24 వేలకే 9 KG 5 స్టార్ వాషింగ్ మెషిన్! దీని అసలు ధర రూ. 44 వేలు

www.mannamweb.com


అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ లో భాగంగా హోమ్ అప్లయెన్సెస్ పై భారీ డిస్కౌంట్ లభిస్తుంది. ఏకంగా 65 శాతం వరకూ తగ్గింపు లభిస్తుండడం విశేషం. వాషింగ్ మెషీన్స్, రిఫ్రిడ్జిరేటర్, ఏసీలు, మైక్రోవేవ్ ఓవెన్స్, డిష్ వాషర్ వంటి వస్తువుల మీద 65 శాతం వరకూ డిస్కౌంట్ లభిస్తుంది. ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ ఆగస్టు 6 నుంచి ప్రారంభమవుతుంది. ఈ క్రమంలో పలు వస్తువుల ధరలను రివీల్ చేసింది. ఇప్పటికే శాంసంగ్ గెలాక్సీ, వన్ ప్లస్ నార్డ్, రియల్ మీ మోడల్ ఫోన్ల ధరలను రివీల్ చేసిన అమెజాన్.. వాషింగ్ మెషిన్ల ధరలను కూడా రివీల్ చేసింది. ఎల్జీ కంపెనీకి చెందిన 9 కేజీ 5 స్టార్ రేటింగ్ వాషింగ్ మెషిన్ పై భారీ డిస్కౌంట్ ని ప్రకటించింది.

రూ. 43,990 విలువ చేసే ఎల్జీ 9 కేజీ 5 స్టార్ ఏఐ అండ్ డైరెక్ట్ డ్రైవ్ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషిన్ ని డిస్కౌంట్ లో రూ. 24,240కే విక్రయిస్తున్నట్లు అమెజాన్ తెలిపింది. అలానే శాంసంగ్ కంపెనీకి చెందిన 9 కేజీ 5 స్టార్ ఫ్రంట్ లోడ్ ఏఐ ఎకో బబుల్ వాషింగ్ మెషిన్ పై కూడా భారీ డిస్కౌంట్ ని ప్రకటించింది. 61 వేల విలువ చేసే ఈ వాషింగ్ మెషిన్ ని రూ. 40,990కే విక్రయిస్తున్నట్లు అమెజాన్ పేర్కొంది. ఈ వాషింగ్ మెషిన్ ఏఐ, వైఫై టెక్నాలజీతో పని చేస్తుంది. ఎకో బబుల్ టెక్నాలజీ కూడా ఉంది. ఎల్జీ 8 కేజీ 5 స్టార్ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషిన్ పై కూడా ఆఫర్ ఉంది. రూ. 47,999 విలువైన వాషింగ్ మెషిన్ ధరను రూ. 35,990కే నిర్ణయించింది. డైరెక్ట్ డ్రైవ్, ఇన్ బిల్ట్ హీటర్ తో వస్తుంది. 12 నెలల వరకూ నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ ఉంది. ఫ్రీడమ్ సేల్ ఆగస్టు 6న మధ్యాహ్న సమయంలో ప్రారంభం కానుంది. ప్రైమ్ మెంబర్స్ కి ముందు రోజు అర్ధరాత్రి నుంచే ప్రారంభం కానుంది.