మమ్మీ లు అనగానే మనకి గుర్తుకు వచ్చేది మమ్మీ సినిమాలో ఉండే ఈజిప్ట్ మమ్మీ లు. ఒక చనిపోయిన దేహానికి రకరకాల లేపనాలు పూసి వాటి శరీరం దెబ్బతినకుండా భద్రంగా జాగ్రత్తపరుస్తారు. మరి కొన్ని మమ్మీలు శిక్షలో భాగంగా పూడ్చి పెట్టబడుతాయి. కానీ తాజాగా చైనా లో దొరికిన ఓ మమ్మీ కధ వేరుగా ఉంది. ఆ మమ్మీ ని పూర్తిస్థాయిలో పరిశీలించిన పరిశోధకులకి కళ్ళు చెదిరే వాస్తవాలు బయటపడ్డాయి.
చైనాలో ఓ బౌద్ధ సన్యాసికి చెందిన మమ్మీ ఒకటి బయటపడింది.ముందుగా అది పద్మాసనంలో కూర్చుని ఉన్న బొమ్మ అనుకున్నారు. కానీ పరిశోధించి తరువాత ఒక్కొక్క నిజం తెలుసుకుని ఆశ్చర్య పోయారు. ఆ బొమ్మని పూర్తిగా స్కాన్ చేయగా లోపల అస్థిపంజరం ఉన్నట్లుగా గుర్తించారు. అది దాదాపు 1000 ఏళ్ల నాటి మమ్మీ అని గుర్తించారు. ఇక్కడ ఆశ్చర్యపడే విషయం ఏమిటంటే…
ఆ కాలంలో బౌద్ధ సన్యాసులు తామంతట తాముగా మమ్మీలు గా మారే వారట. అప్పట్లో ఆ పద్ధతిని ఆచారంగా భావించే వారట. ఎంతో దీక్షతో పట్టుదలతో ,అతి కష్టం మీద జరిగే ప్రక్రియ అంటున్నారు పరిశోధకులు. అలా మారడానికి గాను వాళ్ళు ముందుగా కొవ్వు కరగడానికి ఒక 1000 రోజుల పాటు కేవలం డ్రై ఫ్రూట్స్ తీసుకునే వారట. మరో వెయ్యి రోజులు వృక్షాల వేళ్ళు బెరడు మాత్రమే తీసుకునే వారట.ఇలా చేయడం వలన శరీరంలో ఉండే తేమ , ఆమ్లాలు బయటకి వచ్చి శరీరం నిర్జీవంగా అయ్యేదట. ఆ తరువాత ఇలాంటి ప్రతిమలోకి వెళ్లి బయట నుంచీ గాలి వచ్చేలా మార్గాన్ని చేసుకుని , ఒక గంట ఏర్పాటు చేసుకుని వారట. చబిపోయే వరకూ ఆ గంట మొగుతూ ఉంటుందని, అప్పటి వరకూ అలా ధ్యానంలోనే ఉండేవారని చనిపోయాక గంట మొగడం ఆగిపోతుందని పరిశోధకులు తెలిపారు.