మంత్రం అనేది పవిత్రమైన ధ్వని. దీనిని పఠిస్తారు, ధ్యానం చేస్తారు లేదా జపిస్తారు, అయితే గురు మంత్రం అనేది గురువు శిష్యునికి ఇచ్చే ఒక నిర్దిష్ట మంత్రం, ఇది ఆధ్యాత్మిక పురోగతికి సహాయపడుతుంది.
గురు మంత్రం ఒక శక్తివంతమైన శక్తికి మూలం. ఈ సంవత్సరం గురు పూర్ణిమ జూలై 10న వచ్చింది. ఈ రోజు మీరు గురువు నుంచి మంత్రం తీసుకోబోతున్నట్టైతే దానిని రహస్యంగా ఉంచాలి
శిష్యుడు గురువు ఇచ్చిన మంత్రాన్ని రహస్యంగా ఉంచాలి, ఎందుకంటే గురువు తన సంకల్ప శక్తిని మంత్రంలో ఉంచుతాడు. దీనివల్ల మంత్రం మేల్కొంటుంది. దీనిని జపించడం ద్వారా సాధకుడు ఆధ్యాత్మిక యాత్రలో ముందుకు సాగడానికి సహాయపడుతుంది.
గురు మంత్రాన్ని బయటకు చెబితే దాని శక్తి తగ్గుతుంది. అలాగే ఇంకెవరైనా ఆ మంత్రాన్ని దుర్వినియోగం చేసే అవకాశం ఉంది. అలా జరిగితే సాధకుని ఆధ్యాత్మిక అభివృద్ధికి ఆటంకం కలుగుతుంది.
మంత్రం రహస్యంగా ఉంచకపోతే, అది ప్రతికూల శక్తుల లేదా వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళవచ్చు
గురు మంత్రం సాధకుని వ్యక్తిగత ఆధ్యాత్మిక అభివృద్ధి కోసం. ఇది రహస్యంగా ఉంచడం వల్ల సాధకుడు తన సాధనపై దృష్టి పెట్టడానికి సహాయపడుతుంది.
గురువు ఇచ్చిన మంత్రాన్ని జపించడానికి సాధకుడు ఒక సమయం నిర్ధేశించుకోవాలి. క్రమం తప్పకుండా ఈ పద్ధతిలో జపించడం వల్ల ఫలితం లభిస్తుంది. గురు మంత్రం జపించడం వల్ల మానసిక శాంతి మరియు విజయం సాధించే మార్గం సులభం అవుతుంది.