10 సిక్స్‌లు, 9 ఫోర్లు.. 3 ఓవర్లలోనే సెంచరీ.. 18 నిమిషాల్లోనే బౌలర్లకు హై ఫీవర్.. చరిత్రలోనే తొలిసారి

 బ్రాడ్‌మాన్ తన అద్భుతమైన బ్యాటింగ్‌తో ప్రపంచాన్ని వణికించిన సంగతి తెలిసిందే. అతను టెస్ట్‌లలో అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌గా పేరుగాంచి, తన పేరుతో ఎన్నో రికార్డులను లిఖించుకున్నాడు. అలాగే, తన కెరీర్‌లో ఒక ప్రత్యేక రికార్డు గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రికార్డ్ వింటే కచ్చితంగా అవాక్కు అవ్వాల్సిందే మరి.

టెస్ట్ క్రికెట్ చరిత్రలో చాలా మంది దిగ్గజాలు ఉన్నారు. వీళ్లంతా ఇప్పటికీ ఎన్నో రికార్డులు తమ ఖాతాలో వేసుకున్నారు. టెస్ట్ చరిత్రలో ఆస్ట్రేలియా తరపున ఆడిన దిగ్గజ బ్యాట్స్‌మన్ సర్ డాన్ బ్రాడ్‌మాన్, ఒకప్పుడు తన బ్యాటింగ్ బలంతో మొత్తం క్రికెట్ ప్రపంచాన్ని ఏలిన సంగతి తెలిసిందే. బ్రాడ్‌మాన్ తన అద్భుతమైన బ్యాటింగ్‌కు ప్రసిద్ధి చెందాడు. అతను టెస్ట్‌లలో అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌గా పేరుగాంచాడు. అతను తన కెరీర్‌లో ఒక ప్రత్యేక రికార్డును సృష్టించాడు. దీని గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. ఆ రికార్డు గురించి ఇప్పుడు తెలుసుకుందాం..


బౌలర్లపై దూకుడు..

దాదాపు 94 సంవత్సరాల క్రితం డాన్ బ్రాడ్‌మాన్ తన డేంజరస్ బ్యాటింగ్‌తో కేవలం 3 ఓవర్లలోనే 100 పరుగులు సాధించాడు. 1931లో బ్లాక్ హీత్ జట్టు తరపున ఆడిన సర్ డాన్ బ్రాడ్‌మాన్ కేవలం 18 నిమిషాల్లోనే సెంచరీ సాధించాడు. ఆసమయంలో ఈ దిగ్గజ ప్లేయర్ బ్యాటింగ్ చేసిన శైలి అత్యుత్తమ బౌలర్లను కూడా భయపెట్టింది. బ్రాడ్‌మాన్ బౌలర్లకు ఒక పీడకలగా మారాడు.

3 ఓవర్లలో 100 పరుగులు..

ఆ సమయంలో జరిగిన టెస్ట్ మ్యాచ్ ఇది. 1 ఓవర్‌లో 8 బంతులు ఉండేవి. అంటే ఒక ఓవర్‌లో 48 పరుగులు వరకు చేయవచ్చు. న్యూ సౌత్ వేల్స్‌లో జరుగుతున్న మ్యాచ్‌లో, బ్రాడ్‌మాన్ తన మొదటి ఓవర్‌లోనే 38 పరుగులు చేశాడు. అయితే, ఇక్కడి వరకు పరిస్థితి అదుపులో ఉంది. కానీ, ఆ తర్వాత ఏమి జరిగిందో ఎవరూ ఊహించి ఉండరు. తదుపరి ఓవర్ వేయడానికి వచ్చిన బిల్ బ్లాక్, మునుపటి మ్యాచ్‌లో బ్రాడ్‌మాన్‌ను అవుట్ చేశాడు. ఈ మ్యాచ్‌లో బిల్ బ్లాక్ ఓవర్‌లో అతను 38 పరుగులు కొట్టాడు. ఆ ఓవర్‌లో అతను 3 ఫోర్లు, 3 సిక్సర్లు కొట్టాడు.

డబుల్ సెంచరీ పూర్తి..

తరువాతి ఓవర్లో, బ్రాడ్‌మాన్ మరోసారి స్ట్రైక్‌లో ఉన్నాడు. బౌలింగ్ చేయడానికి వచ్చిన హ్యారీ బేకర్ వేసిన ఈ ఓవర్‌లో, అతను దూకుడుగా బ్యాటింగ్ చేసి లాంగ్ సిక్సర్లు బాదాడు. అతను 4 ఫోర్లు, 4 సిక్సర్లు బాది కేవలం 3 ఓవర్లలోనే సెంచరీ సాధించాడు. సెంచరీ సాధించడానికి అతనికి కేవలం 18 నిమిషాలు పట్టింది. కాగా, మొదటి ఓవర్‌లో 33 పరుగులు (6,6,4,2,4,4,6,1)చేయగా, రెండవ ఓవర్‌లో 40 (6,4,4,6,6,4,6,4), మూడవ ఓవర్‌లో 29 (1,6,6,1,1,4,4,6) పరుగులు చేశాడు. ఇందులో వెండెల్ బిల్ మొదటి, ఐదవ బంతుల్లో తీసిన సింగిల్స్ ఉన్నాయి. ఈ ఇన్నింగ్స్‌లో, బ్రాడ్‌మాన్ 256 పరుగులు చేశాడు. ఇందులో 29 ఫోర్లు, 14 సిక్సర్లు ఉన్నాయి.

 

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.