పాన్ 2.0: అప్లై విధానం.. ఫీజు వివరాలు

www.mannamweb.com


భారత ప్రభుత్వం పాన్ 2.0 ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గం కూడా దీనికి ఆమోదం తెలిపింది.

ఇది ఆర్ధిక మోసాలను, గుర్తింపు చౌర్యం వంటి వాటిని నిరోధించడమే కాకుండా.. సమాచారం మరింత భద్రంగా ఉంటుంది. అయితే.. పాన్ 2.0 ఎప్పుడు వస్తుంది అన్నదానికి సంబంధించిన అధికారిక వివరాలు ప్రస్తుతం వెలువడలేదు. అయితే కొత్త పాన్ కార్డులు వస్తే?.. పాత పాన్ కార్డులు ఏమవుతాయి. ఈ కొత్త పాన్ కార్డులు లేదా క్యూఆర్ కోడ్ పాన్ కార్డుల కోసం ఎక్కడ.. ఎలా అప్లై చేసుకోవాలి అనే విషయాలను ఈ కథనంలో చూసేద్దాం.

పాత పాన్ కార్డులు రద్దవుతాయా?
క్యూర్ కోడ్ పాన్ కార్డులు వస్తే.. పాత పాన్ కార్డులు రద్దవుతాయా? అనే అనుమానం చాలామందికి ఉంటుంది. కానీ పాత పాన్ కార్డులు రద్దు అయ్యే అవకాశం లేదని ఆదాయ పన్ను శాఖ క్లారిటీ ఇచ్చింది.

పాన్ 2.0 ప్రవేశపెట్టడంలో ప్రధాన ఉద్దేశ్యం ఏమిటంటే.. కొత్త టెక్నాలజీతో ట్యాక్స్ పేయర్లకు మెరుగైన సేవలు అందించడమే. నాణ్యమైన సేవలను సులభంగా, వేగవంతంగా అందించాలనే లక్ష్యంతో కేంద్రం ఈ పాన్ 2.0కు సిద్ధమైంది. కాబట్టి రాబోయే పాన్ కార్డులు క్యూఆర్ కోడ్‌తో రానున్నాయి.

పాన్ 2.0 కోసం ఎలా అప్లై చేసుకోవాలి?
➤పాన్ 2.0 కోసం అప్లై చేసుకోవాలంటే ముందుగా అధికారిక వెబ్‌సైట్‌లోని పోర్టల్ సందర్శించాలి (పాన్ 2.0 ప్రాజెక్ట్ ఇటీవలే ప్రవేశపెట్టారు, కాబట్టి దీనికి అప్లై చేసుకోవడానికి వెబ్‌సైట్‌లో పోర్టల్ ఇంకా అందుబాటులోకి రాలేదు).
➤అవసరమైన చోట వ్యక్తిగత వివరాలను నమోదు చేయాలి.
➤గుర్తింపు, చిరునామా, పుట్టిన తేదీలకు సంబంధించిన డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయాలి.
➤అవసరమైనన్నీ నమోదు చేసిన తరువాత అప్లికేషన్ సబ్మీట్ చేయాలి.

అవసరమైన డాక్యుమెంట్స్
➤ఐడెంటిటీ ప్రూఫ్ కోసం.. ఆధార్ కార్డు, ఓటర్ ఐడీ, పాస్‌పోర్ట్ లేదా డ్రైవింగ్ లైసెన్స్
➤అడ్రస్ ప్రూఫ్ కోసం.. యుటిలిటీ బిల్స్, బ్యాంక్ స్టేట్‌మెంట్స్ లేదా రెంటల్ అగ్రిమెంట్
➤డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కోసం.. బర్త్ సర్టిఫికెట్, టీసీ, పాస్‌పోర్ట్

పాన్ 2.0 కోసం అప్లై చేయాలంటే డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పాన్ కార్డు.. రిజిస్టర్ మెయిల్‌కు వస్తుంది. అయితే క్యూఆర్ కోడ్‌తో వచ్చే ఫిజికల్ కార్డు కావాలంటే 50 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. క్యూఆర్ కోడ్ కలిగిన పాన్ కార్డును భారతదేశంలో ఎక్కడికైనా డెలివరీ చేసుకోవాలంటే ఈ 50 రూపాయలు చెల్లించాలి. అంతర్జాతీయ డెలివరీలకు ఫీజులు వేరే ఉంటాయి. కాబట్టి దీనికి అదనంగా చెల్లించాల్సి ఉండే అవకాశం ఉంది.