బ్రాండెడ్ TVపై క్రేజీ ఆఫర్ గురూ.. 25 వేల స్మార్ట్ TV 10 వేలకే.

www.mannamweb.com


దసరా పండగ సెలబ్రేషన్స్ అప్పుడే మొదలయ్యాయి. ఎక్కడ చూసినా ఫెస్టివల్ వైబ్స్ కనిపిస్తోంది. పండగ వేళ నూతన వస్తువులను ఇంటికి తెచ్చుకోవాలని భావిస్తుంటారు. తక్కువ ధరలో వచ్చే క్వాలిటీ ఐటెమ్స్ కోసం చూస్తుంటారు. ఫెస్టివల్స్ సమయంలో షాపింగ్ మాల్స్, ఎలక్ట్రానిక్ ప్రొడక్స్ట్ తయారీ సంస్థలు, ప్రముఖ ఈకామర్స్ సంస్థలు తమ ఉత్పత్తులపై కళ్లు చెదిరే ఆఫర్స్ ను ప్రకటిస్తుంటాయి. కస్టమర్లను ఆకర్షించేందుకు భారీ డిస్కౌంట్స్ ను అందిస్తుంటాయి. తమ సేల్స్ ను పెంచుకునేందుకు క్రేజీ డీల్స్ ను అందుబాటులో ఉంచుతాయి. కాగా ప్రస్తుతం ప్రముఖ ఈకామర్స్ సంస్థలో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నడుస్తోంది.

ఈ సేల్ సందర్భంగా ఎలక్ట్రానిక్ వస్తువులపై మతిపోయే ఆఫర్లను అందిస్తోంది. స్మార్ట్ టీవీలపై కిర్రాక్ ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. తక్కువ ధరకే బ్రాండెడ్ టీవీలను సొంతం చేసుకునే ఛాన్స్ కల్పిస్తున్నది. మరి మీరు కూడా ఈ దసరాకి కొత్త టీవీ కొనాలనే ప్లాన్ లో ఉన్నారా? తక్కువ ధరలో బెస్ట్ ఫీచర్స్ ఉన్న టీవీ కోసం చూస్తున్నారా? అయితే ఈ డీల్ ను వదలకండి. ప్రముఖ ఎలక్ట్రానిక్ తయారీ సంస్థ షియోమీ కంపెనీకి చెందిన 32 అంగుళాల స్మార్ట్ టీవీపై 54 శాతం డిస్కౌంట్ అందుబాటులో ఉంది. 25 వేలు విలువ చేసే టీవీ 10 వేలకే వచ్చేస్తోంది. టీవీ తయారీ కంపెనీల మధ్య నెలకొన్న పోటీతో 10 వేల ధరకే అడ్వాన్స్డ్ ఫీచర్లు ఉన్న టీవీలు లభ్యమవుతున్నాయి. మీరు కూడా 10 వేలకే షియోమీ స్మార్ట్ టీవీని సొంతం చేసుకోవచ్చు.

షియోమీ స్మార్ట్ టీవీ ఏ 32 2024 ఎడిషన్ పై 54 శాతం తగ్గింపు లభిస్తోంది. దీని అసలు ధర 24 వేల 999గా ఉంది. ఆఫర్లో భాగంగా దీన్ని మీరు 11 వేల 489కే సొంతం చేసుకోవచ్చు. అయితే ఎస్బీఐ, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డులను ఉపయోగించి కొనుగోలు చేస్తే 10 వేలకే షియోమీ టీవీని దక్కించుకోవచ్చు. బెజెల్ లెస్ డిజైన్ తో వస్తుంది. 720పీ రెసొల్యూషన్, 60 హెచ్ జెడ్ రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. ఈ స్మార్ట్ టీవీలో క్విక్ వేక్, క్విక్ మ్యూట్, క్విక్ సెట్టింగ్స్ మెనూ వంటి స్పెషల్ ఫీచర్స్ ఉన్నాయి. వైఫై, యూఎస్బీ, ఈథర్ నెట్, హెచ్ డీఎంఐ కనెక్టివిటీ టెక్నాలజీతో వస్తుంది. ప్రైమ్ వీడియో, నెట్ ఫ్లిక్స్, యూట్యూబ్, డిస్నీ+హాట్ స్టార్ యాప్స్ కి సపోర్ట్ చేస్తుంది. గూగుల్ అసిస్టెంట్ ఫీచర్ అందించారు. గుడ్ సౌండ్ ఎక్స్ పీరియన్స్ కోసం డాల్బీ ఆడియో స్పీకర్స్ ను ఇచ్చారు.