మనకు లోన్ కావాలంటే కచ్చితంగా బ్యాంక్ కి వెళ్ళాలి. అక్కడ ప్రాసెస్ అంత ఈజీ కాదు. పైగా లోన్ శాంక్షన్ అవ్వడానికి కూడా ఎక్కువ టైమ్ పడుతుంది. కానీ ఈ ఒక్క పని చేస్తే బ్యాంక్ కి వెళ్ళకుండా మీరు మీ ఇంటి వద్దనే లోన్ పొందవచ్చు. ఏకంగా 15 లక్షల వరకు లోన్ పొందవచ్చు. అదెలాగో పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
ఈ లోన్ కావాలంటే కచ్చితంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) అకౌంట్ ఉండాలి. ఎస్బిఐ.. తన యోనో యాప్ ద్వారా కస్టమర్లకు బ్యాంకుకు వెళ్లకుండా పర్సనల్ లోన్ పొందే సదుపాయం అందిస్తోంది. ఆన్‌లైన్లో కస్టమర్లు కేవలం ఈ యాప్ సహాయంతో తమ అవసరాలకు అనుగుణంగా లోన్ అప్లై చేసుకోవచ్చు. ఈ యాప్ ద్వారా మీరు ఇనస్టంట్ పర్సనల్ లోన్ అప్లై చేసి 50,000 నుండి 15 లక్షల దాకా పొందవచ్చు. ఈ యాప్ ముఖ్యంగా బ్యాంకుకి వెళ్ళకుండా ఆన్‌లైన్ సేవలను కోరుకునే వారికి చాలా బెస్ట్. మీరు ఇంటి నుంచి బయటకు వెళ్లకుండానే లోన్ ప్రాసెస్ అంతా కూడా చాలా ఈజీగా పూర్తి చేసుకోవచ్చు.
ఈ లోన్ కావాలంటే కచ్చితంగా కొన్ని అర్హతలు ఉండాలి. అవేంటంటే.. మీరు భారతీయ పౌరుడై ఉండాలి. మీ వయస్సు 18 నుండి 60 సంవత్సరాల మధ్య ఉండాలి. మీరు కచ్చితంగా SBI సేవింగ్ అకౌంట్ కలిగి ఉండాలి.ఇక సిబిల్ స్కోర్ చాలా ముఖ్యం. మీ సిబిల్ స్కోర్ మినిమమ్ 750 పైన ఉండాలి.మీ ఆదాయం నెలకు కనీసం 18,000 ఉండాలి.స్థిరంగా ఏదైనా ఉద్యోగం చేస్తూ ఉండాలి. ఈ అర్హతలు ఉంటేనే మీకు ఈ లోన్ వస్తుంది. ఇందులో మీకు వడ్డీ కూడా తక్కువే. ఈ లోన్ కి వడ్డీ రేటు కేవలం 11.45% ఉంటుందని SBI తెలుపుతోంది.ఇందులో ఇంకో సౌలభ్యం ఏంటంటే ఈ లోన్ కి ఎలాంటి ప్రాసెసింగ్ ఫీజు లేదు. ఎలాంటి ప్రాసెసింగ్ చార్జీలు లేకుండానే మీకు ఇందులో లోన్ వస్తుంది. అయితే ఈ స్కీమ్ భారతీయ పౌరుల కోసం ప్రత్యేకంగా పెట్టారు. ఎన్నారైలు అప్లై చేసుకోవడం కుదరదు.
ఇక Yono యాప్ ద్వారా ఈ లోన్ ఎలా అప్లై చేసుకోవాలో తెలుసుకుందాం.. ముందుగా మీరు మీ స్మార్ట్‌ఫోన్‌లో SBI Yono యాప్ డౌన్లోడ్ చేయాలి. తరువాత యాప్‌లో యూజర్ ఐడీ ఇంకా పాస్‌వర్డ్ క్రియేట్ చేసుకొని, వాటిని ఉపయోగించి లాగిన్ అవ్వాలి. ఇక యాప్ లో లాగిన్ అయిన తర్వాత, మీ అకౌంట్ లో ప్రీ-అప్రూవ్డ్ పర్సనల్ లోన్ వివరాలు మీరు చూడవచ్చు. ఆ తరువాత అప్లై బటన్ పై క్లిక్ చేసి, మీకు ఎంత లోన్ కావాలో సెలెక్ట్ చేసుకొని, మీకు అనుగుణంగా ఉండే టెన్యూర్ ని సెలెక్ట్ చేసుకోండి. ఇక అవసరమైన అన్ని వివరాలని ఎంటర్ చేయండి. మీ మొబైల్ నంబర్ వాడి OTP ద్వారా వెరిఫికేషన్ పూర్తి చేయాలి. మీ వివరాలు అన్నీ కరెక్ట్ గా పర్ఫెక్ట్ గా ఉంటే మీకు ఈజీగా లోన్ వచ్చేస్తుంది.