Thursday, November 14, 2024

Manabadi Nadu Nedu STMS Latest App Nadu Nedu Latest App

MANA BADI NADU NEDU STMS Android APP Latest Version Download Mana Badi – Nadu Nedu is to strengthen the infrastructure and transform the existing infrastructure of the schools in the mission mode in a phased manner over a period of three years, starting from 2019-20. Under Mana Badi – Nadu Nedu program, following 9 infrastructure components have been taken up. (I) Toilets with running water (ii) ) Drinking water supply (iii) Major and minor repairs (iv) Electrification with fans and tube lights (v) Furniture for students and staff (vi) Green chalk boards (vii) Painting to schools (viii) English labs and (ix) Compound walls.

MANA BADI NADU NEDU STMS Android APP Latest Version Download APK. Download MANA BADI NADU NEDU Latest Version Mobile APK APP. This STMS NADU NEDU APP is very useful for All the Head Masters of Nadu Nedu for Uploading the Bills. Use Always the Latest Updated Version of NADU-NEDU APP.

Download…. Mana Badi Nadu Nedu Latest App 

School Attendance App latest Updated version Download | Teachers Students Attendance latest updated App

SIMS-AP School Attendance APP latest Updated version Download | Teachers Students N Attendance latest updated APP

AP School Education Department has developed an Attendance APP based on Artificial Intelligence. This AI Based School Attendance app is named as SIMS AP. School Integrated Management System APP for All Schools in Andhra Pradesh. This SIMS AP New Students Attendance APP not only captures Teachers Attendance, But also capable of capturing Students attendance, Manage Leaves of Teachers, Teachers can Apply for Leaves using this SIMS School Attendance APP. Details of this APP and How to use this APP, Features of this Android School Attendance APP, How to Download / Install the Latest Official Version of SIMS AP AI Based Attendance APP is explained below.

Download….AP School Attendance APP 

IBPS calendar : క్లర్క్​, పీఓ పరీక్షల తేదీలను ప్రకటించిన ఐబీపీఎస్​- ఎగ్జామ్​ క్యాలెండర్​ ఇదే

IBPS calendar 2024 : 2024 ఏడాదిలో నిర్వహించే వివిధ పరీక్షలకు సంబంధించిన టెంటెటివ్​ (తాత్కాలిక) క్యాలెండర్​ని విడుదల చేసింది ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ బ్యాంకింగ్​ పర్సనల్​ సెలక్షన్​ (ఐబీపీఎస్​).

అభ్యర్థులు ibps.in వెబ్​సైట్​లోకి వెళ్లి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.

ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్లో (ఐబీపీఎస్ ఆర్ఆర్​బీ క్లర్క్, ఆర్ఆర్​బీ పీవో) ఆఫీస్ అసిస్టెంట్స్, ఆఫీసర్ స్కేల్-1 ప్రిలిమినరీ పరీక్షను 2024 ఆగస్టు 3, 5, 10, 17, 18 తేదీల్లో నిర్వహించనున్నారు.

ఆఫీసర్స్ స్కేల్ 2, 3లకు ఒకే పరీక్షతో పాటు, ఆఫీసర్స్ స్కేల్ 1 మెయిన్ పరీక్షను సెప్టెంబర్ 29న నిర్వహించనున్నారు. ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులకు అక్టోబర్ 6న మెయిన్ పరీక్ష జరగనుంది.

IBPS Clerk exam date :

ఐబీపీఎస్ పీవో ప్రిలిమ్స్ పరీక్షను అక్టోబర్ 19, 20 తేదీల్లో, మెయిన్ పరీక్షను నవంబర్ 30న నిర్వహించే అవకాశం ఉంది. ఐబీపీఎస్ ఎస్​వో ప్రిలిమ్స్ పరీక్ష.. సెప్టెంబర్ 9న, మెయిన్ పరీక్ష డిసెంబర్ 14న జరగనుంది.

ఐబీపీఎస్ క్లర్క్ ప్రిలిమ్స్ పరీక్షను ఆగస్టు 24, 25, 31 తేదీల్లో, మెయిన్ పరీక్షను అక్టోబర్ 13న నిర్వహించనున్నారు.

ఈ పరీక్షలకు సంబంధించిన పూర్తి నోటిఫికేషన్​ని రానున్న రోజుల్లో ibps.in వెబ్​సైట్​లో విడుదల చేయనున్నారు.

IBPS PO exam date latest news :

ఆన్​లైన్​ విధానంలో మాత్రమే రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఉంటుంది. ప్రిలిమినరీ, మెయిన్ పరీక్షలకు ఒకే రిజిస్ట్రేషన్ ఉంటుందని ఐబీపీఎస్​ తెలిపింది.

పరీక్షలకు దరఖాస్తు చేసుకోవడానికి అవసరమైన డాక్యుమెంట్లు ఇవి:

దరఖాస్తుదారుని ఫోటో ( .jpeg ఫైల్) – దరఖాస్తుదారుడి సంతకం (10 కేబీనుంచి 20 కేబీ)
దరఖాస్తుదారుని వేలిముద్ర ( .jpeg ఫైల్ లో- 20 కేబీ నుంచి 50 కేబీ మధ్యలో ఉండాలి)
చేతిరాత డిక్లరేషన్ స్కాన్ కాపీ (- .jpeg ఫైల్ లో 50 కేబీ నుంచి 100 కేబీ మధ్యలో ఉండాలి).
అయితే.. ఇది టెంటెటివ్​ క్యాలెండర్​ మాత్రమే. భవిష్యత్తులో ఏదైనా సమస్య తలెత్తితే, వీటిని మార్చే అవకాశం ఉందని గుర్తుపెట్టుకోవాలి.

సెంట్రల్ బ్యాంక్​లో జాబ్స్..

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 484 సఫాయి కర్మచారి కమ్ సబ్-స్టాఫ్ మరియు/లేదా సబ్-స్టాఫ్ పోస్టుల కోసం అప్లై చేయడానికి లాస్ట్ డేట్ జనవరి 9. అర్హత 8వ తరగతి పాస్ మాత్రమే. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారిక వెబ్‌సైట్‌ centralbankofindia.co.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ఉసిరితో ఇలా చేస్తే.. కళ్ళజోడు అవసరం లేదు..!!

ఈ మధ్యకాలంలో చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరికి కళ్ళజోడుచాలా కామన్ అయిపోయింది.దీనికి కారణం వారు పోషకాలు కలిగిన ఆహారం తీసుకోకపోవడం,జంక్ ఫుడ్ అలవాటు పడడం,టీవీ మొబైల్ వంటి బ్లూ స్క్రీన్ కలిగిన ఎక్కువగా చూడటం వల్ల వారి ఇంటి చూపు తగ్గిపోతూ ఉంది.కానీ ఇది ఇలాగే కొనసాగితే మాత్రం పూర్తిగా కంటి చూపుని పోగొట్టుకునే అవకాశం ఎక్కువగా ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తూ ఉన్నారు.ఇలా కంటి చూపు మందగించిన వారికి సైతం తిరిగి కంటిచూపులు పొందేలా కొన్ని రకాల ఆయుర్వేద సుగుణాలు కలిగిన పదార్థాలు చాలా బాగా పనిచేస్తాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.మరి అవి ఏంటో మనము తెలుసుకుందాం పదండి..
చలికాలం వచ్చిందంటే చాలు ఉసిరికాయలు చాలా ఎక్కువగా లభిస్తూ ఉంటాయి కదా.ఈ ఉసిరికాయలే కంటికి ఔషధమని చెబుతున్నారు ఆయుర్వేద నిపుణులు.ఈ చిట్కా కోసం అర కేజీ ఉసిరికాయలను తీసుకొని బాగా ఎండబెట్టుకోవాలి.ఇలా ఎండబెట్టిన ఉసిరికాయలను పొడి చేసి,అర స్పూన్ మోతాదులో రోజు తేనెను కానీ,ఆవు నెయ్యిని కానీ జోడించి పరగడుపుని తీసుకోవాలి.ఇలా 45 నుంచి 60 రోజులు వరకు తీసుకోవడంతో కంటి చూపు క్రమంగా మెరుగుపడుతుంది.అంతే కాక ఉసిరికాయలో ఉన్న విటమిన్ సి మరియు విటమిన్ ఏ రోగ నిరోధక శక్తిని పెంచడంతో,దగ్గు,జలుబు,జ్వరం వంటి సీజనల్ రోగాలను దరి చేరకుండా కాపాడుతుంది.

ఉసిరికాయను పోషకాలకు తల్లి వంటిది అని చెబుతూ ఉంటారు కదా.అలాంటి ఉసిరికాయను తరచూ తీసుకోవడం వల్ల రక్తంలోని మలినాలను శుద్ధపరచి ధమనులు,సిరలలోని రక్తం పంపింగ్ చాలా బాగా జరుగుతుంది.దీనితో గుండె ఆరోగ్యం మెరుగుపడి గుండె సమస్యలు దరిచేరకుండా ఉంటాయి.మరియు రక్తంలోని గ్లూకోస్ లెవెల్స్ హెచ్చుతగ్గులు కాకుండా క్రమబద్దీకరించి, మధుమేహం బారిన పడకుండా కూడా కాపాడుతుంది.మరియు జుట్టు ఆరోగ్యానికి మంచి ఔషదమని చెప్పవచ్చు.కావున ప్రతి ఒక్కరూ ఉసిరికాయను ఏదో ఒక రూపంలో తీసుకోవడం చాలా ఉత్తమం.మరి ముఖ్యంగా కళ్ళ సమస్యలు ఉన్నవారు అద్భుతమైన చూపు కోసం,కచ్చితంగా ఈ చిట్కా పాటించి చూడండి.

Betavolt: వావ్.. కొత్త బ్యాటరీ..50 ఏళ్లకు సరిపడా చార్జింగ్! ఇక చార్జర్ల అవసరం లేనట్టేనా?

పునర్వినియోగ బ్యాటరీలకు చార్జింగ్ తప్పదు. కానీ 50 ఏళ్లకు సరిపడా విద్యుత్ అందించే బ్యాటరీలు అందుబాటులోకి వస్తే ఇక చార్జర్ల అవసరమే ఉండదు.

చైనాకు (China) చెందిన స్టార్టప్ కంపెనీ ‘బీటావోల్ట్’ (Betavolt) సరిగ్గా ఇలాంటి ఆవిష్కరణతోనే ముందుకొచ్చింది. అణుధార్మికత ఆధారంగా నడిచే అతి చిన్న న్యూక్లియర్ బ్యాటరీని (Nuclear battery with 50 year life) రూపొందించింది. కేవలం 63 ఐసోటోపులను ఓ చిన్న మాడ్యూల్‌గా కూర్చి దీన్ని రూపొందించింది. ప్రపంచంలో అణుశక్తితో నడిచే అతి చిన్న బ్యాటరీ ఇదేనని సంస్థ చెబుతోంది. ప్రస్తుతం ఈ బ్యాటరీపై ప్రయోగాలు జరుగుతున్నాయని, త్వరలో వాణిజ్య అవసరాలకు సరిపడా భారీ స్థాయిలో ఉత్పత్తి ప్రారంభిస్తామని బీటా వోల్ట్ చెప్పుకొచ్చింది.

అతి చిన్న బ్యాటరీ..

ఈ బ్యాటరీలో సైజు కేవలం 15 x 15 x 15 మిల్లీమీటర్లు. ఇందులో న్యూక్లియర్ ఐసోటోపులను సన్నని పొరలుగా అమర్చారు. ఐ ఈ బ్యాటరీ 3 వోల్టుల వద్ద 100 మైక్రోవాట్స్ విద్యుత్ ఉత్పత్తి చేస్తుంది. అయితే, బ్యాటరీ సామర్థ్యాన్ని 2025 కల్లా 1 వాట్ తీసుకెళ్లాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు సంస్థ పేర్కొంది.

ఈ బ్యాటరీని ఎయిరోస్పేస్, ఏఐ ఎక్విప్మెంట్, మెడికల్ ఎక్విప్మెంట్, మైక్రోప్రాసెసర్లు, అడ్వాన్స్డ్ సెన్సర్లు, చిన్న డ్రోన్లు, మైక్రో రోబోట్స్‌లో శక్తి వనరుగా వినియోగించుకోవచ్చు. ఈ బ్యాటరీ విడుదల చేసే రేడియోధార్మికతతో ఎటువంటి అనారోగ్యం కలగదని, ఫలితంగా పేస్‌మేకర్లలో కూడా దీన్ని వాడుకోవచ్చని సంస్థ చెబుతోంది.

బ్యాటరీ పనిచేసేది ఇలా..

బ్యాటరీలోని ఐసోటోపులు రేడియోధార్మిక క్షీణతకు గురై శక్తిని విడుదల చేస్తాయి. ఈ శక్తి చివరగా విద్యుత్‌గా మారుతుంది. బ్యాటరీలోని ఐసోటోపులను వివిధ పొరలుగా అమర్చడంతో అగ్నిప్రమాదం కూడా ఉండవని బీటావోల్ట్ చెబుతోంది. మైనస్ 60 డిగ్రీల నుంచి 120 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద కూడా తాము రూపొందించిన బ్యాటరీ పనిచేస్తుందని వెల్లడించింది.

Chanakya Niti Telugu : మహిళల్లో ఉండే ఈ చెడు లక్షణాలతో జీవితంలో ఇబ్బందులు

స్త్రీ ని శక్తితో పోలుస్తారు. కుటుంబాన్ని నిర్మించే శక్తి మహిళలకు ఉంది. అలాగే స్త్రీ మనసు పెడితే కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసే శక్తి కూడా ఉంటుంది.
సమాజంలో మహిళలకు గౌరవ స్థానం ఉంది. చాణక్యుడి ప్రకారం స్త్రీలలో కొన్ని లక్షణాలు ఉంటే జీవితం బంగారుమయం అవుతుంది. అదేవిధంగా ఆమెలోని కొన్ని లక్షణాలు జీవితాన్ని నాశనం చేస్తాయని చాణక్యుడు తెలిపాడు. చాణక్యుడి ప్రకారం స్త్రీలకు ఉండకూడని లక్షణాలు ఏంటో చూద్దాం..

