ఓటీటీలోకి ఇవాళ 6 సినిమాలు- 3 చాలా స్పెషల్- అన్ని తెలుగులోనే- హారర్ టు క్రైమ్ థ్రిల్లర్

ఓటీటీలో ఇవాళ ఆరు సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. వాటిలో ఒక సినిమా నేరుగా డైరెక్ట్‌గా ఓటీటీ రిలీజ్ అయింది. ఇక ఆరింటిలో 3 సినిమాలు చూసేందుకు చాలా బెస్ట్‌గా అది కూడా తెలుగులో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోన్నాయి. అవేంటీ, వాటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ఏంటో లుక్కేద్దాం.


ఓటీటీలోకి ఇవాళ ఆరు సినిమాలు స్ట్రీమింగ్‌కు వచ్చాయి. వీటిలో ఏ సినిమా చూడాలి, అవి ఏ జోనర్‌లో స్పెషల్‌గా ఉన్నాయో తెలుసుకుందాం. అలాగే, వాటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్, స్ట్రీమింగ్ టైమింగ్ వివరాలు వంటి ఇతర విశేషాలపై ఓ లుక్కేద్దాం.

జీ20 ఓటీటీ
అమెరికన్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ జీ20 ఇవాళ నేరుగా ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్‌లో జీ20 ఓటీటీ రిలీజ్ అయింది. నేటి నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఇంగ్లీష్‌తోపాటు తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ వంటి మొత్తం 6 భాషల్లో జీ20 ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.

టుక్ టుక్ ఓటీటీ
తెలుగులో హారర్ కామెడీ ఫాంటసీ అడ్వెంచర్ చిత్రంగా వచ్చిందే టుక్ టుక్. ఏప్రిల్ 26న థియేటర్లలో విడుదలైన టుక్ టుక్ 15 రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేసింది. ఏప్రిల్ 10 నుంచి ఈటీవీ విన్‌లో టుక్ టుక్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. ఒక రిక్షాకు దెయ్యం పట్టడం అనే కాన్సెప్ట్‌తో టుక్ టుక్ తెరకెక్కింది.

ప్రవింకూడు షప్పు ఓటీటీ
మలయాళ స్టార్ యాక్టర్, డైరెక్టర్ బసిల్ జోసెఫ్ నటించిన మరో క్రైమ్ థ్రిల్లర్ డార్క్ కామెడీ చిత్రమే ప్రవింకూడు షప్పు. ఈ సినిమాలో సౌబిన్ షాహిర్, చెంబన్ వినోద్ జోస్ వంటి పాపులర్ మలయాళ యాక్టర్స్ కూడా కీలక పాత్రలు పోషించారు. శ్రీరాజ్ శ్రీనివాసన్ దర్శకత్వం వహించిన ప్రవింకూడు షప్పు ఇవాళ ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది.

అయితే, ఏప్రిల్ 11న ప్రవింకూడు షప్పు ఓటీటీ రిలీజ్ కానుందని అధికారిక ప్రకటన ఇచ్చింది సదరు ప్లాట్‌ఫామ్. కానీ, దానికంటే ఒకరోజు ముందే ఓటీటీలోకి ప్రవింకూడు షప్పు మూవీని తీసుకురానుంది. ఏప్రిల్ 10న సాయంత్రం నుంచి సోనీ లివ్‌లో మలయాళంతోపాటు తెలుగు ఇతర భాషల్లో ప్రవింకూడు షప్పు ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది.

బ్లాక్ మిర్రర్ సీజన్ 7 ఓటీటీ
హాలీవుడ్‌ ఓటీటీ వెబ్ సిరీస్‌ల్లో ప్రాచుర్యం పొందిన వాటిలో బ్లాక్ మిర్రర్ సిరీస్ ఒకటి. ఇందులో సరికొత్తగా ఏడో సీజన్ వచ్చింది. నెట్‌ఫ్లిక్స్‌లో బ్లాక్ మిర్రర్ సీజన్ 7 ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. హిందీ, ఇంగ్లీష్ భాషలో ఇవాళ (ఏప్రిల్ 10) నేరుగా బ్లాక్ మిర్రర్ 7 ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.

మూన్‌రైజ్ ఓటీటీ
జపాన్ సైన్స్ ఫిక్షన్ యానిమేటెడ్ వెబ్ సిరీస్‌గా తెరకెక్కిందే మూన్‌రైజ్. కేవలం ఇంగ్లీష్, జపాన్ భాషలోనే మూన్‌రైజ్ ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చింది. భవిష్యత్తులో సామాజిక అసమానతల వల్ల భూమి, చంద్రుడిపై కలిగే సమస్యల కథాంశంగా మూన్‌రైజ్ తెరకెక్కింది. నెట్‌ఫ్లిక్స్‌లో నేడు మూన్‌రైజ్ ఓటీటీ రిలీజ్ అయింది.

నార్త్ ఆఫ్ నార్త్ ఓటీటీ
కెనడియన్ కామెడీ వెబ్ సిరీస్‌గా తెరకెక్కిన నార్త్ ఆఫ్ నార్త్ ఇవాళ ఓటీటీ రిలీజ్ అయింది. నెట్‌ఫ్లిక్స్‌లో ఇంగ్లీష్ భాషలో కూడా నార్త్ ఆఫ్ నార్త్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. ఇదిలా ఉంటే, ఇవాళ (ఏప్రిల్ 10) 3 వెబ్ సిరీస్‌లు, 3 సినిమాలతో ఆరు ఓటీటీ రిలీజ్ కానున్నాయి. వీటిలో తెలుగులో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోన్న టుక్ టుక్, ప్రవింకూడు షప్పు, జీ20 చూసేందుకు చాలా బెస్ట్ సినిమాలుగా ఉన్నాయి.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.