Viral : తనకు తానే కిడ్నప్ అయినట్లు సృష్టించి తల్లితండ్రుల నుండి 2 లక్షలు డిమాండ్..

www.mannamweb.com


Crime Thriller Kidnap : తాజాగా రాజస్థాన్ రాష్ట్రంలో ఓ క్రైమ్ థ్రిల్లర్ సినిమాను ఏమాత్రం తీసుకొని విధంగా సంఘటన జరిగింది. ఓ గ్రాడ్యుయేషన్ మొదటి సంవత్సరం చుదువుతున్న విద్యార్థి ఆన్లైన్ లలో గేమ్స్ ఆడి రూ. 40000 పోగొట్టుకున్నాడు. అయితే ఈ విషయం ఇంట్లో తెలిస్తే తాటతీస్తారని., దాంతో అతను ఓ మాస్టర్ ప్లాన్ ఆలోచించాడు. తన సొంత కిడ్నాప్ కథను సృష్టించాడు. అందుకోసం తన తల్లిదండ్రుల వద్ద నుండి రెండు లక్షల రూపాయలను డిమాండ్ చేశాడు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు పరిశీలిస్తే..

రాజస్థాన్ రాష్ట్రంలోని కోట నగరంలో గ్రాడ్యుయేషన్ మొదటి సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థి తనకు తానే కిడ్నాప్ అయినట్లు కథను సృష్టించాడు. అంతేకాదు తన తల్లిదండ్రుల నుండి రెండు లక్షల రూపాయలను డిమాండ్ చేశాడు. కాకపోతే తన ప్లాన్ అడ్డం తిరిగింది. చివరికి పోలీసుల కోటింగ్ లో తప్పును అంగీకరించాడు. జూలై 2న జగ్‌పురా కోటకు చెందిన ఓ వ్యక్తి రాంపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు పోలీస్ అధికారిని అమృత తెలిపారు. తన కుమారుడు ఎలాంటి సమాచారం లేకుండా కనబడటం లేదని ఆ ఫిర్యాదులో తెలిపాడు. అందుకు సంబంధించిన కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. ఇందులో బాగుందానే తప్పిపోయిన ఆ బాలుడి కోసం పోలీసులు వెలుగుతున్న సమయంలో అతని తండ్రి ఫోనుకు ఆ బాలుడే ఫోటోలు గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ నుండి రావడం మొదలుపెట్టాయి. ఆ ఫోటోలలో ఆ బాలుడికి నోటికి కర్చీఫ్ కట్టి, చేతులు వెనక్కి కట్టి ఉంచడం లాంటి సంఘటనలు కనబడ్డాయి. అయితే తన కుమారుడని ఏడిపించుకునేందుకు రెండు లక్షలు డిమాండ్ చేశారు. ఇక ఈ విషయాన్ని తల్లిదండ్రులు పోలీసులకు తెలపడంతో ఘటన తీవ్రతను పరిగణలోకి తీసుకొని పోలీసులు సపరేట్ బృందాన్ని ఏర్పాటు చేశారు.

ఈ నేపథ్యంలోనే సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి పోలీసులు విద్యార్థిని గుర్తించి జైపూర్ రైల్వే జంక్షన్ నుండి అతడిని కాపాడే కుటుంబ సభ్యులకు అప్పగించారు. అదే ఈ విషయంపై పోలీసులకు పూర్తి విచారణ జరపగా ఇంస్టాగ్రామ్ లో ఆన్లైన్ గేమ్ ప్రకటన చూసి తాను గేమ్ ఆడటం మొదలుపెట్టాలని.. అందులో 40 వేలు పోగొట్టుకున్నట్లు తెలిపాడు. దీంతో తన కుటుంబం నుంచి ఎలాగైనా డబ్బులు రాబట్టేందుకు ఈ మాస్టర్ ప్లాన్ వేసినట్లు నిందితుడు అంగీకరించాడు. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి పోలీసులు విచారణ జరుగుతున్నారు.