20 లక్షలకే 200 గజాల స్థలం.. ఒక్క నెలలోనే 4 లక్షలు లాభం! కోటీశ్వరులయ్యేందుకు ఇదే మంచి ఛాన్స్

www.mannamweb.com


రియల్ ఎస్టేట్ లో పెట్టుబడి పెట్టి లక్షాధికారులు, కోటీశ్వరులు అవ్వాలని చాలా మందికి ఉంటుంది. అయితే దీనికి ఓపిక, స్ట్రాటజీ కూడా ఉండాలి. వీటితో పాటు డబ్బు కూడా ఉండాలనుకోండి. అయితే మరీ ఎక్కువ పెట్టుబడి పెట్టకుండా తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందాలంటే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇప్పుడు అందరికీ మంచి ఛాయిస్ గా ఉంది. ఇప్పుడు చెప్పుకోబోయే ఏరియాలో పెట్టుబడి పెడితే కనుక ఒక్క నెలలోనే భారీ లాభాలు పొందే అవకాశం ఉంది. ఫ్యూచర్ లో కోటీశ్వరులయ్యేందుకు కూడా అవకాశం ఉంది. అలాంటి ఏరియా గురించి ఇప్పుడు తెలుసుకోబోతున్నారు. ఆ ఏరియాలో గజం స్థలం 10 వేల రూపాయలుగా ఉంది. మీరు కనుక 10 లక్షలు పెట్టి 100 గజాల స్థలం కొనుక్కున్నట్లైతే కనుక భవిష్యత్తులో ఆ 10 లక్షలు కోటి రూపాయలు అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఆ ఏరియాలో అతి పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ వస్తుంది.

అతి పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ అయిన.. నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ (నిమ్జ్) వస్తుంది. ఇది వస్తే ఎన్నో కంపెనీలు వస్తాయి. లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి. మరో మాదాపూర్, గచ్చిబౌలి ఏరియాగా ఈ ఏరియా డెవలప్ కాబోతుంది. ఇప్పటికే అక్కడ పలు రియల్ ఎస్టేట్ కంపెనీలు వెంచర్స్ అమ్ముతున్నాయి. భారీగా రియల్ ఎస్టేట్ వ్యాపారం జరుగుతోంది. డీటీసీపీ, రెరా అప్రూవ్డ్ లేఅవుట్స్ అందుబాటులో ఉన్నాయి. 150 ఎకరాల్లో కొత్త వెంచర్ ఒకటి స్టార్ట్ అవ్వనుంది. ఇది ముంబై హైవేకి 2 కి.మీ., వాక్సన్ యూనివర్సిటీకి 4 కి.మీ. దూరంలో ఉంది. రీజనల్ రింగ్ రోడ్ కి 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. అవుటర్ రింగ్ రోడ్ కి 40 కి.మీ. దూరంలో ఉంది. హైదరాబాద్ లో బెంగళూరు హైవే, విజయవాడ హైవే, శ్రీశైలం హైవే సహా పలు హైవేలతో పోలీస్తే ఎక్కువగా రియల్ ఎస్టేట్ గ్రోత్ కి కేపబిలిటీ ఉన్న హైవే ముంబై హైవే.

ముంబై హైవేకి దగ్గర్లో ఎక్కడ స్థలాలు తీసుకున్నా గానీ భారీగా లాభాలు పొందవచ్చునని నిపుణులు చెబుతున్నారు. ఈ ఏరియాలో ఇప్పుడు వెంచర్స్ మీద ఆఫర్ నడుస్తోంది. గజం 10 వేలకు అమ్ముతున్నారు. ఒక నెల దాటితే అదే గజం ధర రూ. 12 వేలు అవుతుంది. ఇప్పుడు 2 వేలు డిస్కౌంట్ ఇస్తున్నారు. మీరు కనుక ఇప్పుడు 20 లక్షలు ఇన్వెస్ట్ చేసి 200 గజాల స్థలం కొనుగోలు చేసి ఒక నెల తర్వాత అమ్ముకుంటే 4 లక్షలు లాభం పొందవచ్చు. అలానే కొన్నేళ్లు ఉంచుకుంటే కోటీశ్వరులయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు చదరపు అడుగు స్థలం 1100 నుంచి 1200 రూపాయలుగా ఉంది. రెండు, మూడేళ్ళలో ఇది 3 వేల నుంచి 5 వేలకు పెరిగితే కనుక మీకు లక్షల్లో లాభాలు పొందవచ్చు. హైదరాబాద్ సిటీలో ఉన్న ఏరియాలు ఒకప్పుడు ఇలా తక్కువ ధరకు పలికినవే. ఇప్పుడు కోట్లు కురిపిస్తున్నాయి. ఏది ఏమైనా గానీ ముంబై హైవే దగ్గర కొత్తగా లాంఛ్ అవుతున్న ఈ వెంచర్ లో ఇప్పుడు కొనడం వల్ల 4 లక్షలైతే మిగులుతాయి.

గమనిక: పలువురు రియల్ ఎస్టేట్ నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వబడింది. మీరు పెట్టుబడి పెట్టే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించి అవగాహనతో పెట్టుబడి పెట్టాల్సిందిగా మనవి.