Stock market psychology : ఇది తెలిస్తే.. స్టాక్​ మార్కెట్​లో కోట్ల సంపద మీ సొంతం!

www.mannamweb.com


Stock market tips in Telugu : వారెన్​ బఫెట్​, రాకేశ్​ ఝున్​ఝున్​వాలా లాగా.. భారీ సంపదను సృష్టించుకోవాలన్న ఆశలతో.. చాలా మంది స్టాక్​ మార్కెట్​లోకి అడుగు పెడుతున్నారు.

కానీ.. సంపద సృష్టిని పక్కన పెడితే.. చాలా మంది కష్టంతో సంపాదించిన డబ్బులను కూడా పోగొట్టుకుంటున్నారు. ఆ తర్వాత తిరిగి మార్కెట్లవైపు చూడటానికి భయపడుతున్నారు. స్టాక్​ మార్కెట్​ను ఒక గ్యాంబ్లింగ్​ అని ఫిక్స్​ అవుతున్నారు. వాస్తవానికి.. స్టాక్​ మార్కెట్​ నుంచి డబ్బులు సంపాదించడం అంత ఈజీ కాకపోయినా.. కానీ ‘అసాధ్యం’ కాదు! స్టాక్​ మార్కెట్​లో సక్సెస్​ సాధించిన ఎందరో ఇందుకు అసలైన నిదర్శనం. మరి స్టాక్​ మార్కెట్​లో కోట్లు కోట్లు ఎలా సంపాదించుకోవాలి? తప్పుల నుంచి ఎలా నేర్చుకోవాలి? వంటి వివరాలను ఇక్కడ తెలుసుకుందాము రండి..

ట్రేడింగ్​లో సైకాలజీ చాలా ముఖ్యం..!

స్టాక్​ మార్కెట్​ని.. డబ్బులు ఇచ్చే యంత్రంగా చూస్తున్నారా? అయితే మీ మైండ్​సెట్​ని మార్చుకోవాలి. స్టాక్​ మార్కెట్​లో డబ్బులు సంపాదించడం అంత ఈజీ కాదు అన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. డిగ్రీ వరకు చదువుకుని ఉద్యోగంలో చేరి డబ్బులు సంపాదిస్తాము.. కానీ స్టాక్​ మార్కెట్​ విషయానికొచ్చే సరికి వెంటనే, వేగంగా సంపద వచ్చేయాలని భావిస్తుంటాము. ఈ సైకాలజీ కరెక్ట్​ కాదు! మార్కెట్​లో నిలదొక్కుకోవాలంటే.. సైకాలజీ చాలా ముఖ్యం

స్టాక్​ మార్కెట్​లో సక్సెస్​ అవ్వడం ఓ పెద్ద జర్నీ చేసినట్టే.. పెద్ద యుద్ధం చేసినట్టే! ఈ జర్నీలో ఎన్నో కష్టాలు, నష్టాలు ఉంటాయి. ఎన్నో లాభాలు ఉంటాయి. ఈ ప్రయాణంలో ముందు మనల్ని మనం తెలుసుకోవాలి! మనకి స్టాక్​ మార్కెట్​లో ఏ స్ట్రాటజీ సెట్​​ అవుతోంది? నష్టాల వెనక మన తప్పులు, సైకాలజీలో లోపాలు ఏమైనా ఉన్నాయా? లేక మార్కెట్​ ఒడుదొడుకుల్లో మనం డబ్బులు కోల్పోతున్నామా? అన్నది అర్థం చేసుకోవాలి. ఇవన్నీ తెలుసుకోవడానికి చాలా టైమ్​ పడుతుంది. ఆ టైమ్​లో.. రిస్క్​ మేనేజ్​మెంట్​కి వాల్యూ ఇస్తూ, డబ్బులు పోగొట్టుకోకుండా మార్కెట్​లో నిలబడాలి. క్యాపిటల్​ పూర్తిగా నష్టపోతే.. రేపు అనే రోజున మార్కెట్​లో ఉండటమే సాధ్యం అవ్వదు కదా!

How do successful traders think : స్టాక్​ మార్కెట్​లో ఫండమెంటల్​ ఎనాలసిస్​తో డబ్బులు సంపాదిచుకోవచ్చు. లేదా.. టెక్నికల్​ ఎనాలసిస్​తోనూ సంపద సృష్టించుకోవచ్చు. లేదా.. ఆ రెండింటినీ కలిపి కూడా కోట్లు సంపాదించుకోవచ్చు. వాటిల్లో మనకి ఏది సెట్​ అవుతుందో ముందు తెలుసుకోవాలి. స్టాక్​ మార్కెట్​లో మనకి మనతోనే పోటీ.. మనకి మనమే పోటీ..! అందుకే సైకాలజీని మెరుగుపరుచుకుంటూ ఎప్పటికప్పుడు ముందుకు వెళ్లాలి.

