వారి ఖాతాల్లో 2న్నర లక్షలు..ఏపీలో వారికి శుభవార్త

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సొంత ఇంటి స్థలం ఉండి, ఇల్లు కట్టుకోవడానికి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వారికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి శుభవార్త చెప్పాయి.


ఇప్పటికే ఏపీలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద అర్హులైన వారికి ఇళ్లను మంజూరు చేస్తున్న కార్యక్రమం యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతోంది.

పీఎం ఆవాస్ యోజన 2.0

ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ పథకం కింద అర్హులైన వారికి ఇళ్లను మంజూరు చేసి లబ్ధిదారుల వివరాలను గ్రామ, వార్డు సచివాలయం ద్వారా అధికారులు సేకరిస్తున్నారు.ఎవరైతే సొంత ఇంటి స్థలం ఉండి, ఇల్లు కట్టుకోవడానికి ఆర్థికంగా ఇబ్బంది ఉందో అటువంటివారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అందిస్తున్న ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 కింద రెండున్నర లక్షల రూపాయలను పొందవచ్చు.

దరఖాస్తుల స్వీకరణ గడువు పొడిగింపు

ప్రస్తుతం దీనికోసం అర్హులైన లబ్ధిదారుల నుండి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. దరఖాస్తుల స్వీకరణను నవంబర్ 5నుండి నవంబర్ 30తేదీ వరకు పొడిగించి ఏపీలో ఇల్లులేని నిరుపేదలకు శుభవార్త చెప్పారు. కొత్తగా అందుబాటులోకి వచ్చిన పిఎంఏవై గ్రామీణ 2.0యాప్ ద్వారా దరఖాస్తుల ప్రక్రియ సులభతరం చేశారు.దరఖాస్తు చేసుకోవడానికి ఆధార్, రేషన్ కార్డులు, ఇంటి పట్టా, బ్యాంకు ఖాతా వివరాలు ఇతర అవసరమైన పత్రాలతో సచివాలయానికి వెళ్లి జిరాక్స్ కాపీలను సమర్పించి దరఖాస్తు చేసుకోవాలి.

ఈ పథకం క్రింద ఆర్ధిక సహాయం

దరఖాస్తు చేసుకున్న తర్వాత అధికారులు స్థలాన్ని పరిశీలించి, దాని ఫోటోలను యాప్లో నమోదుచేసి అర్హత ఉన్నట్లయితే పథకాన్ని వర్తింపజేస్తారు. ఇల్లు పునాది దశలో ఉంటే ఈ పథకం కింద ఆర్థిక సహాయం లభిస్తుంది .ఇంటి నిర్మాణ సమయంలో 90 రోజుల పాటు కూలీలకు వేతనం ఇస్తారు. ఇంటి నిర్మాణంలో వివిధ దశలు పూర్తయినప్పుడు దశలవారీగా నిధులను విడుదల చేస్తారు. ఇది లబ్ధిదారులకు ఆర్థిక భారాన్ని తగ్గిస్తుంది.

లబ్దిదారుడికి 2న్నర లక్షల రూపాయలు

లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియలో భాగంగా పారదర్శకత కోసం మొబైల్ యాప్ ను ఉపయోగిస్తారు. నిర్మాణ పనులను జియో టాకింగ్ ద్వారా పర్యవేక్షించి ఎప్పటికప్పుడు బిల్లులను చెల్లిస్తారు మొత్తం ఇంటి నిర్మాణానికి రెండు లక్షల 50 రూపాయల యూనిట్ విలువలో కేంద్ర ప్రభుత్వం నుండి ఒక లక్ష 50 వేల రూపాయలు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి లక్ష రూపాయలను అందిస్తారు.

ఇల్లు లేని వారు ఇల్లు కట్టుకోవాలంటే ఇదే బెస్ట్ స్కీం

ఈ నిధుల విడుదలను పునాది లెవెల్ కు, లింటల్ లెవెల్ కు, స్లాబ్ లెవెల్ కు, నిర్మాణం తర్వాత వివిధ నిర్మాణ దశల ఆధారంగా ఇస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇల్లు లేని నిరుపేదల సొంతింటి కల నెరవేర్చుకోవడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అందిస్తున్న ఈ పథకాన్ని అందిపుచ్చుకోండి. దరఖాస్తు గడువును పొడిగించిన నేపథ్యంలో వెంటనే త్వరపడండి.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.