BIG BREAKING: కేసీఆర్ ఇప్పుడు ఎలా ఉన్నారంటే?

సాధారణ వైద్య పరీక్షల నిమిత్తం గురువారం యశోద ఆసుపత్రిలో చేరిన బీఆర్ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్ ను పలువురు పార్టీ నేతలు పరామర్శించేందుకు వచ్చారు.


ఈ సందర్భంగా వారితో కేసీఆర్ కూర్చుని మాట్లాడారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, రైతులకు యూరియా ఎరువుల లభ్యత, వ్యవసాయం, సాగునీరు, తదితర ప్రజా సమస్యలు వర్తమాన అంశాలపై వారితో సుదీర్ఘంగా కేసీఆర్ చర్చించారు. పార్టీ నేతలు, ఉద్యమకారుల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను బీఆర్ఎస్ సోషల్ మీడియా రిలీజ్ చేసింది. ఇందులో కేసీఆర్ చాలా యాక్టివ్ గా కనిపించడం పార్టీ శ్రేణులకు కొత్త ఉత్సహన్ని ఇస్తుంది.

కాగా కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై ఆయన కుమారుడు, ఎమ్మెల్యే కేటీఆర్ ఇప్పటికే స్పందించారు. సాధారణ వైద్య పరీక్షల కోసమే యశోద హాస్పిటల్కు తీసుకెళ్లినట్టు తెలిపారు. కేసీఆర్ కు బ్లడ్ షుగర్, సోడియం స్థాయిలను చెక్ చేసేందుకు కొన్ని రోజులు పాటు హాస్పిటల్లోనే ఉండాలని వైద్యులు సూచించినట్టుగా తెలిపారు. కేసీఆర్కు ఎలాంటి తీవ్ర ఆరోగ్య సమస్యలు లేవన్నారు కేటీఆర్. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని, కేసీఆర్ క్షేమం గురించి ఆలోచిస్తూ, ఆరా తీస్తున్న ప్రతి ఒక్కరికి తాను కృతజ్ఞతలు తెలియజేశారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.