చాణక్య నీతి ప్రకారం స్త్రీలు పురుషుల కంటే అత్యాశ ఎక్కువ ఉంటుందని చాణక్యుడు తెలిపాడు. అది డబ్బు, నగలు, బట్టలు మొదలైనవి విషయాల్లో అయి ఉంటుంది. మనిషికి కోరిక ఉండాలి కానీ దురాశ ఉండకూడదు. అది ఎప్పటికైనా డేంజర్. అతిగా అత్యాశతో ఉంటే మోక్షానికి అవకాశం లేదని చాణక్యుడు చెప్పాడు. దీనితో అనేక సమస్యలు వస్తాయి. జీవితంలో చాలా ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది.
చాణక్యుడు ప్రకారం మహిళలు ఏదైనా పని చేసేటప్పుడు ఎక్కువగా ఆలోచించరు. ప్రతి పని చేసేటప్పుడు జాగ్రత్తగా అడుగులు వేయాలి. కొంచెం తడబడినా ప్రమాదంలో పడతారు. ఆలోచన లేకుండా చేసే పనులు విజయాన్ని ఇవ్వలేవు. ఆలోచిస్తేనే సరైనా అడుగులు పడతాయి. ఇబ్బందులు రాకుండా ఉంటాయి. ఆలోచన లేకుండా ముందుకు వెళ్తే సమస్యలు కచ్చితంగా వస్తాయి. వాటిని ఎదుర్కొనేందుకైనా సరిగా ముందుగు సాగాలి.

స్త్రీలలో కొందరు చాలా స్వార్థపరులు. మహిళలు తమ పనిని పూర్తి చేయడం కోసం దేనికైనా సిద్ధపడతారు. ఈ గుణం కొందరికి ఉంటుంది. స్త్రీలు ఈ లక్షణాలను విడిచిపెట్టాలని చాణక్యుడు చెప్పాడు. జీవితంలో కొన్ని విషయాలు జరిగితే జరుగుతాయి.. లేదంటే లేదు. దానికోసం కొన్ని కోల్పోవలసిన అవసరం లేదు. అలా చేస్తే మిమ్మల్ని చూసి ఇతరులు చెడుగా మాట్లాడే అవకాశం ఉంది.
చాణక్య నీతి ప్రకారం స్త్రీలకు ధైర్యం మంచిదే కానీ మితిమీరిన ధైర్యం మంచిది కాదు. మీ ఈ మితిమీరిన ధైర్యసాహసాలు మీకు ఏదో ఒక రోజు కష్టాల్లో పడేస్తాయి అని చాణక్యుడు చెప్పాడు. ఏం కాదులే అని కొన్నిసార్లు ముందుకు వెళ్లితే సమస్యలు తప్పవు. ఆచితూచి ఆలోచించి అడుగు వేయాలి. మితిమీరిన ధైర్యం పురుషులకు కూడా మంచిది కాదు. ఎంత వరకు ఉండాలో అంత వరకు ఉంటే చాలు.
కొందరు స్త్రీలకు అబద్ధం చెప్పే అలవాటు ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు చెప్పే అబద్ధాలే వాళ్ళని కష్టాల్లో పడేస్తాయి. స్త్రీలు అలాంటి గుణాలను వదిలేయాలని చాణక్యుడు తెలిపాడు. ఈ గుణాలు స్త్రీలకు అందాన్ని తీసుకురావని వివరించాడు. ప్రపంచంలో ఏ వ్యక్తి కూడా పరిపూర్ణంగా ఉండలేడు. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక లోపం ఉంటుంది. స్త్రీలు కూడా ఈ లక్షణాలలో కొన్నింటిని మార్చుకోవాలి అని చాణక్యుడు వెల్లడించాడు.

Late Breakfast : ఆ టైంలోపు టిఫిన్ చేయకపోతే డేంజరే.? అధ్యయనంలో సంచలన విషయాలు.!

చాలా మందికి ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌ చేసే అలవాటు ఉంటుంది. ఉదయం టిఫిన్‌ చేశాకా మధ్యాహ్నం భోజనం చేస్తుంటారు. అయితే కొందరు టిఫిన్ చేసే సమయ వేళలు పాటించరు.
ఉదయం ఏ సమయానికి టిఫిన్‌ చేయాలి? సమయం దాటితో ఎలాంటి సమస్యలు వస్తాయన్న విషయం పెద్దగా పట్టించుకోరు. ఉదయం టిఫిన్‌ చేయడానికి ఓ టైమ్‌ అంటూ ఉంటుంది. ఆ సమయంలో లోపు చేయడం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు. చాలా మంది ఈ బ్రేక్‌ ఫాస్ట్‌ను ఆలస్యంగా చేస్తుంటారు. ప్రతి రోజు ఉదయం 8 గంటలలోపు9 ఆల్పాహారం చేయాలంటున్నారు నిపుణులు. ఉదయం అల్పాహారంపై ఐఎస్‌ గ్లోబస్‌ అధ్యయనం చేపట్టింది. ఇందులో షాకింగ్‌ విషయాలు వెలుగులోకి వచ్చాయి.

ఉదయం 8 గంటల్లోపు తినేవారితో పోలిస్తే 9 గంటల తర్వాత టిఫిన్‌ చేసేవారిలో డయాబెటిస్‌ ముప్పు 59 శాతం ఉన్నట్లు తేలింది. తినే సమయ వేళలు శరీరంపై తీవ్ర ప్రభావం చూపుతాయని చెబుతున్నారు. వేళపాల లేకుండా టిఫిన్‌ చేస్తే రక్తంలో గ్లూకోజు, కొలెస్ట్రాల్‌ మోతాదు వంటి వాటిపై ప్రభావం ఉంటుందట. అలాగే రాత్రి 10 గంటల తర్వాత భోజనం చేసేవారిలో మధుమేహం పెరిగే అవకాశం ఉందని నిపుణులు అధ్యయనం ద్వారా గుర్తించారు.

మధుమేహం అనేది దీర్ఘకాలిక వ్యాధి. ఇది ప్రపంచవ్యాప్తంగా వేగంగా వ్యాపిస్తోంది. భారతదేశంలో కూడా పెద్ద సంఖ్యలో ప్రజలు దీని బారిన పడుతున్నారు. జీవనశైలిలో మార్పులు, శారీరక శ్రమలు తగ్గడం వల్ల అధిక రక్తంలో చక్కెర స్థాయికి సంబంధించిన ఈ వ్యాధి పెరుగుతుంది. ఇది అటువంటి వ్యాధి, బాధితురాలిగా మారిన తర్వాత జీవితాంతం మందులపై ఆధారపడతారు. అందువల్ల, మధుమేహాన్ని నివారించడానికి, అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవడం, ఆరోగ్యకరమైన అలవాట్లను అనుసరించడం. ఇది కాకుండా, మధుమేహాన్ని సరైన సమయంలో గుర్తించినట్లయితే, అప్పుడు ఈ వ్యాధి సమస్యలు సంభవించే ముందు నివారించవచ్చు. అందుకే ఆహారం తీసుకోవడంలో సమయ వేళలు పాటించడం చాలా ముఖ్యం.
శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారంలోని పోషక విలువలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచిస్తున్నారు నిపుణులు. మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ నిండుగా, పోషకాలతో ఉండాలని నిపుణులు అంటున్నారు. అయితే సమయానికి ఆహారం తీసుకోకపోతే అది మనకు చాలా హానికరమని పరిశోధన ద్వారా తెలుస్తోంది. ఉదయం ఆలస్యంగా అల్పాహారం తీసుకునే వ్యక్తులు టైప్-2 డయాబెటిస్‌కు గురయ్యే ప్రమాదం ఉందని పేర్కొంది. గతంలో కూడా అమెరికాలో జరిపిన అధ్యయనం ఆధారంగా నిపుణులు ఈ నివేదికలో వెల్లడించారు.

Viral Video: వామ్మో.. పెద్ద పులితో ఆటలా? పులి తరుముతుంటే వెన్నులో వణుకు పుట్టాల్సిందే!

చాలా మంది కుక్కలు, పిల్లులు, పక్షులు వంటి వాటిని పెంచుకునేందుకు ఇష్టపడుతుంటారు. వాటితో సరదాగా ఆడుకుంటుంటారు. అయితే దుబాయ్‌ (Dubai)లో ఇందుకు భిన్నం.
వారు వన్య మృగాలను పెంచుకోవడాన్ని స్టేటస్ సింబల్‌గా భావిస్తారు. ఆ సంపన్న దేశంలో ధనవంతులు చిరుతలను, పులులను, సింహాలను ఇళ్లలో పెంచుకుంటారు. అంతేకాదు వాటిని తీసుకుని అప్పుడప్పుడు రోడ్ల పైకి కూడా వస్తుంటారు. వాటికి సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు (Tiger Videos).

తాజాగా అలాంటి వీడియో ఒకటి billionaire_life.styles అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో పోస్ట్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ విలాసవంతమైన ఇంట్లో ఓ వ్యక్తి తన పెంపుడు పులితో (Pet Tiger) ఆడుకుంటున్నాడు. ఆ వ్యక్తి ఇల్లంతా పరిగెడుతుండగా ఓ పెద్ద పులి అతడిని పట్టుకునేందుకు అతడి వెంట పరుగులు తీస్తోంది. పరుగెత్తే క్రమంలో అతడు అదుపుతప్పి కింద పడిపోయాడు. అయినా సరే ఆ పులి అతడిని వదలలేదు. వెంబడించి అతడిని పట్టుకుంది. అయితే పెంపుడు పులి కావడంతో అతడిని ఏమీ చేయలేదు (Tiger Chasing Man).

ఈ వీడియో చాలా మంది నెటిజన్లను భయాందోళనలకు గురి చేసింది. ఈ వీడియోపై నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేశారు. “మిడిల్ ఈస్ట్‌లో మాత్రమే ఇలాంటివి సాధ్యం,ఆ జంతువు బొమ్మ కాదు దానికి స్వేచ్చ కావాలి,వీడియో చూస్తుంటే చాలా భయంకరంగా ఉంది,వన్య ప్రాణులను అలా బంధించడం ప్రకృతికి ఎదురెళ్లడమే అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

సిమ్ కార్డ్ లేకుండానే వీడియోలు చూసేయొచ్చు : డీ2ఎం బ్రాడ్‌కాస్టింగ్ దిశగా కేంద్రం , ఎలా పనిచేస్తుందంటే..?

మొబైల్ వినియోగదారులు త్వరలో సిమ్ కార్డ్ లేకుండా ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండా వీడియోలను వీక్షించవచ్చు. ఎందుకంటే సమీప భవిష్యత్తులో డైరెక్ట్ టు మొబైల్ ప్రసారాలు అందుబాటులోకి రానున్నాయి.
బ్రాడ్ కాస్టింగ్ సమ్మిట్‌ను ఉద్దేశించి కేంద్ర సమాచార, ప్రసార కార్యదర్శి అపూర్వ చంద్ర మాట్లాడుతూ.. దేశీయంగా అభివృద్ధి చేసిన డైరెక్ట్ టు మొబైల్ (డీ2ఎం) సాంకేతికతకు సంబంధించిన ట్రయల్స్ త్వరలో దేశంలోని 19 నగరాల్లో జరుగుతాయని చెప్పారు. ఇందుకోసం 470-582 MHz స్పెక్ట్రమ్ రిజర్వ్ చేయడానికి బలమైన గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నట్లు అపూర్వ తెలిపారు.

డీ2ఎంకి వీడియో ట్రాఫిక్‌ను 25 నుంచి 30 శాతం మార్చడం వల్ల 5జీ నెట్‌వర్క్‌లు అన్‌లాగ్ అవుతాయని అపూర్వ చంద్ర అన్నారు. తద్వారా దేశ డిజిటల్ పరిణామాన్ని వేగవంతం చేసి కంటెంట్ డెలివరీని మరింత అందుబాటులోకి తెస్తుందన్నారు. గతేడాది డీ2ఎం సాంకేతికతను పరీక్షించడానికి పైలట్ ప్రాజెక్ట్‌లు బెంగళూరు, కర్తవ్య పథ్, నోయిడాలో జరిగాయి. డీ2ఎం టెక్నాలజీ దేశవ్యాప్తంగా దాదాపు 8 నుంచి 9 కోట్ల టీవీ డార్క్ ఇళ్లను చేరుకోవడానికి సహాయపడతాయని చంద్ర తెలిపారు. దేశంలోని 280 మిలియన్ల కుటుంబాలలో కేవలం 190 మిలియన్లకు మాత్రమే టెలివిజన్ సెట్లు వున్నాయి.

దేశంలో 80 కోట్ల స్మార్ట్‌ఫోన్లు వున్నాయని, 69 శాతం కంటెంట్ వీడియో ఫార్మాట్‌లోనే వుందని అపూర్వ చెప్పారు. వీడియోను ఎక్కువగా ఉపయోగించడం వల్ల మొబైల్ నెట్‌వర్క్‌లు అడ్డుపడతాయని , దీని ఫలితంగా కంటెంట్ బఫర్ అవుతుందని చంద్ర తెలిపారు. సాంఖ్య ల్యాబ్స్ , ఐఐటీ కాన్పూర్ అభివృద్ధి చేసిన డీ2ఎం ప్రసార సాంకేతికత భూ సంబంధమైన టెలికమ్యూనికేషన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ పబ్లిక్ బ్రాడ్‌కాస్టర్ అసైన్డ్ స్పెక్ట్రమ్ ద్వారా వీడియో, ఆడియో, డేటా సిగ్నల్‌లను నేరుగా అనుకూల మొబైల్ లేదా స్మార్ట్ పరికరాల నుంచి స్ట్రీమ్ చేసుకోవచ్చు.
ఒక బిలియన్ మొబైల్ డివైస్‌లను చేరుకోగల సామర్ధ్యంతో డీ2ఎం సాంకేతిక పరిజ్ఞానాన్ని స్వీకరించడం వలన డేటా ట్రాన్స్‌మిషన్ , యాక్సెస్‌లో ఖర్చు తగ్గింపులు, నెట్‌వర్క్ సామర్ధ్యం, దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీ అలర్ట్ సిస్టమ్ ఏర్పాటు వంటి వాటి ఏర్పాటుకు దారి తీయడం వంటి ప్రయోజనాలను పొందవచ్చు.

Vijayamma support for whom : ఏపీలో జగన్, షర్మిల రాజకీయాలు – విజయమ్మ మద్దతు ఎవరికి ?

Andhra YS Family Polotics : ఏపీ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల కొత్త అధ్యక్షురాలుగా నియమితులయ్యారు. ఏపీలో ఆయన సోదరుడు జగన్ మోహన్ రెడ్డి సొంత పార్టీ వైఎస్ఆర్సీపీ ద్వారా ముఖ్యమంత్రిగా ఉన్నారు.
పార్టీ కోసం షర్మిల పాదయాత్ర సహా చాలా కష్టపడ్డారు. అయితే కారణాలేంటో తెలియదు కానీ చెల్లి షర్మిలను జగన్ దూరం పెట్టడంతో ఆమె తన రాజకీయ లక్ష్యాలను అందుకోవడానికి తెలంగాణలో పార్టీ పెట్టుకున్నారు. కానీ అక్కడి రాజకీయ పరిస్థితుల్ని చూసిన తర్వాత మనసు మార్చుకుని ఏపీకి వచ్చేశారు. తండ్రి వైఎస్ జీవితాంతం ఉన్న కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షులయ్యారు. అంటే అన్నతో చెల్లి పోటీ పడబోతున్నారు. మరి వీరిద్దరిలో తల్లి విజయలక్ష్మి మద్దతు ఎవరికి ఉండబోతోంది ?

పిల్లలిద్దరూ చెరో రాష్ట్రంలో రాజకీయాలు చేస్తారన్న విజయమ్మ

షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టినప్పుడు విజయమ్మ పూర్తి మద్దతుగా నిలిచారు. పిల్లలిద్దరూ చెరో రాష్ట్రంలో రాజకీయం చేయాలని దేవుడు రాసి పెట్టారని చెప్పుకున్నారు. తెలంగాణలో వైఎస్ఆర్సీపీ పోటీ చేయడం లేదు కాబట్టి అన్నా చెల్లెళ్ల మధ్య సవాల్ జరిగే అవకాశం కనిపించ లేదు.అందుకే విజయమ్మకు కూడా ఇద్దరి మధ్య ఎవరో తేల్చుకోవాల్సిన అవసరం రాలేదు. కానీ ఇప్పుడు సీన్ మారిపోయింది. షర్మిల తెలంగాణ నుంచి ఏపీకి వచ్చేశారు.

రాజకీయంగా వైసీపీని టార్గెట్ చేస్తేనే కాంగ్రెస్కు ఓటు బ్యాంక్

షర్మిల నేరుగా తన అన్నతో ఢీకొనడానికి ఇష్టం లేకే తెలంగాణలో పార్టీ పెట్టారని గతంలో ప్రచారం జరిగిదంి. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. కాంగ్రెస్ పార్టీలో తాను స్థాపించిన పార్టీని విలీనం చేసేసి ఏపీలో తన అన్నను గట్టిగా ఢీకొనాలనే ధృఢ సంకల్పంతో షర్మిల రెడీ అయ్యారు. రాజకీయాల్లోకి వచ్చాక బలమున్న చోటే వెదుక్కోవాలి. లేకపోతే కష్టం. ఈ సూత్రం తెలియకుండా షర్మిలరాజకీయం చేయరని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణలో ఆమె ప్రభావం దాదాపుగా లేదని ఇక ఏటూ తేల్చుకోవాలనుకుంటున్నారు కాబట్టి మొహమాటాలు వదిలేయాలని అనుకున్నారని చెబుతున్నారు. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా షర్మిల వంద శాతం పార్టీ కోసం పని చేసే అవకాశం ఉంది. ల

విజయమ్మ మద్దతు ఎవరికి ఉంటే వారికి నైతిక బలం !

ఇలాంటి సమయంలో పిల్లల్లో విజయమ్మ సపోర్ట్ ఎవరికి అన్నది ఆసక్తికరంగా మారింది. ఇప్పటి వరకు విజయమ్మ కూతురు వైపే మొగ్గు చూపారు. కూతురుకు అండగా నిలవడమే ప్రాధాన్యతాంశంగా తీసుకున్నారు. వైసీపీ గౌరవాధ్యక్షురాలిగా రాజీనామా చేసినప్పుడు అదే చెప్పారు. ఇద్దరు బిడ్డలు రెండు రాష్ట్రాల్లో రాజకీయం చేస్తారని చెప్పారు. కానీ ఇప్పుడు ఒకరిపైకి ఒకరు రాజకీయం చేసే పరిస్థితులు వచ్చాయి. షర్మిల ఏపీకి వచ్చేయాలనే నిర్ణయం తీసుకున్న తర్వాత షర్మిలను కట్టడి చేయాలని విజయమ్మపై జగన్ ఒత్తిడి తెచ్చారన్న ప్రచారం జరిగింది. తన ఇద్దరు పిల్లలు తనకు రెండు కళ్లని విజయమ్మ చెబుతూ వస్తున్నారు. అప్పుడు ఆమె రెండు కళ్లల్లో ఏదోక కంటికే ప్రాధాన్యం ఇవ్వక తప్పదన్న వాదన వినిపిస్తోంది.షర్మిళ వైపే విజయమ్మ నిలబడితే జగనుకు నైతికంగా భారీ దెబ్బ తగిలినట్టే భావిస్తారు. ఇప్పటికే తల్లి.. చెల్లెలను పట్టించుకోవడం లేదనే విమర్శలను జగన్ ఎదుర్కొంటున్నారు. ఇక షర్మిళ నేరుగా ఏపీ రాజకీయ రంగంలోకి దూకారు కాబట్టి నేరుగా జగన్ను విమర్శించే పరిస్థితి వస్తుంది.
విజయమ్మ తటస్థంగా ఉంటారా ?

ఎవరికీ మద్దతు ఇవ్వకుండా విజయమ్మ తటస్థంగా ఉంటారని వైసీపీ వర్గాలు నమ్ముతున్నాయి. కానీ ప్రస్తుతం విజయమ్మ షర్మిల వద్దే ఉంటున్నారు. రెండు, మూడు సార్లు షర్మిలతో కనిపిస్తే.. కుమార్తెకే ఆమె మద్దతు ఉన్నట్లుగా ప్రచారం జరుగుతుంది. ఇది సీఎం జగన్కు ఇబ్బందే.

M Aadhaar: మీ మొబైల్‌లోనే క్షణాల్లో ఆధార్‌.. రిజిస్ట్రేషన్‌ ప్రాసెస్‌ చాలా సింపుల్‌..

ఆధార్‌ అనేది కేంద్ర ప్రభుత్వం అందించే విశిష్ట గుర్తింపు సంఖ్య. ప్రభుత్వం ప్రతి చిన్న అవసరానికి ఆధార్‌ను తప్పనిసరి చేసింది. ముఖ్యంగా ప్రభుత్వ పథకాల వర్తింపునకు ఆధార్‌ అవసరం అవుతుంది.
అంతేకాకుండా బ్యాంకు ఖాతాల నిర్వహణతో పాటు ఆర్థిక సంబంధిత కార్యకలాపాలకు కూడా ఆధార్‌ అవసరం అవుతుంది. ఈ నేపథ్యంలో ఆధార్‌ను ప్రతి అవసరానికి గుర్తింపు కార్డుగా ఉపయోగించాల్సి వస్తుంది. ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరి చేతుల్లో స్మార్ట్‌ఫోన్‌ ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆధార్‌ను సింపుల్‌గా ఫోన్‌ ద్వారా యాక్సెస్‌ చేయవచ్చు. అలాగే ఆధార్‌ ఒరిజినల్‌లా ధ్రువీకరించుకోవచ్చు. ఆధార్‌ను జారీ చేసే భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) ఎం-ఆధార్‌ను తీసుకొచ్చింది. ఇది ఆధార్ కార్డునకు మొబైల్ యాప్ వెర్షన్‌ను సూచిస్తుంది. ఇది తప్పనిసరిగా మీ స్మార్ట్‌ఫోన్‌లో మీ ఆధార్ సమాచారాన్ని డిజిటల్‌గా తీసుకెళ్లడానికి, వివిధ ఆధార్ సంబంధిత సేవలను సౌకర్యవంతంగా ఉపయోగించుకోవడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. ఎం ఆధార్‌ గురించి వివరాలను తెలుసుకుందాం.

ఎం-ఆధార్ ఫీచర్లు

ఎం ఆధార్‌ ద్వారా మీ వ్యకతిగత సమాచారం, ఫోటోగ్రాఫ్, ఆధార్ నంబర్‌ను ఎప్పుడైనా ఎక్కడైనా యాక్సెస్ చేయండి.
బ్యాంకులు, టెలికాం ఆపరేటర్లు మొదలైన వాటి వద్ద ఆధార్ ఆధారిత ప్రమాణీకరణ కోసం మీ ఫోన్‌ని ఉపయోగించవచ్చు.
ఎం ఆధార్‌ యాప్‌ దవ​ఆరా మీ ఆధార్ కార్డునకు సంబంధించిన సురక్షితమైన, డిజిటల్ సంతకం చేసిన కాపీని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
అలాగే ఈ యాప్‌లో మీ కుటుంబ సభ్యులకు సంబంధించిన ఐదుగురి ఆధార్ నంబర్‌లను లింక్ చేయవచ్చు.
మీ రిజిస్టర్డ్ మొబైల్ ఫోన్ అందుబాటులో లేకపోతే ఆఫ్‌లైన్ ఆధార్ ప్రమాణీకరణ కోసం తాత్కాలిక పిన్‌ను సృష్టించవచ్చు.
ఎం ఆధార్‌ యాప్‌ ద్వారా నిర్వహించే మీ అన్ని ఆధార్ ఆధారిత ప్రమాణీకరణ లావాదేవీలను ట్రాక్ చేయండి.
ఎం ఆధార్‌ ప్రొఫైల్‌ క్రియేట్‌ చేయడం ఇలా

ఎం ఆధార్‌ యాప్‌ను ప్లే స్టోర్‌ లేదా ఐఓఎస్‌ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలి.
అనంతరం యాప్‌ని తెరిచి “రిజిస్టర్ ఆధార్” ఎంపికను ఎంచుకోవాలి. మీ చెల్లుబాటు అయ్యే 12-అంకెల ఆధార్ నంబర్, అక్కడ కనిపించే క్యాప్చా కోడ్‌ను నమోదు చేయాలి.
ఎం ఆధార్‌ ప్రొఫైల్‌కు సురక్షితమైన యాక్సెస్ కోసం 4 అంకెల పిన్‌ లేదా పాస్‌వర్డ్‌ను సెట్ చేయాలి.
అనంతరం మీ ఆధార్‌తో లింక్ చేసిన మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయడానికి ఓటీపీను నమోదు చేయాలి.
ఒకసారి ఆధార్‌ నమోదు చేసుకున్న తర్వాత మీరు సృష్టించిన పిన్ లేదా పాస్‌వర్డ్‌ని ఉపయోగించి మీ ఎం-ఆధార్ ప్రొఫైల్‌ను యాక్సెస్ చేయవచ్చు.

Aadhaar: ఆధార్‌ కార్డ్‌లో మీ ఫొటో బాగోలేదా?, అందంగా మార్చడం చాలా సింపుల్‌

Latest Photo Updation In Aadhaar Card Online: భారతదేశ పౌరుల గుర్తింపు పత్రాల్లో ఆధార్ కార్డు ఒకటి. ఇది అతి ముఖ్యమైన ఐడీ కార్డ్. స్కూలు & కాలేజీలో అడ్మిషన్ కోసం, ఉద్యోగాల కోసం దరఖాస్తు చేయడానికి, జాబ్లో జాయిన్ కావడానికి, బ్యాంక్ ఖాతా తెరవడానికి, స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టడానికి, ఆదాయ పన్ను పత్రాలు దాఖలు చేయడానికి, ఆస్తుల క్రయవిక్రయాల కోసం, ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను పొందేందుకు, ఇలా…
చాలా రకాల పనుల కోసం ఆధార్ కార్డ్ తప్పనిసరిగా అవసరం. ఆధార్ కార్డ్ లేకపోతే ఈ పనులేవీ జరగవు.

ఆధార్ కార్డ్లో 12 అంకెల గుర్తింపు సంఖ్య ఉంటుంది. ఇందులో.. వేలిముద్రలు (బయోమెట్రిక్) & కనుపాపల (Iris) గుర్తులు, వ్యక్తి పేరు, ఫోటో, పుట్టిన తేదీ, చిరునామా, ఫోన్ నంబర్, ఈ-మెయిల్ ఐడీ వంటి వ్యక్తిగత వివరాలన్నీ నిక్షిప్తమై ఉంటాయి.

