ఫిట్ మెంట్ ఫ్యాక్టర్ గురించి ప్రతీ ఉద్యోగి తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే..ఎంత వేతనం పెరుగుతుంది అంటే

కేంద్రంలోని మోడీ ప్రభుత్వం 8వ పే కమిషన్ విషయంలో ఇప్పటికే పలు కీలక నిర్ణయాలు తీసుకోగా మరో కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తున్నట్లు కనపడుతోంది. త్వరలోనే 8వ పే కమిషన్ కు సంబంధించిన చైర్మన్ అలాగే ఇతర సభ్యులను ప్రకటించే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఉద్యోగులు 8వ పే కమిషన్ విషయంలో ఫిట్మెంట్ ఫ్యాక్టర్ పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. అసలు ఫిట్మెంట్ ఫ్యాక్టర్ అంటే ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం


కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అతి త్వరలోనే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త వినిపిస్తుందా అంటే అవుననే కొన్ని వర్గాల నుంచి లభిస్తున్న సమాచారాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఏడవ వేతన సంఘం కాలపరిమితి 2025 డిసెంబర్ 31 తేదీ నాటికి ముగియనుంది. ఈ లోగా కేంద్ర ప్రభుత్వం ఎనిమిదవ వేతన సంఘాన్ని ఏర్పాటు చేసి 2026 జనవరి ఒకటో తేదీ నుంచి నూతన వేతన సంఘం సిఫార్సులను అమలు చేయాల్సి ఉంటుంది. అయితే ఇప్పటివరకు ఎనిమిదవ వేతన సంఘం ఏర్పాటు గురించి కీలకమైన ప్రకటన చేసినప్పటికీ దీనికి సంబంధించిన చైర్మన్ అలాగే ఇతర సభ్యుల పేర్లను ఇంకా ప్రకటించలేదు. దీంతో నూతన వేతన సంఘం ఏర్పాటు అవుతుంది అని ఉద్యోగ సంఘాలు ఎదురుచూస్తున్నాయి. మరోవైపు ఉద్యోగులు మాత్రం తమ వేతనం పెరుగుదల పైన పలు అంచనాలు వేస్తున్నారు ఈ సందర్భంగా ఫిట్మెంట్ ఫ్యాక్టర్ పైనే అందరి దృష్టి కేంద్రీకరించి ఉంది. అసలు ఫిట్మెంట్ ఫ్యాక్టర్ అంటే ఏంటో తెలుసుకుందాం.
ఫిట్మెంట్ ఫ్యాక్టర్ అంటే ఏమిటి:
ఒక ఉద్యోగి జీతం లెక్కించటానికి ఫిట్మెంట్ ఫ్యాక్టర్ అనే లెక్కను ఆధారంగా గణిస్తారు. దీని ప్రకారం ఉద్యోగి వేతనం ఎంత ఉండాలి అనే దానిపైన ఉదాహరణకు ఒక ఉద్యోగి బేసిక్ వేతనం 18,000 అనుకున్నట్లయితే, అప్పుడు ఫిట్మెంట్ ఫ్యాక్టర్ 2.57 ఉన్నట్లయితే అతని వేతనం 18000 X 2.57 = 46260 రూపాయలు అవుతుంది.
గతంలో ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ఎలా ఉందో ఇప్పుడు మనం తెలుసుకుందాం .
1996 – ఐదవ వేతన సంఘం – ఫిట్ మెంట్ ఫ్యాక్టర్ 1.86 గా ఉంది.
2006 – 6 వ వేతన సంఘం – ఫిట్ మెంట్ ఫ్యాక్టర్ – 1.86గా ఉంది.
2016- 7వ వేతన సంఘం – ఫిట్ మెంట్ ఫ్యాక్టర్ – 2.57 గా ఉంది.
అయితే ఉద్యోగులు ఎనిమిదవ పే కమిషన్ విషయంలో కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు ముఖ్యంగా ఫిట్మెంట్ ఫ్యాక్టరీ కనీసం 2.83 గా ఉండాలనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది. ముఖ్యంగా పెరుగుతున్న ఖర్చుల నేపథ్యంలో ద్రవ్యోల్బణం ఆధారంగా ఫిట్మెంట్ ఫ్యాక్టర్ పెంచాలని వీరి డిమాండ్ వినిపిస్తోంది.
గమనిక: ఎనిమిదవ పే కమిషన్ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు దీనికి సంబంధించిన వార్తల కోసం కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే గెజిట్ నోటిఫికేషన్ లను ప్రామాణికంగా తీసుకోవాల్సి ఉంటుంది.