వ్యాపారం చేయాలనుకునే వారికి మొదట ఎదురయ్యే ఇబ్బంది పెట్టుబడి. చిన్న వ్యాపారం చెయ్యాలన్నా లక్షల్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి. పోనీ తక్కువ పెట్టుబడితో ఏదైనా వ్యాపారం చేద్దాం అంటే పోటీ ఎక్కువ ఉంటుంది.
అందుకే మీకోసం మధ్యస్థమైన పెట్టుబడితో, ఎక్కువలాభాలు తెచ్చిపెట్టే అదిరిపోయే బిజినెస్ ఐడియా అందిస్తున్నాం. మీడియం రేంజ్ పెట్టుబడితో ఈ వ్యాపారం మీరు చేస్తే మీకు నెలకు ఎంతలేదన్నా 2 లక్షల వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. పైగా పోటీ చాలా తక్కువ…ఇదేమి సీజనల్ వ్యాపారం కూడా కాదు…ఇంకెందుకు ఆలస్యం..వివరాల్లోకి వెళ్ళిపోదాం…
మనకు రోజు గడవాలంటే ఉల్లిపాయ కావాలి. బ్రేక్ఫాస్ట్ తో మొదలుపెట్టి నైట్ డిన్నర్ వరకు ఆనియన్ లేకుండా రోజు గడవదు. అందుకే ఉల్లిపాయ రేట్లు పెరిగితే సామాన్యుడి నుండి వచ్చే వ్యతిరేకత మామూలుగా ఉండదు. ప్రభుత్వాలే కలగజేసుకుని మరీ నియంత్రించాల్సి వస్తుంది. మన వ్యాపారం ఇప్పుడు అదే..అంటే ఉల్లిపాయల వ్యాపారం కాదు…ఆనియన్ పొడి బిజినెస్.
ఇప్పుడంతా ఫాస్ట్ లైఫ్. అందుకే వంట చెయ్యాలంటే కారం, మసాలాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ రెడీ టు యూజ్. అలానే ఇప్పుడు ఉల్లిపాయ పొడి కు డిమాండ్ విపరీతంగా పెరుగుతుంది. దేశీయంగానే కాదు అంతర్జాతీయంగా దీనికి డిమాండ్ ఉంది. కిలో ఉల్లిపాయయలు మీకు రైతు నుండి కొంటే అతి తక్కువలో దొరుకుతాయి. రిటైల్ మార్కెట్ లో 25 రూపాయలమ్మే ఉల్లిపాయ మీకు రైతు దగ్గర 2 రూపాయల కూడా పలకదు. అదే ఆనియన్ పొడి రేటెంతుందో తెలుసా? ఒక్కసారి ఆన్లైన్ లో చెక్ చెయ్యండి..షాక్ అవుతారు…350 రూపాయల నుండి మొదలై 600 వరకు అమ్ముతున్నారు. అంటే అర్థం చేసుకోండి ఎంత ప్రాఫిట్ ఉందొ…
ఈ బిజినెస్ కోసం ఏమి కావాలి?
పెద్దగా భారీ సెటప్ అవసరం ఏమి ఉండదు..మీకు బిజినెస్ సెట్ చేసుకోవడానికి ఒక షెడ్ అవసరం ఉంటుంది. ముఖ్యమైనది ఒక ఆనియన్ డ్రైయింగ్ మెషిన్. దీని ఖరీదు మీకు మంచి మెషిన్ కావాలంటే 2 లక్షల వరకు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. అక్కడినుంచి ప్రారంభం… ఇంకా ఎక్కువ ఖరీదులో కూడా ఈ యంత్రాలు దొరుకుతాయి. ఒక గ్రైండర్ అవసరం ఉంటుంది. ఇది డ్రై చేసిన ఆనియన్స్ పొడి చెయ్యటానికి అవసరం. ప్యాకేజింగ్ మెషిన్ కూడా అవసరం ఉంటుంది. ఫుల్లీ ఆటోమేటిక్ అయితే కొంచెం ఖరీదు ఎక్కువగా ఉంటుంది, సెమీ ఆటోమేటిక్ మీకు 70 వేలలో దొరుకుతుంది. ఇక ప్యాకేజింగ్ మెటీరియల్, fssai లైసెన్సులు, ఒకవేళ మీరే డైరెక్టుగా ఎక్స్పోర్ట్ చేయాలనుకుంటే APEDA , IEC రిజిస్ట్రేషన్లు అవసరం పడతాయి. ఇంకా ల్యాబ్ టెస్టులు, ఇతర ఖర్చులు కలిపి మీకు సరిగా ప్లాన్ చేసుకుంటే తక్కువలో తక్కువ 5 లక్షల వరకు ఖర్చయ్యే అవకాశం ఉంది.
