ఆలయ హుండీలో రూ.2వేల నోట్ల కట్టలు.. కంగుతిన్న పూజారులు

రూ.2000 నోట్లను ఆర్బిఐ చలామణి నుంచి వెనక్కి తీసుకున్న సంగతి తెలిసిందే. 2023 మే 19 ఆర్.బి.ఐ నిర్ణయం తీసుకుంది. వీటిలో దాదాపు 98 శాతానికి పైగా రికవరీ అవ్వగా..


మిగతా కరెన్సీ ఆర్బిఐ కి తిరుగు రాలేదు. ఇంకా ఎవరి దగ్గరైనా ఈ నోట్లు ఉంటే ఆర్.బి.ఐ ప్రాంతీయ కేంద్రాల్లో మార్చుకోవచ్చని ఆర్బిఐ వెల్లడించింది. అయితే ప్రజల దగ్గరే ఇంకా రూ. 6000 కోట్లకు పైగా కరెన్సీ ఉన్నట్లు తెలిసింది.

ప్రస్తుత మార్కెట్లో ఎవరి దగ్గర ఈ నోట్లో కనిపించడం లేదు. కానీ ఓ దేవాలయంలోని హుండీలో ఈ నోట్లు దర్శనమిచ్చాయి. రూ. 2000 నోట్ల కట్టలు చూసి ఆ ఆలయ అధికారులు ఒక్కసారి షాక్ అయ్యారు. ఆలయానికి వెళ్తే భక్తులు తమ కోరికలు చెప్పుకొని కానుక రూపంలో సమర్పించుకుంటారు. కానీ ఓ భక్తుడు ఆలయం హుండీలో రూ. 2000 కోట్ల కట్టలను సమర్పించాడు. ఆ నోట్ల కట్టల విలువ దాదాపు రూ. 2లక్షల 44వేల వరకు ఉంటాయని ఆలయ అధికారులు వెల్లడించారు. ఆ నోట్లు ఇప్పుడు చెల్లవనే కారణంగా అతను హుండీలో వేసినట్లు పూజారులు అధికారులు అభిప్రాయం వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా తెనాలి వైకుంఠపురం దేవస్థానం గుడి హుండీలో ఈ ఘటన చోటుచేసుకుంది