రూ.7499 కే 5G స్మార్ట్‌ఫోన్‌.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీ, 4 సంవత్సరాల వరకు అప్‌డేట్స్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ శాంసంగ్‌ భారత్‌ మార్కెట్‌ లో ఈ సంవత్సరం అనేక ఎంట్రీ, బడ్జెట్‌ రేంజ్‌ స్మార్ట్‌ఫోన్‌ లను విడుదల చేసింది. ఇందులో A, F, M సీరిస్‌ లో ఎంట్రీ లెవల్‌ మోడల్స్‌ ను అందుబాటులోకి తీసుకొచ్చింది.


తక్కువ ధరలో అందుబాటులోకి వచ్చినా.. అనేక ఆకట్టుకొనే స్పెసిఫికేషన్‌ లు, ఫీచర్‌ లను కలిగి ఉన్నాయి. ప్రస్తుతం అమెజాన్‌ లో శాంసంగ్‌ గెలాక్సీ M06 5G స్మార్ట్‌ఫోన్‌ ను డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్‌ స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు.

ధరలు అప్పుడెలా ఉన్నాయి :

విడుదల సమయంలో శాంసంగ్‌ గెలాక్సీ M06 5G స్మార్ట్‌ ఫోన్‌ (Samsung Galaxy M06 5G Smartphone) 4GB ర్యామ్ + 64GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.8499 గా ఉండేది. అదే 4GB ర్యామ్ + 128GB స్టోరేజీ రూ.9499, 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.10999 గా ఉండేది.

రూ.7499 ధరకే స్మార్ట్‌ఫోన్‌ :

అయితే ప్రస్తుతం అమెజాన్‌ లో ఈ ఫోన్‌ను భారీ డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్‌ ధరలు వరుసగా రూ.7499, రూ.7999, రూ.8999 గా ఉంది. తక్కువ ధరలో 5G ఫోన్ కోసం చూస్తుంటే ఈ హ్యాండ్‌సెట్‌ను ఆప్షన్‌ గా భావించవచ్చు.

శాంసంగ్‌ గెలాక్సీ M06 5G పూర్తి వివరాలు :

శాంసంగ్‌ గెలాక్సీ M06 5G స్మార్ట్‌ఫోన్ 6.7 అంగుళాల HD+ LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 90Hz రీప్రెష్‌ రేట్‌, 800 నిట్స్ పీక్‌ బ్రైట్‌నెస్‌ ను కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ బ్లేజింగ్‌ బ్లాక్‌, సేజ్‌ గ్రీన్‌ కలర్‌ వేరియంట్స్‌ లో లభిస్తోంది.

4 సంవత్సరాల వరకు అప్‌డేట్స్ :

ఈ గెలాక్సీ హ్యాండ్‌సెట్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ 6300 SoC ప్రాసెసర్‌ పైన పనిచేస్తోంది. మరియు ఆండ్రాయిడ్ 15 ఆధారిత One UI 7.0 ను కలిగి ఉంది. అయితే తక్కువ ధరకే అందుబాటులోకి వస్తున్నా.. ఈ ఫోన్ 4 ఆండ్రాయిడ్‌ OS అప్‌డేట్స్‌, 4 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ ను పొందుతుంది.

50MP కెమెరా, 5000mAh బ్యాటరీ :

కెమెరా విభాగం పరంగా వెనుక వైపు రెండు కెమెరాలను కలిగి ఉంది. ఇందులో 50MP ప్రైమరీ కెమెరా, 2MP డెప్త్ సెన్సర్‌ ను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 8MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. మరియు 25W ఫాస్ట్‌ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీ తో పనిచేస్తోంది.

శాంసంగ్‌ స్మార్ట్‌ ఫోన్‌ 5G, 4G VoLTE, Wi-Fi, బ్లూటూత్‌ 5.3, GPS, 3.5mm ఆడియో జాక్‌ ను కలిగి ఉంది. భద్రత కోసం సైడ్‌ మౌంటెడ్‌ ఫింగర్‌ ప్రింట్‌ సెన్సర్‌ ను కలిగి ఉంది. వీటితోపాటు శాంసంగ్‌ Knox Vault, వాయిస్ ఫోకస్‌, క్విక్‌ షేర్‌ వంటి ఫీచర్‌ లు కూడా ఉన్నాయి.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.