ప్రస్తుతం చెడు కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడేవారి సంఖ్య పెరుగుతోంది. సాధారణంగా సిరల్లో పేరుకుపోయిన కొవ్వును కరిగించుకోవడం అంత తేలికకాదు. అయితే, వర్కవుట్ల ద్వారా కంటే ఈ సింపుల్ పద్ధతులు పాటించడం ద్వారా శరీరంలో నుంచి హానికరమైన కొవ్వును వదిలించుకోవచ్చు.
ఈ రోజుల్లో ప్రజల జీవనశైలి, ఆహారపు అలవాట్లు మారిపోయి. బిజీ లైఫ్ వల్ల చాలామంది బీపీ, షుగర్ వంటి జీవనశైలి వ్యాధుల బారిన పడుతున్నారు. చెడు కొలెస్ట్రాల్ అనేది కూడా జీవనశైలి సరిగా లేకపోవడం వల్ల వచ్చే సమస్యే. వాస్తవానికి, “చెడు కొలెస్ట్రాల్” ధమనుల గోడలపై పేరుకుపోతుంది. దీనివల్ల ధమనులు గట్టిగా, ఇరుకుగా మారుతాయి. ఇది రక్త ప్రవాహాన్ని తగ్గిస్తుంది. తద్వారా గుండెకు రక్తం, ఆక్సిజన్ సరఫరా తగ్గిపోయి గుండె జబ్బులు, స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతుంది. ఇలాంటి సమస్య రాకూడదంటే చెడు కొలెస్ట్రాల్ నియంత్రించడానికి మీరు ఈ కింది టిప్స్ ప్రయత్నించవచ్చు.
ఓట్స్
ఓట్స్ గుండె ఆరోగ్యానికి చాలా మంచివి. ఎందుకంటే వీటిలో కరిగే ఫైబర్, ముఖ్యంగా బీటా-గ్లూకాన్ అధికంగా ఉంటాయి. ఈ ఫైబర్ చెడు కొలెస్ట్రాల్‌ను జీర్ణవ్యవస్థలోకి తీసుకొస్తుంది. రక్తప్రవాహంలో వెళ్లకుండా నిరోధిస్తుంది. కాబట్టి ఉదయం అల్పాహారంలో ఓట్స్‌ను చేర్చుకోండి.
వేగంగా నడక
వ్యాయామం గుండె ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. అలాగని అతిగా నడవాల్సిన అవసరమూ లేదు. వారానికి ఐదు రోజులు వేగంగా 30 నిమిషాల నడక చాలు. మంచి కొలెస్ట్రాల్‌ను పెరిగుతుంది. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గుతుంది. నడక రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది. మీ శరీరంలోని అదనపు కొలెస్ట్రాల్‌ను బయటకు పంపడంలో సహాయపడుతుంది. సమయం తక్కువగా ఉంటే భోజనం తర్వాత 15 నిమిషాల పాటు నడవండి. రెండు సెషన్‌లుగా విభజించుకుని నడిస్తే మరీ మంచిది.
డ్రై ఫ్రూట్స్
మీ గుండె ఆరోగ్యంగా ఉండటానికి డ్రై ఫ్రూట్స్ ఆహారంలో చేర్చుకోండి. బాదం, వాల్‌నట్స్, వేరుశెనగలు, అవిసె గింజలు వంటి నట్స్, డ్రై ఫ్రూట్స్ గుండె ఆరోగ్యానికి మంచివి.
ఆలివ్ నూనె
ఆలివ్ నూనె శరీరంలో మంచి కొలెస్ట్రాల్‌ను నిర్వహిస్తుంది. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. మీరు దీనిని కూరగాయలను వేయించడానికి లేదా సలాడ్‌లపై చల్లుకోవడానికి లేదా తృణధాన్యాల బ్రెడ్‌కు డిప్‌గా ఉపయోగించవచ్చు.
గ్రీన్ టీ
గ్రీన్ టీ సేవించడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. కొలెస్ట్రాల్‌తో పోరాడడంలో ఇది ప్రభావవంతంగా పనిచేస్తుంది. గ్రీన్ టీలో కనిపించే కాటెచిన్‌లు శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు. ఇవి LDL కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. దాని ఆక్సీకరణను నిరోధిస్తాయి. ప్రతిరోజూ 2-3 కప్పుల తియ్యని గ్రీన్ టీ తాగడం వల్ల LDL దాదాపు 2-5% తగ్గుతుంది.
