మార్కెటింగ్ ఎలా?
మీ బ్రాండ్ నేమ్ తో మీరే సొంతంగా ఆన్లైన్ లో అమ్మవచ్చు. ఇప్పుడు రెస్టారెంట్లలో వీటి వినియోగం పెరగటం వల్ల మీరు రెస్టారెంట్లతో డైరెక్టుగా కాంటాక్ట్ చేసి రెగ్యులర్ గా సప్లై చెయ్యొచ్చు. DMart వంటి సూపర్ మార్కెట్లతో ఒప్పందం చేసుకుని వారికి మీరు పార్టనర్ కావొచ్చు. విదేశాలలో ఆనియన్ పొడి కు విపరీతమై డిమాండ్ ఉంది. అనేక మంది ఎక్సపోర్టర్స్ మార్కెట్ లో ఆనియన్ పొడి ని ఎగుమతి చేస్తున్నారు. మీకు ఆన్లైన్ వెతికితే వారి వివరాలు లభిస్తాయి. వారికి సప్లయర్ గా మారినా మీకు సేల్స్ అదిరిపోతాయి. అయితే ఆనియన్ పొడి ఎగుమతి చెయ్యాలంటే పొడి క్వాలిటీ విషయం లో కొన్ని నిబంధనలు పాటించాలి. అవి మీకు ఎగుమతి దారుల వద్ద లభిస్తాయి. ఒక్క గుజరాత్ రాష్టం నుండి 2023 – 24 సంవత్సరంలో 83254 టన్నుల పొడి ఎగుమతి అయ్యిందంటే ఎంత డిమాండ్ ఉంటుందో అంచనా వెయ్యండి. ఇదేమి కుళ్లిపోయే ఐటెం కాదు కాబట్టి మీరు సరుకు లభ్యతను బట్టి ప్రొడక్షన్ పెంచుకోవచ్చు. డిమాండ్ ను బట్టి మీకు లాభాలు ఉంటాయి. ముందుగా స్మాల్ స్కేల్ లో స్టార్ట్ చేసి తరువాత పెంచుకోవచ్చు. మరిన్ని వివరాలకు Tg Ipass వంటి సంస్థల వెబ్సైటు లేదా ఆఫీసులు సంప్రదించండి. ఈ వ్యాపారాన్ని ప్రారంభించాలంటే ఖాదీ, విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ ద్వారా ఆర్థిక సహాయం పొందే అవకాశం కూడా ఉంది. బ్యాంకు లోన్లు కూడా లభిస్తాయి.
Disclaimer: ఆన్లైన్ లో ఉన్న సమాచారం మేరకు ఈ ఆర్టికల్ ఇవ్వడం జరిగింది. పెట్టుబడి వివరాలు కేవలం అంచనా మాత్రమే. వాస్తవం లో ఎక్కువ తక్కువ అవ్వవచ్చు. ఏదైనా వ్యాపారాన్ని ప్రారంభించాలంటే మీరు ఆర్థిక నిపుణుల సలహాలు తీసుకోండి. మీ లాభనష్టాలు మేము బాధ్యత వహించము.
































