నడక వల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు అందుతాయి. ఈ మధ్య దీనిపై ప్రజలు బాగా ఆసక్తి కనబరుస్తున్నారు. అందుకే హెల్త్ బెనిఫిట్స్ కోసం ప్రతిరోజూ వాకింగ్ చేయాలని చూస్తున్నారు.
అయితే మీరు కొత్తగా వాకింగ్ స్టార్ట్ చేయాలనుకుంటే 6-6-6 రూల్‌ని ఫాలో అయిపోండి. లేదా మీరు రెగ్యులర్‌గా వాక్ చేసేవారు అయినా ఈ టెక్నిక్ ఫాలో అయితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు అంటున్నారు నిపుణులు.
6-6-6 వాకింగ్ రూల్ అంటే ఏమిటి?
వాకింగ్ చేయడానికి రూల్ ఏంటి? అసలు ఈ 6-6-6 రూల్ అర్థమేమిటి అని ఆలోచిస్తున్నారా? 6-6-6 వాకింగ్ రూల్ అంటే 60 నిమిషాల నడకను.. రెండు భాగాలుగా.. ఉదయం 6 గంటలకు, సాయంత్రం 6 గంటలకు పూర్తి చేయడం. ఇదే వాకింగ్ రొటీన్‌గా కంటీన్యూ చేయడం. అంతేకాకుండా వాకింగ్ తర్వాత మరో 6 నిమిషాలు శరీరాన్ని వార్మప్ చేసి మరో 6 నిమిషాలు రిలాక్స్ చేయాల్సి ఉంటుంది. ఈ రూల్‌ని ఫాలో అవ్వడం వల్ల ఫిట్‌గా ఉండడంతో పాటు హెల్త్‌కి ఎన్నో ప్రయోజనాలు అందుతాయట.
ఉదయం 6 గంటలకు నడిస్తే..
ది హార్ట్ ఫౌండేషన్‌లోని ఓ అధ్యయనం ప్రకారం రోజూ 6 గంటలకు ఉదయాన్నే 30 నిమిషాలు నడిస్తే.. చాలామంచిదని తెలిపింది. దీనివల్ల గుండె జబ్బుల ప్రమాదం 35 శాతం తగ్గుతుందని తెలిపింది. మార్నింగ్ వాకింగ్ చేయడం వల్ల జీవక్రియ మెరుగవుతుంది. రక్తప్రసరణ పెరుగుతుంది. ఈ రొటీన్ వల్ల మీరు డే అంతా యాక్టివ్‌గా ఉంటారు.
సాయంత్రం 6 గంటలకు నడిస్తే..
డే అంతా కష్టపడి.. సాయంత్రం 6 గంటలకు అలా పార్క్‌లో వాక్ చేస్తే మీకు విశ్రాంతి లభిస్తుంది. ఒత్తిడి దూరమవుతుంది. మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. మెరుగైన నిద్ర మీ సొంతమవుతుంది. దీనిని ఓ రొటీన్‌గా అలవాటు చేసుకుంటే నాణ్యమైన నిద్ర మీ సొంతమవుతుంది. దీనివల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు అందుతాయి.
6 నిమిషాలు వార్మ్-అప్
వాకింగ్ చేసేముందు నడకకు శరీరాన్ని సిద్ధం చేస్తూ వాకింగ్ చేయాలి. స్ట్రెచ్ చేస్తూ శరీరాన్ని వార్మ్ అప్ చేయాలి. దీనివల్ల మెరుగైన రక్త ప్రసరణ అందుతుంది. నడుస్తున్నప్పుడు ఆయాసం లేకుండా చేస్తుంది.
6 నిమిషాలు కూల్ డౌన్
వాకింగ్ చేసిన తర్వాత శరీరాన్ని రిలాక్స్ చేసేందుకు చిన్నగా స్ట్రెచ్‌లు చేయాలి. దీనివల్ల శరీరం ఒత్తిడి గురికాకుండా.. నొప్పులు కంట్రోల్ అవుతాయి. వాకింగ్‌కి ముందు, తర్వాత చేసే ఈ స్ట్రెచ్‌లు ఫ్లెక్సిబులిటీని పెంచుతాయి.
రోజుకు రెండుసార్లు వాక్ చేస్తూ 60 నిమిషాల నడకను పూర్తి చేయాలి. వార్మ్ అప్, కూల్ డౌన్ కచ్చితంగా ఫాలో అవ్వాలి. దీనిని రోజూ చేస్తూ ఉంటే ఆరోగ్యకరమైన జీవనశైలి మీకు అలవాటు అవుతుంది. ఈ రొటీన్ వల్ల గుండె సమస్యలు తగ్గుతాయి. బరువు తగ్గడంలో హెల్ప్ అవుతుంది. బీపీ, షుగర్ కంట్రోల్ అవుతాయి. నిద్ర నాణ్యత పెరుగుతుంది. మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు. పూర్తిగా ఆరోగ్యానికి మేలు జరుగుతుంది.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్ను సంప్రదించాలి.