APDSC Exams: ఏపీ డీఎస్సీ-2024 పరీక్షలు వాయిదా, రివైజ్డ్ షెడ్యూలు ఎప్పుడంటే?

www.mannamweb.com


Andhra Pradesh డీఎస్సీ-2024 పరీక్షల నిర్వహణపై సందిగ్ధతకు తెరపడింది. సార్వత్రిక ఎన్నికల వల్ల పరీక్షలను వాయిదావేసినట్లు విద్యాశాఖ వెల్లడించింది. ఈ మేరకు అధికారిక వెబ్‌సైట్‌లో ప్రకటన ద్వారా తెలిపింది.

AP DSC Exams Postponed: ఏపీలో డీఎస్సీ-2024 పరీక్షల నిర్వహణపై సందిగ్ధతకు తెరపడింది. ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మార్చి 30 నుంచి ఏప్రిల్ 30 వరకు డీఎస్సీ పరీక్షలు నిర్వహించాల్సి ఉండగా.. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పరీక్షలను వాయిదావేసినట్లు విద్యాశాఖ వెల్లడించింది. ఈ మేరకు అధికారిక వెబ్‌సైట్‌లో ప్రకటన ద్వారా తెలిపింది. ఎలక్షన్‌ కమిషన్‌ నుంచి స్పష్టత వచ్చాకే పరీక్షల కొత్త తేదీలను (రివైజ్డ్ షెడ్యూలు) ప్రకటించనున్నట్లు తెలిపింది. అదేవిధంగా పరీక్ష కేంద్రాల ఎంపిక కోసం ఆప్షన్ల నమోదుకు కొత్త షెడ్యూలు ప్రకారం అవకాశం కల్పించనున్నట్లు విద్యాశాఖ వెల్లడించింది. అలాగే టెట్ ఫలితాలను కూడా తర్వాతే వెల్లడించే అవకాశం ఉంది.

“Candidates May Noted That The Revised Schedule will be Announced and option for centres will be enabled after clearance from Election Commission”

దేశవ్యాప్తంగా లోక్‌స‌భ‌ ఎన్నికలు, ఏపీలో అసెంబ్లీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో.. డీఎస్సీ పరీక్షలను ఎన్నికల తర్వాతే నిర్వహించే అవకాశాలున్నాయి. డీఎస్సీ వాయిదా వేయాలని వెయ్యికి పైగా ఫిర్యాదులు వచ్చాయని, డీఎస్సీ నియామకంపై ఎన్నికల కమిషన్‌కు పంపిస్తున్నామని, ఈసీ నుంచి అనుమతి వస్తేనే డీఎస్సీ పరీక్ష జరుగుతుందని సీఈవో ముఖేశ్‌కుమార్‌ మీనా ప్రకటించిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో ఎన్నికల్ కోడ్ అమల్లో ఉన్నందున ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే ఎంతటివారినైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి (సీఈవో) ముఖేశ్‌కుమార్‌ మీనా అన్నారు. రాష్ట్రంలో 144 సెక్షన్‌ అమలవుతోందని, ఎలాంటి కార్యక్రమం అయినా అనుమతులు తీసుకోవాల్సిందేనని పేర్కొన్నారు.

ఏపీలో 6100 ఉపాధ్యాయుల నియామకం కోసం ఏపీ డీఎస్సీ-2024 నోటిఫికేష‌న్ విడుద‌ల చేసిన విషయం తెలిసిందే. పరీక్షలకు సంబంధించిన షెడ్యూలును కూడా విద్యాశాఖ ఇప్పటికే ప్రకటించింది. దీనిప్రకారం మార్చి 30 నుంచి ఏప్రిల్ 30 వరకు డీఎస్సీ ప‌రీక్షలు నిర్వహించనున్నారు. అయితే చాలా మంది అభ్యర్థులు డీఎస్సీ ప‌రీక్షలు వాయిదా వేయాలని ఆంధ్రప్రదేశ్ ఎన్నిక‌ల క‌మిష‌న్‌ను అభ్యర్థించారు. అయితే ఏపీ ఎన్నిక‌ల క‌మిష‌న్ మాత్రం ఇది తమ ప‌రిధిలో ఉండ‌ద‌ని.. కేంద్ర ఎన్నిక‌ల క‌మిష‌న్ అనుమతిస్తే వాయిదా వేస్తామ‌ని అభ్యర్థులకు తెలిపింది. అయితే.. ఏపీ విద్యాశాఖ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టతలేదు.