అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ 2024 ప్రారంభమైంది. దీనిలో అన్ని రకాల వస్తువులపై అదిరే ఆఫర్లను అందిస్తోంది. అన్ని ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లపై ఆకర్షణీయమైన తగ్గింపులను అందిస్తోంది.
ఈ కథనంలో చీప్ అండ్ బెస్ట్ ల్యాప్ టాప్ ల గురించి తెలుసుకుందాం. టాప్ బ్రాండ్లు అయిన లెనోవో, డెల్, అసుస్, హెచ్‌పీ, యాసర్ వంటి వాటిపై ఏకంగా 45శాతం వరకూ తగ్గింపు డీల్స్ ను అమెజాన్ అందిస్తోంది. వీటిల్లో అత్యాధునిక ఫీచర్లు, బెస్ట్ స్పెసిఫికేషన్లు ఉన్నాయి. అమెజాన్లో మీరు ఎస్బీఐ క్రెడిట్ కార్డు వినియోగించి లావాదేవీ చేస్తే మరో 10శాతం అదనపు తగ్గింపును పొందొచ్చు.
లెనోవో వీ15 జీ2 ల్యాప్ టాప్..
ఇది అత్యంత చవకైన ల్యాప్ టాప్. విద్యార్థుల అవసరాలకు సరిగ్గా సరిపోతుంది. ఇది 15.6-అంగుళాల ఫుల్ హెచ్డీ డిస్ ప్లేను కలిగి ఉంటుంది. ఇంటెల్ సెలెరాన్ ఎన్4500 ప్రాసెసర్, 8జీబీ ర్యామ్, 256జీబీ ఎస్ఎస్డీ, రోజువారీ పనులకు సున్నితమైన పనితీరును అందిస్తుంది. మైక్రోసాఫ్ట్ ఆఫీస్ 2021 ముందే ఇన్‌స్టాల్ చేసి ఉంటుంది. గరిష్టంగా 6.5 గంటల బ్యాటరీ లైఫ్ ను అందిస్తుంది. ఈథర్నెట్ కనెక్టివిటీ, డాల్బీ ఆడియోతో వస్తుంది. దీనిని అమెజాన్ లో కేవలం రూ. 24,449కే కొనుగోలు చేయొచ్చు.
అసుస్ వివోబుక్ గో 13(2023)..
ఇది విద్యార్థుల కోసం ఉద్దేశించిన ల్యాప్ టాప్. చవకైన ధరకే లభ్యమవుతుంది. ఇది 14-అంగుళాల ఫుల్ హెచ్డీ డిస్ ప్లేను అందిస్తుంది, ఇంటెల్ సెలెరాన్ ఎన్4500 ప్రాసెసర్, 8జీబీ ర్యామ్, 256జీబీ ఎస్ఎస్డీ సామర్థ్యంతో ఉంటుంది. కేవలం 1.3 కిలోల బరువు, ఇది అత్యంత పోర్టబుల్ గా ఉంటుంది. ప్రయాణాల్లో కూడా ఉపయోగించుకోవచ్చు. విండోస్ 11 హోమ్‌తో ప్రీలోడెడ్ అయి వస్తుంది. యాంటీ-గ్లేర్ స్క్రీన్, ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్ మంచి అనుభూతిని అందిస్తాయి. దీని ధర అమెజాన్ సేల్లో రూ. 22,749గా ఉంది.
డెల్15 థిన్ అండ్ లైట్ ల్యాప్ టాప్..
మంచి పనితీరు, పోర్టబిలిటీని కోరుకునే ప్రొఫెషనల్స్ కి ఇది సరిగ్గా సరిపోతుంది. దీనిలో
12వ తరం ఇంటెల్ కోర్ ఐ3-1215యూ ప్రాసెసర్, 8జీబీ ర్యామ్ (16జీబీ వరకూ విస్తరించుకోవచ్చు. 512జీబీ ఎస్ఎస్డీ ఫీచర్‌తో వస్తుంది. 120హెర్జ్ రిఫ్రెష్ రేట్‌తో 15.6-అంగుళాల ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్‌ప్లేతో స్పష్టమైన విజువల్స్‌ను అందిస్తుంది. విండోస్ 11, ఎంఎస్ ఆఫీస్ 2021, మెక్ఏఫీ సెక్యూరిటీతో ప్రీలోడ్ అయి వస్తుంది. దీని ధర అమెజాన్ సేల్లో రూ. 33,990గా ఉంది.
లెనోవో ఐడియా ప్యాడ్ గేమింగ్ 3 ల్యాప్ టాప్..
బడ్జెట్ లిమింట్ ఉండాలనుకునే గేమింగ్ ప్రియులకు ఇది సరిగ్గా సరిపోతుంది. దీనిలో ఏఎండీ రైజన్ 5 5500హెచ్ ప్రాసెసర్, 8జీబీ ర్యామ్, 512జీబీ ఎస్ఎస్డీ ఉంటుంది. 144హెర్జ్ రిఫ్రెష్ రేట్‌తో 15.6-అంగుళాల ఫుల్ హెచ్డీ ఐపీఎస్ డిస్‌ప్లే తో శక్తివంతమైన విజువల్స్‌ను నిర్ధారిస్తుంది. ఎన్విడా ఆర్టీఎక్స్ 2050 4జీబీ గ్రాఫిక్స్ కార్డుతో వస్తుంది. విండోస్ 11, అలెక్సా, మూడు నెలల గేమ్ పాస్ తో లోడ్ అయి వస్తుంది. దీని ధర అమెజాన్లో రూ. 44,990గా ఉంది.