ఆధార్ కార్డ్లో ఉన్న వివరాల్లో కొన్నిసార్లు తప్పులు దొర్లుతాయి. ఫోన్ నంబర్ లేదా చిరునామా మారినప్పుడు వాటిని అప్డేట్ చేయాల్సి వస్తుంది. ఇలాంటి సమాచారాన్ని మార్చుకోవడానికి లేదా తప్పులు సరి చేసుకోవడానికి ఆధార్ సేవ కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా, ఆన్లైన్లోనే వివరాలు మార్చుకోవచ్చు. అయితే, మొత్తం సమాచారాన్ని ఆన్లైన్ ద్వారా అప్డేట్ చేయడం కుదరదు. ఫోటో, బయోమెట్రిక్ వివరాలను అప్డేట్ చేయడానికి తప్పనిసరిగా ఆధార్ సేవ కేంద్రానికి వెళ్లాల్సి ఉంటుంది. ఇందుకోసం, నేరుగా ఆధార్ సేవ కేంద్రానికి వెళ్లవచ్చు, లేదా ఆధార్ అధికారిక వెబ్సైట్లోకి వెళ్లి మీకు దగ్గరలోని ఆధార్ సేవ కేంద్రంలో మీకు వీలైన సమయం కోసం అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు.

ఆధార్ కార్డ్లో ఉన్న మీ ఫోటో లేదా మీ కుటుంబ సభ్యుల ఫోటోలు బాగోలేకపోతే, లేదా ఆ ఫోటోలు పాతబడితే.. ఆధార్ సెంటర్కు వెళ్లి వాటిని మార్చుకోవాలి.

ఆధార్ కార్డ్లో ఫోటో మార్చే విధానం (How to Change Photo in Aadhaar Card):

ముందుగా, mAadhaar యాప్ లేదా ఉడాయ్ వెబ్సైట్ నుంచి ఆధార్ ఎన్రోల్మెంట్ ఫామ్ను డౌన్లోడ్ చేసుకోవాలి.
ఇదే ఫారాన్ని ఆధార్ సేవ కేంద్రానికి వెళ్లి కూడా తీసుకోవచ్చు.
ఆ ఫారంలో అడిగిన వివరాలను తప్పులు లేకుండా జాగ్రత్తగా పూరించండి. అక్షర దోషాలు లేకుండా ఒకటికి రెండుసార్లు సరి చూసుకోండి.

ఫారం నింపిన తర్వాత, ఆధార్ సేవ కేంద్రంలో ఆ ఫారాన్ని సబ్మిట్ చేయాలి.
ఇప్పుడు, ఫొటో అప్డేషన్ పని ప్రారంభమవుతుంది.
మొదట, ఆధార్ సేవ కేంద్రంలోని సిబ్బంది మీ నుంచి వేలిముద్రలతో మీ గుర్తింపును ధృవీకరిస్తారు.
అక్కడే ఉన్న కెమెరా ద్వారా మీ ఫోటో తీసుకుంటారు. ఇదే ఫొటోను ఆధార్ కార్డ్లో అప్డేట్ చేస్తారు.
ఆధార్ కార్డ్ ఫొటోలో మీరు ఎలా కనిపించాలని కోరుకుంటారో, దానికి తగ్గట్లుగా ముందే సిద్ధమై వెళ్లండి.
తర్వాత, ఆధార్లో ఫోటోను అప్డేట్ చేయడానికి కొంత డబ్బు చెల్లించాలి.

ఈ తతంగం ముగిసిన తర్వాత ఆధార్ కేంద్రం సిబ్బంది మీకు ఒక రిసిప్ట్ ఇస్తారు. దాని మీద URN ఉంటుంది. దాని సాయంతో, మీ ఫోటో అప్డేట్ ప్రాసెస్ను మీరు ఎప్పటికప్పుడు ట్రాక్ చేయవచ్చు. కొన్ని రోజుల తర్వాత, UIDAI నుంచి ఫోటో అప్డేట్ SMS వస్తుంది. మీ ఆధార్ కార్డుకు అనుసంధానమైన మొబైల్ నంబర్కు ఆ SMS వస్తుంది. ఆ తర్వాత, ఆధార్ వెబ్సైట్లోకి వెళ్లి, ఆధార్ కార్డ్లో కొత్తగా యాడ్ చేసిన ఫోటోను చూసుకోవచ్చు. ఆ ఆధార్ కార్డ్ను డౌన్లోడ్ చేసుకుని అవసరమైన చోట వినియోగించుకోవచ్చు.

ఆధార్ కార్డ్లో ఫోటో మార్చుకోవడానికి ఎంత ఫీజు చెల్లించాలి?

UIDAI అధికారిక వెబ్సైట్ ప్రకారం, ఆధార్ కార్డ్లో ఫోటోను నవీకరించడానికి రూ.100+GST చెల్లించాలి. ఆధార్ కార్డ్లో ఫోటోను అప్డేట్ చేయడానికి ఇతర ఏ గుర్తింపు కార్డ్ను చూపించాల్సిన అవసరం లేదు.

ఆధార్ కార్డ్లో ఫోటోను ఆఫ్లైన్లో మాత్రమే అప్డేట్ చేస్తారు. ఆన్లైన్ ద్వారా మనమే అప్డేట్ చేసుకోవడం కుదరదు.

Dialy News Papers Telugu, English News Papers,Epapers

Telugu News Papers, Telugu Epapers, English news papers – Epapers Eenadu / Eenadu Epaper/Andhra Jyothi Epaper/Sakshi Epaper/Andhra Bhoomi/Andhra Prabha/Praja sakthi/Visalaandhra/Vaartha/Suryaa/Namasthe Telangana/V6 – Velugu/ ManaTelangana / NavaTelangana /AadabHyderabad/Janam sakshi/manam

S.NO Telugu News website Epaper
1 Eenadu Epaper
2 Andhra Jyothi Epaper
3 Sakshi Epaper
4 Andhra Bhoomi Epaper
5 Andhra Prabha Epaper
6 Praja sakthi Epaper
7 Visalaandhra Epaper
8 Vaartha Epaper
9 Suryaa Epaper
10 Namasthe Telangana Epaper
11 V6 – Velugu Epaper
12 ManaTelangana Epaper
13 NavaTelangana Epaper
14 AadabHyderabad Epaper
15 Janam sakshi Epaper
16 manam Epaper

డయాబెటిస్ వారికీ గుడ్ న్యూస్.. శాశ్వతంగా చెక్ పెట్టే మందు రాబోతుంది..!

ప్రస్తుతం ప్రతీ మందిలో 7 గురు డయాబెటిస్ తో ఇబ్బంది పడుతున్నారు. డయాబెటిస్ కి శాశ్వతంగా తగ్గించే మందుల మీద పరిశోధనలు జరుగుతున్నాయి.
ఇది విజయవంతం అయితే ఇక డయాబెటిస్ కి వారు భయ పడాల్సిన అవసరం లేదు. డయాబెటిస్ వచ్చిందంటే చాలు జీవితం మొత్తం అయిపోయిందని బాధ పడతారు. ఎందుకంటే ఇంత వరకు ఎవరు దీనికి మందు కనిపెట్టలేకపోయారు. ఎన్ని మందులు వాడినా ఎంత డైట్ తీసుకున్న షుగర్ వ్యాధి పెరుగుతూనే ఉంది.జీవితం సగం అయిపోయిందనే భావనలోనికి వెళ్లిపోతున్నారు. ఇక నుంచి ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. టైప్ టు డయాబెటిస్ కి శాశ్వతంగా చెక్ పెట్టే విధంగా పరిశోధనలు జరుగుతున్నాయి.

సాధారణంగా టైప్ వన్ డయాబెటిస్ 30 ఏళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్నవారికీ వస్తుంది. ఈ సమస్య రావడానికి వేరే కారణం కూడా ఉందట. చిన్న వయసులో డయాబెటిస్ ఎదుర్కోవడానికి కారణం ఒత్తిడి కూడా కారణమని నిపుణులు వెల్లడించారు. మరికొందరికి డయాబెటిస్ చిన్న వయసులో రావడానికి కారణం వారి కుటుంబంలో ఎవరైనా ఈ సమస్యతో బాధపడుతున్నట్లయితే వారికి కూడా ఈ సమస్య వచ్చే అవకాశం ఉంది. చాలా పరిశోధనల తర్వాత ఈ టైప్ టు డయాబెటిస్ ఎందుకు వస్తుంది అనే విషయాన్ని తెలుసుకున్నారు వైద్యులు. అంతేకాదు.. ఈ పరిశోధన ఈ వ్యాధికి శాశ్వతంగా చెక్ పెట్టే విధంగా కూడా ఉపయోగపడుతుందని తెలిపారు. ఇన్సూలేన్స్ వంటి ప్రోటీన్లను ప్రభావితం చేస్తుంది. త్వరలోనే డయోబెటిస్ వారికీ మంచి రోజులు రాబోతున్నాయి. శాశ్వత పరిష్కారం కూడా కనుగొనబోతున్నారు.

Fastag KYC: మీ ఫాస్టాగ్‌ కేవైసీ అయ్యిందా..? లేదా.? ఇలా తెలుసుకోండి..

ఫాస్టాగ్‌లకు కేవైసీని తప్పనిసరి చేస్తూ జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. జాతీయ రహదారులపై వాహనాలు టోల్‌ చెల్లించే విధానాన్ని సులభతరం చేస్తూ కేంద్రం దేశంలోని అన్ని టోల్‌గేట్ల వద్ద ఫాస్టాగ్‌ను అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలోనే ఫాస్టాగ్‌లకు కేవైసీ చేసుకోవాలని అధికారులు తెలిపారు.

కేవైసీ పూర్తి చేయని ఫాస్టాగ్‌లను డీయాక్టివేట్ చేస్తామని అధికారులు స్పష్టం చేశారు. ఇందుకు గాను చివరి తేదీగా జనవరి 31వ తేదీని నిర్ణయించారు. ఒకే వాహనానికి ఒకే ఫాస్టాగ్‌ ఉండాలన్న ఉద్దేశంతోనే నేషనల్ హైవే అథారిటీ ఆఫ్‌ ఇండియా ఈ విధానాన్ని తీసుకొచ్చింది. ఒకే ఫాస్టాగ్‌ను వేరు వేరు వాహనాలకు ఉపయోగించకుండా ఉండడానికి కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. జనవరి 31వ తేదీలోపు కేవైసీ చేసుకోకపోతే ఫాస్టాగ్‌ డీయాక్టివేట్‌ అవుతుందని ప్రకటించారు.

దీంతో వాహనదారులు తమ ఫాస్టాగ్‌కు కేవైసీని అప్‌డేట్ చేసుకునే పనిలో పడ్డారు. ఇదిలా ఉంటే ఇంతకీ మీరు ఉపయోగిస్తున్న ఫాస్టాగ్‌కు కేవైసీ అయ్యిందో లేదో ఆన్‌లైన్‌లో తెలుసుకునే అవకాశం ఉంది. ఇంతకీ ఆన్‌లైన్‌లో కేవేసీ స్టేటస్‌ను ఎలా చెక్‌ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఇందుకోసం ముందుగా ఫాస్టాగ్‌ అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. అనంతరం మీ మొబైల్‌ నెంబర్‌, పాస్‌వర్డ్‌ను ఎంటర్‌ చేయాలి.

లేదంటే ఓటీపీని ఎంటర్‌ చేయడం ద్వారా కూడా లాగిన్‌ కావొచ్చు. అనతంరం డ్యాష్‌బోర్డులోకి వెళ్లి ‘మై ప్రొఫైల్‌’ ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోవాలి. అక్కడ మీ ఫాస్టాగ్ కేవైసీ స్టేటస్‌ వివరాలు కనిపిస్తాయి. ఒకవేళ మీ ఫాస్టాగ్‌ కేవైసీ కాకపోయి ఉంటే.. అక్కడ అడిగిన వివరాలు సమర్పించాలి. దీంతో కేవైసీ ప్రాసెస్‌ను పూర్తి చేసుకోవచ్చు.

మజ్లిస్ కు రేవంత్ మార్క్ చెక్ ? ఇండియా కూటమిలోకి ఎంబీటీ-హైదరాబాద్ ఎంపీ సీటూ !

తెలంగాణలో తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా మెజార్టీ సీట్లు గెల్చుకుని అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీకి రాజధాని హైదరాబాద్ పరిధిలో ఒక్కసీటు కూడా గెలవలేకపోవడం పెద్ద మైనస్ గా మారింది.
దీంతో వచ్చిన కసో, మరో కారణమో తెలియదు కానీ హైదరాబాద్ విషయంలో దీర్ఘకాలిక వ్యూహాలకు సీఎం రేవంత్ రెడ్డి తెరలేపుతున్నారు. హైదరాబాద్ లో బీఆర్ఎస్ కు సహకరించి కాంగ్రెస్ ఓట్లు చీల్చి ఆ పార్టీ అభ్యర్ధుల ఓటమికి కారణమైన స్ధానిక పార్టీ ఎంఐఎంకు చెక్ పెట్టేందుకు సీరియస్ కసరత్తు చేస్తున్నారు.

ఇందులో భాగంగా పాతబస్తీలో ఎంఐఎం ప్రత్యర్ధి ఎంబీటీని ఓ రేంజ్ లో ప్రోత్సహించేందుకు సీఎం రేవంత్ రెడ్డి సిద్ధమయ్యారు. ఇప్పటికే గత ఎన్నికల్లో ఎంఐఎం గెలిచిన ఏడు సీట్లలో రెండు సీట్లు యాకుత్ పురా, నాంపల్లిలో గట్టి పోటీ ఇచ్చిన కాంగ్రెస్ ను భవిష్యత్తులో ఎంబీటీతో పొత్తు పెట్టుకుని ముందుకెళ్లేలా రేవంత్ ప్లాన్ చేసారు. ఇందులో భాగంగా ఎంబీటీ నేత అంజాదుల్లా ఖాన్ ను ప్రోత్సహించాలని నిర్ణయించారు. ఎంఐఎంకు బలమున్న ప్రతీ చోటా ఇకపై ఎంబీటీని ప్రోత్సహించబోతున్నారు.

