టెన్త్‌ అర్హతతో.. యంత్ర ఇండియా లిమిటెడ్‌లో 3,883 ఉద్యోగాలు.. నో ఎగ్జాం, నో ఇంటర్వ్యూ

www.mannamweb.com


భారత రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని యంత్ర ఇండియా లిమిటెడ్ భారీగా ట్రేడ్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఉన్న ఆర్డ్‌నెన్స్, ఆర్డ్‌నెన్స్ ఎక్విప్‌మెంట్ ఫ్యాక్టరీల్లో ట్రేడ్ అప్రెంటిస్‌ శిక్షణకు అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

ఐటీఐ, నాన్‌ ఐటీఐ అభ్యర్థులకు సంబంధించి మొత్తం 3,883 ఖాళీలు ఉండగా.. వీటన్నింటినీ అర్హులైన అభ్యర్ధుల ద్వారా భర్తీ చేయనున్నారు. మొత్తం ఖాళీల్లో ఐటీఐకు సంబంధించి 2498 ఖాళీలు, నాన్ ఐటీఐకు సంబంధించి 1385 ఖాళీలు ఉన్నాయి. ఆసక్తి కలిగిన వారు నవంబర్‌ 21వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని యంత్ర ఇండియా తన ప్రకటనలో పేర్కొంది. ఎటువంటి రాత పరీక్ష, ఇంటర్వ్యూ లేకుండా కేవలం విద్యార్హతల ఆధారంగా మాత్రమే అభ్యర్థులను ఎంపిక చేయనున్నట్లు తెలిపింది. ఆర్డ్‌నెన్స్ కేబుల్ ఫ్యాక్టరీ- చండీగఢ్, ఆర్డ్‌నెన్స్ ఫ్యాక్టరీ- నలంద, గన్ క్యారేజ్ ఫ్యాక్టరీ- జబల్‌పూర్, ఆర్డ్‌నెన్స్ ఫ్యాక్టరీ- ఇటార్సీ, ఆర్డ్‌నెన్స్ ఫ్యాక్టరీ- ఖమారియా, ఆర్డ్‌నెన్స్ ఫ్యాక్టరీ- కట్ని, హై ఎక్స్‌ప్లోజివ్ ఫ్యాక్టరీ- కిర్కీ, ఆర్డ్‌నెన్స్ ఫ్యాక్టరీ- అంబఝరి, ఆర్డ్‌నెన్స్ ఫ్యాక్టరీ ప్రాజెక్ట్- అంబర్‌నాథ్‌ తదితర ఫ్యాక్టరీలలో మొత్తం అప్రెంటీస్‌ ఖాళీలను భర్తీ చేస్తారు.

మెషినిస్ట్, ఫిట్టర్, టర్నర్, వెల్డర్, పెయింటర్, కార్పెంటర్, ఎలక్ట్రీషియన్, మేసన్, ఎలక్ట్రోప్లేటర్, మెకానిక్, ఫౌండ్రీమ్యాన్, బాయిలర్ అటెండెంట్, అటెండెంట్ ఆపరేటర్ కెమికల్ ప్లాంట్ తదితర ట్రేడుల్లో అప్రెంటీస్‌లను ఎంపిక చేస్తారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలంటే సంబంధిత ఐటీఐ కేటగిరీలో ఉత్తీర్ణతతోపాటు కనీసం 50 శాతం మార్కులతో పదో తరగతిలో పాసై ఉండాలి. నాన్-ఐటీఐ కేటగిరీకికి సంబంధించి అభ్యర్థులు 50 శాతం మార్కులతో పదో తరగతిలో ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్ధుల గరిష్ఠ వయోపరిమితి 35 ఏళ్లకు మించకుండా ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల వరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్‌ ద్వారా నవంబర్‌ 21, 2024వ తేదీలోపు దరఖాస్తు చేయాలి. దరఖాస్తు రుసుము కింద జనరల్ అభ్యర్ధులు రూ.200, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళలు, ట్రాన్స్‌జెండర్ అభ్యర్థులు రూ.100 చొప్పున చెల్లించాలి. నాన్-ఐటీఐ కేటగిరీకి పదోతరగతి, ఐటీఐ కేటగిరీకి పదోతరగతి, ఐటీఐలో వచ్చిన మార్కుల ఆధారంగా తుది ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు నాన్-ఐటీఐలకు రూ.6000, ఐటీఐలకు రూ.7000 చొప్పున స్టైపెండ్‌ చెల్లిస్తారు.