ప్రపంచంలో 10 పవర్‌ఫుల్‌ మిలిటరీ దేశాలు

2025 గ్లోబల్ ఫైర్ పవర్ ర్యాంకింగ్స్


ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో అత్యంత శక్తివంతమైన సైనిక దళాల తాజా ర్యాంకింగ్స్‌ను గ్లోబల్ ఫైర్ పవర్ (Global Fire Power) వెల్లడించింది.

ఈ ర్యాంకింగ్స్‌లో యునైటెడ్ స్టేట్స్ (USA) అగ్రస్థానంలో ఉండగా, భారత్ సైనిక బలం పరంగా ప్రపంచంలో నాలుగో స్థానంలో నిలిచింది.

నివేదికల ప్రకారం గ్లోబల్ ఫైర్ పవర్ ఈ సంవత్సరం 145 దేశాల సాయుధ దళాలను వారి వనరులు, యుద్ధ పరికరాల ఆధారంగా అంచనా వేసింది. దళాల బలం, ఆర్థిక స్థితి, వనరులతో సహా 60కి పైగా ప్రమాణాలను లెక్చించి, ఆయా దేశాల మిలిటరీలను పోల్చి ర్యాంకింగ్‌ను కేటాయించింది. ఈ ర్యాంకింగ్‌లో దేశాల అణు సామర్థ్యాలను కూడా పరిగణనలోకి తీసుకున్నారు.

టాప్ 10 అత్యంత శక్తివంతమైన మిలిటరీ దేశాలు

1. యునైటెడ్ స్టేట్స్ (USA)-1వ ర్యాంకు

పవర్ ఇండెక్స్ స్కోరు: 0.0744

ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సైన్యంగా ర్యాంక్ పొందింది. 2024 లో 873 బిలియన్‌ డాలర్లు దాటిన ప్రపంచంలోనే అతిపెద్ద రక్షణ బడ్జెట్‌ను కలిగి ఉంది.

2. రష్యా-2వ స్థానం

పవర్ ఇండెక్స్ స్కోరు: 0.0788

విస్తారమైన అణ్వాయుధాలు కలిగి ఉంది. విమానాలు, హెలికాప్టర్లు, ట్యాంకుల పరంగా ఇది రెండో స్థానంలో ఉంది.

3. చైనా: 3వ స్థానం

పవర్ ఇండెక్స్ స్కోరు: 0.0788

పవర్ ఇండెక్స్‌లో రష్యాకు సమానంగా ఉంది.

4. భారతదేశం: 4వ స్థానం

పవర్ ఇండెక్స్ స్కోరు: 0.1184

సైనిక బలం పరంగా ప్రపంచవ్యాప్తంగా నాలుగో స్థానంలో ఉంది.

5. దక్షిణ కొరియా: 5వ స్థానం

పవర్ ఇండెక్స్ స్కోరు: 0.1656

6. యునైటెడ్ కింగ్‌డమ్ (UK): 6వ స్థానం

పవర్ ఇండెక్స్ స్కోరు: 0.1785

7. ఫ్రాన్స్: 7వ స్థానం

పవర్ ఇండెక్స్ స్కోరు: 0.1878

8. జపాన్: 8వ స్థానం

పవర్ ఇండెక్స్ స్కోరు: 0.1839

9. టర్కీ: 9వ స్థానం

పవర్ ఇండెక్స్ స్కోరు: 0.1902

ఫ్రిగేట్ నౌకాదళాలు, హెలికాప్టర్లు, నావికాదళ కార్వెట్లు, జలాంతర్గాములు వంటివి అధికంగా ఉన్నాయి.

10. ఇటలీ: 10వ స్థానం

పవర్ ఇండెక్స్ స్కోరు: 0.2164

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.