ఎంబీటీతో నేరుగా కాంగ్రెస్ పొత్తు పెట్టుకోవడమే కాకుండా ఆ పార్టీ నేతృత్వంలో సాగుతున్న ఇండియా కూటమిలోకీ చేర్చుకునేలా రేవంత్ రెడ్డి వ్యూహరచన చేస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ తరఫున అధిష్టానం దూతలు ఎంబీటీ నేతలతో ఈ మేరకు చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. జాతీయ స్ధాయిలో ఎంఐఎంకు పోటీగా ఎంబీటీని అన్ని విధాలుగా ప్రోత్సహించేందుకు కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతోంది. ఇందులో భాగంగా ఎంబీటీకి మరో కీలక ఆఫర్ కూడా ఇవ్వబోతున్నారు.

ఇన్నాళ్లూ ఎంఐఎం వరుసగా గెలుస్తూ, తన సొత్తుగా భావిస్తున్న హైదరాబాద్ ఎంపీ సీటులో ఎంబీటీ అభ్యర్ధిని పోటీకి పెట్టి అన్ని విధాలా సహకరించాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. తద్వారా అసదుద్దీన్ ఓవైసీకి చెక్ పెట్టాలని ప్లాన్ చేస్తోంది. ఈ ప్రయత్నాలు ఇప్పుడు మొదలైతే భవిష్యత్తులో ఎంఐఎం కంచుకోటల్ని బద్దలు కొట్టి తన మిత్రపక్షం ఎంబీటీతో పాగా వేయించాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత హైదరాబాద్ పరిధిలో ఎంబీటీ సాయంతో కాంగ్రెస్ బలపడాలన్నది ఈ వ్యూహంలో భాగంగా కనిపిస్తోంది.

Income Tax Benefits: సొంతిల్లు కొంటే.. ఆదాయ పన్ను మినహాయింపు! అదెలా? ఇది చదవండి..

సొంతంగా ఇంటిని నిర్మించుకోవడం లేదా ఓ ఇల్లు కొనుగోలు చేయడం ద్వారా మీరు కట్టే పన్ను ఆదా చేసుకోవచ్చని మీకు తెలుసా? ఆదాయ పన్నుల చట్టం 1961 ప్రకారం అనేక మినహాయింపులు ఉంటాయి.

వాటి గురించి అవగాహన ఏర్పరచుకుంటే మీరు ఏటా పెద్ద మొత్తంలో ఆదా చేసుకోవచ్చు. అదెలా అంటారా? ఏమి లేదండి.. మీరు సొంత ఇల్లు నిర్మించుకునే సమయంలో ఏదైనా బ్యాంకులో హోమ్ లోన్ తీసుకోండి. ఆ హోమ్ లోన్ వడ్డీ, ప్రిన్సిపల్ అమౌంట్ కూడా పన్ను మినహాయింపునకు అర్హత సాధిస్తాయి. తద్వారా ఒక ఆర్థిక సంవత్సరంలో మీరు పెద్ద మొత్తంలో ట్యాక్స్ ఆదా చేసుకునే వీలుంటుంది. అందుకు పాటించవలసిన కొన్ని సూచనలు, సలహాలు ఇప్పుడు తెలుసుకుందాం..

ప్రిన్సిపల్ చెల్లింపుపై పన్ను మినహాయింపులు..

మీరు మీ హోమ్ లోన్ ప్రిన్సిపల్ అమౌంట్ చెల్లించినప్పుడు, మీరు ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80సీ కింద పన్ను ప్రయోజనాన్ని పొందవచ్చు. ఈ ప్రయోజనం ప్రధాన రీపేమెంట్, స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఛార్జీలను కలిగి ఉంటుంది. ఇది సంవత్సరానికి గరిష్టంగా రూ. 1.5 లక్షల వరకు పొందవచ్చు. అయితే, ఈ మినహాయింపును పొందడానికి, మీరు తప్పనిసరిగా కనీసం ఐదేళ్లపాటు ఆస్తి యాజమాన్యాన్ని కలిగి ఉండాలి.

హోమ్ లోన్ వడ్డీ చెల్లింపు తగ్గింపులు..

అసలు రీపేమెంట్‌తో పాటు, మీ హోమ్ లోన్‌పై చెల్లించే వడ్డీపై కూడా పన్ను మినహాయింపులు వర్తిస్తాయి. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 24 కింద గృహ రుణం కోసం చెల్లించే వడ్డీపై స్వీయ-ఆక్రమిత ఆస్తికి రూ. 2 లక్షల వరకు మినహాయింపులను అనుమతిస్తుంది. లెట్ అవుట్ ప్రాపర్టీకి, చెల్లించిన వడ్డీకి తగ్గింపుపై గరిష్ట పరిమితి లేదు.

సుదీర్ఘ పదవీకాలాలు..

చాలా వరకు హోమ్ లోన్‌లు సాధారణంగా సుదీర్ఘ కాల వ్యవధితో వస్తాయి కాబట్టి, రుణం తిరిగి చెల్లించే మొత్తం వ్యవధికి మీ హోమ్ లోన్ వడ్డీ చెల్లింపులపై పన్ను మినహాయింపులను క్లెయిమ్ చేయడానికి ఇది మిమ్మల్ని అనుమతించే కోణంలో పన్ను ప్రయోజనాన్ని అందిస్తుంది. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 24 ప్రకారం, గృహయజమానులు స్వీయ-ఆక్రమిత ఆస్తి కోసం గృహ రుణ ఈఎంఐ భాగంపై సంవత్సరానికి రూ. 2 లక్షల వరకు తగ్గింపును క్లెయిమ్ చేయవచ్చు.

జాయింట్ గా రుణం తీసుకుంటే..

మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి రుణం తీసుకుంటే, మీరిద్దరూ ప్రిన్సిపల్ చెల్లింపు నుంచి సంవత్సరానికి రూ. 1.5 లక్షల వరకు, వడ్డీ చెల్లింపుల కోసం ఒక్కొక్కరూ రూ. 2 లక్షల వరకు క్లెయిమ్ చేయవచ్చు. ఇది ఆదాయపు పన్ను మినహాయింపు మొత్తాన్ని రెట్టింపు చేయవచ్చు.

అదనపు వడ్డీ తగ్గింపులు..

నిర్దిష్ట సందర్భాలలో, ఇంటి యజమానులు అదనపు వడ్డీ తగ్గింపులను కూడా పొందవచ్చు. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80ఈఈ ప్రకారం, కొన్ని షరతులకు లోబడి రూ. 50,000 వరకు అదనపు మినహాయింపు లభిస్తుంది. అదేవిధంగా, సెక్షన్ 80ఈఈఏ నిర్దిష్ట షరతులలో మళ్లీ రూ. 1.5 లక్షల వరకు తగ్గింపును అందిస్తుంది.

Brahma muhurtham: బ్రహ్మ ముహూర్తం అంటే ఏంటి? ఈ ముహూర్తానికి ఉన్న ప్రత్యేకత ఏంటి?

What is Brahma Muhurta? What is special about this moment?

Brahma muhurtham: బ్రహ్మ ముహూర్తం అనే మాట చాలా మంది నోటి నుంచి వినే ఉంటారు. ఆ సమయంలో ఎటువంటి కార్యం తలపెట్టినా కూడా అది నిర్విగ్నంగా విజయవంతం అవుతుందని నమ్ముతారు.
పురాతన కాలం నుంచి బ్రహ్మ ముహూర్తం గురించి చెప్తూనే ఉంటారు.

బ్రహ్మ ముహూర్తం అంటే ఏంటి?

సూర్యోదయానికి ముందు తెల్లవారు జాము ముందు సమయాన్ని సూచిస్తుంది. సూర్యోదయానికి సుమారు గంట 36 నిమిషాల ముందు ప్రారంభం అవుతుంది. దాదాపు వేకుమజామున 3.30 గంటల నుంచి 5 గంటల బ్రహ్మ ముహూర్తం ఉంటుంది. ఏదైనా కొత్త పనులు చేపట్టేందుకు, శుభ కార్యాలు నిర్వహించుకునేందుకు బ్రహ్మ ముహూర్తం ఉత్తమ సమయాలలో ఒకటిగా పరిగణించబడుతుంది.

బ్రహ్మ ముహూర్తం గురించి సద్గురు ఏమన్నారంటే..

బ్రహ్మ ముహూర్త సమయంలో మెలటోనిన్ స్టేబుల్ గా ఉంటుంది. ఈ సమయంలో కార్టిసాల్ ఎక్కువగా విడుదల అవడం వల్ల ఒత్తిడి తగ్గించుకునేందుకు ఉపయోగపడుతుంది. ఈ సమయంలో విద్యాభ్యాసం చేయడం వల్ల ఏకాగ్రత పెరుగుతుంది. ఈ సమయంలో చాలా మంది తమ ఆధ్యాత్మిక ప్రక్రియి చేపట్టాలని అనుకుంటారు. బ్రహ్మ ముహూర్తం అంటే సృష్టికర్త సమయం. ఈ సమయంలో మీరు చేపట్టే పని ఏదైన విజయం సాధిస్తుందని చెప్పుకొచ్చారు. ఇది అపారమైన శక్తికి మూలంగా పరిగణిస్తారు.

బ్రహ్మ ముహూర్తం ఎందుకు ముఖ్యమైనది?

బ్రహ్మ ముహూర్తానికి జీవితాన్ని మార్చే శక్తి ఉంటుంది. ఆధ్యాత్మిక స్వచ్చత, ప్రశాంతమైన నిర్మలమైన వాతావరణం ఈ సమయంలో ఉంటుంది. యోగా, ధ్యానం, చదువుకోవడానికి ఇది ఉత్తమమైన సమయం. మనసు ఏకాగ్రత ఉంటుంది. జ్ఞానాన్ని నిలుపుకునే సామర్థ్యాన్ని పెంచుతుంది. జ్ఞాపకశక్తి మీద ప్రభావం చూపిస్తుంది. ఈ సమయంలో వాతావరణంలో సానుకూల శక్తి నిండి ఉంటుంది.
బ్రహ్మ ముహూర్తంలో మేల్కొని చదవడం వల్ల ఏకాగ్రత సామర్థ్యం పెరుగుతుంది. చుట్టుపక్కల వాతావరణం ప్రశాంతంగా ఉండటం వల్ల మీ ధ్యాస మొత్తం చదువు, చేపట్టిన పని మీదే ఉంటుంది. మనసు చేస్తున్న పని మీద లగ్నం చేస్తారు. పరధ్యానం లేకుండా ఉంటుంది. ఈ సమయంలో పర్యావరణం శాంతియుతంగా ఉంటుంది. మిమ్మల్ని డిస్ట్రబ్ చేసే వాళ్ళు కూడా ఉండరు. ఎటువంటి శబ్దాలు లేకపోవడం వల్ల ఆధ్యాత్మిక భావనలు, లోతైన ఏకాగ్రత మీకు తోడుగా ఉంటుంది.

బ్రహ్మ ముహూర్తంలో లేస్తే ఆరోగ్య ప్రయోజనాలు

ఈ సమయంలో విశ్వ శక్తులు గరిష్ట స్థాయికి చేరుకుంటాయని చెబుతారు. ధ్యానం, జపం, ప్రార్థన చేసుకునేందుకు, అధ్యాత్మికంగా బలపడేందుకు, అంతర్గత పరివర్తన కోసం ఈ సమయం ఉత్తమం. బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేవడం మంచిదని పురాణాల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు చెప్తూనే ఉంటారు. ఈ సమయంలో నిద్రలేస్తే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆయుర్వేద శాస్త్రం కూడా చెబుతోంది. సూర్యుని నుంచి వచ్చే లేలేత కిరణాలు శరీరం మీద పడటం వల్ల విటమిన్ డి పుష్కలంగా అందుతుంది. బ్రహ్మ ముహూర్తంలో నిద్రని త్యాగం చేయడం మంచిదని రుషులు కూడా చెప్తూ ఉంటారు.
పొద్దున్నే నిద్రలేచి వ్యాయామం చేయడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేస్తే మానసిక, శారీరక ఒత్తిళ్లు కూడా దూరం అవుతాయి.

Kanuma: కనుమ రోజు ఎందుకు ప్రయాణాలు చేయకూడదు?

తెలుగు రాష్ట్రాల ప్రజలు సంక్రాంతిని పెద్ద పండగగా పిలుచుకుంటారు. మూడు రోజుల పాటు ఎంతో సందడిగా జరిగే ఈ పండగ సమయంలో తెలుగు లోగిళ్లు కొత్త అల్లుళ్లు, బంధు మిత్రులతో కళకళలాడుతుంటాయి.
పచ్చని తోరణాలతో సంక్రాంతి లక్ష్మిని ఆహ్వానించే ఈ పర్వదినంలో తొలి రోజు భోగ భాగ్యాలను ప్రసాదించే భోగి, రెండో రోజు పితృదేవతలను పూజించే సంక్రాంతి కాగా.. మూడో రోజు కనుమ. (Kanuma festival) పాడి పశువుల పండగ కనుమ. వ్యవసాయ క్షేత్రాల్లో పంటల సాగుకు ఎంతో సహాయపడిన పశువులకు రైతులు కృతజ్ఞత తెలుపుకొనే రోజు. రైతులు తమకు పండిన పంటను తామే కాకుండా పశుపక్ష్యాదులతో పంచుకోవాలని పిట్టల కోసం ధాన్యపు కంకులను ఇంటి గుమ్మాలకు కడతారు. అయితే, ‘కనుమ రోజున కాకులు కూడా కదలవు’ అనే సామెతను గుర్తు చేస్తూ ఆ రోజు ప్రయాణాలు చేయొద్దని మన పూర్వీకులు చెబుతుంటారు. తరతరాలుగా అనుసరిస్తున్న ఈ సంప్రదాయ నియమాల వ్యాప్తి వెనుక ఉద్దేశాలను పరిశీలిస్తే..

