ఏపీలో 1.47లక్షల కోట్ల భారీ పరిశ్రమ నవంబర్ లోనే ఎంట్రీ, ఉద్యోగాల జాతరే

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతి పైన ఏపీ ప్రభుత్వం దృష్టి సారించింది. ముఖ్యంగా మంత్రి లోకేష్ ఏపీకి పెట్టుబడులను ఆకర్షించడానికి తన వంతుగా ప్రయత్నాలు చేస్తున్నారు.


ఈ క్రమంలో విశాఖపట్నంలో నవంబర్ 14, 15 తేదీలలో జరగనున్న సీఐఐ భాగస్వామ్య సదస్సులో భారీ పెట్టుబడులను ఆకర్షించాలని మంత్రి లోకేష్ లక్ష్యంగా పెట్టుకున్నారు.

రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే వారికి ప్రభుత్వ సహకారం

ఈ సదస్సు లోనే గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుకు ఒప్పందం కుదుర్చుకోనున్నట్టు, అలాగే ఏరో స్పేస్ సిటీ అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే వారికి అన్ని విధాల ప్రభుత్వ సహకారం ఉంటుందని లోకేష్ ఈ సందర్భంగా తెలిపారు.

ఏపీ ప్రజలకు లోకేష్ శుభవార్త

ఇక ఇదే సమయంలో మంత్రి లోకేష్ మరో శుభవార్త చెప్పారు. అనకాపల్లిలో ఆర్సెలార్ మిత్తల్ ప్లాంట్ రాబోతుందని నవంబర్ నెలలోనే ఆర్సెలార్ మిత్తల్ స్టీల్ ప్లాంట్ పనులు ప్రారంభమవుతాయని నారా లోకేష్ శుభవార్త చెప్పారు. పారిశ్రామిక ప్రగతిలో వేగవంతమైన కార్యకలాపాలకు ఇది నిదర్శనంగా ఉండబోతుందని లోకేష్ పేర్కొన్నారు.

1.47 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడితో భారీ స్టీల్ ప్లాంట్

అనకాపల్లి జిల్లా నక్కపల్లి సమీపంలో ఆర్సెలార్ మిత్తల్, నిప్పన్ స్టీల్స్ సంయుక్తంగా 1.47 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడితో ఈ భారీ పరిశ్రమను ప్రారంభిస్తున్నట్టు, మొదటి దశలో 70 వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెడతారని ఆయన తెలిపారు.ఈ ప్రాజెక్టు 2033 వరకు దక్షిణాదిలోని అతిపెద్ద స్టీల్ ప్లాంట్ గా ఉండబోతుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.

ప్లాంట్ ఏర్పాటుకు జూమ్ కాల్ లోనే అనుమతులు

ఈ ప్లాంట్ ఏర్పాటుతో వేలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు. నక్కపల్లి మండలంలో 2020 ఎకరాల భూమిని దీనికోసం కేటాయించినట్లు తెలిపారు. ఈ ప్లాంట్ ఏర్పాటుకు జూమ్ కాల్ లోనే కంపెనీకి అన్ని అనుమతులు మంజూరు చేస్తామని వెల్లడించారు. ఈ భారీ పెట్టుబడితో అనకాపల్లి ప్రాంతం యొక్క రూపురేఖలు మారిపోతాయని పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుందని లోకేష్ అన్నారు.

చంద్రబాబు లీడర్ షిప్ తోనే రాష్ట్రానికి పెద్ద కంపెనీలు

ముఖ్యమంత్రి చంద్రబాబు లీడర్ షిప్ తోనే రాష్ట్రానికి పెద్ద పెద్ద కంపెనీలు వస్తున్నాయని మంత్రి లోకేష్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పెట్టుబడులకు అనుకూలంగా ఉన్న రాష్ట్రమని, ఫార్చ్యూన్ 500 కంపెనీలు రాష్ట్రం వైపు చూస్తున్నాయని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి వచ్చేవారికి ఏపీ ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని మరోమారు లోకేష్ స్పష్టం చేశారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.