , పాలల్లో, సోంపూ గింజల్లో ఉండే పోషకాలు కంటిచూపును మెరుగుపరచడంలో మనకు ఎంతో సహాయపడతాయి.

ఈ చిట్కాను పాటిస్తూనే పోషకాలు కలిగిన ఆహారాన్ని తీసుకోవడం, సెల్ ఫోస్ వంటి పరికరాలను తక్కువగా ఉపయోగించడం వల్ల వంటి చేయాలి.

దీంతో మన కంటి చూపు మెరుగుపడడమే కాకుండా భవిష్యత్తులో కూడా కంటిచూపుకు సంబంధించిన సమస్యలు రాకుండా ఉంటాయని నిపుణులు సూచిస్తున్నారు.

Hair fall: జట్టు రాలిపోతోందా ? వెంటనే మేల్కోండి.. భవిష్యత్తులో బట్టతల రాకుండా ఉండేందుకు..

ప్రస్తుత యుగంలో చాలామంది యువత సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో పడిపోయారు. ఎక్కవ సేపు దానిమీదే గడుపుతున్నారు. ఇక ఉద్యోగులైతే సరేసరి. ఎప్పడూ కంప్యూటర్ మీద, లేదా ఏదో ఓ రూమ్లో కూర్చుండిపోతారు.
అయితే నిరంతరం పని చేయడం వల్ల నిద్ర ఎక్కువగా పట్టకపోవడం, తదనంతరం డిప్రెషన్కు కారణాలుగా మారవచ్చంట. అయితే ఈ దశలే మనిషికి బట్టతల (bald head)ను తెచ్చే అవకాశం ఉందని వైద్యులు (doctors) చెబుతున్నారు. దీనికి కారణం మీకు తెలుసా? అధిక ఒత్తిడి వల్ల వెంట్రుకల కుదుళ్లు దెబ్బతింటాయి. అలోపేసియా ఏరియాటా ఏర్పడుతుంది. ఈ విధంగా, పురుషుల (men)కు యుక్త వయస్సు (young age)లోనే జుట్టు (hair) తగ్గడం ప్రారంభమవుతుంది. బట్టతల సమస్యతో చాలా అంటే చాలా ఇబ్బందులు పడుతున్నారు. బట్టతల రాకుండా జుట్టు బాగా పెరగాలంటే ఖచ్చితంగా ఈ ఆహారం తీసుకోవాలి.

పెరిగే జుట్టు కోసం..
కోడి గుడ్లు (Eggs) ప్రోటీన్ అలాగే బయోటిన్ వంటి పోషకాలు కలిగిన అతిపెద్ద మూలం. ఈ రెండు పోషకాలు కూడా జుట్టు పెరుగుదలకు (hair increase) చాలా అవసరం. ఇక మన జుట్టు (hair) కుదుళ్లను బాగా బలోపేతం చేయడానికి ప్రోటీన్ అనేది బాగా సహాయపడుతుంది. అయితే బయోటిన్ అనేది పెరిగే జుట్టు కోసం ప్రోటీన్ కెరాటిన్ ఉత్పత్తికి ఎంతగానో సహాయపడుతుంది. ఇది మన జుట్టు (hair) పెరుగుదలను బాగా పెంచుతుంది. ఈ పోషకాల లోపం సాధారణంగా జుట్టు రాలడానికి బాగా కారణమవుతుంది. రోజుకు ఒకటి లేదా రెండు గుడ్లు (eggs) అనేవి తప్పనిసరిగా తీసుకోవడం చాలా మంచిది. బట్టతలకు (bald head) చెక్ పెట్టొచ్చు.

జుట్టు రాలడాన్ని (hair fall) కూడా క్యారెట్ (carrot) నివారిస్తుంది. అలాగే క్యారెట్‌లో విటమిన్ ఎ, సి, కె, బి కాంప్లెక్స్ ఇంకా పొటాషియం, ఫాస్పరస్ అలాగే ఫైబర్ వంటి పోషకాలు అనేవి పుష్కలంగా ఉంటాయి. ఈ మొత్తం అన్ని కూడా శారీరక ఆరోగ్యానికి (body health) కూడా చాలా అనుకూలంగా ఉంటాయి.
పచ్చని ఆకు కూరలు కూడా శారీరక ఆరోగ్యానికి చాలా మంచివి. ఈ ఆకుకూరలో జుట్టు సంరక్షణ రహస్యం కూడా ఉంది. ఇక పాలకూర అనేది వివిధ పోషకాలతో కూడిన గొప్ప మూలం. ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్స్ బి, సి, ఇ, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం ఇంకా ఐరన్ ఉంటాయి.

Sugar – Vepaaku – షుగర్ పేషెంట్స్ కోసం.. వేపాకు ను 45 రోజులు ఇలా వాడితే 99% ఫలితం ఖాయం

ప్రపంచవ్యాప్తంగా షుగర్ వ్యాధి బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకు భారీగా పెరుగుతోంది. గతంతో పోల్చితే ఇప్పుడు కొన్ని వందల రెట్లు షుగర్ వ్యాధి పేషెంట్ సంఖ్య పెరిగింది. షుగర్ వ్యాదిగ్రస్తులు ప్రతి రోజు ట్యాబ్లెట్ లేదా ఇన్సులిన్‌ ఇంజక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. అలా తీసుకోని పక్షంలో వారి షుగర్ లెవల్స్ విపరీతంగా పెరిగి పోయి చివరకు వారి ప్రాణాలకే ప్రమాదం వాటిల్లే అవకాశం ఉంటుంది. అందుకే ప్రతి రోజు వారు ఇన్సులిన్‌ తీసుకోవడం తప్పనిసరి అయ్యింది.

షుగర్‌ లెవల్స్ ను ఒక స్థాయిలో ఉండేలా చేయడంలో మన చుట్టు పక్కల ఎన్నో పదార్థాలు ఉపయోగ దాయకంగా ఉంటాయి. అందులో వేపాకు ఒకటి అంటూ ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
ఆయుర్వేద నిపుణుల సూచన మేరకు వేపాకు ను 45 రోజుల పాటు తీసుకోవడం వల్ల 99 శాతం మందిలో షుగర్‌ లెవల్స్ కంట్రోల్‌ లో ఉంటాయని అంటున్నారు. షుగర్‌ ఉన్న వారు చేయవల్సిందల్లా ఉదయానే పరిగడుపున వేప చెట్టు లేత ఆకులు మూడు లేదా నాలుగు నమిలి మింగాలి. ఆ తర్వాత కనీసం గంట సమయం బ్రేక్‌ ఇచ్చి టీ లేదా ఇతర పదార్థాలు ఏమైనా తీసుకోవాలి.

ఖచ్చితంగా వేప ఆకులు తిన్న తర్వాత కనీసం గంట గ్యాప్‌ ఇవ్వాల్సిందే అంటున్నారు. అందుకే లేచిన వెంటనే వేప ఆకులు తిని ఆ తర్వాత బ్రష్‌ చేసుకోవడం.. ఆ తర్వాత టీ టిఫిన్ చేయడం మంచిది. వేప ఆకు ను నమిలి మింగడం ఇబ్బందిగా అనుకున్న వారు గుప్పెడు ఆకులను తీసుకుని బాగా మరుగుతున్న నీటిలో వేసి మరో అయిదు నిమిషాల పాటు ఆ నీటిని మరిగించి ఆ తర్వాత వడగట్టి ఆ నీటిని చల్లార్చుకుని తాగాలి. అలా ప్రతి రోజు ఉదయం సాయంత్రం కలిపి లీటరు నీళ్లు తాగాలి. రెండు నెలలు కంటిన్యూగా వేప నీళ్లు తాగడం వల్ల షుగర్‌ వ్యాది సమస్యల నుండే కాకుండా ఇతర అనారోగ్య సమస్యల నుండి కూడా పరిష్కారం లభిస్తుంది. వేపాకు అనేది ఉచితంగా వచ్చేదే కదా.. ప్రయత్నిస్తే పోయేది ఏముంది చెప్పండి. షుగర్ వ్యాధి ఉన్న వారు ఒక సారి ప్రయత్నించి చూడండి.

Jaggary: చలికాలంలో బెల్లం తింటే కలిగే ఉపయోగాలు తెలిస్తే మీరు షాక్ అవ్వడం గ్యారంటీ..!

Jaggary: బెల్లం గురించి మన అందరికి తెలిసే ఉంటుంది. బెల్లం తినడానికి ఎంతో రుచికరంగా ఉంటుంది. అలాగే బెల్లం వలన మన ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది.
అసలే ఇప్పుడు చలికాలం. ఎక్కువగా సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ కాలంలో మన శరీరాన్ని వేడిగా ఉంచుకోవాలి.అలాగే ఈ కాలంలో ఎక్కువగా వచ్చే జలుబు, దగ్గు వంటి అనారోగ్య సమస్యల నుండి మనల్ని మనం కాపాడుకోవాలంటే ప్రతి రోజు బెల్లం తినాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.మరి ఈ కాలంలో బెల్లం తినడం వలన కలిగే ఉపయోగాలు ఏంటో ఒకసారి తెలుసుకుందాం..

బెల్లం ఉపయోగాలు :

బెల్లంలో కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు, విటమిన్ బీ 12, బి 6, పోలేట్, కాల్షియం, ఐరన్, ఫాస్ఫరస్, మెగ్నీషియం వంటి ఎన్నో రకాల పోషకాలు దాగి ఉన్నాయి. ఇవి మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయని వైద్య నిపుణులు అంటున్నారు.ఇంకా బెల్లంలో ఉండే మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి. ఫలితంగా వివిధ రకాల అనారోగ్యాల బారిన పడకుండా తప్పించుకోవచ్చు.
అందుకే ప్రతిరోజు బెల్లంను ఆహారంలో భాగంగా చేసుకోవాలి. భోజనం పూర్తయ్యాక కొద్దిగా బెల్లం ముక్క తింటే జీర్ణక్రియ ప్రక్రియ సులభతరమవుతుంది.

బెల్లం ఎలా తినాలంటే..?
బెల్లాన్ని పాలతో కలిపి తీసుకుంటే కీళ్ల నొప్పులకు ఉపశమనం కలుగుతుంది. చాలా మంది పాలలో పంచదార వేసుకుని తాగుతారు. అలా కాకుండా పాలలో బెల్లం కలుపుకుని తాగితే ఆరోగ్యానికి ఇంకా మంచిది.బెల్లం తినడం వలన రక్తపోటు కూడా అదుపులో ఉంటుంది.బెల్లం రోజూ తినడం ద్వారా మలబద్ధకం సమస్య తగ్గుతుంది.బెల్లం తినడం వలన కలిగే ఇంకో ముఖ్యమైన లాభం ఏంటనే ఏది రక్తహీనతను తగ్గిస్తుంది.ఎందుకంటే బెల్లంలో పుష్కలంగా ఐరన్ ఉంటుంది.ఇది శరీరంలోని ఎర్రరక్త కణాలను సంఖ్యను వృద్ధి చేస్తుంది.అలాగే శరీరానికి కావాల్సిన ఆక్సీజన్ ను సరఫరా పెంచి, రక్తహీనతను అడ్డుకుంటుంది.కావున రక్తహీనత సమస్యతో ఇబ్బంది పడే వారు తరుచు భోజనములో బెల్లంను చేర్చుకోవాలి.

Smartphone Unlock: స్మార్ట్ ఫోన్ లాక్ మర్చిపోతే ఇలా బ్రేక్ చేయండి?.. ఈ సింపుల్ ట్రిక్‌తో మీ డేటా కూడా సేఫ్..

ఇప్పుడు ప్రతిఒక్కరి అరచేతిలోకి స్మార్ట్ ఫోన్ వచ్చేసింది. ప్రతీది స్మార్ట్ ఫోన్‌లో సేవ్ చేసేస్తుంటారు. ఫోన్‌లోని పర్సనల్ డేటాను ఎవరూ చూడకుండా ఉండేందుకు స్మార్ట్ ఫోన్ యూజర్లు ఫోన్ లాక్ చేస్తుంటారు.

ఇందుకు కొన్ని సెక్యూర్ సెట్టింగ్స్ వాడుతుంటారు. ఫోన్లో పర్సనల్ డేటా ఫొటోలు లేదా వీడియోలు, ఇతర కాంటాక్టుల విషయంలో కాస్తా జాగ్రత్తగానే ఉండాలని సైబర్ నిపుణులు సూచిస్తున్నారు. ఇప్పుడు వచ్చే ప్రతి స్మార్ట్ ఫోన్‌లో లాకింగ్ ఆప్షన్ చాలా పద్దతులు ఉన్నాయి. ఇందు కోసం face scans, thumbprints, irises, passcodes, patterns వంటి ఎన్నో పద్దతుల్లో లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం, ఫోన్‌లను లాక్ లేదా అన్‌లాక్ చేసేందుకు భద్రతపరంగా అనేక మార్గాలు ఉన్నాయి. మీరు మీ మొబైల్ పాస్‌వర్డ్‌ను మరచిపోయినట్లయితే, ఈ వార్త మీకు ఉపయోగకరంగా ఉంటుంది.

ఆండ్రాయిడ్ ఫోన్ పాస్‌వర్డ్‌ను బ్రేక్ చేసే కొన్ని పద్ధతుల గురించి ఈ వార్తలో తెలుసుకుందాం. మీరు మొబైల్ పాస్‌వర్డ్‌ను మరచిపోయినట్లయితే దాన్ని అన్‌లాక్ చేయడానికి అనేక మార్గాలు ఉన్నాయి. కొత్త సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్ చేసుకోవడానికి సర్వీస్ సెంటర్‌కి వెళ్లడం లేదా మొబైల్ రిపేరింగ్ షాప్‌కి వెళ్లడం వంటివి వీటిలో ఉన్నాయి. అయితే ఈరోజు వార్తలలో, మనం సురక్షితమైన, సులభమైన మార్గం గురించి తెలుసుకోవచ్చు. ఈ పద్ధతిని ఉపయోగించి, మీరు ఇంట్లో కూర్చొని మీ మొబైల్‌ను అన్‌లాక్ చేయవచ్చు. ఈ పద్ధతుల గురించి తెలుసుకుందాం.

Google ఖాతాతో పాస్‌వర్డ్‌ని రీసెట్ చేయండి

Google ఖాతా నుంచి పాస్‌వర్డ్‌ను రీసెట్ చేయడం సులభమైన మార్గాలలో ఒకటి. దీనితో మీరు మీ డేటాను కోల్పోకుండా మొబైల్ లాక్‌ని. దీని కోసం క్రింద పేర్కొన్న దశలను అనుసరించండి.

పాస్‌వర్డ్‌ను చాలాసార్లు నమోదు చేయండి. తద్వారా మొబైల్ లాక్ చేయబడి ఉంటుంది. మీరు పాస్‌వర్డ్‌ను మర్చిపోయారు అనే ఎంపికను వస్తుంది.

మర్చిపోయిన పాస్‌వర్డ్‌పై క్లిక్ చేయండి.

ఇక్కడ మీరు ఇమెయిల్ ఐడి, పాస్‌వర్డ్‌ను నమోదు చేయమని అడుగుతుంది. దీనిలో, మీరు Google Play Storeలో ఉపయోగించే అదే ఇమెయిల్ IDని నమోదు చేయండి.

ఆ తర్వాత సెట్ న్యూ పాస్‌వర్డ్ ఆప్షన్‌పై క్లిక్ చేయండి.

You know those round lids on the train? రైలుపై ఆ గుండ్రని మూతలేంటో మీకు తెలుసా ?

ట్రైన్ జర్నీ చేయనివారు మనలో ఎవరూ వుండరనే చెప్పొచ్చు. అయితే, ట్రైన్ కి సంబంధించిన కొన్ని కొన్ని విషయాల్ని మనం పెద్దగా గమనించం, ఒకవేళ గమనించినా వాటికి సంబంధించిన వివరాలేంటో మనకు తెలిసి వుండకపోవచ్చు. అలాంటి ఒక ఆసక్తికరమైన విశేషాన్ని మనం ఒకసారి గుర్తు చేసుకుందాం.

రైళ్లలో ముద్రించిన వివిధ సంకేతాలు, సంఖ్యలు, అక్షరాల గురించి మనలో చాలామందికి తెలియదు. రైలు పైకప్పుపై గుండ్రని ఆకారపు మూతలు వుండడాన్ని మీరు ఎప్పుడైనా గమనించారా? అవి దేనికో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఈ గుండ్రని ఆకారపు మూతలు కోచ్‌ల లోపల నుంచి కనిపించవు. బ్రిడ్జిల నుంచి లేదా రైల్వే ఓవర్ బ్రిడ్జిల నుంచి రైలు పైకప్పులను గమనిస్తే అవి కనిపిస్తాయి.
వాటిని అమర్చడం వెనుక ఓ ఆసక్తికర కారణం ఉంది.

ఈ మూతలు కేవలం డిజైన్ కోసం మాత్రమే కాదు. రైలులో ఉన్న ప్రయాణీకులు సౌకర్యంగా ఉండేందుకు ఇవి ఎంతోగానో ఉపయోగపడతాయి. వీటిని రూఫ్ వెంటిలేటర్లు అంటారు. ఇవి కోచ్ లోపల ఉన్న ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరిస్తాయి. కోచ్‌లలో ప్రయాణికుల సంఖ్య పెరిగినపుడు అధిక వేడి ఉత్పత్తి అవుతుంది. అలాంటి పరిస్థితుల్లో ప్రయాణికులు లోపల కూర్చోవడం కష్టమవుతుంది. ప్రయాణికులకు అలాంటి అసౌకర్యం ఎదురుకాకుండా ఉండేందుకు ఈ ఏర్పాటు చేశారు.

వేడి గాలి ఎప్పుడూ పైకి ప్రయాణిస్తుంది. అలా పైకి ప్రయాణించిన గాలి ఈ రూఫ్ వెంటిలేటర్ల గుండా బయటకు వెళ్లిపోతుంది. అందుకే కిటికీలు ఉన్నప్పటికీ వేడి గాలిని బయటకు పంపడంలో రూఫ్ వెంటిలేటర్లది కీలక పాత్ర. ఒకవేళ వర్షం పడినా నీరు లోపలికి వెళ్లకుండా ఉండేలా వీటిని రూపొందించారు. చూశారా, ఇలాంటివాటిని ఎప్పుడూ చూస్తూంటాం గానీ, పెద్దగా పట్టించుకోం.

వాట్సాప్ ద్వారా CIBIL స్కోర్ ఇలా తెలుసుకోండి!

ప్రస్తుత కాలంలో ఆర్థిక అవసరాలు చాలా వరకు పెరిగాయి. వ్యక్తిగత లోన్స్, గృహ, వాహన రుణాలను తీసుకునే వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది.
దీంతో పలువురు బ్యాంకులు, వివిధ ఫైనాన్స్ కంపెనీలను సంప్రదిస్తున్నారు. ఇవి CIBIL( క్రెడిట్ స్కోర్) స్కోర్ ఆధారంగా లోన్స్‌ను అందిస్తుంటాయి. క్రెడిట్ స్కోర్ ఎంత ఎక్కువగా ఉంటే అంత ఎక్కువగా లోన్స్ పొందడానికి వినియోగదారులకు అవకాశం ఉంటుంది. అదే స్కోర్ తక్కువగా ఉంటే గనుక లోన్ పొందడం కష్టంగా ఉంటుంది. CIBIL స్కోర్ అనేది వినియోగదారులు తీసుకున్న లోన్స్‌లను సకాలంలో చెల్లించడం ద్వారా పెరుగుతుంది. సమయానికి చెల్లింపులు చేయనట్లయితే CIBIL స్కోర్ తగ్గుతుంది. దీంతో సంస్థలు లోన్స్ ఇవ్వడానికి నిరాకరిస్తాయి.

క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (ఇండియా) లిమిటెడ్, క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ, వినియోగదారుల ఆర్థిక లావాదేవీల వివరాలు సేకరించి అన్ని సంస్థలకు అందిస్తుంది. దీని ఆధారంగా సంస్థలు అర్హత ఉన్న వడ్డీ రేటు ప్రకారం రుణ మొత్తాన్ని నిర్ణయిస్తాయి. మరి ఇంత ముఖ్యమైన CIBIL స్కోర్‌ను సులభంగా తెలుసుకోడానికి కొత్త సదుపాయం అందుబాటులోకి వచ్చింది.
WhatsApp ద్వారా CIBIL స్కోర్‌ను తెలుసుకునే ఫీచర్ ప్రస్తుతం అందుబాటులో ఉంది. WhatsAppలో క్రెడిట్ స్కోర్‌ని తెలుసుకోడానికి 9920035444 నంబర్‌ను సేవ్ చేసుకుని “హే” అని మెసేజ్ చేయాలి. తరువాత చాట్‌లో వచ్చిన విధంగా పేరు, ఫోన్ నంబర్, ఇమెయిల్ చిరునామాను సెండ్ చేయాలి. వెరిఫికేషన్ పూర్తయ్యాక క్రెడిట్ స్కోర్ వాట్సాప్‌లో చూపిస్తుంది. కాపీ కూడా ఈ-మెయిల్ ద్వారా వస్తుంది.

IRCTC తత్కాల్ టికెట్ త్వరగా బుక్ చేయాలా. వెంటనే ఇలా చేయండి!

అనుకోకుండా ఎక్కడికైనా ప్రయాణం పడినప్పుడు లేదా టికెట్ బుకింగ్ లిస్టులో ఉన్న సమయంలో కొన్నిసార్లు టికెట్ బుక్ ఎంతో ఇబ్బంది పడుతుంటాము ఈ క్రమంలోనే ఎంతో త్వరగా సౌకర్యవంతంగా మన టికెట్ రిజర్వేషన్ చేసుకొని ప్రయాణం చేయాలంటే తత్కాల్ ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది.
తత్కాల్లో టికెట్ బుకింగ్ ఓపెన్ కాగానే వెంటనే బుక్ అవుతాయి ఇలాంటి సమయంలో అంత సులభంగా టికెట్లు దొరకడం కష్టతరం అవుతుంది. అయితే తత్కాల్లో కూడా వెంటనే టికెట్ బుక్ చేసుకోవాలంటే ఈ చిన్న పనిచేస్తే చాలు.

ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ ద్వారా బుక్ చేసుకునే వ్యక్తులు ఆధార్‌ నంబర్‌తో సహా అన్ని వివరాలను సమర్పించాల్సి ఉంటుంది అయితే ఈ వివరాలన్నింటినీ నమోదు చేసే లోపు మొత్తం సీట్లు అన్ని నిండిపోతాయి. ఇలాంటి సమయంలో మీరు తత్కాల్ టికెట్ బుక్ చేసుకోలేరు. తత్కాల్ లో టికెట్ బుక్ చేసుకోవాలంటే భారతీయ రైల్వే ప్రయాణికుల సౌకర్యార్థం మాస్టర్ లిస్ట్ ఫీచర్ సౌకర్యాన్ని అందిస్తుంది. అంటే ముందుగానే కొన్ని వివరాలు సేవ్‌ చేసుకోవడం అన్నట్లు. ముందుగానే మన వివరాలన్నింటినీ సేవ్ చేసి పెట్టుకోనే సౌకర్యాన్ని ఈ మాస్టర్ లిస్ట్ కల్పిస్తుంది.
ఈ విధంగా మీ వివరాలన్నింటినీ సేవ్ చేసిన తర్వాత
తత్కాల్ బుకింగ్ చేసినప్పుడు మీరు ఈ వివరాలను పూరించవలసిన అవసరం లేదు. యాడ్ ప్యాసింజర్స్‌పై క్లిక్ చేయడం ద్వారా అన్ని వివరాలు జోడించబడతాయి.
ఈ ఫీచర్‌ను ఉపయోగించడానికి ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌కి వెళ్లి, మై అకౌంట్‌ Myprofileని ఎంచుకోండి. దీని తర్వాత జోడించు / సవరించు మాస్టర్ జాబితా ఆప్షన్‌ను ఎంచుకోండి. అనంతరం ప్రయాణీకుల వివరాలను పూరించి సమర్పించండి. దీని తర్వాత, బుకింగ్ చేస్తున్నప్పుడు, సేవ్‌ చేసిన ప్రయాణికుల జాబితా నుండి జోడించడం ద్వారా మీ బుకింగ్ సులభంగా చేయబడుతుంది.

Check Wheat Flour: మీరు తినే గోధుమ పిండి అసలైనదేనా? నకిలీనా? ఇలా చెక్ చేసుకోండి..

కాదేదీ కల్తీకనర్హం అన్నట్లుగా.. కేటుగాళ్లు ప్రతీది కల్తీ చేసేస్తున్నారు. పిల్లలు తాగే పాలు మొదలు ప్రతీది కల్తీమయం చేస్తేస్తున్నారు. ఇలాంటి కల్తీ పదార్థాల వల్ల ప్రజల ఆరోగ్యాలు క్షీణించి..
అనారోగ్యం బారిన పడుతున్నారు. ఫలితంగా ఆస్పత్రుల్లో వేలకొద్ది డబ్బులు వదులుకోవాల్సి వస్తుంది. కల్తీకి గురయ్యే పదార్థాలలో గోధుమ పిండి కూడా ఒకటి. చాలా మంది ఆరోగ్యం కోసం.. ఒక పూట అన్నం తినడం మానేసి.. గోధుమ పిండితో చేసిన చపాతీలను తింటుంటారు. అయితే, దీన్ని కూడా కల్తీ చేస్తున్నారు కేటుగాల్లు. అది గుర్తించలేక ప్రజలు చాలా మంది అలాగే తినేస్తున్నారు. అనారోగ్యాన్ని కొనితెచ్చుకుంటున్నారు. మరి ఈ గోధుమ పిండిలో కల్తీని ఎలా గుర్తించాలి? మీరు తినే గోధుమ పిండి నిజమైనదేనా? అందులో ఏమైనా కల్తీ జరిగిందా? ఎలా తెలుసుకునేది? అంటే ఇందుకు కూడా కొన్ని మార్గాలు ఉన్నాయి. అసలైన గోధుమ పిండి, నకిలీ గోధుమ పిండికి మధ్య తేడాని కనిపెట్టడం ఎలాగో ఇవాళ మనం తెలుసుకుందాం..

గోధుమ పిండి కల్తీని ఇలా గుర్తించండి..
⇒ నీటిలో కూడా గోధుమ పిండి కల్తీని కనిపెట్టేయొచ్చు. ఇందుకోసం ముందుగా ఒక గ్లాస్ వాటర్ తీసుకోవాలి. అందులో అర చెంచా పిండిని వేయాలి. ఆ తరువాత దానిని బాగా కలపాలి. 10 సెకన్ల పాటు వేచి ఉండాలి. కాసేపు ఆ పిండిని బాగా గమనించాలి. పిండి నీటిలో తేలుతూ కనిపిస్తే.. ఆ పిండి కల్తీ చేసిందని అర్థం చేసుకోవచ్చు. పిండి అడుగున చేరి ఉంటే.. అది స్వచ్ఛమైనదని అర్థం చేసుకోవచ్చు.

⇒ చపాతీని తయారు చేసేటప్పుడు కూడా గోధుమ పిండి స్వచ్ఛతను చెక్ చేయొచ్చు. సాధారణంగా గోధుమ పిండిని కలపడానికి తక్కువ నీరు అవసరం పడుతుంది. అలాగే అది చాలా మెత్తగా ఉంటుంది. స్వచ్ఛమైన పండితో చేసిన రోటీలు ఈజీగా సాగుతాయి. ఇలాంటి లక్షణాలున్న పిండిని స్వచ్ఛమైనదిగా భావించొచ్చు. అదే కల్తీ పిండి అయితే దానిని కలిపేటప్పుడు ఎక్కువ నీరు అవసరం పడుతుంది. పిండి గట్టిగా ఉంటుంది. రోటీలు కూడా చాలా చిన్నవిగా వస్తాయి.

Electricity Bill Saving Tips: కరెంటు బిల్లు చూసి మైండ్ బ్లాక్ అవుతోందా ?.. ఇక చింతించకండి.. మీ ఇంట్లో దీనిని వాడితే చాలు…

ప్రస్తుతం పెరుగుతున్న కరెంటు బిల్లుల వల్ల అందరూ ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్యను నివారించడానికి, చాలా మంది సోలార్ ప్లేట్లను పెట్టించుకునేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు.
అయితే ఖరీదైన సోలార్ ప్లేట్ల కారణంగా.. ప్రస్తుతానికి ప్రతి ఒక్కరూ మరో ఆలోచన చేస్తున్నారు. మీరు కూడా అలాంటి సమస్యను ఎదుర్కొంటున్నట్లయితే చింతించకండి. కేవలం రూ. 500లతో లభించే ఈ పరికరం గురించి ఇవాళ మనం చూద్దాం. దీన్ని ఉపయోగించి మీ విద్యుత్ బిల్లును సగానికి తగ్గించుకోవచ్చు. ఆ పరికరం (విద్యుత్ సేవింగ్ పరికరం) ఏంటో తెలుసుకుందాం.

500 కంటే తక్కువ ధరకే పరికరం అందుబాటులో ఉంది

ఈ మంత్రముగ్ధులను చేసే పరికరం పేరు వెల్‌బర్గ్ పవర్ సేవర్ అని విద్యుత్ నిపుణులు చెబుతున్నారు. ఈ పరికరం ధర రూ. 500ల కంటే తక్కువ. ఈ పరికరాన్ని అమెజాన్ నుంచి కొనుగోలు చేయవచ్చు. ఈ రోజుల్లో కంపెనీ తన వినియోగదారులకు 10 రోజుల రిటర్న్ పాలసీని కూడా ఇస్తోంది. అంటే మీకు ఈ పరికరం ఉపయోగకరంగా లేకుంటే.. మీరు దానిని 10 రోజులలోపు వాపసు చేయవచ్చు.

ఇంట్లో లేదా ఆఫీసులో కూడా ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు

కంపెనీ ప్రకారం, ఈ చిన్న పరికరం (విద్యుత్ సేవింగ్ పరికరం) ఇంట్లో, కార్యాలయంలో ఎక్కడైనా అమర్చవచ్చు. ఇది డ్యూయల్ బెనిఫిట్ డివైజ్ అని కంపెనీ పేర్కొంది. ఈ పరికరాన్ని ఇన్‌స్టాల్ చేయడం ద్వారా, వోల్టేజ్ హెచ్చుతగ్గుల నుంచి రక్షించడమే కాకుండా, ఇది చాలా వరకు విద్యుత్ బిల్లును తగ్గిస్తుంది. ఎలక్ట్రికల్ ఉపకరణాలు ఎక్కువ కాలం పనిచేయడంలో కూడా ఈ డివైజ్ దోహదపడుతుందని కంపెనీ చెబుతోంది.

50 శాతం వరకు విద్యుత్ ఆదా అవుతుంది
కంపెనీ ప్రకారం, వెల్‌బర్గ్ పవర్ సేవర్ పరికరాన్ని అమర్చడం చాలా సులభం. మీరు దానిని మీ విద్యుత్ మీటర్ దగ్గర అమర్చవచ్చు. దీన్ని ఇన్స్టాల్ చేయడానికి ఇంటిని తిరిగి వైరింగ్ చేయవలసిన అవసరం లేదు. మీరు దానిని మీటర్ సమీపంలోని ఏదైనా సాకెట్‌లో సులభంగా అమర్చవచ్చు. ఈ పరికరాన్ని అమర్చిన తర్వాత, ఇంటి విద్యుత్ బిల్లు దాదాపు 40-50 శాతం తగ్గుతుందని పేర్కొన్నారు.

వాస్తు: సంధ్యవేళ ఈ తప్పులు చేస్తున్నారా..? అయితే మీ ఇంటి నుండి లక్ష్మి దేవి వెళ్ళిపోతుంది..!

చాలా మంది వాస్తు ప్రకారం నడుచుకుంటూ ఉంటారు. నిజానికి వాస్తు ని ఫాలో అవ్వడం వలన మనం ఎన్నో సమస్యలకు దూరంగా ఉండొచ్చు. పైగా వాస్తు శాస్త్రం ప్రకారం నడుచుకుంటే నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ కలుగుతుంది.
చాలా మంది జీవితంలో ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి అయితే మీరు కనుక ఇబ్బందులు లేకుండా ఉండాలంటే వీటిని కచ్చితంగా పాటించాలి. ముఖ్యంగా సంధ్య వేళలో ఇలాంటి తప్పులు చేయకూడదు. సంధ్యా సమయంలో ఎప్పుడు కూడా ఈ తప్పులు చేయకుండా చూసుకోండి ఇలాంటి తప్పులు చేయడం వలన లక్ష్మీదేవి మీ ఇంటి నుండి దూరంగా వెళ్ళిపోతుంది.

సంధ్య వేళలో కుటుంబ సభ్యులు ఎప్పుడూ కూడా గొడవలు పడకూడదు. కుటుంబ సభ్యులు సంధ్య వేళలో గొడవలు పడితే సమస్యలు వస్తాయి. పైగా లక్ష్మీదేవి కూడా బాధపడుతుంది మీ ఇంటి నుండి వెళ్ళిపోతుంది.
సంధ్య వేళలో ఎవరికైనా ఏదైనా సహాయం కావాలని వచ్చి అడిగితే లేదనుకుంటా చేయడం మంచిది. కాళీ చేతులతో ఎవరిని పంపకండి.
అలానే సంధ్య వేళలో తలుపులు క్లోజ్ చేసి ఉంచడం మంచిది కాదు. ఈ సమయంలో తలుపుల్ని తీసి ఉంచితే లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉంటుంది. కాబట్టి ముఖద్వారాన్ని ఎప్పుడూ కూడా సంధ్య వేళలో మూసేయకండి.
సంధ్య వేళలో ఎప్పుడూ కూడా తులసి ఆకులను త్రుంచద్దు. ఇలా చేస్తే కూడా లక్ష్మీదేవికి కోపం వస్తుంది.
అలానే ఎవరైనా సంధ్య వేళలో అప్పు అడిగితే అసలు ఇవ్వకండి.

Refund Wrong UPI Transaction : మీరు పొరపాటున మరో UPI IDకి డబ్బులను పంపారా? ఆందోళన అక్కర్లేదు.. ఇలా ఈజీగా రీఫండ్ చేసుకోవచ్చు.. ఇదిగో ప్రాసెస్..!

Refund Wrong UPI Transaction : మీరు పొరపాటున యూపీఐ ద్వారా మరొకరికి పేమెంట్ చేశారా? అయితే ఆందోళన అక్కర్లేదు. మీరు పంపిన నగదు తిరిగి సులభంగా పొందవచ్చు.
యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) భారతీయ డిజిటల్ పేమెంట్ సిస్టమ్ అనేక మార్పులు చేసింది. యూపీఐ యూజర్లు తమ స్మార్ట్‌ఫోన్లలో ఎప్పుడైనా నేరుగా బ్యాంకు అకౌంట్లకు డబ్బును బదిలీ చేసుకునే వీలుంది. అయితే UPI సిస్టమ్ సురక్షితంగా ఉన్నప్పటికీ, డిజిటల్ గేట్‌వే తరచుగా డబ్బును డెబిట్ చేసిన తర్వాత లావాదేవీలు నిలిచిపోవడం జరుగుతుంటాయి. ఫలితంగా కొన్నిసార్లు UPI మోసానికి గురయ్యే అవకాశం ఉంటుంది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) మొబైల్ నంబర్ లేదా QR Code ఉపయోగించి బ్యాంక్ అకౌంట్ల మధ్య నగదు బదిలీని అనుమతిస్తున్న సంగతి తెలిసిందే.

కొన్నిసార్లు తెలియకుండానే నగదు పంపాల్సిన అకౌంట్ బదులుగా మరో యూపీఐ అకౌంట్లోకి పంపడం జరుగుతుంది. వినియోగదారులు BHIM యాప్ లేదా GPay, PhonePe వంటి మరిన్ని ఇతర UPI సర్వీస్ ప్రొవైడర్ల ద్వారా UPI పేమెంట్లు చేస్తుంటారు. అయినప్పటికీ, అన్ని భద్రతా ఫీచర్లు, సూచనలు ఉన్నప్పటికీ, యూజర్లు తరచుగా రిసీవర్ ఫోన్ నంబర్ లేదా QR కోడ్ కోసం రెండుసార్లు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. పొరపాటుగా వేరొకరి బ్యాంక్ అకౌంటుకు డబ్బు పంపుకోవచ్చు. UPI లావాదేవీలు ప్రాసెస్ చేసిన తర్వాత వాటిని తిరిగి పొందడం కష్టమే. కానీ, దీనికి పరిష్కారం కూడా ఉంది. UPI ద్వారా అనాలోచిత లావాదేవీకి సంబంధించి అనేక పద్ధతులు అందుబాటులో ఉన్నాయి.

UPI యాప్ సపోర్ట్‌ని సంప్రదించండి :

RBI (రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) మార్గదర్శకాల ప్రకారం.. ఒక యూజర్ ముందుగా పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్‌తో ఉద్దేశపూర్వక లావాదేవీల సమస్యను నివేదించాలి. మీరు డబ్బును బదిలీ చేసిన GPay, PhonePe, Paytm లేదా UPI యాప్ కస్టమర్ కేర్ సపోర్ట్‌లో ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. సర్వీస్ ప్రొవైడర్లు కస్టమర్లకు సపోర్టును అందిస్తోంది. మీరు మీ సమస్యను ఫ్లాగ్ చేయవచ్చు. లేదంటే నగదు వాపసు కోసం రిక్వెస్ట్ చేయవచ్చు.

Read Also :UPI Payments : యూపీఐ పేమెంట్స్ చేస్తున్నారా? ఈ 5 విషయాలు తప్పక గుర్తుపెట్టుకోండి..!

* NPCI పోర్టల్‌లో ఫిర్యాదు చేయండి
* ఆ తర్వాత UPI యాప్ కస్టమర్ సర్వీస్ Help లేకుంటే.. మీరు NPCI పోర్టల్‌లో కూడా ఫిర్యాదు చేయవచ్చు.
* ఇప్పుడు NPCI అధికారిక వెబ్‌సైట్ npci.org.in కి వెళ్లండి
* ఇప్పుడు ‘What we do’ అనే ట్యాబ్‌పై Click చేయండి
* ఆపై UPIపై Tap చేయండి.
* Next బటన్‌పై Tap చేయండి.
* Dispute Redressal Mechanism ఎంచుకోండి
* ఫిర్యాదు సెక్షన్ కింద.. UPI లావాదేవీ ID, వర్చువల్ పేమెంట్ అడ్రస్, బదిలీ చేసిన మొత్తం, లావాదేవీ తేదీ, ఈ-మెయిల్ ID మొబైల్ నంబర్‌తో సహా మీ అన్ని లావాదేవీ వివరాలను ఇవ్వండి.
* ఫిర్యాదుకి కారణం ‘Incorrectly transferred to another account’ ఎంచుకోండి.
* మీ ఫిర్యాదును Submit చేయండి.
* బ్యాంకును సంప్రదించండి
* ఫిర్యాదు ఇప్పటికీ పరిష్కరించకపోతే.. మీరు PSP యాప్/ TPAP యాప్‌లో పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్ (PSP) బ్యాంక్ తర్వాత బ్యాంక్ (ఎండ్-యూజర్ కస్టమర్ అకౌంట్‌ను నిర్వహించే చోట)తో మీ ఫిర్యాదును పెంచవచ్చు.

Refund Wrong UPI Transaction _ Sent money to wrong UPI ID_ what you should do to get back the money

బ్యాంకింగ్ Ombudsman సంప్రదించండి :

పైన పేర్కొన్న అన్ని ప్రక్రియలను అనుసరించిన తర్వాత కూడా ఫిర్యాదును పరిష్కరించకపోతే.. 30 రోజుల తర్వాత మీ బ్యాంకింగ్ అంబుడ్స్‌మన్/ లేదా డిజిటల్ ఫిర్యాదుల కోసం అంబుడ్స్‌మన్‌ను సంప్రదించవచ్చు. RBI ప్రకారం.. ఒక సాధారణ కాగితంపై రాసి పోస్ట్/ఫ్యాక్స్/హ్యాండ్ డెలివరీ ద్వారా అంబుడ్స్‌మన్ సంబంధిత కార్యాలయానికి పంపడం ద్వారా అంబుడ్స్‌మన్‌కి ఫిర్యాదు చేయవచ్చు.

మీరు డిజిటల్ లావాదేవీల కోసం అంబుడ్స్‌మన్‌కి ఈ-మెయిల్ ద్వారా ఫిర్యాదును కూడా పంపవచ్చు. మీరు ఫిర్యాదు చేసిన సర్వీస్ ప్రొవైడర్ బ్రాంచ్ లేదా ఆఫీస్‌కు ఫిర్యాదును పంపాలి. మీరు RBI వెబ్‌సైట్‌లో స్కీమ్‌తో పాటు ఫిర్యాదు ఫారమ్‌ను కూడా కనుగొనవచ్చు. ఈ ఫార్మాట్‌ని ఉపయోగించడం తప్పనిసరి కాదు.

డిజిటల్ లావాదేవీలకు అంబుడ్స్‌మెన్ ఎవరు? :

కస్టమర్ ఫిర్యాదులను పరిష్కరించే డిజిటల్ లావాదేవీల కోసం RBI సీనియర్ అధికారిని అంబుడ్స్‌మెన్‌గా నియమించింది. స్కీమ్‌లోని క్లాజ్ 8 కింద పేర్కొన్న ఫిర్యాదు ఆధారంగా నిర్దిష్ట సర్వీస్‌లలో లోపాన్ని సిస్టమ్ పార్టిసిపెంట్‌లపై ఫిర్యాదును అధికారి పరిశీలిస్తారు.

Business Ideas: ప్రతి నెలా జీతం సరిపోవడం లేదా, ఓ రెండు గంటలు కష్టపడి చూడండి, నెలకు లక్షల్లో ఆదాయం..

ప్రస్తుత కాలంలో పెరుగుతున్న ధరల దృష్ట్యా ఒక ఇంటిని నడపాలంటే మీకు వస్తున్న జీతం సరిపోదు. అదనపు ఆదాయం కోసం తప్పనిసరిగా పని చేయాల్సిన పరిస్థితి నెలకొంది.
అదనపు ఆదాయం కోసం ఏం చేయాలా అని ఆలోచిస్తున్నారా. అయితే అదనపు ఆదాయం కోసం చేయాల్సిన చిన్న చిన్న బిజినెస్ ఐడియాలు గురించి ప్రస్తుతం తెలుసుకుందాం.

మొబైల్ బిర్యానీ సెంటర్: ప్రస్తుత కాలంలో పెద్దపెద్ద రెస్టారెంట్ల కన్నా ఫుడ్ ట్రక్స్ వద్ద తినేందుకు జనం ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. దీన్నే మీరు మీ అదనపు ఆదాయం కోసం వ్యాపార అవకాశంగా మార్చుకోవచ్చు. సాయంకాలం పూట వేడి వేడి రుచికరమైన బిరియాని అందుబాటులో ఉంచితే, దాన్ని తినేందుకు ఎంతో మంది కస్టమర్లు ఎదురు చూడటం సహజమే. అయితే మీరు ఫుల్ టైం కాకుండా పార్ట్ టైం కోసం అయితే 30 నుంచి 50 ప్లేట్ల వరకూ సరిపోయేలా దమ్ బిర్యాని తయారుచేసుకుని, ఫుడ్ ట్రక్ ద్వారా విక్రయిస్తే, కొద్ది గంటల్లో మీకు కావలసిన ఆదాయం సమకూరుతుంది.

మిల్క్ డోర్ డెలివరీ : ఉదయం పూట మిల్క్ ప్యాకెట్లను హోం డెలివరీ చేయడం ద్వారా, కూడా అదనపు ఆదాయం సంపాదించే వీలుంది. కేవలం ఉదయం పూట కొద్ది గంటలు కష్టపడితే చాలు. మీకు అదనపు ఆదాయం లభిస్తుంది.

డేటా ఎంట్రీ జాబ్స్: ఆన్ లైన్ లో అనేక పార్ట్ టైం డేటా ఎంట్రీ జాబ్స్ అందుబాటులో ఉన్నాయి. Fivver లాంటి వెబ్ సైట్స్ పార్ట్ టైం జాబ్స్ అందిస్తున్నాయి. మీరు కూడా పార్ట్ టైం డేటా ఎంట్రీ జాబ్స్ కోసం ఎదురుచూస్తున్నట్లు అయితే. ఆన్ లైన్ ద్వారా వెతకడం మంచిది. అనేక అంతర్జాతీయ సంస్థలు డేటా ఎంట్రీ కోసం ఎదురు చూస్తున్నాయి. డాటా ఎంట్రీ ద్వారా కూడా చక్కటి ఆదాయం సంపాదించుకోవచ్చు.

