10 Facts About Bananas : అరటిపండ్ల గురించి ఈ 10 ఆసక్తికరమైన విషయాలు తెలుసా..? 90 శాతం మందికి తెలియవు..!

www.mannamweb.com


10 Facts About Bananas : మనం ఆహారంగా తీసుకునే రుచికరమైన పండ్లల్లో అరటి పండు కూడా ఒకటి. అరటి పండు చాలా రుచిగా ఉంటుంది. పిల్లలు, పెద్దలు దీనిని ఇష్టంగా తింటూ ఉంటారు.
అరటి పండు మనకు అన్ని కాలాల్లో విరివిగా లభిస్తూ ఉంటుంది. అలాగే అరటి పండ్లను అందరూ కూడా సులభంగా కొనుగోలు చేసి తీసుకోవచ్చు. అరటిపండును తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది.దీనిలో మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో పోషకాలు ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. రోజూ ఒక అరటిపండును తప్పకుండా ఆహారంలో భాగంగా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. రోజూ ఒక అరటిపండును తీసుకోవడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చని వారు చెబుతున్నారు. అసలు రోజూ ఒక అరటిపండును ఎందుకు తీసుకోవాలి… దీనిని తీసుకోవడం వల్ల మనకు కలిగే ప్రయోజనాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
అరటిపండులో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. దీనిలో ఉండే పొటాషియం రక్తనాళాల పనితీరును మెరుగుపరచడంలో, గుండె ఆరోగ్యాన్ని కాపాడడంలో, అధిక రక్తపోటును తగ్గించడంలో మనకు సహాయపడుతుంది. అరటిపండులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. దీనిలో ఉండే ఫైబర్ జీర్ణశక్తిని మెరుగుపరచడంలో, మలబద్దకాన్ని తగ్గించడంలో, పొట్ట ఆరోగ్యాన్ని కాపాడడంలో దోహదపడుతుంది. అరటిపండులో సహజ చక్కెరలు, కార్బోహైడ్రేట్స్, క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి. రోజూ ఒక అరటిపండును తీసుకోవడం వల్ల మనం రోజంతా ఉత్సాహంగా పనిచేసుకోవచ్చు. అరటిపండ్లు ట్రిప్టోఫాన్ ను కలిగి ఉంటాయి. దీనిని తీసుకోవడం వల్ల మానసిక స్థితి మెరుగుపడుతుంది. ఒత్తిడి, ఆందోళన వంటివి తగ్గి మనసుకు ప్రశాంతత లభిస్తుంది.
కండరాల తిమ్మిర్లు, కండరాల నొప్పులు, కండరాలు పట్టేయడం వంటి సమస్యలతో బాధపడే వారు రోజూ ఒక అరటిపండును తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. దీనిలో ఉండే పొటాషియం కండరాల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అరటిపండ్లల్లో ఫ్రక్టోలిగోసాకరైడ్ లు ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరం క్యాల్షియంను గ్రహించడంలో సహాయపడతాయి. దీంతో అరటిపండ్లను తీసుకోవడం వల్ల ఎముకలు ధృడంగా మారతాయి. ఎముకలు గుళ్లబారడం, బోలు ఎముకలు వంటి సమస్యలు రాకుండా ఉంటాయి. అరటిపండు బీటా కెరోటీన్ ను కలిగి ఉంటుంది. బీటా కెరోటీన్ మన శరీరంలోకి వెళ్లిన తరువాత విటమిన్ ఎ మారుతుంది. కనుక అరటిపండ్లను తీసుకోవడం వల్ల కంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది. దృష్టి లోపాలు తగ్గుతాయి.
అరటిపండును తీసుకోవడం వల్ల చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మ ఆరోగ్యాన్ని కాపాడడంలో సహాయపడతాయి. అరటిపండ్లను తీసుకోవడం వల్ల చర్మంపై ముడతలు రాకుండా ఉంటాయి. రోజూ అరటిపండును తీసుకోవడం వల్ల మనం సులభంగా బరువు తగ్గవచ్చు. అరటిపండును తీసుకోవడం వల్ల కడుపు నిండిన భావన కలుగుతుంది. త్వరగా ఆకలి వేయకుండా ఉంటుంది. జంక్ ఫుడ్ తినాలన్న కోరిక తగ్గుతుంది. దీంతో మనం సులభంగా బరువు తగ్గవచ్చు. ఈ విధంగా అరటిపండ్లు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి కనుక వీటిని రోజూ ఒకటి చొప్పున తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. అరటిపండ్లను నేరుగా తినడంతో పాటు స్మూతీ, ఓట్ మీల్, ఫ్రూట్ సలాడ్ వంటి వాటితో కూడా కలిపి తీసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.