Healthy Drink : ఒక్క గ్లాస్ తాగితే.. షుగర్‌, కీళ్ల నొప్పులు, కిడ్నీ స్టోన్లు, గ్యాస్‌, అసిడిటీ.. అన్నీ మాయం..!

www.mannamweb.com


Healthy Drink : ఒక్క గ్లాస్ తాగితే.. షుగర్‌, కీళ్ల నొప్పులు, కిడ్నీ స్టోన్లు, గ్యాస్‌, అసిడిటీ.. అన్నీ మాయం..!

Healthy Drink : బార్లీ గింజలు.. ఇవి మనందరికి తెలిసినవే. బార్గీ గింజల వల్ల మన శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది. వీటిని ఎక్కువగా బీర్ల తయారీలో ఉపయోగిస్తారు.
బార్లీ గింజల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. వీటిని ఉపయోగించడం వల్ల మనం పలు రకాల అనారోగ్య సమస్యలను నయం చేసుకోవచ్చు. ఈ బార్లీ గింజలతో తయారు చేసిన నీటిని తీసుకోవడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని పొందవచ్చు. మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ బార్లీ గింజల నీటిని ఎలా తయారు చేసుకోవాలి… వీటిని తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. బార్లీ నీటిని తయారు చేసుకోవడానికి ముందుగా ఒక గిన్నెలో ఒక లీటర్ నీటిని తీసుకోవాలి. తరువాత దానిలో గుప్పెడు బార్లీ గింజలను వేసి 15 నిమిషాల పాటు బాగా మరిగించాలి.
దీంతో బార్లీ గింజలు మెత్తగా అవుతాయి. వాటిలోని పోషకాలన్నీ నీటిలోకి చేరుతాయి. ఇలా మరిగించిన నీరు చల్లారిన తరువాత ఈ నీటిని వడకట్టి ఒక గ్లాస్ లోకి తీసుకోవాలి. ఈ నీటిలో నిమ్మరసం లేదా ఒక టీ స్పూన్ తేనెను కలిపి తాగాలి. ఈ నీటిని రోజూ ఉదయం పరగడుపున తాగాలి. ఈ నీటిని తాగడం వల్ల మనం అనేక అనారోగ్య సమస్యల నుండి బయటపడవచ్చు. ఈ బార్లీ నీటిని నిత్యం పరగడుపున తాగడం వల్ల శరీరంలోని వ్యర్థాలు, విష పదార్థాలు మూత్రం రూపంలో బయటకు పోతాయి. ప్రెద్ద ప్రేగు శుభ్రపడుతుంది. దీంతో కోలన్ క్యాన్సర్ రాకుండా ఉంటుంది. బాగా వేడి చేసిన వారు ఈ బార్లీ నీటిని తాగడం వల్ల వేడి తగ్గి శరీరానికి చలువ చేస్తుంది.
కడుపులో మంట, అసిడిటీ, గ్యాస్, అజీర్తి, మలబద్దకం వంటి జీర్ణసంబంధిత సమస్యలు ఉన్న వారు బార్లీ నీటిని తాగడం వల్ల చక్కటి ఫలితాన్ని పొందవచ్చు. బార్లీ నీటిలో సహజసిద్దమైన యాంటీ ఇన్ ప్లామేటరీ లక్షణాలు ఉంటాయి. ఇవి కీళ్ల నొప్పులను, మోకాళ్ల నొప్పులను తగ్గించడంలో సహాయపడతాయి. ఇక మధుమేహం ఉన్న వారు బార్లీ నీటిని తాగడం ఎంతో మంచిది. బార్లీలో ఉండే బీటా గ్లూకాన్ అనే మూలకం శరీరం గ్లూకోజ్ గ్రహించడాన్ని ఆలస్యం చేస్తుంది. దీంతో రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. అలాగే బార్లీ గింజల్లో పీచు పదార్థాలు అధికంగా ఉంటాయి. ఇవి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. శరీరంలో ఉన్న కొలస్ట్రాల్ ను తగ్గిస్తుంది. దీంతో గుండె సమస్యలు రాకుండా ఉంటాయి. రక్తపోటు కూడా అదుపులో ఉంటుంది.
మూత్రాశయ సమస్యలతో బాధపడే వారు రోజూ బార్లీ నీటిని తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. మూత్రపిండాల్లో రాళ్లను తొలగించే శక్తి కూడా బార్లీ నీటికి ఉంది. రోజూ బార్లీ నీటిని తాగితే మూత్రపిండాల్లో రాళ్లు తొలగిపోతాయి. బాలింతలు బార్లీ నీటిని తాగడం వల్ల వారిలో పాల ఉత్పత్తి పెరుగుతుంది. బరువు తగ్గాలనుకునే వారికి కూడా బార్లీ నీరు ఎంతగానో సహాయపడతాయి. దీనిలో ఉండే పోషకాలు శరీరంలో మెటబాలిజాన్ని పెంచుతాయి. దీంతో బరువు చాలా త్వరగా తగ్గవచ్చు. అయితే బరువు తగ్గాలనుకునే వారు ఈ నీటిని ఉదయం, సాయంత్రం రెండు పూటలా తాగాలి. ఒక గ్లాస్ బార్లీ నీటిలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయని వీటిని తీసుకోవడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని పొందవచ్చని నిపుణులు తెలియజేస్తున్నారు.