ప్రపంచంలోనే మొట్టమొదటి సీఎన్‌జీ బైక్ గా బజాజ్ ఫ్రీడమ్ బైక్ వచ్చింది. రావడంతోనే మార్కెట్‌లో ఈ బైక్ దూసుకెళ్తుంది. ఈ స్టైలిష్ బైక్ అందుబాటు ధరకే రావడం వల్ల దీన్ని కొనడానికి జనాలు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం ఇది దేశంలోని 88 నగరాల్లో మాత్రమే అందుబాటులో ఉంది. ఈ బైక్ సేల్స్ ఎక్కువగా ఉండటం వల్ల మరిన్ని నగరాల్లో ప్రవేశపెట్టే పనిలో ఉంది బజాజ్ కంపెనీ. ఈ సీఎన్‌జీ బైక్ ఆగస్టులో అమ్మకాలు జరుపుకుంది. విడుదలకు ముందే ఈ బైక్ బుకింగ్స్‌లో దుమ్మురేపింది. ఒక్క ఆగస్ట్ లోనే ఏకంగా 9,215 యూనిట్లు అమ్ముడయ్యాయి. గత నెలలో బజాజ్ నుంచి అత్యధికంగా అమ్ముడైన నాలుగో బైక్‌గా ఈ బైక్ నిలిచింది. దేశంలో పూర్తి స్థాయిలో ఈ బైక్స్ అందుబాటులోకి వస్తే సేల్స్ ఇంకా ఎక్కువ అవుతాయి. మార్కెట్లో సీఎన్‌జీ కార్లు చలామణి అవుతున్న టైంలో దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే సీఎన్‌జీతో నడిచే తొలి బైక్ ఇదే కావడం విశేషం.
ఈ కొత్త బజాజ్ ఫ్రీడమ్ బైక్ విషయానికి వస్తే.. ఇది 125 సీసీ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఈ ఇంజిన్ 9.5 ps పవర్ ని 9.7 nm టార్క్‌ని జనరేట్ చేస్తుంది. దీని సీటు కింద 2 కిలోల సీఎన్‌జీ సిలిండర్‌ని ఫిక్స్ చేశారు. అలాగే 2 లీటర్ల పెట్రోల్ ట్యాంక్ కూడా ముందుంది. దీని సీఎన్‌జీ ట్యాంక్‌ని 11 సేఫ్టీ టెస్ట్‌ల్లో పరీక్షించారు. ఈ టెస్ట్‌లో బైక్ ఎలాంటి ఇబ్బందులకు గురికాలేదు. అలా అన్ని ఇబ్బందులు తట్టుకొని ఉండేలా ఈ బైక్‌ని డిజైన్ చేశారు. ఇది 330 కిలోమీటర్ల రేంజ్‌ని అందిస్తుంది. సీఎన్‌జీతో నడుస్తున్నప్పుడు, 2 కిలోల సీఎన్‌జీకి 200 కిలోమీటర్ల రేంజ్, పెట్రోల్ మోడ్‌లో 130 కి.మీ వరకు ఈ బైక్ రేంజ్ ని అందిస్తుంది. ఇది రోజువారీ డ్రైవింగ్ ఖర్చులను ఏకంగా 50 శాతం తగ్గిస్తుంది. కార్బన్ డై ఆక్సైడ్ ఉద్గారాలను 26 శాతం తగ్గిస్తుంది. అందువల్ల ఈ బైక్ పర్యావరణానికి చాలా మేలు చేస్తుంది. పెట్రోల్ 125 సీసీ బైక్ తో పోలిస్తే ఈ బైక్ తో 5 సంవత్సరాలలో రూ.75,000 వరకు ఇంధన ఖర్చులను ఆదా చేయవచ్చు. ఇక ఈ బైక్‌ని బుక్ చేసుకోవాలంటే రూ.1,000 టోకెన్ అమౌంట్ చెల్లించి బుక్ చేసుకోవాలి. ఇది డ్రమ్, డ్రమ్ ఎల్‌ఈడీ, డిస్క్ ఎల్ఈడీ వేరియంట్స్‌లో అందుబాటులో ఉంటుంది.
ఈ బైక్ బేసిక్ వేరియంట్ ధర రూ .95,055 ఉంటుంది. ఇక టాప్-ఎండ్ వేరియంట్ ధర రూ .1.10 లక్షలుగా ఉంది. ఇది సీఎన్‌జీ స్పోర్టీ స్టైలింగ్, LED హెడ్‌ల్యాంప్, బ్లూటూత్ కనెక్టివిటీ, గ్రాఫిక్స్‌తో కూడిన డ్యూయల్ కలర్ స్కీమ్, ఫస్ట్-ఇన్-క్లాస్ లింక్డ్ మోనోషాక్ సస్పెన్షన్ వంటి ఫీచర్లతో వస్తుంది. ఈ బైక్ బ్రేకింగ్ ఆల్ డ్రమ్ వేరియంట్ డిస్క్ బ్రేక్ సెటప్‌తో వస్తుంది. ప్రస్తుతం దీని డెలివరీలు మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లో జరుగుతున్నాయి. మిగిలిన రాష్ట్రాల్లో కూడా డెలివరీలు ప్రారంభం కానున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోకి ఇంకో రెండు వారాల్లో ఈ బైక్ రానుంది.