Kavya Maran: సన్‌రైజర్స్ కావ్య పాప ఆస్తి ఇన్ని కోట్లా.? లెక్కలు చూస్తే చుక్కలు కనబడతాయ్.!

ఐపీఎల్‌కి ప్రపంచవ్యాప్తంగా ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పొట్టి ఫార్మాట్‌లో అంతర్జాతీయ మ్యాచ్‌లు జరిగితేనే మాములుగా ఉండదు. అదీ ఐపీఎల్ అంటే.. ఇంకేముంది మస్త్ మజా ఉన్నట్టే. ఫ్యాన్స్ అరుపులు, కేకలు.. బంతి.. బంతికి నరాలు తెగే ఉత్కంఠ. ఇవన్నీ పక్కనపెడితే.. ఫ్రాంచైజీ ఓనర్లు.. ప్రతీ మ్యాచ్‌లోనూ గ్రౌండ్‌లో హాజరయ్యి.. తమ జట్లను ఎంకరేజ్ చేస్తుండటం సర్వసాధారణం. షారుఖ్ ఖాన్, ప్రీతీ జింటా, కావ్య మారన్.. ఈ లిస్టులోకి వస్తారు. ఇక మనం సన్‌రైజర్స్ హైదరాబాద్ సీఈఓ కావ్య మారన్ గురించి మాట్లాడితే.. గ్రౌండ్‌లో ఆమె చేసే అల్లరి అంతా ఇంతా కాదు. వికెట్ తీస్తే ఆమె చేసే సందడి.. ప్రత్యర్ధి బ్యాటర్లు సిక్సర్లు కొడితే.. ఆమె ఇచ్చే హావభావాలు.. క్షణాల్లో నెట్టింట వైరల్‌గా మారతాయి. సన్‌రైజర్స్‌కి కావ్యమారన్ 2018లో సీఈఓగా నియమితులయ్యారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Join Now
Facebook Page Join Now

ఆటగాళ్లను కొనుగోలు చేసే వేలం దగ్గర నుంచి తన జట్టు ఆడే ప్రతీ మ్యాచ్‌లోనూ కావ్య పాప కనిపిస్తుంది. జట్టు గెలిచినప్పుడు పట్టలేని సంతోషం వ్యక్తం చేసే కావ్య.. ఓడిపోయినప్పుడు దిగులుగా కనిపిస్తుంది. ఆ సమయంలో ఫ్యాన్స్ ఆమెను చూసినప్పుడు అయ్యో.! పాపం అని అనుకుంటుంటారు. ఇక ఈ ఏడాది కావ్య పాప ఫుల్ హ్యాపీ అని చెప్పొచ్చు. సన్‌రైజర్స్ ప్యాట్ కమిన్స్ సారధ్యంలో ఎదురులేని శక్తిగా దూసుకుపోతోంది. ప్రస్తుతం ఆమె ఆస్తులు, కార్ల కలెక్షన్లు గురించి చూస్తే బిత్తరపోతారు. సన్ టీవీ గ్రూప్ ఛైర్మన్, వ్యవస్థాపకుడు కళానిధి మారన్ కుమార్తె కావ్య మారన్. ఈ 31 ఏళ్ల చిన్నది చెన్నైలోని స్టెల్లా మేరీస్ కాలేజీలో కామర్స్‌లో డిగ్రీ పూర్తి చేసింది. అలాగే యూకే నుంచి ఎంబీఏలో పట్టా సాధించింది. జాతీయ మీడియా కథనం ప్రకారం కావ్య మారన్ ఆస్తి విలువ సుమారు రూ.409 కోట్లు ఉంటుందని తెలుస్తోంది. క్రికెట్ అంటే ఎంతో ఇష్టపడే కావ్య మారన్‌కు.. కార్లపై కూడా మక్కువ ఎక్కువే. ఆమె గ్యారేజీలో లగ్జరీ కార్లు ఉన్నాయి.

రోల్స్ రాయిస్ ఫాంటమ్ VIII EWB – ధర: రూ. 12.2 కోట్లు

Related News

బెంట్లీ బెంటెగా LWB – ధర: రూ. 6 కోట్లు

బీఎండబ్ల్యూ i7- ధర: రూ. 2.13 కోట్లు

ఫెరారీ రోమా – ధర: రూ. 3.76 కోట్లు.

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *