ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బీచ్‌లకు సంబంధించి తీసుకోబోతున్న నిర్ణయం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బీచ్‌లలో ప్రవేశ రుసుము వసూలు చేయబోతున్నట్లు ప్రభుత్వం సంకేతాలు ఇచ్చింది. ఈ మేరకు ప్రభుత్వం వచ్చే జనవరి నుంచి సూర్యలంక, రామవరం, రుషికొండ, కాకినాడ, మైపాడు బీచ్‌లలో ప్రవేశ రుసుం వసూలు చేయాలనిప్రభుత్వం భావిస్తోంది. జనవరి 1 నుంచి సూర్యలంకలో వసూలు ఎంత వసూలు చేయాలని నిర్ణయానికి వచ్చినట్లు బాపట్ల ఎమ్మెల్యే చెప్పారు. ఇదే విషయాన్ని మీడియా ప్రస్తావించగా పర్యాటకశాఖ మంత్రి కందుల దుర్గేష్ క్లారిటీ ఇచ్చారు.
రాష్ట్రవ్యాప్తంగా బీచ్‌లలో ప్రవేశ రుసుము వసూలు చేయాలని ప్రభుత్వం భావిస్తోందని.. కాకపోతే ఎంత అనేది స్పష్టత లేదన్నారు. రూ.20, రూ.25 అన్నది నిర్ణయించలేదని చెప్పారు. రాష్ట్రంలో బీచ్‌లను పర్యాటక కేంద్రాలుగా తయారు చేసిన తర్వాత వీటి నిర్వహణ కూడా ముఖ్యమని.. వీటిని అభివృద్ధి చేశాం.. వదిలేశామని భావన ఉండకూడదన్నారు. అందుకే ప్రభుత్వం రుసుము వసూలు చేసే దిశగా ఆలోచన చేస్తోంది.. పూర్తిగా స్పష్టత రావాల్సి ఉందన్నారు.
ప్రభుత్వం బీచ్‌లలో ప్రవేశ రుసుముకు సంబంధించి.. ఇప్పటి వరకు పూర్తిగా స్పష్టత రాలేదు. ఇప్పటికే బీచ్‌లో పార్కింగ్, బోటింగ్, గేమ్స్ వంటి వాటికి సందర్శకులు డబ్బులు చెల్లిస్తున్నారు.. బీచ్‌లో ప్రవేశ రుసుము అమలు చేస్తే పర్యాటకుల సంఖ్య తగ్గుతుందనే వాదన వినిపిస్తోంది. అయితే నగరాన్ని సుందరంగా ఉంచేందుకు అభివృద్ధి పనులు చేయకపోతే నగరానికి ఉన్న బ్రాండ్ పోతుంది అంటున్నారు అధికారులు. బీచ్‌లలో అభివృద్ధి పనులు చేసి వదిలేస్తే సరిపోదని.. వాటి నిర్వహణ కూడా చాలా ముఖ్యం అంటోంది ప్రభుత్వం.
బాపట్ల జిల్లా సూర్యలంక బీచ్‌లో ప్రవేశ రుసుముపై స్థానిక ఎమ్మెల్యే నరేంద్ర వర్మ స్పందించారు. బాపట్లలోని మున్సిపల్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో స్థానిక ఎమ్మెల్యే ఇటీవల సమావేశం నిర్వహించారు. కార్తీక మాసం కావడంతో.. సూర్యలంక బీచ్‌కు వచ్చే పర్యాటకులకు కల్పించాల్సిన ఏర్పాట్లపై సమీక్ష చేశారు. సూర్యలంక బీచ్‌కు వచ్చే పర్యాటకుల నుంచి బీచ్ అభివృద్ధి కోసం ఫీజు వసూలు చేయనున్నట్లు చెప్పారు. సూర్యలంక సముద్ర తీరం దగ్గర ఫెన్సింగ్ ఏర్పాటు చేసి.. బీచ్‌లోకి ప్రవేశించేందుకు మూడు ప్రవేశ మార్గాల ద్వారా పర్యాటకులను అనుమతిస్తామని చెప్పుకొచ్చారు.
సూర్యలంక బీచ్ ప్రవేశ రుసుము కింద రూ.20 వసూలు చేస్తామన్నారు. జనవరి ఒకటి నుంచి రుసుము విధానాన్ని అమలు చేస్తామన్నారు. సూర్యలంక సముద్ర తీరం అభివృద్ధి కోసం ఆదాయ మార్గాల అన్వేషణలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నామంటున్నారు. బాపట్ల సూర్యలంక సముద్ర తీరాన్ని విదేశీయులను సైతం ఆకర్షించేలా ప్రముఖ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. సూర్యలకంతో పాటుగా మిగిలిన ప్రముఖ చీబ్‌లలో ప్రవేశ రుసుము వసూలు చేయాలని భావిస్తున్నారు. మరి ప్రభుత్వం ఈ బీచ్‌లకు సంబంధించిన ప్రవేశ రుసుము వ్యవహారంపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది చూడాలి.