ఈ డిసెంబర్‌లో ఫ్రెండ్స్‌తో ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? తమిళనాడులో 5 బెస్ట్ ప్లేస్‍లు ఇవే

www.mannamweb.com


స్నేహితులతో తమిళనాడుకు ట్రిప్ వేయాలనుకుంటే కొన్ని ప్లేస్‍లు అత్యుత్తమంగా ఉంటాయి. ఎంజాయ్ చేసేందుకు పర్‌ఫెక్ట్‌గా అనిపిస్తాయి. అలా.. తమిళనాడులో ట్రిప్ వెళ్లేందుకు కొన్ని బెస్ట్ ప్లేసెస్ ఏవో ఇక్కడ చూడండి.

ఏడాది చివరి నెల అయిన డిసెంబర్‌లో ట్రిప్‍కు వెళ్లాలని చాలా మంది ప్లాన్ చేస్తుంటారు. ముఖ్యంగా ఈ సంవత్సరాన్ని మంచి అనుభూతులతో గుర్తుంచుకోవాలని చాలా మంది స్నేహితులు వెకేషన్‍కు వెళ్లాలని అనుకుంటారు. ఈనెలలో వెళ్లేందుకు తమిళనాడు మంచి ఆప్షన్‍గా ఉంటుంది. ఇక్కడి కొన్ని ప్రాంతాలు వెకేషన్‍కు బాగుంటాయి. స్నేహితులు ఎంజాయ్ చేసేందుకు పర్‌ఫెక్ట్‌గా ఉంటాయి. అలా తమిళనాడులో డిసెంబర్‌లో వెళ్లేందుకు 5 బెస్ట్ ప్లేస్‍లు ఏవో ఇక్కడ చూడండి.

ఊటీ

డిసెంబర్‌లో తమిళనాడులో వెకేషన్ వెళ్లేందుకు ఊటీ అదిరిపోతుంది. శీతాకాలంలో ఇక్కడ చల్లటి వాతావణం చాలా ఆకర్షిస్తుంది. టీ తోటలు, పచ్చదనం మనసులను దోచేస్తాయి. అందమైన కొండలు, సేలయేర్లతో ప్రకృతి అందాలు విపరీతంగా నచ్చేస్తాయి. స్నేహితులతో ఎంజాయ్ చేసేందుకు ఊటీ సూటవుతుంది. కావాలంటే ట్రెక్కింగ్ కూడా చేయవచ్చు. ఊటీ బొటానికల్ గార్డెన్, ఊటీ లేక్ సహా చాలా పర్యాటక ప్రాంతాలు ఊటీ పరిసరాల్లో ఉన్నాయి.

కొడైకెనాల్

ఫ్రెండ్స్‌తో టూర్ వెళ్లేందుకు తమిళనాడులోని కొడైకెనాల్ కూడా సూపర్‌గా ఉంటుంది. ఈ హిల్ స్టేషన్‍కు వెళ్లేందుకు డిసెంబర్ నుంచి ఫిబ్రవరి సరైన టైమ్. చలికాలంలో ఇక్కడి చల్లదనం మనసుకు హాయిని ఇస్తుంది. ఆహ్లాదకరంగా ఉంటుంది. అందమైన కొండలు అట్రాక్ట్ చేస్తాయి. అందమైన అడవులు, కొడై సరస్సు, పిల్లర్ రాక్స్ లాంటి పర్యాటక ఆకర్షణలు ఉన్నాయి. స్నేహితులతో కొడైకెనాల్ వెళితే మంచి అనుభవంగా ఉంటుంది.
కన్యాకుమారి

సూర్యోదయం, సూర్యస్తమయం చూసేందుకు కన్యాకుమారి చాలా పాపులర్ అయింది. అందమైన సముద్రం తీరం నుంచి సూర్యుడిని చూస్తూ జనాలు పరవశించిపోతారు. ఇక్కడి బీచ్‍లో స్నేహితులతో బాగా ఎంజాయ్ చేయవచ్చు. వివేకానంద రాక్ మొమోరియల్ కూడా ఆకర్షణగా ఉంటుంది. సముద్రం తీరంలో ఇక్కడ చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది.
నీలగిరి హిల్స్

డిసెంబర్‌లో తమిళనాడులో నీలగిరి హిల్స్‌కు వెళ్లడం ప్రత్యేక అనుభూతి కలిగిస్తుంది. ఇక్కడి దట్టమైన అడవులు, కొండలు ప్రకృతిని ఇష్టపడే వారిని కట్టిపడేస్తాయి. పచ్చదనం అలరారుతూ ఉంటుంది. వాతావారణం ఆహ్లాదకరంగా అనిపిస్తుంది. నీలగిరి నేషనల్ పార్క్ తప్పనిసరిగా సందర్శించాలి. నీలగిరిలోని టీ తోటలు కూడా అద్భుతంగా అనిపిస్తాయి.
చెన్నై

తమిళనాడు రాజధాని చెన్నైలోనూ స్నేహితులతో అలా తిరగడం అదిరిపోతుంది. శీతాకాలంలో ఇక్కడ వెదర్ ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా మెరీనా బీచ్ బాగా అట్రాక్ట్ చేస్తుంది. బాగా ఎంజాయ్ చేయవచ్చు. తమిళనాడు ప్రాంతీయ సంస్కృతిని చూడొచ్చు. చెన్నైలో రకరకాల వెరైటీ వంటకాలు తినొచ్చు. ఫోర్ట్ సెయింట్ జార్జ్ సందర్శించవచ్చు.

తమిళనాడులో అధ్యాత్మిక ప్రాంతాలైన మహాబలిపురం, రామేశ్వరం, మధురై కూడా సందర్శించవచ్చు. ఈ ఆలయాల్లోని చారిత్రక శిల్ప సంపద ఆకట్టుకుంటుంది. ఆధ్యాత్మికతతో విలసిల్లుతూ ఉంటాయి.