యూట్యూబర్: యూట్యూబ్ ద్వారా కూడా మీరు డబ్బు సంపాదించుకోవచ్చు. కుకింగ్ వీడియోస్, ఆర్ట్ క్రాఫ్ట్ వీడియోస్ కు మంచి డిమాండ్ ఉంది. అలాగే ఒకవేళ మీరు టీచర్ అయితే, ఆన్లైన్ క్లాసులకు కూడా చక్కటి డిమాండ్ ఉంది. యూట్యూబ్ వీడియోలు మానిటైజేషన్ అవడం ద్వారా డబ్బులు సంపాదించుకోవచ్చు.

యోగా క్లాస్ టీచర్: ప్రస్తుతం సమాజంలో ఆరోగ్యం పట్ల అవగాహన పెరిగింది. ఈ నేపథ్యంలో యోగా క్లాసుల ద్వారా ఆదాయం సంపాదించుకునే వీలుంది. అయితే యోగా క్లాస్ టీచర్ గా మారాలంటే మీ వద్ద సర్టిఫికేట్ వుండాలి. యోగ విజ్ఞాన సంస్థలు, యోగా ట్రైనింగ్ సర్టిఫికెట్లను జారీ చేస్తున్నాయి. మీరు వారి పరీక్షల్లో ఉత్తీర్ణులై యోగ ట్రైనింగ్ సర్టిఫికెట్లను పొందవచ్చు. తద్వారా మీరు యోగా క్లాస్ టీచర్ గా మారవచ్చు.

పిండి వంటలు చేయడం ద్వారా అదనపు ఆదాయం పొందే అవకాశం ఉంది. పండగ సీజన్లో పిండివంటలను తయారుచేసి విక్రయించడం ద్వారా, చక్కటి ఆదాయం పొందే వీలుంది. తద్వారా కూడా మీరు ఖాళీ సమయాల్లో డబ్బు సంపాదించుకోవచ్చు.

Do you know what causes baldness? బట్టతల ఎందుకొస్తుందో తెలుసా ?

ఒక మనిషి అందంగా వుండాలంటే ఒడ్డూ, పొడుగూ వుండాలి. మెరిసిపోయే మేనిఛాయ వుండాలి. చిరునవ్వుతో వెలిగిపోయే వదనం వుండాలి. తీరైన తెల్లని పలు వరస వుండాలి. వీటన్నింటితోపాటు నల్లని నిగనిగలాడే ఒత్తైన జుట్టు వుండాలి. కానీ, అనేకమంది స్త్రీ, పురుషులు బాధపడే, ఆందోళన చెందే సమస్య జుట్టు రాలిపోవడం, బట్టతల రావడం. బట్టతల వచ్చినవారిలో ఎంతోమంది మానసికంగా ఎంతగా కృంగిపోతారో మాటల్లో చెప్పలేం. మనుషులను మానసికంగా కృంగిపోయేలా చేసే బట్టతల ఎందుకొస్తుందీ అన్నదాని వెనక సవాలక్ష కారణాలున్నాయి. అవేంటో తెలుసుకుందాం…!!

నిజానికి మగవారికి బట్టతల రావడానికి భూమ్యాకర్షణ శక్తి కారణమయ్యే అవకాశం వుందనీ, ఇంతేగాక టెస్టోస్టిరాన్ లో మార్పులు కూడా కారణమవుతాయని అమెరికా పరిశోధకులు చేసిన అధ్యయనంలో వెల్లడైంది.
టెస్టోస్టిరాన్ లో మార్పులవల్ల తలపై కొన్ని భాగాల్లో జుట్టుఊడిపోతుందనీ, హార్మోన్ లో ఈ మార్పును డీహైడ్రోటెస్టోస్టిరాన్ అంటారనీ నిపుణులు వెల్లడించారు. డి.టి.హెచ్.టి. వల్ల తలపై వుండే చర్మంలో కొవ్వు మోతాదు తగ్గి తద్వారా ఒత్తిడిని తట్టుకోలేక జుట్టు వూడిపోతుందన్నది పరిశోధనలో తేలిన సత్యం.

అయితే, తలపై గాక, శరీరంలోని ఇతర భాగాలపై వుండే వెంట్రుకల విషయంలో మాత్రం డి.టి.హెచ్.టి. భిన్నంగా ప్రభావం చూపుతుందిట. దీనికి తోడు ఇతర పురుష హార్మోన్ల వల్ల అక్కడి వెంట్రుకల కింద చర్మం మందంగా తయారవుతుందని అంటున్నారు. అయితే, వయసు పెరిగే కొద్దీ చర్మం, దాని కింది కొవ్వు తగ్గి పోవడంతో వెంట్రుకలు వూడిపోతాయి. దీనికి పురుషుల్లో టెస్టోస్టిరాన్ కీలక పాత్ర పోషిస్తుందంటున్నారు.

అదే మహిళల విషయంలో మాత్రం ఇలా వెంట్రుకలు వూడిపోకుండా ఈస్ట్రోజన్ హార్మోన్ నివారిస్తుందని, కనీసం మెనోపాజ్ వరకైనా ఈ పరిస్థితి వుంటుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. జుట్టు రాలుతున్నట్టు మొదట్లో గమనిస్తే ఆహారంలో మార్పులు చేసుకొని అదుపు చేయొచ్చు. ముఖ్యంగా పోషక పదార్థాలు ఎక్కువగా వుండే ఆహారాలను తీసుకుంటే జుట్టు రాలే సమస్యను చాలా సులభంగా అరికట్టవచ్చు. అయితే, బట్టతల అనగానే చాలామంది జుట్టు వూడిపోవడమనే అనుకుంటారు గానీ దీంట్లోనూ రకరకాలున్నాయి. అవేంటో ఒకసారి చూద్దాం.

మగవారికి వచ్చే బట్టతల వంశపారంపర్యంగా వస్తుంది. ఇది మచ్చతో లేదా వెంట్రుకలతో తగ్గడం కనిపిస్తుంది. ఇదే ఆడవారిలో బహు అరుదుగా కనిపిస్తుంది. ఇది వ్యక్తి జన్యు అలంకరణకు సంబంధించిన విషయం. ఇక అలోపేసియా అరేటా అనే బట్టతల మచ్చలకు దారితీసి నెత్తిమీద జుట్టు మొత్తం పోతే ఇది అలోపేసియా టోటిలిస్ గా సైతం మారుతుంది. గాయం, కాలిన గాయాలు, రేడియేషన్ లేదా వ్యాధుల వల్ల అంటే చర్మ వ్యాధులు వంటి వాటి వల్ల బట్టతల మచ్చలు అభివృద్ధి చెందితే, ఈ పరిస్థితిని మచ్చల అలోపేసియా అంటారు.

టాక్సిక్ అలోపేసియా అనేది సాధారణంగా తాత్కాలికమైనది. తీవ్రమైన అనారోగ్యాలు, అధిక జ్వరాలు లేదా కొన్ని మందుల వల్ల వస్తుంది. సో, బట్టతల అనేది ఒకే సమస్య కాదు. అందులో ఎన్నెన్నో విధాలు వుంటాయి. ఏది దేనివల్ల వస్తుందన్నదాన్ని తెలుసుకుని పరిష్కారానికి కృషి చేయాలి. అయితే, మా పాఠకులకు ఓ చిన్న సలహా. బట్టతల పోయేలా చేస్తామనీ, జుట్టు మామూలుగా వచ్చేలా చేస్తామనీ చెప్పి మోసగిస్తున్నవారి సంఖ్య ఎక్కువగానే వుంది. ఇది కేవలం మోసం మాత్రమే కాదు. అనారోగ్యాలకు సైతం దారితీసే పరిస్థితులు ఎదురు కావచ్చు. అందుకే, బట్టతల వచ్చింది గదాని బాధపడుతున్నవారు క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకుని జీవితాన్ని అధోగతిపాలు చేసుకోవద్దని మనవి.

LPG Gas Cylinder: గ్యాస్‌ సిలిండర్‌ డెలివరీ చేసే వ్యక్తి అదనపు డబ్బు అడుగుతున్నాడా? ఇలా ఫిర్యాదు చేయండి..

పెరుగుతున్న ద్రవ్యోల్బణం కారణంగా సామాన్య పౌరుల బడ్జెట్ కుప్పకూలుతోంది. రోజురోజుకు పెరుగుతున్న ధరలను చూసి చాలా మంది తమకు వీలైనంత వరకు పొదుపు చేసేందుకు ప్రయత్నిస్తుంటారు.
కానీ, గ్యాస్ సిలిండర్ల వంటి నిత్యావసర వస్తువులు ఎంత ఖరీదు అయినా కొనాల్సిందే. సామాన్యుల ఈ అవసరాన్ని కొందరు సిలిండర్ డెలివరీ వ్యక్తులు సద్వినియోగం చేసుకుంటున్నారు. ఈ సిలిండర్ డెలివరీ కస్టమర్ల నుంచి అదనపు డబ్బులు వసూలు చేస్తున్నట్లు కంపెనీకి ఫిర్యాదులు అందుతున్నాయి. ఒక కస్టమర్‌ నుంచి రూ.25-30 అదనంగా వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయి. అయితే ఈ విధంగా అదనపు డబ్బు అడగడం చట్టవిరుద్ధం. డెలివరీ చేసే వ్యక్తి అదనంగా డబ్బులు అడిగినట్లయితే ఫిర్యాదు చేయాలని గ్యాస్‌ కంపెనీలు సూచిస్తున్నాయి.

ముంబైలోగ్యాస్ సేవలను భారత్ గ్యాస్, ఇండెన్ గ్యాస్, హిందుస్థాన్ పెట్రోలియం (హెచ్‌పీ) అందిస్తున్నాయి. అందులో భారత్ గ్యాస్, హిందుస్థాన్ పెట్రోలియం కస్టమర్ల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఈ సిలిండర్లను ఇంటింటికీ పంపిణీ చేసే ఉద్యోగులకు నెలవారీ జీతం చెల్లిస్తారు. ఆ తర్వాత కూడా కస్టమర్ల నుంచి అదనంగా డబ్బులు డిమాండ్ చేస్తారని, ఎవరైనా అలాంటి డిమాండ్ చేస్తే టోల్ ఫ్రీ నంబర్‌లో ఫిర్యాదు చేయవచ్చని గ్యాస్ ఏజెన్సీ ఉద్యోగి తెలిపారు.

టోల్ ఫ్రీ నంబర్:

భారత్ గ్యాస్ – 1800224344

ఇండన్ గ్యాస్ – 18002333555

హిందుస్థాన్ పెట్రోలియం (హెచ్‌పీ) – 18002333555

ఫిర్యాదు చేసే కస్టమర్ ముందుగా ఈ టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేయాలి. వారి కస్టమర్ నంబర్, చిరునామా, అదనపు డబ్బును అభ్యర్థించిన ఉద్యోగి పేరును పేర్కొనాలి. గ్యాస్ కంపెనీ ఈ విషయాన్ని పరిశోధించి గ్యాస్ వినియోగదారులకు డబ్బు అదనంగా చెల్లించేలా చూస్తుంది. అలాగే సంబంధిత ఉద్యోగిపై తగు చర్యలు తీసుకుంటామని గ్యాస్‌ కంపెనీలు చెబుతున్నాయి. అయితే గ్యాస్‌ సిలిండర్‌ను డెలివరి చేసే వ్యక్తి పేరును తప్పనిసరిగ్గా తెలుసుకోవాలని సూచించారు.

Anushka Shetty 42 ఏళ్ల వయసులో పెళ్లికి రెడీ అయిన అనుష్క శెట్టి… ఆ స్టార్ క్రికెటర్​తో..!

