Home Vastu: ఇంట్లో వాస్తు దోషాలతో ఇబ్బంది పడుతున్నారా..? నెగెటివ్ ఎనర్జీ పెరిగిపోయి ఇంట్లో మనఃశాంతి లేకుండాపోయిందా..? ఎంత సంపాదించినా డబ్బు నిలవ అష్టకష్టాలు పడుతున్నారా..? అయితే సింపుల్ రెమెడీతో మీ కష్టాలన్నీ తీరుతాయంటున్నారు పండితులు. ఒకే ఒక మొక్క మీ వాస్తుదోషాల నుంచి ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కిస్తుందంటున్నారు. ఇంతకీ ఆ మొక్కేంటి దాని వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు ఈ కథనంలో తెలుసుకుందాం.
హిందూ సంప్రదాయాల ప్రకారం మనుషులకు వచ్చే ప్రతి కష్టానికి ఏదో ఒక రెమెడీ ఉంటుంది. అలాగే ఇంటిలో వాస్తు దోషాల నుంచి ఆర్థిక కష్టాల వరకు ప్రతి దానికి ఒకే ఒక్క రెమెడీ పరిష్కారం అంటున్నారు పండితులు. ఎవరైతే వాస్తు దోషాతలో కష్టపడుతున్నారో వాళ్ల ఇంటి ఆవరణలో ఈశాన్య మూలలో ఒక తెల్ల జిల్లేడు చెట్టును నాటమని సూచిస్తున్నారు. దీని వల్ల ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుందట.
ఆధ్యాత్మిక నిపుణులు చెబుతున్న ప్రకారం జిల్లేడు మొక్క జ్యోతిష్యశాస్త్రంగానే కాకుండా అయుర్వేద పరంగా కూడా చాలా ఉపయోగపడుతుందట. ఆధ్యాత్మిక పరంగా చూస్తే, దానిలో దేవతా శక్తులను ఆకర్షించే సుగుణం అధికంగా ఉంటుందట. ఒక తెల్ల జిల్లేడు చెట్టు 12 సంవత్సరాలకు పైగా అవిచ్ఛిన్నంగా పెరిగితే దాని తల్లి వేరు గణపతి ఆకారంగా గానీ, ఆంజనేయస్వామి ఆకారంగా గానీ దానంతట అది గానే రూపొందుతుందట. దాన్ని శాస్త్రోక్త విధానంగా ఆరాధన చేస్తే ఆయా దేవతల అనుగ్రహం విశేషంగా లభిస్తుందట.
తెల్లజిల్లేడు సూర్య భగవానుడికి కూడా ప్రియమైనదే తెల్ల జిల్లేడును శ్వేతార్కం అంటారు. వృక్షజాతిలో ఈ తెల్ల జిల్లేడు విశిష్టమైంది. ఇందులో విషం ఉంటుందని చాలా మంది ఈ మొక్కలకు దూరంగా ఉంటారు. ముఖ్యంగా జిల్లేడు పాలు కళ్ళలో పడితే చూపు పోతుందని భయపడతారు. కానీ గమ్మత్తేమిటంటే ఈ మొక్కలో ఉన్న విషంతో ఆయుర్వేదంలో దివ్యమైన ఔషధాలు తయారుచేస్తున్నారు.
జిల్లేడులో రెండు రకాలు ఉంటాయి. వంగపూవు రంగు పూలు పూసే జిల్లేడు ఒకటి తెల్ల పూల జిల్లేడు మరొకటి. ఇది హేరంబ గణపతికి ప్రతీక. ఈ తెల్ల జిల్లేడును ఇంటి ఆవరణలో పెంచుకుంటే.. మహాశివుడు, గణపతిల దయ మనమీద ప్రసరిస్తుందట. తెల్ల జిల్లేడు వేళ్ళ మీద గణపతి నివసిస్తాడట. ఈ వేళ్ళు కొన్నిసార్లు ఆకృతిలో సైతం గణేశుని పోలి ఉంటాయట. అందుకే చాలామంది తెల్ల జిల్లేడును పరమ పవిత్రంగా భావించి, తులసి మొక్కలా ఇంట్లో నాటుతారు.
ఈ మొక్క ఇంటి ఆవరణలో ఉంటే.. ఉంటే ధన ధాన్యాలు పుష్కలంగా లభిస్తాయట. ఆలోచనల్లో పరిపక్వత వస్తుందట, ఎవరైనా హాని తలపెట్టినా, దుష్టశక్తులు మీ ఇంటిపైకి వచ్చినా, ఎలాంటి దుష్ప్రభావం మీ ఇంటి మీద పడకుండా వారి ప్రయోగాలు నశిస్తాయని ప్రతీతి. ఇళ్ళలో జిల్లేడు మొక్కలు ఉండకూడదనేది ఒక అపోహ మాత్రమేనని. నిజానికి శ్వేతార్కం లేదా తెల్ల జిల్లేడు మొక్క ఇంట్లో ఉంటే ఇక వారికి దారిద్ర్యం అంటే ఏమిటో తెలీదని పండితులు చెప్తున్నారు.
జిల్లేడు మొక్కలు అధికంగా ఉన్న ఊళ్ళో పంటలు బాగా పండుతాయంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే జిల్లేడు సిరిసంపదలకు చిహ్నం అని నమ్ముతారు. తెల్ల జిల్లేడు వేళ్ళు గనుక గణపతి రూపాన్ని సంతరించుకుంటే, అది స్వయంభూ శ్వేతార్క గణపతి అన్నమాట. మరి ఈ శ్వేతార్క రూపానికి ఎరుపు రంగు ఇష్టం. ఆసనం మీద కుంకుమ వేసి శ్వేతార్క గణపతిని నిలిపి, ఎర్ర వస్త్రం కప్పి, నైవేద్యం సమర్పించి పగడాలు లేదా ఎర్ర రుద్రాక్షలతో పూజించాలి. మందార లాంటి ఎర్రటి పూలు, ఎర్ర చందనంతో పూజ చేయాలి. శ్వేతార్క గణపతిని పూజించిన వారికి వెంటనే గొప్ప ఫలితాలు సాక్షాత్కరిస్తాయని ఎందరో అనుభవపూర్వకంగా చెప్తున్నారు. ఇంట్లో తులసి చెట్టును ఎలాగైతే పూజిస్తున్నారో అలాగే తెల్లజిల్లేడు మొక్కను కూడా పెంచుకోమని పండితులు సూచిస్తున్నారు.
ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.


































