ఈ 4 సేఫ్ సెడాన్ కార్లపై ఓ లుక్కేయండి.. ఫ్యామిలీ సేఫ్టీకి 5 స్టార్ రేటింగ్

www.mannamweb.com


మారుతి సుజుకి డిజైర్ ఫేస్ లిఫ్ట్ నవంబర్ 11 న భారత మార్కెట్లోకి రానుంది. లాంచ్‌కు ముందు ఫ్యామిలీ సేఫ్టీలో 5 స్టార్ రేటింగ్ పొందింది. సేఫ్ సెడాన్లు మరికొన్ని ఉన్నాయి. వాటిపై ఓ లుక్కేయండి.

ఎన్ని లక్షలు పెట్టి కారు కొన్నా.. అందులో ఉండే ఫీచర్ల గురించి కచ్చితంగా ఆరా తీస్తాం. సేఫ్టీ గురించి కూడా ఎక్కువగా ఆలోచిస్తాం. 5 స్టార్ రేటింగ్ ఉన్న కార్లు ఎక్కువ మందిని ఆకర్శిస్తాయి. భద్రతా పరంగా మీరు కొనే కారు బెస్ట్ ఉంటే చాలా ప్రమాదాల నుంచి బయటపడొచ్చు.

నిజానికి కొన్నేళ్లుగా కొత్త కారును కొనుగోలు చేసేటప్పుడు సేఫ్టీ ఫీచర్లను జాగ్రత్తగా చూసుకునే అలవాటు భారతీయ వినియోగదారులలో పెరుగుతోంది. ఇటువంటి పరిస్థితిలో అనేక దిగ్గజ కార్ల తయారీదారులు తమ కొత్త మోడళ్లను విడుదల చేయడానికి ముందు భద్రతా ఫీచర్ల గురించి చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇటీవల మారుతి సుజుకి రాబోయే సెడాన్ డిజైర్ ఫేస్ లిఫ్ట్‌కు కుటుంబ భద్రత కోసం నిర్వహించిన క్రాష్ టెస్ట్‌లో గ్లోబల్ ఎన్‌సీఏపీ 5 స్టార్ రేటింగ్ ఇచ్చింది.

మీరు కూడా అతి తొందరలో సేఫ్టీ ఫీచర్లతో కూడిన కొత్త సెడాన్ కొనాలని ఆలోచిస్తుంటే మీకోసం కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఇండియన్ మార్కెట్లో అమ్మకానికి ఉన్న అలాంటి సెడాన్ కార్ల గురించి తెలుసుకుందాం. ఈ కార్లు ఫ్యామిలీకి బెస్ట్ ఛాయిస్ అని చెప్పవచ్చు. సేఫ్టీ పరంగా చాలా బాగుంటాయి.

మారుతి సుజుకి డిజైర్

మారుతి సుజుకి డిజైర్ ఫేస్ లిఫ్ట్ నవంబర్ 11 న భారత మార్కెట్లోకి రానుంది. లాంచ్‌కు ముందు కొత్త మారుతి డిజైర్‌కు కుటుంబ భద్రత కోసం నిర్వహించిన క్రాష్ టెస్ట్‌లో గ్లోబల్ ఎన్‌సీఏపీ 5 స్టార్ రేటింగ్ ఇచ్చింది. ప్రస్తుత మారుతి సుజుకి డిజైర్ వయోజన, పిల్లల భద్రతలో 2 స్టార్ రేటింగ్‌ను మాత్రమే పొందింది. కొత్త మారుతి సుజుకి డిజైర్ ఇప్పుడు 6 ఎయిర్ బ్యాగులతో సహా అనేక భద్రతా ఫీచర్లతో వస్తుంది.

హ్యుందాయ్ వెర్నా

హ్యుందాయ్ వెర్నా ఎల్లప్పుడూ భారతీయ కస్టమర్లలో ప్రసిద్ధ సెడాన్ కారు. హ్యుందాయ్ వెర్నాకు 5 స్టార్ ఫ్యామిలీ సేఫ్టీ రేటింగ్ కూడా లభిస్తుంది. సేఫ్టీ ఫీచర్‌గా హ్యుందాయ్ వెర్నాలో ఏడీఏఎస్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ ఉన్నాయి.
వోక్స్ వ్యాగన్ విర్టస్

వోక్స్ వ్యాగన్ విర్టస్ భారతీయ వినియోగదారులలో ప్రసిద్ధ సెడాన్ కారు. కుటుంబ భద్రత కోసం నిర్వహించిన క్రాష్ టెస్ట్‌లో వోక్స్ వ్యాగన్ విర్టస్‌కు గ్లోబల్ ఎన్‌సీఏపీ 5 స్టార్ రేటింగ్ ఇచ్చింది. వోక్స్ వ్యాగన్ విర్టస్‌లో టైర్ ప్రెజర్ డిఫ్లెక్షన్ వార్నింగ్, ట్రాక్షన్ కంట్రోల్ వంటి సేఫ్టీ ఫీచర్లతో పాటు పార్క్ డిస్టెన్స్ కంట్రోల్, మల్టీ కొలిషన్ బ్రేకులు అందించారు.
స్కోడా స్లావియా

కొత్త సెడాన్ కొనాలనుకునే కస్టమర్లకు స్కోడా స్లావియా బెటర్ ఆప్షన్. గ్లోబల్ ఎన్‌సీఏపీ కుటుంబ భద్రత కోసం నిర్వహించిన క్రాష్ టెస్ట్‌లో స్కోడా స్లావియాకు 5-స్టార్ రేటింగ్ లభించింది. స్కోడా స్లావియాలో 6-ఎయిర్ బ్యాగ్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, మల్టీ-కొలిషన్ బ్రేకింగ్ ఉన్నాయి.

పైన చెప్పిన సెడాన్ కార్లలో మీరు ఏది తీసుకుంటారో సెలక్ట్ చేసుకోండి. అన్ని కార్లు ఎన్‍‌‌సీఏపీ ఫ్యామిలీ సేఫ్టీలో 5 స్టార్ రేటింగ్ పొందాయి.