టాలీవుడ్ స్వీటీ అనగానే అభిమానులకు, ప్రేక్షకులకు టక్కున గుర్తొచ్చే పేరు అనుష్క శెట్టి. ఎందుకంటే దాదాపు రెండు దశాబ్దాలుగా సినిమాలు చేస్తూ ఇక్కడి ప్రేక్షకులను అలరిస్తోంది.
‘బాహుబలి’ చిత్రంతో దేశవ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకుంది. అయితే 40 ఏళ్లు దాటిపోయినా ఇంకా పెళ్లి చేసుకోకుండా అలాగే ఉండిపోయింది. గతంలో పలు రూమర్స్ వచ్చినప్పటికీ అవి నిజం కాలేదు. అయితే ఇప్పుడు మరోసారి ఆమె పెళ్లి వార్తలు తెరపైకి వస్తున్నాయి. ఆమె ఓ క్రికెటర్​ను వివాహం చేసుకోబోతుందని అంతా మాట్లాడుకుంటున్నారు. దాని గురించే ఈ కథనం..
హీరోయిన్‌ అంటే రెండు సన్నివేశాలు, మూడు పాటలు మాత్రమే కాదు.. అవసరమైతే సినిమా మొత్తాన్ని ఒంటిచేత్తో నడిపించగలం అని నిరూపించిన కథానాయిక అనుష్క శెట్టి. మొదట్లో అందాలు బాగానే ఆరబోసినా, ఆ తర్వాత ‘జేజమ్మ’, ‘రుద్రమదేవి’, ‘దేవసేన’, ‘భాగమతి’ వంటి పాత్రలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అలా భారీ ఫ్యాన్​ ఫాలోయింగ్​ను పెంచుకున్నారు. ఇంకా చెప్పాలంటే లేడి ఓరియెంటెండ్​ సినిమా అనగానే.. అనుష్క పేరు గుర్తొచ్చేలా తన నటనతో ప్రేక్షకుల్ని మాయ చేశారు.

ఇక అనుష్క ప్రొఫెషనల్ లైఫ్​తో పాటు పర్సనల్​ లైఫ్ గురించి సోషల్​ మీడియాలో అప్పుడప్పుడు వార్తలు వస్తూనే ఉంటాయి.​ ముఖ్యంగా ఆమె పెళ్లి, రిలేషన్​ షిప్​ గురించి ఎన్నో వార్తలు వచ్చాయి. టాలీవుడ్‌కు చెందిన ఓ ప్రముఖ దర్శకుడి కుమారుడిని అనుష్క పెళ్లి చేసుకోనున్నారంటూ అప్పట్లో పలు వెబ్‌సైట్లలో వార్తలు వచ్చాయి. వీటిని కూడా అనుష్క అప్పట్లో ఖండించింది.

ప్రభాస్​తో పెళ్లి : అనుష్క హీరో ప్రభాస్ రిలేషన్‌లో ఉన్నారంటూ ఎప్పుడూ వార్తలు వైరల్ అవుతూనే ఉంటాయి. దీనిపై వీరిద్దరు స్పందించి తాము మంచి ఫ్రెండ్స్ అని కూడా చెప్పారు. అయినప్పటికీ ఆ పుకార్లు ఎప్పుడూ వస్తూనే ఉన్నాయి. ఇలా ఇన్నేళ్ల నుంచి అనుష్క పెళ్లిపై ఎన్నో వార్తలు వినిపిస్తూనే ఉన్నా ఒక్కసారి కూడా అవి నిజం కాలేదు.
పెళ్లిపై నమ్మకం ఉంది : అయితే ఈ మధ్య అనుష్కనే స్వయంగా తన పెళ్లి గురించి మాట్లాడింది. ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. “వివాహ వ్యవస్థపై నాకు నమ్మకముంది. పెళ్లికి నేను ఎప్పుడూ వ్యతిరేకం కాదు. సమయం వచ్చినప్పుడు కచ్చితంగా పెళ్లి చేసుకుంటాను” అని అనుష్క చెప్పుకొచ్చింది.

స్టార్ క్రికెటర్​తో : అయితే ఈ క్రమంలోనే తాజాగా ఇప్పుడు మళ్లీ అనుష్క పెళ్లి వార్తలు తెరపైకి వచ్చాయి. ఆమె ఓ క్రికెటర్‌తో పెళ్లికి సిద్ధమైనట్లు బయట కథనాలు వస్తున్నాయి. ఈ పెళ్లికి ఇరు కుటుంబసభ్యులు కూడా ఓకే చెప్పుకున్నారని ఆ కథనాల్లో రాసి ఉంది. మరి ఇందులో నిజమెంత అనేది తెలియదు కానీ ఈ వార్త మాత్రం ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.

TTD: మహిళా భక్తులకు మంగళ సూత్రాలు, లక్ష్మీ కాసులు – టీటీడీ నిర్ణయం..!!

Tirumala: తిరుమల తిరుపతి పాలక మండలి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. మొత్తం రూ.5141.74 కోట్లతో టీటీడీ వార్షిక బడ్జెట్‌కు ఆమోద ముద్ర పడింది. హిందూ ధార్మిక ప్రచారంలో భాగంగా బంగారు మంగళ సూత్రాలు, లక్ష్మీ కాసులు భక్తులకు విక్రయించాలని టీటీడీ నిర్ణయించింది.
టీటీడీ ఉద్యోగుల ఇళ్ల స్థలాల్లో గ్రావెల్ రోడ్డు నిర్మాణానికి ఆమోదం లభించింది. లడ్డు ట్రే మోసే కార్మికుల వేతనాలు రూ.15 వేలు అదనంగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది.

కీలక నిర్ణయాలు: టీటీడీ బోర్డు సమావేశంలో భక్తుల కోసం ముఖ్య నిర్ణయాలను తీసుకున్నారు. ధర్మ ప్రచారంలో భాగంగా బంగారు డాల్లర్లు తరహలో శ్రీవారి పాదాల చెంత ఉంచిన మంగళ సూత్రాలను భక్తులకు అందుబాటులోకి తీసుకు వస్తామని టిటిడి చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి వెల్లడించారు. మహిళలు కోసం మంగళసూత్రాలను, లక్ష్మీకాసులను తయారు చేయాలని నిర్ణయం తీసుకున్నామన్నారు..

లాభాపేక్ష లేకుండా మంగళసూత్రాలు, లక్ష్మీకాసులు విక్రయిస్తామని చెప్పారు.హైందవస్త్రీలకు ఈ మంగళసూత్రాలు, లక్ష్మీకాసులు ఒక అమూల్యమైన కానుక అని చెప్పారు. వేద పాఠశాలల్లో 51 మంది సంభావన అధ్యాపకుల వేతనాలు రూ.34 వేల నుంచి రూ.54 వేలకు పెంచాలని నిర్ణయించారు.

నూతన పోస్టుల మంజూరు: టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న 60 ఆలయాల్లో పని చేసేందుకు నూతనంగా పోస్టుల మంజూరుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని టీటీడీ పాలకమండలి నిర్ణయం తీసుకుంది. 3, 4, 5వ తేదీల్లో ధార్మిక సదస్సును నిర్వహిస్తున్నామని టీటీడీ చైర్మన్ తెలిపారు. 57 మంది మఠ, పీఠాధిపతులు హాజరువుతున్నారన్నారు.

వారి సలహాలు, సూచనలను స్వీకరించి అమలు చేస్తామని కరుణాకర్ రెడ్డి వెల్లడించారు. ఇక, ఈ సమావేశంలో స్విమ్స్ అస్పత్రిలో 300 పడకల నుంచి 1200 పడకల పెంపుకు రూ.148 కోట్లతో టెండర్ ఆమోదం తెలిపారు. రూ.2.5 కోట్లతో సప్తగిరి సత్రాల్లో అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. ఎస్ఎంసీతో పాటు పలు కాటేజీల ఆధునీకరణకు రూ.10 కోట్లు మంజూరు చేసారు.
ఆదాయంపై అంచనాలు: టీటీడీలో ఒరాకిల్ ఫ్యూషన్ క్లౌడ్ సాఫ్ట్‌వేర్ వినియోగానికి ఆమోదం తెలిపారు. అన్నమయ్య భవన్ ఆధునీకరణకు రూ.1.47 కోట్లు కేటాయించారు. 2024-25 లో హుండీ ఆదాయం రూ.1611 కోట్ల వస్తుందని అంచనాగా చూపించారు. బ్యాంకు డిపాజిట్ల వడ్డీల ద్వారా రూ.1068.51 కోట్ల అంచనా వేసారు.

లడ్డూ ప్రసాదం విక్రయాల ద్వారా రూ.550 కోట్లు వస్తాయని అంచనాల్లో చూపించారు. దర్శన టికెట్ల విక్రయాల ద్వారా రూ.468 కోట్ల అంచనాగా నిర్ణయించారు. గదుల వసతి సౌకర్యం ద్వారా రూ.142 కోట్లుగా పేర్కొన్నారు. కళ్యాణ కట్ట ద్వారా రూ.226.50 కోట్ల ఆదాయం వస్తుందని అధికారులు అంచనా వేశారు. రూ. 30కోట్లతో గోగర్భం- ఆకాశగంగ వరకు నాలుగు వరుసలు నిర్మాణాలు చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు.

Kota: “మమ్మీ, డాడీ, ఈ జేఈఈ నావల్ల కాదు”.. కోటాలో మరో ఆత్మహత్య..

Kota: రాజస్థాన్ కోటాలో ఆత్మహత్యల పరంపర కొనసాగుతూనే ఉంది. ఒత్తిడితో విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతూనే ఉన్నారు. అక్కడి ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఆత్మహత్యలకు అడ్డుకట్ట పడటం లేదు.
కోటాలో 18 ఏళ్ల జేఈఈ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. తల్లిదండ్రులను ఉద్దేశించి సూసైడ్ నోట్ రాసింది. పరీక్షకు రెండు రోజుల ముందు ఆమె ఆత్మహత్య చేసుకుంది. కోటాలో వారం రోజుల్లో ఇది రెండో ఆత్మహత్య.
చనిపోయిన విద్యార్థినిని 18 ఏళ్ల నిహారికగా గుర్తించారు. కోటలోని శిక్షానగరి ప్రాంతంలో తన ఇంటి గడిలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె పరీక్ష జనవరి 31న జరగాల్సి ఉంది. ఆమె రాసిన సూసైడ్ నోట్ కన్నీరు పెట్టిస్తోంది. ”తాను ఒక వరస్ట్ కూతురిని, ఇదే తనకు లాస్ట్ ఆప్షన్” అని రాసి ఆత్మహత్యకు పాల్పడింది. ”అమ్మా, నాన్న, ఈ జేఈఈ నావల్ల కాదు. అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నాను. నేనే కారణం. నేను మంచి కూతుగా ఉండలేకపోయాను. క్షమించండి అమ్మా నాన్న. ఇదే చివరి ఆప్షన్” అంటూ సూసైడ్ నోట్‌లో పేర్కొంది.

అంతకుముందు జనవరి 23న కోటాలో ప్రైవేట్ కోచింగ్ ద్వారా నీట్‌కు సిద్ధమవుతున్న ఉత్తరప్రదేశ్‌కు చెందిన విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మొరాదాబాద్‌కు చెందిన మహ్మద్ జైద్ తన గదిలో ఉరివేసుకుని కనిపించాడు. సూసైడ్ నోట్ దొరకలేదు. ఇంజినీరింగ్ మరియు మెడికల్ ప్రవేశ పరీక్షల కోసం కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌లకు పేరుగాంచిన కోటాలో 2023లో 29 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు.

