6 వేల కోట్ల ఖరీదైన లగ్జరీ క్రూయిజ్ షిప్ కొన్న చిరంజీవి.. ఏడాదికి అన్ని కోట్ల ఆదాయమా.?

మెగాస్టార్ చిరంజీవికి ప్రైవేట్ జెట్ ఉన్న సంగతి మనకు తెలిసిందే.. అయితే తాజాగా చిరంజీవి గురించి ఒక షాకింగ్ వార్త మీడియాలో చక్కర్లు కొడుతుంది.అదేంటంటే చిరంజీవి ఒక భారీ క్రుయీజ్ షిప్ ని కొనుగోలు చేశారని, ఎండకు వానకు గాలికి ఇలా అన్నింటికీ తట్టుకునేలా భారీ హంగులతో ఆ షిప్ ని తయారు చేయించారని ఇక దాదాపు 6,075 కోట్లు ఖర్చు పెట్టి భూకంపాలకు, సునామీలకు తట్టుకునేలా ప్రత్యేకమైన క్రూయీజ్ షిప్ ని తయారు చేయించుకున్నట్టు తెలుస్తోంది.
అయితే 6,075 కోట్ల ఖరీదైన క్రూయీజ్ షిప్ అంటే మామూలు విషయం కాదు.ఇక ఈ షిప్ తయారీకి అన్ని వేల కోట్లు ఖర్చు పెట్టారంటే చాలా భారీగానే చిరంజీవి రామ్ చరణ్ లు ఆస్తులు సంపాదించుకున్నారని అర్థమవుతుంది.


ఇక ఆ క్రూయిజ్ షిప్ లో ఉన్న సౌకర్యాలు ఏంటంటే..474 బాత్రూంలు, 350 బెడ్రూంలు,వాటర్ పార్కులు, షాపింగ్ మాల్ లు, సినిమా థియేటర్లు ఈ క్రూయీజ్ షిప్ లో ఉన్నాయి అని,అలాగే ఇది అండమాన్, అమెరికా, ప్యారిస్, లండన్ వంటి దేశాలలో పర్యటిస్తుందని, బాగా డబ్బున్న వాళ్ళు మాత్రమే ఈ షిప్ లో ప్రయాణం చేయగలరని, ఎందుకంటే ఈ షిప్ లో ఒకరోజు గడపడానికి చాలా డబ్బులు ఖర్చు చేయాల్సి ఉంటుందని, అలాగే ఈ 6075 కోట్ల విలువైన క్రూయీజ్ షిప్ ద్వారా చిరంజీవికి ప్రతి ఏడాది 125 కోట్ల లాభం వస్తుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అయితే చిరంజీవి క్రూయీజ్ షిప్ కి సంబంధించి కొన్ని ఫోటోలు వీడియోలు కూడా నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

అయితే చిరంజీవి 6075 కోట్ల విలువైన క్రూయీజ్ షిప్ కొన్నారంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని తెలుస్తోంది.అలాగే రేవంత్ రెడ్డి తో పాటు చిరంజీవి ఉన్న ఫొటోస్ హైదరాబాదులో ఎక్స్పీరియన్స్ ఎకో పార్క్ సందర్శించిన టైంలో దిగినవి అని అర్థమవుతుంది. అయితే వివిధ దేశాల్లో ఉన్న లగ్జరీ క్రూయీజ్ షిప్ లను ఎడిట్ చేసి చిరంజీవి ఆ షిప్ ను కొనుగోలు చేసినట్టు ఓ ఎడిట్ వీడియో నెట్టింట్లో వైరల్ అవ్వడంతో చాలామంది నెటిజన్స్ ఆ ఖరీదైన క్రూయీజ్ షిప్ ని చిరంజీవి కొనుగోలు చేసినట్టు రూమర్లు వినిపిస్తున్నాయి.