పల్లెల్లో పశువులే గొప్ప సంపద. అవి ఆనందంగా ఉంటేనే కదా రైతుకు ఉత్సాహం.. ఉత్తేజం. పంటలు పండటంలో వీటి పాత్ర ఎంతో గొప్పది. అందుకే వాటిని పూజించి ప్రేమగా చూసుకొనే రోజుగా కనుమను భావిస్తారు. కనుమను పల్లెల్లో వైభవంగా జరుపుకొంటారు. రైతు కుటుంబాలకు సుఖ సంతోషాలను అందించేందుకు అహర్నిశలు కష్టపడుతూ ఈ మూగ జీవాలు పోషిస్తున్న పాత్రను రైతులు మర్చిపోరు. తమ జీవనాధారానికి మూలమైన పశువుల పట్ల కృతజ్ఞతగా కనుమ రోజున వాటికి విశ్రాంతి ఇచ్చి పూజించుకుంటారు. ఆ రోజు నదీ తీరాలు, చెరువుల వద్దకు వాటిని తీసుకెళ్లి స్నానం చేయించిన తర్వాత నుదట పసుపు, కుంకుమ దిద్దుతారు. (Kanuma festival) ఆ తర్వాత వాటిని మువ్వల పట్టీలతో చక్కగా అలంకరించి హారతులిచ్చి పూజించుకొనే గొప్ప సంస్కృతి కనుమ రోజున కనబడుతుంది. ఏడాది మొత్తం రైతుతో సమానంగా కష్టపడే పశువులను కనుమ రోజున ఎలాంటి పనులూ చేయించకుండా పూర్తి విశ్రాంతి కల్పిస్తారు. ఆ రోజు సాయంత్రం పొంగలి చేసి నైవేద్యంగా పెడతూ వాటిపట్ల ప్రేమానురాగాలను చాటుకుంటారు. ఈ విధంగా చేయడం వల్ల పశు వృద్ధి, ధనధాన్యాల వృద్ధి కలుగుతుందని పెద్దల విశ్వాసం.

 

అయితే, కనుమ రోజున ప్రయాణాలు చేయకూడదంటూ పూర్వ కాలంలో పెద్దలు పెట్టిన ఈ ఆచారం వెనుక ఓ గొప్ప ఔన్నత్యమే దాగి ఉంది. వాస్తవానికి పూర్వం ప్రయాణాలకు ఎక్కువగా ఎడ్ల బండ్లే ఉపయోగించేవారు. కనుమ రోజున ఎద్దులను పూజించడంతో ఆ ఒక్కరోజైనా వాటిని కష్టపెట్టకుండా ఉంచాలనే గొప్ప భావనతో బళ్లు కట్టకుండా చూసేందుకు ఆ రోజు ప్రయాణమే వద్దని చెప్పేవారు. ఏడాదిలో ఒక్కరోజైనా ఎద్దులకు విశ్రాంతి ఇవ్వాలనే గొప్ప ఉద్దేశం ఈ మాట వెనుక ఉంది. (Kanuma festival) శ్రమైక జీవనంలో తనతో పాటు వ్యవసాయ క్షేత్రంలో కష్టపడుతున్న ఈ నోరులేని జీవాలకు రైతు ఇచ్చే గౌరవానికి ప్రతీకగా కనుమను భావిస్తారు. అందువల్ల పశు పక్ష్యాదులకు మనిషి జీవితంలో ఎంత ప్రాముఖ్యత ఉందో వివరించే పండుగగా ఆ రోజును పరిగణిస్తారు.

 

సంక్రాంతితో ఉత్తరాయణం మొదలవుతుంది. దేవతలకు ఇది చాలా ఇష్టమైన సమయమని పూర్వీకులు చెబుతుంటారు. అందుకే దీన్ని ఉత్తరాయణ పుణ్యకాలం అని కూడా పిలుస్తారు. చనిపోయిన పెద్దలు కూడా ఇదే రోజున బయటకు వస్తారనీ.. వారిని తలచుకుంటూ ప్రసాదాలు పెట్టాలని ఆచారం. కనుమ రోజు పెద్దలకు ప్రసాదం పెట్టడంతో పాటు ఇంట్లో వాళ్లు కూడా తినేందుకు మాంసాహారం వండుతారు. కనుమ రోజున మినుములు తింటే మంచిదన్న ఉద్దేశంతో ఆ రోజు గారెలు చేసి మాంసాహారం వడ్డిస్తారు. మినుములు చలికాలంలో వేడిని పెంచేందుకూ ఉపయోగపడతాయి. కనుమ రోజు పెద్దల కోసం విందు భోజనం తయారు చేయడమే కాదు.. అందరూ కలిసి తినాలనే నియమం కూడా ఉంది. (Kanuma festival) అందుకే అక్కా చెల్లెల్లు- అల్లుళ్లతో కలిసి కుటుంబమంతా ఈ కనుమ వేడుకను ఉత్సాహంగా జరుపుకొంటారు. కనుమ రోజున ఇంట్లో ఎంతో హడావుడి ఉంటుంది గనక ఆ రోజు ఆగి.. పెద్దలను తలచుకోవాలనీ.. బంధువులతో కాస్త సమయం గడిపి విశ్రాంతి తీసుకొని మర్నాడు ప్రయాణించాలని కొందరు చెబుతుంటారు.

Mustard Oil Benefits: చలికాలంలో ఆవనూనె వాడితే ఎన్ని బెనిఫిట్సో తెలుసా!

ఆవాల నూనె గురించి అందరికీ తెలిసిన విషయమే. ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. దాదాపు అందరి ఇంట్లో కూడా ఆవాలు ఉంటాయి. ప్రతి వంటకంలోనూ ఆవాలను వాడుతూ ఉంటారు.
ఆవాలతో ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఉన్నాయి. ఆవాలనే కాకుండా ఆవాల నూనె కూడా ఉపయోగిస్తూ ఉంటారు. ఆయుర్వేదంలో కూడా ఆవాల నూనెను పలు రకాలా వ్యాధులను నయం చేయడంలో ఉపయోగిస్తూ ఉంటారు.

ఆవాల నూనెలో కూడా ఎన్నో ఔషధ గుణాలు, ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. పూర్వం అయితే ఆవాల నూనెను వంటల్లో ఉపయోగించే వారు. అదే విధంగా శీతా కాలంలో ఆరోగ్య పరంగా ప్రత్యేకమైన కేర్ తీసుకోవాలి. అలా అయితేనే రోగాలు దరి చేరకుండా ఆరోగ్యంగా ఉండొచ్చు. ముఖ్యంగా శీతా కాలంలో ఆవాల నూనెను ఉపయోగిస్తే ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

చెడు కొలెస్ట్రాల్‌ను అదుపు చేస్తుంది:

ఆవాల నూనెను వంటల్లో ఉపయోగించి తీసుకోవడం వల్ల శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ లెవల్స్ అనేవి అదుపులో ఉంటాయి. దీని వల్ల గుండె ఆరోగ్యం మెరుగు పడుతుంది. గుండెకు సంబంధించిన సమస్యలు కూడా రాకుండా ఉంటాయి.

రక్త పోటు తగ్గించుకోవచ్చు:

అధిక రక్త పోటు సమస్య ఉన్నవారు ఆవాల నూనె వాడటం చాలా మంచిది. ఇందులో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. దీని వల్ల రక్త పోటును అదుపు చేయవచ్చు.

రోగ నిరోధక శక్తి మెరుగు పడుతుంది:

ఆవాల నూనె తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి అనేది మెరుగు పడుతుంది. దీంతో వాతావరణ మార్పుల వల్ల వచ్చే ఇన్ ఫెక్షన్ల బారిన పడకుండా ఉండొచ్చు.

జీర్ణ శక్తి మెరుగు పడుతుంది:

ఆవాల నూనె తీసుకోవడం వల్ల శరీరంలో జీర్ణ శక్తి అనేది మెరుగు పడుతుంది. తిన్న ఆహారం త్వరగా అరుగుతుంది. దీంతో బరువు తగ్గే అవకాశాలు కూడా ఉన్నాయి. కడుపులో నొప్పి, ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలు రాకుండా ఉంటాయి.

మూత్ర పిండాలు ఆరోగ్యంగా ఉంటాయి:

ఆవాల ఆయిల్ ఉపయోగించడం వల్ల మూత్ర పిండాల ఆరోగ్యం కూడా మెరుగు పడుతుంది. అదే విధంగా శరీరంలో ఇన్ ప్లామేషన్ కూడా తగ్గుతుంది. థైరాయిడ్ సమస్యతో బాధ పడేవారు కూడా ఆవాల ఆయిల్ వాడటం మంచిది. అదే విధంగా క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల బారిన పడకుండా ఉంటే అవకాశాలు ఉంటాయి.

గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడం మేలు.

IMMS Latest Updated Version Download

IMMS Latest Updated Version Download
IMMS APP Download – IMMS Play Store APP Download -MDM – TMF Sanitation APP
IMMS APP Download – IMMS Play Store APP Download -MDM – Sanitation APP. Integrated MDM Monitoring System and Sanitation APP Download from Play Store. Every HM of the Every School has to enter the details of MDM and Meals Taken, Eggs Report, Chikkis Report and Sanitation Details in IMMS APP everyday. This IMMS APP is very useful for all Head Masters for Monitoring of MDM and School Sanitation. Download the IMMS APP from Google Play Store.

AP IMMS App Latest version has been updated. The newly released . Old version of IMMS App would not work from today on wards. School heads are requested to download newer version of IMMS for updating school details. The download direct link is given below.

Download IMMS Latest Updated version

ఎట్టి పరిస్థితుల్లో *401# నెంబర్‌కు కాల్ చేయొద్దు – ఎందుకంటే?

టెలికామ్‌ కంపెనీ నుంచి ఫోన్ చేస్తున్నట్లు కాల్ చేసి *401# డయల్ చేయమని కోరితే అలంటి వాటికి స్పందించవద్దని డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (DoT) వెల్లడించింది.
ప్రజలను మోసం చేయడానికి సైబర్ నేరగాళ్లు పొందుతున్న మరో ఎత్తుగడ ఇదని డాట్ తెలిపింది.

సమస్యల పరిష్కారం పేరుతో.. సైబర్ మోసగాళ్ళు అమాయక ప్రజలను మోసం చేయడానికి ఇలాంటి ఎత్తులు వేస్తున్నారని డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ తెలియజేస్తూ.. సంస్థ ఎప్పుడూ ఫోన్ చేసి అలంటి వాటిని ఎంటర్ చేయమని చెప్పదని స్పష్టం చేసింది.

*401# కాల్ చేస్తే ఏమవుతుంది!
నిజానికి *401# నెంబర్ ఎంటర్ చేయగానే మీకు రావాల్సిన కాల్స్ గుర్తు తెలియని వ్యక్తులకు వెళ్ళిపోతాయని, కాల్‌ ఫార్వార్డ్‌కు మీరు పర్మిషన్ ఇచ్చినట్లే అవుతుందని డాట్ పేర్కొంది. మీ కాల్స్ మోసగాళ్ళు రిసీవ్ చేసుకుంటే.. అవతలి మీ స్నేహితులను లేదా బంధువులను మోసం చేసే అవకాశం ఉంది. కాబట్టి ఈ నెంబరుకు ఎట్టి పరిస్థితుల్లో కాల్ చేయవద్దని డాట్ హెచ్చరించింది.

ఒకవేళా మీ మొబైల్ ఫోనులో కాల్ ఫార్వార్డింగ్ యాక్టివేట్ అయి ఉంటే.. వెంటనే సెట్టింగులోకి వెళ్లి డీయాక్టివేట్ చేసుకోండి. లేకుంటే సైబర్ నేరగాళ్లు సులభంగా మీ కాల్స్ రిసీవ్ చేసుకుని మోసాలకు పాల్పడే అవకాశం ఉంటుంది.

Cooch Behar Trophy : కర్ణాటక యువ బ్యాటర్ సంచలన ప్రదర్శన.. ఒకే ఇన్నింగ్స్‌లో 404 నాటౌట్‌

Cooch Behar Trophy final : కూచ్ బెహార్ ట్రోఫీలో సంచలనం నమోదైంది. దేశవాలీ క్రికెట్‌లో అండర్‌-19 స్థాయిలో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) దీన్ని నిర్వహిస్తూ ఉంటుంది.
తాజాగా నిర్వహించిన టోర్నీ ఫైనల్ మ్యాచులో కర్ణాటక బ్యాటర్ ప్రఖర్ చతుర్వేది 400 పైగా పరుగులతో అజేయంగా నిలిచాడు.

ముంబైతో జరిగిన మ్యాచులో 638 బంతులు ఎదుర్కొన్న చతుర్వేది 46 ఫోర్లు, 3 సిక్సర్లతో 404 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. 79 ఏళ్ల ఈ టోర్నీ చరిత్రలో ఫైనల్ మ్యాచులో 400 పరుగులు చేసిన భారత ఆటగాడిగా రికార్డులకు ఎక్కాడు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ముంబై జట్టు మొదట బ్యాటింగ్ చేసింది. ఆయుష్ మత్రే (145) శతకం, సచిన్ వర్తక్ (73) హాఫ్ సెంచరీలతో రాణించడంతో ముంబై తొలి ఇన్నింగ్స్‌లో 380 పరుగులు చేసింది. ఆ తరువాత ప్రఖర్ చతుర్వేది తో పాటు హర్షిల్ ధర్మానీ (169), కార్తికేయ (72), కార్తిక్ (50), సమర్థ్‌ (55 నాటౌట్‌)లు రాణించడంతో కర్ణాటక తమ మొదటి ఇన్నింగ్స్‌ను 890/8 వద్ద డిక్లేర్ చేసింది.
నాలుగు రోజుల మ్యాచ్ సమయం ముగియడంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. అయితే… మొదటి ఇన్నింగ్స్‌లో 510 పరుగుల ఆధిక్యం సాధించిన కర్ణాటక ట్రోఫీని ముద్దాడింది.

Chanakya Niti Telugu : పురుషుల్లో ఈ లక్షణాలు ఉంటే మహిళలు వదులుకోరు

చాణక్యుడు గొప్ప ఆర్థికవేత్త, తత్వవేత్త. ఆర్థిక శాస్త్రం, రాజకీయాలు, దౌత్యం కాకుండా జీవితం గురించి కూడా చాలా విషయాలు చెప్పాడు. నేటికీ ప్రజలు చాణక్యుడి మాటలు, సూత్రాలను జీవితంలో పాటిస్తున్నారు.
చాణక్యుడు తన చాణక్య నీతిలో మనిషిలోని కొన్ని మంచి లక్షణాలను పేర్కొన్నాడు. ఇటువంటి లక్షణాలు మహిళలకు చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. పురుషులలోని ఈ గుణాలను తెలుసుకుంటే స్త్రీలు వారిని ఎప్పటికీ వదలరు.

అలాంటి పురుషుల పట్ల స్త్రీలు ఎందుకు ఆకర్షితులవుతున్నారో కూడా చాణక్యుడు వివరించాడు. అలాంటివారు తమ జీవితంలో భాగం కావాలని మహిళలు కోరుకుంటారు. చాణక్య నీతిలో పురుషుడికి ఉండాల్సిన లక్షణాల గురించి ఏం చెప్పారో చూద్దాం..

చాణక్యుడు ప్రకారం, ప్రతి మనిషి తన భాగస్వామి వ్యవహారాలను ఎప్పుడూ రహస్యంగా ఉంచాలి. మీ భాగస్వామి రహస్యాలను ఎవరికీ చెప్పకండి. స్త్రీలు అలాంటి పురుషులను విడిచిపెట్టడానికి ఎప్పుడూ ఇష్టపడరు. జీవితాంతం అలాంటి భాగస్వామితో ఉండాలని కోరుకుంటారు. అలాంటి స్త్రీలు ఎల్లప్పుడూ పురుషుడితో సంతోషంగా ఉంటారు.

చాణక్యుడు ప్రకారం, స్త్రీలను ఎల్లప్పుడూ గౌరవించే పురుషుల పట్ల మహిళలు ఎల్లప్పుడూ ఆకర్షితులవుతారు. స్త్రీలను లేదా ఇతరులను గౌరవించని పురుషులతో మాట్లాడటం స్త్రీలకు ఇష్టం ఉండదు. అందుకే స్త్రీలను గౌరవించండి.

ఒక స్త్రీకి పురుషుడు స్వేచ్ఛనివ్వాలి. అలాంటి పురుషులను స్త్రీలు ఇష్టపడతారు. వారిని ఎప్పుడూ అనుమానించవద్దు. పూర్తి స్వేచ్ఛ ఇవ్వండి. స్త్రీలు అలాంటి పురుషులను ప్రేమిస్తారు. ఎప్పుడూ అలాంటి పురుషులతో ఉండాలని కోరుకుంటారు.

చాణక్య నీతి ప్రకారం, స్త్రీలు ఎప్పుడూ అహంకారం ఉన్న పురుషులను ఇష్టపడరు. మహిళలు అహంకారం లేని పురుషులను ఇష్టపడతారు. మహిళలు అతనితో దీర్ఘకాలిక సంబంధంలో ఉండాలని కోరుకుంటారు.
బాంధవ్యాలలో నిజాయితీ ఉన్న వ్యక్తికి ప్రతిచోటా గౌరవం లభిస్తుందని చాణక్యుడు చెప్పాడు. స్త్రీలతో మంచిగా ప్రవర్తించే పురుషులు తమ భార్యలను లేదా స్నేహితురాళ్ళను ఎప్పటికీ మోసం చేయరు. పురుషుల ఈ గుణం స్త్రీలను ఆకర్షిస్తుంది. అలాంటి పురుషులు తమ సంబంధాలను బలోపేతం చేయడానికి నిరంతరం ప్రయత్నిస్తారు. నిజాయితీపరులైన పురుషులను విడిచిపెట్టడానికి మహిళలు సిద్ధంగా ఉండరు. తన జీవితంలో భాగం కావాలని ప్రతి స్త్రీ కోరుకుంటుంది.
మృదుస్వభావం, సౌమ్యత వంటి లక్షణాలు తరచుగా మహిళల్లో చూస్తుంటాం. కానీ పురుషులలో ఈ లక్షణాలు ఉంటే అది వారి నిజాయితీని తెలియజేస్తుంది. అలాంటి వారు తమ మధురమైన మాటలతో ఇతరుల హృదయాలను గెలుచుకుంటారు.

స్త్రీలతో మంచిగా ప్రవర్తించే, గౌరవించే పురుషులను మహిళలు ఇష్టపడతారు. స్త్రీలతో మర్యాదగా మాట్లాడే పురుషులంటే స్త్రీలకు చాలా ఇష్టం. అమ్మాయిలు తక్షణమే అలాంటి పురుషులతో ప్రేమలో పడతారు.

Personal Finance: ఈ ఫార్ములాతో లక్షాధికారి కావడం ఖాయం.. పక్కాగా అమలు చేసి చూడండి..

కొత్త సంవత్సరం ప్రారంభమైంది. ఆర్థిక స్థిరత్వం కోరుకునే వారు ఏడాది మొదటి నుంచి ఆర్థిక ప్రణాళిక కచ్చితంగా ఉండేలా చూసుకోవాలి. అందుకు మీకు కావాల్సింది కేవలం మీ రాబడి ప్రకారం, ఖర్చులు, పెట్టుబడులను విభజించుకోవడం.
అలా చేసినప్పుడే అనుకున్న ఆర్థిక లక్ష్యాలను అందుకోగలుగుతారు. అందుకోసం ఆర్థిక నిపుణులు ఓ మంచి ఫార్ములాను అందిస్తున్నారు. అది 50-30-20 ఫార్ములా. కొత్త సంవత్సరంలో చాలా మంది దీర్ఘకాలంలో మంచి రాబడులను అందించే బెస్ట్ స్కీమ్ల కోసం వెతుకుతున్నారు. నిజానికి మీ పెట్టుబడులకు తక్షణ లాభాలను అందించే స్కీమ్లు ఏమి ఉండవు. ఏ పథకమైనా దీర్ఘకాలంలో మంచి రాబడులను ఇస్తాయి. అయితే అంతకన్నా ముందు మీ రాబడులను కచ్చితంగా బడ్జెట్ చేయడం చాలా అవసరం. అందుకు ఉపయోగపడేది ఈ 50-30-20 ఫార్ములా.

50-30-20 ఫార్ములా అంటే..

వేగవంతమైన వ్యక్తిగత బడ్జెట్ కోసం సూటిగా 50/30/20 మార్గదర్శకాన్ని పరిగణించండి. ఇది సరళమైన బడ్జెట్ ఫ్రేమ్‌వర్క్. ఈ నియమం ప్రకారం మీ నెలవారీ ఆదాయాన్ని మూడు భాగాలుగా విభజించాలి. అది 50శాతం, 30శాతం, 20శాతంగా చేయాలి.

50 శాతం అవసరాలకు కేటాయించండి: ఇందులో హౌసింగ్, ఆహారం, రవాణా, యుటిలిటీస్, కనీస రుణ చెల్లింపులు వంటి కీలకమైన ఖర్చులు ఉంటాయి. ఇవి మీ ప్రాథమిక శ్రేయస్సును భద్రపరిచే, అవసరమైన బాధ్యతలను నిర్వర్తించే అనివార్యమైన అవసరాలు.

కోరికల కోసం 30 శాతం ఉంచండి: ఈ భాగం మీ ఐచ్ఛిక ఖర్చులను సూచిస్తుంది. మీరు కోరుకునే కానీ అవసరం లేని ఆనందించే అంశాలను కలిగి ఉంటుంది. ఇందులో వినోదం, భోజనాలు, సెలవులు, హాబీలు, సభ్యత్వాలు ఉంటాయి. ఇక్కడ, మీ వ్యక్తిగత ప్రాధాన్యతల ఆధారంగా ప్రాధాన్యత ఇవ్వడానికి , మీ ఆర్థిక లక్ష్యాలకు అనుగుణంగా సర్దుబాట్లు చేయడానికి మీకు సౌలభ్యం ఉంది.

20 శాతాన్ని పొదుపు చేయండి: ఈ కేటాయింపు మీ ఆర్థిక భవిష్యత్తును భద్రపరచడం, మీ లక్ష్యాలను సాకారం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇది పొదుపు ఖాతాలు, అత్యవసర నిధులు, పదవీ విరమణ పొదుపులు, రుణ పరిష్కారం లేదా భవిష్యత్తు పెట్టుబడులకు కేటాయించాలి . మీరు అధిక-వడ్డీ రుణాన్ని కలిగి ఉన్నట్లయితే, ఆర్థిక సవాళ్ల నుంచి బయటపడటానికి తిరిగి చెల్లించడానికి ప్రాధాన్యత ఇవ్వండి.

50/30/20 నియమం ప్రయోజనాలు..

50/30/20 నియమం సమర్థవంతమైన ఆర్థిక నిర్వహణ కోసం అనేక ప్రయోజనాలను అందిస్తుంది. ఇది వివిధ వయస్సులు, ఆదాయ బ్రాకెట్లలోని వ్యక్తులకు అనుకూలమైన ఎంపికగా చేస్తుంది. ఈ మార్గదర్శకం మీ ఆదాయాన్ని మూడు స్పష్టమైన విభాగాలుగా వర్గీకరిస్తుంది. అమలును సులభతరం చేస్తుంది. దీనికి క్లిష్టమైన లెక్కలు లేదా ఆర్థిక పరిభాష అవసరం ఉండదు. అంతేకాక ఇది మీ ఖర్చుల వర్గీకరణను ప్రోత్సహిస్తుంది, మెరుగైన ట్రాకింగ్, మీ ఖర్చు విధానాల విశ్లేషణను సులభతరం చేస్తుంది. మొదటిసారి బడ్జెట్ చేసేవారికి సులభంగా అర్థం అవుతుంది.

Divy Ayodhya App: అయోధ్య భక్తుల కొరకు నూతన మొబైల్ యాప్

Divy Ayodhya : Mobile App for Piligrims
Ayodhya UP gov initiative single window platform for all your stay travel needs

Navya Ayodhya, Bhavya Ayodhya, Navya Ayodhya UP government initiative – Single window platform for all your stay and travel needs.
Ayodhya Development Authority (ADA) is a principal agency of the Government of Uttar Pradesh, which is responsible for taking ahead the tradition of planned and sustainable development of Ayodhya and Faizabad.

Download Mobile App 

కదిలే స్కూటీపై జంట రొమాన్స్.. హగ్గులు, కిస్సులతో రోడ్డుపైనే రెచ్చిపోయిన ప్రేమికులు.. వైరల్..

మహారాష్ట్రలోని ముంబైలో వీధుల్లో ఓ ప్రేమ జంట నడిరోడ్డుపైనే రెచ్చిపోయింది. స్కూటీపై రిస్కీ స్టంట్స్ తో రొమాన్స్ చేసుకున్నారు. ఒకనొకరు హగ్ చేసుకున్నారు.
ముద్దులతో ముంచెత్తుకున్నారు. దీనిని ఆ రోడ్డు గుండా వెళ్లే పలువురు వీడియో తీశారు. దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇప్పుడది వైరల్ గా మారింది. అయితే ఈ వీడియోకు నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు

అది ముంబైలోని బాంద్రా రిక్లమేషన్ రోడ్. ఈ రోడ్డు ఎప్పుడూ వాహనాల రాకపోకలతో రద్దీగా ఉంటుంది. రెండు రోజుల కిందట ఈ రోడ్డుపై ఓ స్కూటీ వెళ్తోంది. యువకుడు స్కూటీ నడుపుతుండగా.. ఓ యువతి అతడికి ఎదురుగా, గట్టిగా హగ్ చేసుకొని కూర్చొంది. యువతి తన స్కార్ఫ్ తో అతడిని కప్పేసింది.
స్కూటీ రోడ్డుపై వెళ్తూనే ఉండగా.. వారిద్దరూ హగ్గులు, కిస్సులతో రొమాన్స్ చేసుకున్నారు. ఎంతో సంతోషంలో మునిగిపోయారు. ఆ ప్రేమ జంట మత్తులో మరో లోకంలో విహరిస్తూ.. తాము నడిరోడ్డుపై ఉన్నామనే సంగతి కూడా మర్చిపోయింది. ఈ చర్య సామాజిక నిబంధనలను ఉల్లంఘించడమే కాకుండా, రోడ్డు భద్రతా నిబంధనలు కూడా ఉల్లంఘించింది. ఎందుకంటే ఇద్దరూ హెల్మెట్ ధరించకపోగా.. రోడ్డుపై అసభ్యకరంగా ప్రవర్తించారు.
అయితే వీరి చర్యను అటుగా వెళ్తున్న ఓ ప్రయాణికుడు తన సెల్ ఫోన్ లో రికార్డు చేశాడు. అనంతరం దానిని సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశాడు. తరువాత ‘బాంద్రా బజ్’ అనే ఎక్స్ (ట్విట్టర్) హ్యాండిల్ లో షేర్ అయ్యింది. ”ఈ సాహసోపేత జంట బాంద్రా రెక్లమేషన్ వద్ద తమ అసాధారణమైన స్కూటర్ రైడ్ తో కనిపించారు.” అని క్యాప్షన్ పెట్టారు. దీనికి ముంబై పోలీసును ట్యాగ్ చేశారు.