BREAKING: ఐఆర్ఆర్ కేసులో చంద్రబాబుకు బిగ్ రిలీఫ్

ఐఆర్ఆర్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు సుప్రీంకోర్టులో భారీ ఊరట దక్కింది. ఈ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ రద్దు కోరుతూ ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసి పుచ్చింది.
చంద్రబాబు ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్‌పై సుప్రీంకోర్టులో ఇవాళ విచారణ జరగగా.. బాబు ముందస్తు బెయిల్ రద్దు చేయాలన్న ప్రభుత్వ తరుఫు లాయర్ వాదనతో ధర్మాసనం ఏకీభవించలేదు. కేసు దర్యా్ప్తుపై ముందస్తు బెయిల్ ప్రభావం ఉండదని ఈ సందర్భంగా ధర్మాసనం పేర్కొంది.

కాగా, చంద్రబాబు ప్రభుత్వ హయంలో చేపట్టిన ఇన్నర్ రింగ్ రోడ్డు అలాట్మెంట్‌లో అవకతవకలు జరిగాయని ఏపీ సీఐడీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో అప్పటి సీఎం చంద్రబాబు పేరును సైతం నిందితుల జాబితాలో చేర్చింది. దీంతో చంద్రబాబు ఐఆర్ఆర్ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు బాబుకు ఐఆర్ఆర్ కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో చంద్రబాబుకు హైకోర్టు ముందస్తు బెయిల్ ఇవ్వడాన్ని ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. బాబు ముందస్తు బెయిల్ రద్దు చేయాలని పిటిషన్ దాఖలు చేసింది. బాబు బయట ఉంటే కేసు దర్యాప్తుపై ప్రభావం చూపిస్తోందని ఈ పిటిషన్‌లో పేర్కొన్నారు. కాగా, ఈ పిటిషన్‌పై ఇవాళ విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు.. చంద్రబాబు ముందస్తు బెయిల్ రద్దు చేయాలని దాఖలైన పిటిషన్‌ను కొట్టేసింది. దీంతో ఐఆర్ఆర్ కేసులో ఏపీ ప్రభుత్వాన్ని ఎదురు దెబ్బ తగిలినట్లైంది.

BREAKING : హీరో వెంకటేష్‌పై క్రిమినల్ కేసు కి నాంపల్లి కోర్ట్ ఆదేశం

Nampally Court Ordered to File a Case on Actor Venkatesh: టాలీవుడ్ స్టార్ హీరో దగ్గుబాటి వెంకటేశ్ (Daggubati Venkatesh) కు నాంపల్లి కోర్టు (Nampally Court) సోమవారం షాక్ ఇచ్చింది.
హైదరాబాద్ ఫిల్మ్ నగర్ డెక్కన్ హోటల్ కూల్చివేత కేసుకు సంబంధించి వెంకటేశ్, ఆయన కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేయాలని ఆదేశించింది. కోర్టు ఆదేశాలను ధిక్కరించి ఫిలింనగర్ డెక్కన్ కిచెన్ హోటల్ ను కూల్చేశారని నందకుమార్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. రూ.కోట్ల విలువైన భవనాన్ని కూల్చేసి, ఫర్నీచర్ ఎత్తుకెళ్లారని ఆయన పేర్కొన్నారు. లీజు విషయంలో తనకు కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ అక్రమంగా కూల్చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ అధికారులు, పోలీసులతో కుమ్మక్కై వెంకటేశ్, సురేశ్ బాబు, రానా, అభిరామ్ హోటల్ ను కూల్చేయించారని చెప్పారు. 60 మంది ప్రైవేట్ బౌన్సర్లను పెట్టి హోటల్ ను ధ్వంసం చేశారని.. దీంతో రూ.20 కోట్ల నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోర్టును కోరారు. దీనిపై విచారించిన న్యాయస్థానం.. నటుడు దగ్గుబాటి వెంకటేశ్, రానా, అభిరామ్, సురేశ్ బాబులపై కేసు నమోదు చేయాలని ఆదేశాలిచ్చింది.

Jagan: నీ పరిస్థితేం బాలేదు.. నీది మాత్రం బాగుందా?.. జగన్‌ VS సొంత జిల్లా ఎమ్మెల్యే

నీది మాత్రం బాగుందా?.. జగన్‌ వర్సెస్‌ ‘సొంత’ జిల్లా ఎమ్మెల్యే
తాడేపల్లి ప్యాలెస్‌లో సీఎంకు షాక్‌

‘సర్వేలో వ్యతిరేకత’ అని చెప్పిన సీఎం

నేనేం మర్డర్లు చెయ్యలేదు: ఎమ్మెల్యే
(అమరావతి – ఆంధ్రజ్యోతి)

ఒకవైపు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి!

మరోవైపు… ఆయనకు సన్నిహితుడు, అపాయింట్‌మెంట్‌ లేకుండానే తాడేపల్లి ప్యాలెస్‌లోకి అడుగుపెట్టగల ఎమ్మెల్యే!

ఇద్దరి మధ్య ‘ఢీ అంటే ఢీ’! విశ్వసనీయ సమాచారం ప్రకారం… అభ్యర్థుల మార్పుచేర్పులపై కసరత్తు చేస్తున్న జగన్‌… కడప జిల్లాకు చెందిన ఆ శాసన సభ్యుడిని రెండు రోజుల క్రితం తాడేపల్లికి పిలిపించారు. ”నియోజకవర్గంలో నీ పరిస్థితి ఏమీ బాలేదు” అని ఆయన ముఖాన్నే చెప్పారు. అయితే… ఇతర ఎమ్మెల్యేల్లాగా ఆ ఎమ్మెల్యే మౌనముద్ర దాల్చలేదు.. అప్పటికప్పుడే జగన్‌కు కౌంటర్‌ ఇచ్చారు. ”రాష్ట్రంలో నీ పరిస్థితి మాత్రం బాగుందా?” అని సూటిగా ప్రశ్నించారు. ‘ఎవరి పరిస్థితి ఏమిటో ఓటర్లే తేలుస్తారులే’ అని వ్యాఖ్యానించారు. ‘సర్వేలో బాగా వ్యతిరేకత వచ్చిందని చెబుతున్నా’ అని సీఎం అనగానే, ‘నేనేం మర్డర్లు చెయ్యలా! చేయించినోడిని వెనకేసుకు రాలా!’ అంటూ ఆ ఎమ్మెల్యే ఘాటుగా స్పందించారు. దీంతో జగన్‌ ఒక్కసారిగా సహనం కోల్పోయి… ఆగ్రహంతో ఊగిపోయారు. ‘నేనేం చెబుతున్నా.. నువ్వేం మాట్లాడుతున్నావ్‌..’ అంటూ సీరియస్‌ అయ్యారు. అదే సమయంలో అక్కడే ఉన్న వైసీపీ ముఖ్యనేత వైవీ సుబ్బారెడ్డి ‘సమయస్ఫూర్తి’ ప్రదర్శించారు. వివాదం పెద్దది కాకుండా ఎమ్మెల్యే చేయి పట్టుకుని బయటికి తీసుకెళ్లారు. ఆ తర్వాత ఆ ఎమ్మెల్యే గట్టిగా తన వాదన వినిపించారు. ”పులివెందుల నియోజకవర్గంలో కార్యకర్తలందరూ సంతోషంగా ఉన్నారా? ఇడుపులపాయలో ప్రశ్నించింది తెలీదా? నేనెప్పుడూ నా నియోజకవర్గ కేడర్‌కు అందుబాటులో ఉంటా? నాపై ఎందుకు వ్యతిరేకత ఉంటుంది? అవినీతి నేనొక్కడినే చేశానా? మిగతా వాళ్లందరూ పత్తిత్తులా? రాష్ట్రంలో అవినీతి
కేంద్రీకృతమైందని దేశమంతా అంటున్నారు. నా సీటు ఎవడికిస్తాడో ఇచ్చుకోమను. ఎలా గెలుస్తాడో నేనూ చూస్తా!!’ అంటూ కారెక్కి వెళ్లిపోయారు.

ఏపీలో మళ్లీ కరెంటు ఛార్జీల పెంపు? కీలక నిర్ణయం దిశగా ఈఆర్సీ..

ఏపీలో ఎన్నికల వేళ మరోసారి కరెంటు ఛార్జీల పెంపు తప్పేలా లేదు. ఇప్పటికే సరఫరా, ఇతరత్రా నష్టాలను తగ్గించుకుని లాభాలు పెంచుకోవాల్సిన డిస్కంలు అందులో విఫలమై కరెంటు ఛార్జీల పెంపుపైనే ఆధారపడాల్సిన పరిస్ధితి ఏర్పడింది.
దీంతో మరోసారి కరెంటు ఛార్జీలు పెంచుకునేందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ)ని కోరాయి. ఈ నేపథ్యంలో ఇవాళ విశాఖలో నామమాత్రపు ప్రజాభిప్రాయసేకరణకు ఈఆర్సీ సిద్దమైంది.

రాష్ట్రంలో విద్యుత్ సంస్ధలు(డిస్కంలు) 2024-25 ఆర్ధిక సంవత్సరానికి రూ.251 కోట్ల మేర విద్యుత్ ఛార్జీలు పెంచుకునేందుకు అనుమతించాలని కోరుతూ విద్యుత్ నియంత్రణ మండలికి ప్రతిపాదనలు అందించాయి. వీటిపై ఈఆర్సీ ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టి తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. కానీ కొన్నేళ్లుగా ఈఆర్సీ ఇలా డిస్కంలు అందించిన ప్రతిపాదనలపై నామమాత్రపు ప్రజాభిప్రాయ సేకరణ జరిపినా అభ్యంతరాలతో సంబంధం లేకుండా దాదాపుగా వాటికి ఆమోద ముద్ర వేస్తూనే ఉంది. దీంతో ఈసారి కూడా రూ.251 కోట్ల మేర విద్యుత్ ఛార్జీల పెంపుకు ఆమోదం పడేలా కనిపిస్తోంది.

 

డిస్కంల ప్రతిపాదనలకు ఈఆర్సీ ఇవాళ విశాఖలో జరిపే ప్రజాభిప్రాయ సేకరణ తర్వాత ఆమోద ముద్ర వేస్తే వినియోగదారులపై రూ.251 కోట్ల మేర భారం పడటం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే డిస్కంలు కోరినట్లుగా అదనపు ఛార్జీలు, ఇతరత్రా ఛార్జీలను పెంచుకుంటూ పోవడం వల్ల కరెంటు బిల్లుల మోత పెరుగుతోందన్న విమర్శలు ఉన్నాయి. ఇలాంటి తరుణంలో మరోసారి డిస్కంల ప్రతిపాదనలకు ఈఆర్సీ ఆమోద ముద్ర వేయొద్దనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.

