ప్రైడే ఓటీటీలోకి ఏకంగా 20 సినిమాలు.. వీకెండ్ టైం పాస్ పక్కా..

మరోవారం వచ్చేసింది అంటే సినిమాల సందడి కూడా వచ్చేసినట్లే. ప్రతి వారం థియేటర్లలో ఎలా అయితే సినిమాలు రిలీజ్ అవుతున్నాయో.. ఓటీటీలోకి కూడా చాలా సినిమాలు వచ్చేస్తాయి..


ఈ వారం థియేటర్లలోకి బోలెడు సినిమాలు విడుదల అయ్యాయి. రామ్ పోతినేని నటించిన ఆంధ్రా కింగ్ తాలూకా మూవీ థియేటర్లలోకి రిలీజ్ అయ్యి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. గత కొన్ని రోజులుగా హిట్ సినిమాలు లేక సతమతమవుతున్న హీరోకు ఈ మూవీ టాక్ ఊరట కలిగిస్తుంది.. అటు ఫ్రైడే ఓటీటీలోకి బోలెడు సినిమాలు స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్నాయి..

ప్రతి వీక్ లాగే ఈ వారం కూడా బోలెడు కొత్త సినిమాలు ఓటీటీలోకి స్ట్రీమింగ్ కు వస్తున్నాయి. శుక్రవారం ఒక్కరోజే 20 వరకు మూవీస్-వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్ కాబోతున్నాయి. వాటిలో గతవారంతో పోలిస్తే ఈ వారం చాలా సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి. మాస్ జాతర, ఆర్యన్, ప్రేమిస్తున్నా, శశివదనే, ఆన్ పావమ్ పొల్లతత్తు తదితర తెలుగు స్ట్రెయిట్, డబ్బింగ్ మూవీస్ రాబోతున్నాయి.. మరి ఆలస్యం ఎందుకు ఈ శుక్రవారం థియేటర్లలో సందడి చెయ్యబోతున్న చిత్రాలేంటో ఒక లుక్ వేసేద్దాం..

శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేస్తున్న సినిమాలు…

నెట్‌ఫ్లిక్స్

మాస్ జాతర – తెలుగు సినిమా

ఆర్యన్ – తెలుగు డబ్బింగ్ మూవీ

సన్నీసంస్కారి కీ తులసి కుమారి – హిందీ మూవీ (స్ట్రీమింగ్ అవుతోంది)..

లెఫ్ట్ హ్యాండెడ్ గర్ల్ – మాండరిన్ సినిమా

స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 వాల్యూమ్ 1 – తెలుగు డబ్బిగ్ సిరీస్ ( స్ట్రీమింగ్ అవుతుంది)

హాట్‌స్టార్..

ఆన్ పావమ్ పొల్లతత్తు – తెలుగు డబ్బింగ్ చిత్రం

బార్న్ హంగ్రీ – ఇంగ్లీష్ మూవీ

అమెజాన్ ప్రైమ్..

కాంతార 1 – హిందీ డబ్బింగ్ వెర్షన్

షీ రైడ్స్ షాట్ గన్ – తెలుగు డబ్బింగ్ సినిమా

జీ5..

రేగాయ్ – తమిళ సిరీస్

రక్తబీజ్ – బెంగాలీ మూవీ

ద పెట్ డిటెక్టివ్ – తెలుగు డబ్బింగ్ సినిమా

బుక్ మై షో..

40 ఏకర్స్ – ఇంగ్లీష్ సినిమా

ఎలివేషన్ – ఇంగ్లీష్ మూవీ

గ్యాబీ డాల్ హౌస్ – ఇంగ్లీష్ సినిమా

హాచీ: ఏ డాగ్స్ టేల్ – ఇంగ్లీష్ మూవీ

విన్నర్ – ఇంగ్లీష్ సినిమా

ఆహా..

ప్రేమిస్తున్నా – తెలుగు సినిమా

క్రిస్టినా కథిర్‌వేలన్ – తమిళ మూవీ

లయన్స్ గేట్ ప్లే..

ప్రీమిటివ్ వార్ – తెలుగు డబ్బింగ్ సినిమా

రష్ – ఇంగ్లీష్ మూవీ

సన్ నెక్స్ట్..

శశివదనే- తెలుగు సినిమా

మొత్తానికి గత వారంతో పోలిస్తే ఈ వారం బోలెడు సినిమాలు డిజిటల్ ప్లాట్ ఫామ్ లోకి వచ్చేస్తున్నాయి.. ఇందులో కేవలం నాలుగైదు సినిమాలు మాత్రమే ప్రేక్షకులను ఆకట్టుకునేలా కనిపిస్తున్నాయి.. మరి ఈ వీకెండ్ మీకు నచ్చిన ఓటీటీలో మెచ్చిన సినిమాను చూసేయ్యండి… నవంబర్ నెల చివరన సినిమాలో థియేటర్లలోకి రాబోతున్నాయి. కొన్ని సినిమాలు మాత్రం డిసెంబర్ 25న క్రిస్మస్ సందర్భంగా థియేటర్లలో సందడి చేయబోతున్నాయి. చాలావరకు స్టార్ హీరోల సినిమాలన్నీ కూడా సంక్రాంతి పోటీలో తలపడనున్నాయి.. ఈ మూవీల కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.