బ్యాంక్ జాబ్స్ కు ఎలాంటి క్రేజ్ ఉంటుందో వేరే చెప్పనక్కర్లేదు. మంచి జీతం, ఆహ్లాదకరమైన వాతావరణంలో విధులు, అన్నిటికి మించి సెలవులు ఎక్కువగా ఉండడంతో బ్యాంక్ జాబ్స్ కు డిమాండ్ ఎక్కువ. బ్యాంక్ కొలువు సాధించడమే లక్ష్యంగా ఏళ్లకేళ్లు ప్రిపేర్ అవుతుంటారు. గంటలు గంటలు సన్నద్ధమవుతూ పుస్తకాలతో కుస్తీపడుతుంటారు. ఇటీవల ప్రముఖ బ్యాంకుల నుంచి భారీ స్థాయిలో ఉద్యోగాల భర్తీకోసం నోటిఫికేషన్స్ రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే. తాజాగా ప్రభుత్వ బ్యాంక్ కెనరా బ్యాంక్ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ అందించింది. ఏకంగా 3000 జాబ్స్ ను భర్తీ చేసేందుకు సిద్ధమైంది. ఈ పోస్టులకు అర్హులు ఎవరంటే?
కెనరా బ్యాంక్ అప్రెంటిస్ రిక్రూట్‌మెంట్ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. వయసు 20-28 సంవత్సరాల మధ్య ఉండాలి. మెరిట్ లిస్ట్, డాక్యూమెంట్ వెరిఫికేషన్, రాతపరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు. ఈ పోస్టులకు ఎంపికైతే నెలకు రూ. 15 వేలు అందుకోవచ్చు. అర్హత, ఆసక్తి ఉన్నవారు అక్టోబర్ 4 వరకు ఆన్ లైన్ లో అప్లై చేసుకోవచ్చు.
మొత్తం అప్రెంటిస్‌షిప్ ఖాళీలు: 3,000
అర్హత:
గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేట్ డిగ్రీ లేదా తత్సమాన విద్యార్హత కలిగి ఉండాలి.
వయోపరిమితి:
01.09.2024 నాటికి 20 నుంచి 28 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు అయిదేళ్లు, బీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల వయో సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం:
మెరిట్ లిస్ట్, డాక్యూమెంట్ వెరిఫికేషన్, రాతపరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు.
స్టైఫండ్:
ఈ పోస్టులకు ఎంపికైతే నెలకు రూ. 15 వేలు అందుకోవచ్చు.
శిక్షణ కాలం:
ఒక సంవత్సరం.
దరఖాస్తు ఫీజు:
రూ. 500 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు కల్పించారు.
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం తేదీ:
21-09-2024
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ:
04-10-2024