Business Idea: ఉద్యోగం చేస్తూనే వ్యాపారం చేసే ఛాన్స్‌.. నష్టం అనేదే ఉండదు

తక్కువ పెట్టుబడితో మంచి ఆదాయాన్ని ఆర్జించే వ్యాపారంలో మసాల దినుసుల వ్యాపారం ఒకటి. ఈ వ్యాపారాన్ని తక్కువ బడ్జెట్‌తోనే ప్రారంభించవచ్చు. అలాగే నష్టం కూడా చాలా తక్కువగా ఉంటుంది. ప్రతీరోజూ దైనందిక జీవితంలో మసాల దినుసులు ఒక భాగం కావడమే దీనికి కారణం. ఇంతకీ…
చాలా మందికి వ్యాపారం చేయాలనే ప్యాషన్‌ ఉంటుంది. అయితే ఉద్యోగంలో సేఫ్టీ ఉంటుందన్న కారణంతో ఎక్కువ మంది ఉద్యోగానికే మొగ్గు చూపుతారు. అయితే కొన్ని రకాలో బిజినెస్‌లను ఉద్యోగం చేస్తూనే చేసుకోవచ్చు. అలాంటి బిజినెస్ ఐడియాల్లో ఒకదాని గురించి ఈరోజు తెలుసుకుందాం.
తక్కువ పెట్టుబడితో మంచి ఆదాయాన్ని ఆర్జించే వ్యాపారంలో మసాల దినుసుల వ్యాపారం ఒకటి. ఈ వ్యాపారాన్ని తక్కువ బడ్జెట్‌తోనే ప్రారంభించవచ్చు. అలాగే నష్టం కూడా చాలా తక్కువగా ఉంటుంది. ప్రతీరోజూ దైనందిక జీవితంలో మసాల దినుసులు ఒక భాగం కావడమే దీనికి కారణం. ఇంతకీ ఈ వ్యాపారాన్ని ఎలా ప్రారంభించాలి.? ఎలాంటి లాభాలు ఉంటాయి.? ఇప్పుడు తెలుసుకుందాం..


ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు మసాలా దినుసులకు చాలా డిమాండ్‌ ఉంటుంది. ప్రతీ రోజూ వంటింట్లో ఉపయోగించే మసాలల వ్యాపారాన్ని ప్రారంభించే అసలు నష్టం అనే మాటే ఉండదు. తక్కువ పెట్టుబడితో ప్రారంభించవచ్చు. మసాలా తయారీ యూనిట్‌ ప్రారంభించడానికి ఒక్కసారి పెట్టుబడి పెడితే చాలు నిత్యం ఆదాయం పొందొచ్చు. మసాల దినుసులను హోల్‌సేల్‌గా కొనుగోలు చేసి చిన్న చిన్న దుకాణాలకు సరఫరా చేయొచ్చు.
తక్కువలో తక్కువ ఈ వ్యాపారాన్ని ప్రారంభించేందుకు రూ. 3.5 లక్షలు అవుతుంది. ప్రారంభంలో తక్కువ బడ్జెట్‌తో ప్రారంభించి క్రమంగా పెంచుకుంటూ పోవచ్చు. అలాగే సరకులను స్టోర్‌ చేయడానికి ఓ గది ఉండాలి. ఇక ఈ వ్యాపారాన్ని ప్రారంభించేందుకు ముద్రలోన్ ద్వారా రుణం కూడా తసుకోవచ్చు. మంచి మార్కెటింగ్ ట్రిక్స్‌ ఉపయోగించడం ద్వారా నెలకు తక్కువలో తక్కువ రూ. 30 వేల వరకు ఆర్జించవచ్చు.