ఈ వీడియో సోషల్ మీడియాలో దుమారం రేపుతోంది. నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. పలువురు దీనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు వెంటనే దీనిపై జోక్యం చేసుకోవాలని కోరారు. కానీ కొందరు ప్రేమికులకు మద్దతుగా నిలిచారు. కాగా.. రద్దీగా ఉండే వీధిలో ఇలాంటి ఘటన జరగడం ఇదే తొలిసారి కాదు. గత ఏడాది కూడా ఢిల్లీ రోడ్లపై స్కూటీపై వెళ్తున్న ఓ ప్రేమ జంట ఇలాంటి చర్యకే ఒడిగట్టింది. ఓ జంట ఒకరినొకరు కౌగిలించుకొని రొమాన్స్ చేసింది. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

వైఎస్ షర్మిల కు ఏపీ పీసీసీ పగ్గాలు..మూహూర్తం ఫిక్స్..?

YS Sharmila: ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి తనయ వైఎస్ షర్మిల త్వరలో ఏపీ పీసీసీ పగ్గాలు చేపట్టనున్నారు. పార్టీ ఏ భాద్యతలు అప్పగించినా స్వీకరిస్తానని ఇప్పటికే షర్మిల పేర్కొన్నారు.
రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయయాత్ర ప్రారంభోత్సవ కార్యక్రమానికి వెళ్లిన వైఎస్ షర్మిలకు త్వరలో పీసీసీ బాధ్యతలు అప్పగిస్తున్నట్లుగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ సూచించినట్లు సమాచారం.
ఈ నెల 17వ తేదీన మధుసూధన్ మిస్త్రీ ఆధ్వర్యంలో ఏపీ లో లోక్ సభ, అసెంబ్లీ అభ్యర్ధుల స్క్రీనింగ్ కమిటీ సమావేశం జరగనున్న నేపథ్యంలో ఈలోపుగానే షర్మిలకు పీసీసీ బాధ్యతలు అప్పగించాలని పార్టీ డిసైడ్ అయినట్లుగా తెలుస్తొంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం 15 నుండి 20 అసెంబ్లీ స్థానాల గెలుపే లక్ష్యంగా పెట్టుకోవాలని కాంగ్రెస్ భావిస్తుంది. సొంతంగా రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారం వచ్చే పరిస్థితి లేకపోయినా 15 – 20 స్థానాలు గెలుచుకుంటే కింగ్ మేకర్ పాత్ర పోషించవచ్చని ఆ దిశగా పని చేయాలని పార్టీ రాష్ట్ర నేతలకు పార్టీ హైకమాండ్ దిశానిర్దేశం చేసినట్లు సమాచారం.
ఓ పక్క వైఎస్ షర్మిల తన కుమారుడు రాజారెడ్డి నిశ్చితార్ధం, వివాహ ఏర్పాట్లలో బిజీగా ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. రాహుల్ భారత్ జోడో న్యాయ యాత్ర ప్రారంభోత్సవంలో పాల్గొనేందుకు ఢిల్లీ నుండి ప్రత్యేక విమానంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటి సీఎం భట్టి విక్రమార్క, ఏపీ నేతలు కొప్పుల రాజు, రఘువీరారెడ్డి, జేడీ శీలం, వైఎస్ షర్మిల తదితరులు మణిపూర్ కు వెళ్లారు. ఇతక కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, సీఎల్పీ నేతలు, పీసీసీ అధ్యక్షుడు, ఏఐసీసీ అఫీసు బేరర్లు కూడా మణిపూర్ సభలో పాల్గొన్నారు.

Fingerprints: ప్రతి వేలిముద్ర విభిన్నం కాదు!.. సంచలనంగా మారిన సరికొత్త అధ్యయనం

ఈ భూమండలం మీద ప్రతివ్యక్తి ప్రత్యేకమైన వేలిముద్రలను కలిగివుంటాడని చెబుతుంటారు. ఒకే వ్యక్తికి చెందిన ఒక వేలి ముద్ర మరో వేలు ముద్రతో సరిపోలదని అంటుంటారు.
అందుకే పోలీసులు కూడా కేసుల దర్యాప్తుల్లో నేరస్థుల గుర్తింపునకు వేలిముద్రలను కీలకంగా భావిస్తుంటారు. అయితే ఈ సిద్ధాంతం తప్పు అని కొలంబియా యూనివర్సిటీ తాజా అధ్యయనం సవాలు చేస్తోంది.

ప్రతి వేలిముద్ర ప్రత్యేకం కాదని చెబుతోంది. 60,000 వేలిముద్రలను విశ్లేషించి ఒక ప్రత్యేక వ్యక్తికి సంబంధించిన వాటిని మాత్రమే గుర్తించేలా ఒక ఏఐ ప్రోగ్రామ్‌కు (AI) శిక్షణ ఇవ్వగా.. సదరు వ్యక్తి వేలిముద్రలు 75-90 శాతం ఖచ్చితత్వంతో పోలి ఉన్నప్పుడు మాత్రమే ఏఐ వ్యవస్థ గుర్తించగలిగిందని అధ్యయనకారులు చెబుతున్నారు. ముఖాల గుర్తింపులో తరచుగా ఉపయోగించే డీప్ కాంట్రాస్టివ్ నెట్‌వర్క్‌గా పిలిచే ఏఐ విధానాన్ని శాస్త్రవేత్తలు వినియోగించారు. వేలిముద్రల విషయంలో చాలా కాలంగా ఆమోదయోగ్యంగా ఉన్న విషయాన్ని ఎత్తి చూపుతున్న ఈ రీసెర్చ్ ‘సైన్స్ అడ్వాన్సెస్ జర్నల్‌’లో ఈ వారమే ప్రచురితమైంది.

చైనా కంట్లో మాల్దీవుల కారం.. భారత్ చాణక్య వ్యూహం..!

Maldives-Lakshadweep Controversy: ఒక్క తుపాకీ పేలలేదు. ఒక్క సైనికుడూ బోర్డర్ దాటలేదు. ఒక్క చుక్క రక్తం కారలేదు. అయినా చైనాకు గిలగిలమని కొట్టుకుంటోంది.
మాల్దీవుల భుజాలపై తుపాకీ పెట్టి మనల్ని టార్గెట్ చేద్దామనుకుంది. యుద్ధం చేయకుండానే మనల్ని చావుదెబ్బ కొడదామనుకుంది. ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా భారత్ ను ఉక్కిరిబిక్కిరి చేయాలనుకుంది. యుద్ధం పేరుతో అది భయపెడితే.. రాజనీతితో మనం చెక్ పెడుతున్నాం. యుద్ధ రంగంలో అది కాలుపెడితే.. చదరంగ రీతిలో మనం జస్ట్ చేయి పెట్టి చెక్ పెట్టాం. ప్రపంచానికి పాఠాలు నేర్పించిన విశ్వవిద్యాలయాలు ఉన్న గడ్డ ఇది. ఆ విషయం దానికి తెలియక కాదు. ఇప్పుడు ఇజ్రాయెల్ లక్షద్వీప్ విషయంలో ముందుకు వచ్చేసరికీ దానికి గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్టయ్యింది. కక్కాలేక, మింగాలేక, ఊపిరాడక గింజుకుంటోంది. నిజానికి ఇప్పుడున్న సమస్య మాల్దీవులు Vs లక్షద్వీప్ కాదు. చైనా Vs భారత్.
మన విదేశాంగరీతి మనకు అందర్నీ స్నేహితులను చేస్తుంది. కానీ దాని విదేశాంగ నీతి.. డ్రాగన్ కు అందర్నీ శత్రువులుగా మారుస్తోంది. అందుకే మనల్ని దెబ్బకొట్టాలన్నది దాని ప్లాన్. దీనికోసం మన ఇరుగుపొరుగు దేశాలతో మనకు శత్రుత్వం కలిగేలా స్కెచ్ వేసింది. శ్రీలంక, నేపాల్, మాల్దీవులు.. ఇవన్నీ మనపై కస్సుబుస్సులాడడం వెనుక చైనా ఎత్తులు, కుయుక్తులు ఉన్నాయి. మాల్దీవుల వ్యూహంతో మనల్ని రచ్చరచ్చ చేయాలనుకుంది. కానీ అది ఊహించని రీతిలో మన ప్రధాని నరేంద్రమోదీ లక్షద్వీప్ స్కెచ్ ముందు అది తేలిపోయింది. ఒక్కసారిగా షాకైంది. అది తేరుకునే లోపే.. భారత్ లో అందరి స్వరం పెరిగింది. దాంతో మాల్దీవులకు జ్వరం వచ్చింది. డ్రాగన్ ఇచ్చే పారసిటమాల్ టాబ్లెట్ కూడా ఆ ఫీవర్ ను తగ్గించలేదు. పైగా ఇప్పుడు లక్షద్వీప్ లో డీశాలినేషన్ ప్రాజెక్టు విషయంలో సాయం చేయడానికి ఇజ్రాయిల్ మళ్లీ ముందుకొచ్చింది. దీనిని బట్టి లక్షద్వీప్ ఇష్యూ ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించిందని అర్థమవుతోంది.పైగా ఇజ్రాయెల్ రాకతో.. మనకు ప్రపంచ దేశాల మద్దతు మొదలైనట్టే. అదే చైనాకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది.

డీశాలినేషన్ ప్రాజెక్ట్ చేపట్టాలని మనం ఇజ్రాయెల్ ను గతంలో కోరాం. కిందటి ఏడాది ఆ దేశం నుంచి ఓ టీమ్ లక్షద్వీప్ కు వచ్చింది. అన్నీ చూసింది. ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ పై వర్క్ చేయడానికి రెడీగా ఉంది. ఆ విషయాన్నే చెబుతూ.. లక్షద్వీప్ బ్యూటీ ఎలా ఉంటుందో కళ్లకు కట్టినట్టు చూపించింది. దీనికోసం కొన్ని ఫోటోలను కూడా ఇజ్రాయెల్ ఎంబసీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

లక్షద్వీప్ సెగ మాల్దీవులకు తగిలిన వెంటనే.. ఆ దేశ అధ్యక్షుడు ముయిజ్జు చైనాకు వెళ్లారు. అయిదు రోజుల పాటు అక్కడ పర్యటించారు. చైనా అధ్యక్షుడితో మంతనాలు జరిపారు. సరే.. ఆ రెండు దేశాల మధ్య ఏం చర్చలు నడిచాయి అన్నది పక్కన పెడితే… టూర్ ముగింపులో మాల్దీవుల అధ్యక్షుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వాళ్ల దేశాన్ని విమర్శించే రైట్ ఎవరికీ లేదంటూ.. ఇన్ డైరెక్ట్ గా మనల్ని ఉద్దేశించి అన్నారు. వాళ్లది చిన్న దేశమే అయినా.. వాళ్లను అవమానించడానికి ఎలాంటి పర్మిషన్ ఇవ్వడం లేదు అన్నారు. నిజానికి ఏ దేశానికి మరో దేశాన్ని విమర్శించే అధికారం, హక్కు లేవు. కానీ ఇక్కడ వాళ్లను వాళ్లే అవమానించుకుంటున్నారు అన్న సంగతిని ముయిజ్జు మర్చిపోయినట్టుంది. వాళ్ల మంత్రుల నోటీ దురుసు వల్లే కదా.. పరిస్థితి ఇంతవరకూ వచ్చింది. ఇప్పటికి దానికి ఒక్క విషయం అర్థమైనట్టుంది. మననుంచి టూరిజం సపోర్ట్ తగ్గిపోతుందని ఊహించి.. చైనా నుంచి పర్యాటకులను ఎక్కువగా పంపించాలని.. ఆ దేశాధ్యక్షుడు జిన్ పింగ్ ని కోరింది. ఇప్పుడు ఎవరు ఎవరితో ఉన్నారో ఈజీగా అర్థమవుతుంది.
మనకు ఎవరూ శత్రువులు లేరు. మనం ఎవరికీ శత్రువు కాదు. మన జోలికొస్తే మనం ఊరుకోం. ఇతర దేశాల విషయంలో మనం ఎప్పుడూ జోక్యం చేసుకోలేదు. చేసుకోబోము. కానీ చైనా అలా కాదు.. తన చుట్టుపక్కల దేశాలన్ని తన చెప్పుచేతల్లోనే ఉండాలని.. తన మాటనే వినాలని కోరుకుంటోంది. మన దగ్గర దాని ఎత్తులు, జిత్తులు పనిచేయవు. అందుకే ఓ వ్యూహం ప్రకారం.. మన ఇరుగుపొరుగు దేశాలతో సఖ్యత పెంచుకుని.. సాయం పేరుతో వాటిని చేరదీసి.. మనపైకి ఉసిగొల్పుతోంది. అందుకే మోదీ సర్కార్ చాలా తెలివిగా.. చైనా కంట్లో మాల్దీవుల కారం కొట్టింది. మరి.. కంటిమంటతో కామ్ అవుతుందో.. మరో వ్యూహంతో ముందుకొస్తుందో చూద్దాం. రాజనీతి అయినా, చదరంగ రీతి అయినా చాణక్యుడు పుట్టిన గడ్డ ఇది అని మర్చిపోవద్దు డ్రాగన్.

 

Health

సినిమా