అలా చేస్తే.. ఇక నష్టాలే..!

స్టాక్​ మార్కెట్​లో ఒక్కసారి ఎంట్రీ ఇస్తే.. చాలా మంది మనల్ని ట్రాప్​ చేసేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. ఇది ముందు మనం గ్రహించాలి. వారి నుంచి మనల్ని మనం రక్షించుకోవాలి. కొన్ని సందర్భాల్లో.. మనమే అత్యాసకు పోయి.. టిప్స్​ కోసం ప్రయత్నాలు చేస్తాము డబ్బులు కట్టి టిప్స్​ తీసుకుని వాటిని అమలు చేస్తూ ఉంటాము. ఇది తప్పు! ఎవరో చెప్పారు కదా అని మనం స్టాక్స్​ని బై, సెల్​ చేయకడం ఉత్తమం కాదు. ఒక స్టాక్​ని కొనాలన్నా, అమ్మాలన్నా.. దాని వెనక చాలా రీసెర్చ్​ చేయాలి. అందుకే గుంపులో గోవిందా.. లాగా కాకుండా మనకుంటూ సొంతంగా సెటప్​ ఉంటే దీర్ఘకాలంలో అద్భుత సృష్టి సాధ్యమవుతుంది. ట్రేడింగ్​లో సక్సెస్​ అయిన వారు చేసింది ఇదే!

Stock market tips and tricks : స్టాక్​ మార్కెట్​లో చాలా మంది చేసే తప్పు ‘టైమింగ్​’. మార్కెట్​లను టైమ్​ చేయాలని చాలా మంది చూస్తూ ఉంటారు. ఎంత ప్రయత్నించినా.. అది అస్సలు జరగని పని! కొన్ని సందర్భాల్లో లక్​ వల్ల మార్కెట్​ను టైమ్​ చేయగలమేమో కానీ.. అన్నిసార్లు అలా జరగదు. అందుకే మార్కెట్​ను టైమ్​ చేయకుండా.. దానితో పాటు జర్నీ చేయాలి. లాస్​లు తీసుకోవాలి. ప్రాఫిట్​లను చూడాలి. ఏం వచ్చినా.. స్టేబుల్​గా ఉండాలి.

క్రమశిక్షణతోనే కోట్ల సంపద సాధ్యం..!

స్టాక్​ మార్కెట్​లో సక్సెస్​ అవ్వాలంటే క్రమ శిక్షణ చాలా ముఖ్యం. చాలా అవసరం. మార్కెట్​కు ఎప్పుడు దూరంగా ఉండాలి, ఎప్పుడు యాక్టివ్​గా ఉండాలో అర్థం చేసుకోవాలి. దూరంగా ఉండాల్సిన సమయం అని తెలిసి కూడా యాక్టివ్​గా ఉంటే.. డబ్బులు కోల్పోతాము.

Stock market tips for beginners : అందుకే లాంగ్​ టర్మ్​లో ఇన్​వెస్ట్​మెంట్​, ట్రేడింగ్​లో అద్భుత రిటర్నులు ఇస్తాయి. దీర్ఘకాల ప్రణాళికలు ఉంటే.. క్రమం తప్పకుండా పెట్టుబడులు పెడుతూ ఉండాలి. అప్పుడు ఒడిదొడుకులను జయించవచ్చు.
సైకాలజీతోనే విజయం..!

ఎమోషన్స్​పై కంట్రోల్​ లేకపోతే స్టాక్​ మార్కెట్​లో ఎక్కువ కాలం నిలబడలేరు. లాజికల్​గా ఆలోచించాల్సిన చోట.. ఎమోషనల్​గా ఉంటే తప్పులు చేస్తూ డబ్బులు కోల్పోతాము. స్టాక్​ మార్కెట్​లో ఎమోషన్స్​కు స్థానం ఉండదు. లాస్​ వస్తే యాక్సెప్ట్​ చేయాలి. లాభాలొస్తే.. ప్రశాంతంగా ఉండాలి.

How can I start learning stock market : చివరిగా ఒక్క మాట. మార్కెట్​తో జర్నీ చేస్తే.. ఆ మార్కెటే మనకి చాలా నేర్పిస్తుంది. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలన్న ఆశయంతో స్టాక్​ మార్కెట్​లోకి రాకపోవడం బెటర్​. ప్రయాణాన్ని ఆస్వాదిస్తూ.. ఒడిదొడుకులతో ముందుకెళుతూ ఉంటే.. మీ సక్సెస్​ జర్నీ సూపర్​గా ఉంటుంది.