ప్రధాని మోదీ 190 అడుగుల కాంస్య విగ్ర‌హం.. ఎక్క‌డో తెలుసా..?

బిజెపి ప్ర‌భుత్వం అధికారంలో వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి అనేక కార్య‌క్ర‌మాల‌ను చేప‌ట్టింది. అందులో ముఖ్యంగా అయోధ్య రామాలయం గురించి అంద‌రికీ తెలిసిందే. దేశంలో ఎన్నో విగ్ర‌హాల‌ను ఏర్పాటు చేశారు. ఎన్నో వంతెన‌ల‌ను కూడా ప్ర‌ధాని ప్రారంభించారు. దేశంలో తొలిసారిగా ప్ర‌ధాని మోదీ విగ్ర‌హాన్ని ఏర్పాటు చేయ‌నున్నారు. అది కూడా 190 అడుగుల కాంస్య విగ్ర‌హం. 200 కోట్ల రూపాయ‌ల‌తో ఈ విగ్ర‌హాన్ని ఏర్పాటు చేయాల‌నుకుంటున్నారు. ఈ విగ్ర‌హం మొత్తం 60 అడుగుల పీఠ‌భాగంతో క‌లుపుకొని విగ్ర‌హం ఎత్తు 250 అడుగులు ఉంటుంది.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై తనుకున్న అభిమానాన్ని అస్సాంకు చెందిన ఓ వ్యాపారవేత్త ఈ విధంగా తీర్చుకుంటున్నారు. మోదీపై త‌న‌కున్న అభిమానంతో 190 అడుగుల ఎత్తైన ప్రధాని క్యాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ ప్రాజెక్ట్‌కు సోమవారమే ఆ వ్యాపారవేత్త భూమి పూజ కూడాను ప్రారంభించారు. అసోంకి చెందిన వ్యాపారవేత్త నవీన్‌చంద్ర బోరా. గువాహటి నగరానికి సమీపంలో ఉన్న తన స్థలంలోనే ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయ‌నున్నారు. దీని శంకుస్థాపన కార్యక్రమాన్ని కూడా ఆయ‌న మూడు రోజులపాటు నిర్వహించారు. ఈ విగ్రహం మెడ భాగంలో అసోం సంస్కృతికి చిహ్నంగా గమోసా ఉంటుందని నవీన్‌చంద్ర బోరా తెలిపారు. ఈ విగ్రహ ప్రతిష్ఠాపన వివరాలతో గత సంవ‌త్స‌రం ప్రధాని కార్యాలయానికి లేఖ కూడా పంపినట్లు ఆయ‌న చెప్పారు.
ప్ర‌ధాని మోదీకి వీరాభిమాని అస్సోం వ్యాపార‌వేత్త‌ : నవీన్‌చంద్ర బోరా ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోదీకి వీరాభిమాని. ఆయన చేతుల మీదుగా 2016లో ప్రశంసా పత్రాన్ని కూడా అందుకోవ‌డం జ‌రిగింది. ఆ సమయంలోనే మోదీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ఆయ‌న నిర్ణయం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. సొంతడబ్బులతో, గౌహతిలోని జలుక్‌బరిలోని బస్టాండ్ సమీపంలోని తన సొంత స్థలంలో ఈ విగ్ర‌హ ఏర్పాటుకు ఆయ‌న ప‌నులు ప్రారంభించారు. ఈ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి ప్రధాని మోదీ హాజరవుతారని ఆశిస్తున్నానని న‌వీన్‌చంద్ర వెల్లడించారు.