ఇవాళ్టి నుంచి నాలుగు రోజుల పాటు విశాఖ లోని ప్రాంతీయ కార్యాలయంలో ఈఆర్సీ ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టనుంది. వర్చువల్ విధానంలో సాగే ఈ ప్రజాభిప్రాయ సేకరణ తర్వాత డిస్కంల ప్రతిపాదనలపై ఈఆర్సీ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. డిస్కంల ప్రతిపాదనల్ని పూర్తిగా తోసిపుచ్చేందుకు కూడా ఈఆర్సీకి అధికారం ఉంటుంది. అలాగే మార్పు చేర్పులు చేసేందుకు, అవేవీ లేకుండానే పూర్తిగా ఆమోదించేందుకూ ఈఆర్సీకి అధికారం ఉండటంతో ఎన్నికల వేళ కరెంటు ఛార్జీల పెంపుపై తీసుకోబోయే నిర్ణయం కీలకంగా మారింది.

Gold Cleaning: బంగారు నగలు నల్లబడ్డాయా? ఇలా చేస్తే నగలు ఎప్పటికీ కొత్తగానే ఉంటాయి

Gold Cleaning tips in telugu: బంగారం అంటే ప్రతి ఒక్కరికి మోజు ఉంటుంది. ముఖ్యంగా ఆడవారు అయితే పండగ వచ్చినా పేరంటం వచ్చినా తప్పనిసరిగా బంగారు నగలను ధరిస్తారు.
నగలను పండుగలు, పెళ్లిళ్లు, శుభకార్యాల్లో ధరించాక మిగిలిన సమయంలో వాటిని బీరువాలోనే పెడుతుంటాం.

ఈ నగలు కొన్ని రోజులకు నల్లగా, మురికిగా మారుతూ ఉంటాయి. నల్లగా మారిన నగలు కొత్తవాటిలా మెరవాలంటే ఇప్పుడు చెప్పే చిట్కాలను ఫాలో అయితే సరిపోతుంది. నగలను మెరిపించటానికి టూత్‌పేస్ట్‌ను వాడవచ్చు. అయితే తెల్లని టూత్‌పేస్ట్‌ను వాడాలి. నీటిలో టూత్‌పేస్ట్‌ను కలిపి నగలను పది నిమిషాలు ఉంచి రుద్దితే సరిపోతుంది.

నీటిలో బేకింగ్ సోడా కలిపి నగలకు రాసి రుద్ది రెండు నిమిషాలు అలా వదిలేయాలి. ఆ తరువాత, వైట్ వెనిగర్ సహాయంతో, నగలపై పేస్ట్ ను శుభ్రం చేయాలి. ఆ తర్వాత నగలను శుభ్రమైన నీటితో ఒకసారి కడగాలి.
నగలు కొత్తవాటిలా మెరవటానికి డిష్ సోప్ ను కూడా ఉపయోగించవచ్చు. గోరువెచ్చని నీటిలో డిష్ సోప్ ని వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమంలో నగలను వేసి ఒక నిమిషం అయ్యాక బ్రష్ సాయంతో రుద్ది శుభ్రమైన నీటితో కడగాలి. ఆ తర్వాత మృదువైన కాటన్ గుడ్డతో నగలను శుభ్రం చేస్తే సరిపోతుంది.

నగలను శుభ్రం చేయటానికి నిమ్మరసంను కూడా ఉపయోగించవచ్చు. ఒక బౌల్ లో గోరువెచ్చని నీటిని పోసి అరచెక్క నిమ్మరసం వేసి బాగా కలిపి నగలను వేసి పావుగంట అలా వదిలేయాలి. ఆ తర్వాత నగలను మృదువైన బ్రష్‌తో స్క్రబ్ చేసి, శుభ్రమైన నీటితో శుభ్రం చేసి ఆరబెట్టాలి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు.

Mudra Loan: ముద్రా లోన్‌తో మీ బిజినెస్‌ కల సాకారం.. ష్యూరిటీ లేకుండా రూ.10లక్షల రుణం..

ఏ దేశానికైనా యువశక్తి చాలా అవసరం. యువతలోని శక్తి సామర్థ్యాలకు సరైన ప్రోత్సాహం తోడైతే వారు వృద్ధి చెందడంతో పాటు దేశ సమగ్రాభివృద్ధికి దోహద పడతారు.
నాణ్యమైన విద్య, నైపుణ్యాభివృద్ధికి తగిన శిక్షణ అందించగలిగితే యువకులు అద్భుతాలు సృష్టిస్తారు. ప్రతి ప్రభుత్వానికి ఈ విషయంలో స్పష్టమైన అవగాహన ఉంటుంది. అందుకే వారిని ప్రోత్సహించేందుకు పలు ఆకర్షణీయ పథకాలు ప్రవేశపెడుతుంటాయి. మన దేశంలో కేంద్ర ప్రభుత్వం యువశక్తిని ప్రోత్సహించడంతో పాటు యువ సాధికారత, స్వావలంబన లక్ష్యంగా ఓ ప్రత్యేకమైన పథకాన్ని అమలు చేస్తోంది. దాని పేరు ప్రధాన్ మంత్రి ముద్రా యోజన (పీఎంఎంవై). ఇది యువత-కేంద్రీకృత పథకం. ఇది చిన్న తరహా వ్యాపారాలను స్థాపించడానికి రూ. 10 లక్షల వరకు రుణాలను అందిస్తుంది. ఎటువంటి ష్యూరిటీ లేకుండా దీనిని అందిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ ముద్రాలోన్‌ ఎలా పొందాలి? అర్హతేమిటి? ఎంత మొత్తం లోన్‌గా ఇస్తారు? అవసరమైన పత్రాలు ఏంటి? వంటి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

పీఎంఎంవై ప్రధాన ఉద్దేశం..

కేంద్ర ప్రభుత్వం 2015లో ప్రారంభించిన పథకం యువతను వ్యాపారవేత్తలుగా మలిచేందుకు తోడ్పడుతోంది. అందుకు అవసరమైన నైపుణ్యాలను పెంపొందించేలా చేస్తోంది. నిరుద్యోగులు, సొంతంగా వ్యాపారం చేయాలనుకునే యువతకు అండగా ఉంటుంది. ఎవరైనా మంచి వ్యాపార ఆలోచన ఉండి.. దానిని ప్రారంభించేందుకు అవసరమైన నగదు లేకపోతే అటువంటి వారికి ఇది బాగా ఉపయుక్తంగా ఉంటుంది. ఈ పథకం కింద కార్పొరేట్, వ్యవసాయేతర ప్రయోజనాల కోసం రుణాలు అందిస్తారు. ఈ పథకం కింద ప్రభుత్వం రూ.10 లక్షల వరకు రుణం మంజూరు చేస్తుంది.

సెక్యూరిటీ లేకుండా..

సాధారణంగా మీరు హోమ్ లోన్, గోల్డ్ లోన్ లేదా ఆటో లోన్ మొదలైనవి తీసుకున్నప్పుడు, మీరు మీ ఆస్తిలో దేనినైనా సెక్యూరిటీగా బ్యాంకులో తనఖా పెట్టాలి, కానీ పీఎం ముద్రా లోన్ స్కీమ్ కొలేటరల్ ఫ్రీ. అంటే, ఈ పథకం ద్వారా, మీరు ఏదీ సెక్యూరిటీగా ఉంచాల్సిన అవసరం లేదు.

మూడు కేటగిరీలుగా..

ఈ ముద్రాలోన్ల కోసం మీరు ప్రాంతీయ గ్రామీణ బ్యాంకు, చిన్న ఫైనాన్స్ బ్యాంక్, నాన్-ఫైనాన్షియల్ కంపెనీ వంటి ఏదైనా ప్రభుత్వ/ప్రైవేట్ బ్యాంకుల్లో దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఎంత మొత్తం రుణం ఇవ్వాలనే దాని కోసం ఈ లోన్లను మూడు విభాగాలుగా విభజించారు.

శిశు రుణం: ఈ రకమైన రుణంలో, రూ. 50,000 వరకు ఆర్థిక సహాయం లభిస్తుంది.
కిషోర్ లోన్: ఈ పథకం కింద రూ. 5 లక్షల వరకు రుణం అందిస్తారు.
తరుణ్ లోన్: ఇందులో రూ. 10 లక్షల వరకు రుణం పొందొచ్చు.
ముద్రా లోన్‌ కి అర్హత..

సొంతంగా వ్యాపారం ప్రారంభించాలనుకునే ఎవరైనా ఈ పథకం కింద రుణం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే ఇప్పటికే మీరు వ్యాపారస్తులైతే దానిని మరింత విస్తరించడానికి కూడా రుణానికి దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే కొన్ని షరతులకు లోబడి వాటి మంజూరు ఉంటుంది.

రుణం కోసం దరఖాస్తు చేసుకునే వ్యక్తి తప్పనిసరిగా భారత పౌరుడై ఉండాలి.
దరఖాస్తు చేసే వ్యక్తికి బ్యాంక్ డిఫాల్ట్ చరిత్ర ఉండకూడదు.
ముద్రా లోన్ తీసుకోవాల్సిన ఏ వ్యాపారం అయినా కార్పొరేట్ సంస్థ కాకూడదు.
రుణం కోసం దరఖాస్తు చేసుకునే వ్యక్తి తప్పనిసరిగా బ్యాంకు ఖాతాను కలిగి ఉండాలి.
రుణం కోసం దరఖాస్తు చేసుకునే వ్యక్తి వయస్సు 18 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండాలి.
ముద్రా లోన్‌ ప్రయోజనాలు ఇవి..

ప్రధాన మంత్రి ముద్రా యోజన ద్వారా, మీరు మీ అవసరాన్ని బట్టి రూ. 50,000 నుండి రూ. 10 లక్షల వరకు రుణం తీసుకోవచ్చు. ఎటువంటి ప్రాసెసింగ్‌ ఫీజు ఉండదు. రుణం మొత్తం తిరిగి చెల్లించే వ్యవధి 12 నెలల నుండి 5 సంవత్సరాల వరకు ఉంటుంది. ఒకవేళ 5 సంవత్సరాలలో తిరిగి చెల్లించలేకపోతే, మీ కాల వ్యవధిని మరో 5 సంవత్సరాలు పొడిగించవచ్చు. మంజూరైన మొత్తం రుణంపై మీరు వడ్డీ చెల్లించాల్సిన అవసరం లేదు. ముద్రా కార్డ్ ద్వారా విత్‌డ్రా చేసి ఖర్చు చేసిన మొత్తానికి మాత్రమే వడ్డీ విధిస్తారు.

ముద్రా లోన్‌ కి దరఖాస్తు ఇలా..

ముద్రా యోజన అధికారిక వెబ్‌సైట్‌(mudra.org.in)కి వెళ్లండి.
శిశు, కిషోర్, తరుణ్ అనే మూడు రకాల రుణాలను చూపుతూ హోమ్ పేజీ ఓపెన్‌ అవుతుంది. దానిలో మీ అవసరాన్ని బట్టి ఎంచుకోండి.
ఆ తర్వాత దరఖాస్తు ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసి, దాని ప్రింట్ అవుట్ తీసుకోండి.
ఫారమ్‌తో పాటు, మీరు ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, శాశ్వత, వ్యాపార చిరునామా రుజువు, ఆదాయపు పన్ను రిటర్న్, స్వీయ పన్ను రిటర్న్ కాపీలు, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో మొదలైన కొన్ని పత్రాల ఫోటోకాపీలను జతచేయాలి.
ఈ దరఖాస్తు ఫారమ్‌ను మీ సమీపంలోని బ్యాంక్‌లో సమర్పించండి. అన్నీ సరిగ్గా ఉంటే బ్యాంక్ మీ దరఖాస్తును ధ్రువీకరిస్తుంది. ఒక నెలలోపు రుణం మంజూరు చేస్తారు.

Health

సినిమా