బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతుంది. అయితే.. మరోటి కూడా ఏర్పడేందుకు పరిస్థితులు అనుకూలంగా మారుతున్నాయి.
మలక్కా జలసంధి సమీపంలో తీవ్ర అల్పపీడనం మంగళవారం ఉదయం వాయుగుండంగా బలపడింది. ఇది మరింగా బలపడుతుండడంతో రాబోయే 24 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియచేసింది. ఇది తుఫానుగా మారేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని కూడా వాతావరణ నిపుణులు చెబుతున్నారు. రెండు రోజుల్లో దీని పై క్లారిటీ వస్తుంది అంటున్నారు.
శనివారం లేదా ఆదివారానికి తమిళనాడు, (Tamilnadu) ఏపీ తీరాల వైపు వెళుతుందని కొన్ని సూచిస్తుంటే.. సముద్రంలోనే బలహీనపడుతుందని మరికొన్ని సూచిస్తున్నాయి. వైరుతి బంగాళాఖాతంలో శ్రీలంక భూమధ్యరేఖకు సమీపంలో మరో అల్పపీడనం ఏర్పడింది. ఇది తీవ్ర అల్పపీడనంగా 24 గంటల్లో వాయుగుండంగా బలపడుతుందని అంచనా. దీని ప్రభావం తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ లపై ఉంటుందని వాతావరణ శాఖ తెలియచేసింది.
































