ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే 10 సినిమాల వరకు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. వీటిలో క్రైమ్ ఇన్వెస్టిగేటివ్, ఫాంటసీ థ్రిల్లర్, క్రైమ్ థ్రిల్లర్, మిస్టరీ డ్రామా, యాక్షన్ థ్రిల్లర్, కామెడీ, పొలిటికల్ థ్రిల్లర్ వంటి జోనర్స్ ఉన్నాయి.
ఓటీటీ ప్లాట్‌ఫామ్స్
ఇవన్నీ కూడా నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, ఆహా, ఈటీవీ విన్ వంటి ప్లాట్‌ఫామ్స్‌లలో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోన్నాయి. మరి ఆ సినిమాలు ఏంటీ, వాటిలో చూడాల్సిన బెస్ట్ సినిమాలు, తెలుగు భాషలో అందుబాటులో ఉన్న మూవీస్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.
నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ
ఆఫీసర్ ఆన్ డ్యూటీ (తెలుగు డబ్బింగ్ మలయాళ క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీ)- మార్చి 20
బెట్ యువర్ లైఫ్ (ఇంగ్లీష్ క్రైమ్ కామెడీ ఫాంటసీ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- మార్చి 20
ఖాకీ: ది బెంగాల్ చాప్టర్ (తెలుగు డబ్బింగ్ హిందీ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- మార్చి 20
ది రెసిడెన్స్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ క్రైమ్ మిస్టరీ డ్రామా వెబ్ సిరీస్)- మార్చి 20
డెన్ ఆఫ్ థీవ్స్ 2: పంటేరా (ఇంగ్లీష్ క్రైమ్ యాక్షన్ మూవీ)- మార్చి 20
వోల్ఫ్ కింగ్ (ఇంగ్లీష్ యానిమేటెడ్ అడ్వెంచర్ ఫాంటసీ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- మార్చి 20
బ్రహ్మా ఆనందం (తెలుగు కామెడీ ఎమోషనల్ డ్రామా సినిమా)- ఆహా ఓటీటీ- మార్చి 20
జితేందర్ రెడ్డి (తెలుగు పొలిటికల్ డ్రామా చిత్రం)- ఈటీవీ విన్ ఓటీటీ- మార్చి 20
డూప్లిసిటీ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ లీగల్ థ్రిల్లర్ మూవీ)- అమెజాన్ ప్రైమ్ ఓటీటీ- మార్చి 20
లూట్ కాంద్ (హిందీ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- అమెజాన్ ఎమ్ఎక్స్ ప్లేయర్ ఓటీటీ- మార్చి 20
ఓటీటీలోకి ఇవాళ 10 సినిమాలు
ఇలా ఇవాళ (మార్చి 20) ఒక్కరోజే సినిమాలు, వెబ్ సిరీస్‌లు కలిపి 10 ఓటీటీ రిలీజ్ అయ్యాయి. వీటిలో తెలుగు డబ్బింగ్ మలయాళ క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీ ఆఫీసర్ ఆన్ డ్యూటీ, తెలుగు కామెడీ ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా బ్రహ్మానందం, తెలుగు పొలిటికల్ థ్రిల్లర్ చిత్రం జితేందర్ రెడ్డి, తెలుగు డబ్బింగ్ హిందీ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఖాకీ ది బెంగాల్ చాప్టర్ చాలా స్పెషల్‌గా ఉన్నాయి.
స్పెషల్‌గా 6- తెలుగులో 6
వీటితోపాటు హిందీ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ లూట్ కాంద్, తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ది రెసిడెన్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయి. ఈ పదింటిల్లో ఆరు తెలుగు భాషలో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోన్నాయి. ఇందులో నాలుగు సినిమాలు, 2 వెబ్ సిరీస్‌లతో ఆరు చూసేందుకు చాలా స్పెషల్ అండ్ ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయి.