మిడిల్​ క్లాస్​ వారి ముందు 3 బెస్ట్​ ఎలక్ట్రిక్​ స్కూటర్లు​- ఏది కొంటే బెటర్

www.mannamweb.com


హోండా యాక్టివా ఎలక్ట్రిక్​ స్కూటర్​ వర్సెస్​ టీవీఎస్​ ఐక్యూబ్​ వర్సెస్​ బజాజ్​ చేతక్​ ఈవీ.. రేంజ్​ పరంగా ఈ 3 బెస్ట్​ వెహికిల్స్​లో ఏది బెటర్​? ఏది కొనొచ్చు? పూర్తి వివరాలను ఇక్కడ చూసేయండి..

హోండా యాక్టివా ఈవీ లాంచ్​తో దేశంలో మిడిల్​ క్లాస్​ వారికి ఎలక్ట్రిక్​ స్కూటర్ల ఆప్షన్లు పెరిగాయి. ‘హోండా యాక్టివా ఈ’గా పిలుస్తున్న ఈ వెహికిల్​ ఒక ఫ్యామిలీ ఎలక్ట్రిక్ స్కూటర్! ఇది 2025 నాటికి అమ్మకానికి వస్తుంది. ఈ యాక్టివా ఈవీ.. ఇండియాన్​ ఆటోమొబైల్​ మార్కెట్​లోని ఎలక్ట్రిక్​ స్కూటర్ల సెగ్మెంట్​లో ఇప్పటికే మంచి డిమాండ్​ ఉన్న టీవీఎస్ ఐక్యూబ్, బజాజ్ చేతక్ వంటి వాటికి గట్టి పోటీ ఇస్తుందని అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ రెండింటినీ పోల్చి, రేంజ్​తో పాటు ఇతర కీలక వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..

హోండా యాక్టివా వర్సెస్ టీవీఎస్ ఐక్యూబ్..

హోండా యాక్టివా ఎలక్ట్రిక్​ పోటీదారు టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్​ స్కూటర్​ పోర్ట్​ఫోలియోను మూడు కొత్త వేరియంట్లతో ఇటీవలే విస్తరించారు. 2.2 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ ధర రూ.94,999గా ఉంది. 3.4 కిలోవాట్ల యూనిట్, 5.1 కిలోవాట్ల యూనిట్ అనే రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లతో ఐక్యూబ్ ఎస్​టీని అందిస్తున్నారు.

టీవీఎస్ ఐక్యూబ్ ఎస్​టీ 3.4 కిలోవాట్ల వేరియంట్ 100 కిలోమీటర్ల రియల్​టైమ్​ రేంజ్​ని అందిస్తోంది. రెండు గంటల 50 నిమిషాల్లో 0-80 శాతం ఛార్జింగ్ సమయం ఉంటుంది! మరోవైపు, 5.1 కిలోవాట్ల వేరియంట్ దాని సెగ్మెంట్​లోనే అతిపెద్ద బ్యాటరీ ప్యాక్​ని కలిగి ఉంది. ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 150 కిలోమీటర్ల పరిధిని ఇస్తుంది. 5.1 కిలోవాట్ల బ్యాటరీని 0-80 శాతం నుంచి ఛార్జ్ చేయడానికి నాలుగు గంటల 18 నిమిషాలు పడుతుంది.

5.1 కిలోవాట్ సామర్థ్యం కలిగిన టీవీఎస్ ఐక్యూబ్ ఎస్​టీని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 150 కిలోమీటర్ల రేంజ్​ని అందిస్తుండగా, హోండా యాక్టివా ఈవీతో పోల్చదగిన 3.4 కిలోవాట్ల వేరియంట్ 100 కిలోమీటర్ల రేంజ్​తో వస్తుంది. ఇది హోండా ఎలక్ట్రిక్​ స్కూటర్​ అందించే దానికంటే 2 కిలోమీటర్లు తక్కువ!
హోండా యాక్టివా వర్సెస్ బజాజ్ చేతక్ 3202..

చేతక్ 3202 ఎలక్ట్రిక్​ స్కూటర్​ 4.2 కిలోవాట్ పీఎమ్ఎస్ మోటార్​ను కలిగి ఉంది. ఇది 5.36 బీహెచ్​పీ పవర్, 16 ఎన్ఎమ్ టార్క్​ని ఉత్పత్తి చేస్తుంది. బ్యాటరీ ప్యాక్ 3.2 కిలోవాట్ల లిథియం-అయాన్, ఇది ఎకో మోడ్​లో 137 కిలోమీటర్ల వరకు రేంజ్​ని ఇస్తుంది. స్టాండర్డ్ వేరియంట్ స్కూటర్ టాప్ స్పీడ్ గంటకు 63 కిలోమీటర్లు కాగా, టెక్ ప్యాక్ గరిష్ట వేగం గంటకు 73 కిలోమీటర్లు. 3 గంటల 35 నిమిషాల్లో బ్యాటరీ 0-80 శాతం ఛార్జ్ అవుతుంది.

చేతక్ ఈవీ హోండా యాక్టివా ఈవీ కంటే పెద్ద బ్యాటరీని పొందుతుంది. ఇది చేతక్​కు ఎక్కువ రైడింగ్ రేంజ్​ను ఇస్తుంది. అయితే, యాక్టివా ఈ 8 బీహెచ్​పీ పవర్​ని జనరేట్​ చేస్తుంది. చేతక్ 5.6 బీహెచ్​పీని ఉత్పత్తి చేస్తుంది.

యాక్టివా ఈవీ రెండు స్వాపబుల్ బ్యాటరీలను కలిగి ఉంది. ఒక్కొక్కటి 1.5 కిలోవాట్ల సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ఇది పూర్తి ఛార్జ్ చేస్తే మొత్తం 102 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది.