క్రికెట్ అనే కాదు.. వరల్డ్ స్పోర్ట్స్‌లో రిచ్ లీగ్స్‌లో ఒకటిగా ఐపీఎల్ పేరు తెచ్చుకుంది. ఈ లీగ్ వల్లే భారత క్రికెట్ బోర్డు ఇవాళ ప్రపంచంలోనే అత్యంత ధనిక బోర్డుగా అవతరించింది. బీసీసీఐకి ఇది బంగారు గుడ్లు పెట్టే బాతు లాంటిది. ఏటా నెలన్నర పాటు నిర్వహించే ఐపీఎల్ వల్ల బోర్డు ఖాతాలో వేల కోట్ల రూపాయలు వచ్చి పడుతున్నాయి. స్ట్రీమింగ్ రైట్స్, అడ్వర్టయిజ్‌మెంట్స్, స్పాన్సర్ల నుంచి ధనంతో బీసీసీఐ ఖజానా నిండిపోతోంది. దీంతో వరల్డ్ క్రికెట్‌ను శాసించే స్థితికి భారత్ చేరుకుంది. ఆసియా క్రికెట్‌తో పాటు ఐసీసీలోనూ బీసీసీఐ ఏం చెబితే అది జరగాల్సిందే అనేలా పరిస్థితి ఉంది. ఈ తరుణంలో ఐపీఎల్‌తో ఢీ అంటే ఢీ అంటోంది పాకిస్థాన్.
అన్ని దేశాలు లీగ్స్ నిర్వహిస్తుండటంతో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు కూడా ఓ లీగ్‌ను స్టార్ట్ చేసింది. అదే పాకిస్థాన్ సూపర్ లీగ్. ఈ లీగ్ సక్సెస్ అవడంతో పీసీబీకి మంచి ఆదాయం సమకూరింది. అయితే ఈ లీగ్‌కు మరింత క్రేజ్ తీసుకొచ్చేందుకు ప్రయత్నించాల్సిన పాక్ బోర్డు.. ఆ పని మానేసి ఇప్పుడు బీసీసీఐతో పెట్టుకుంటోంది. సాధారణంగా పీఎస్ఎల్కు ఐపీఎల్ షెడ్యూల్‌కు మధ్య గ్యాప్ ఉంటుంది. కానీ ఐపీఎల్ సక్సెస్‌ను చూసి ఓర్వలేని పాక్ బోర్డు.. క్యాష్ రిచ్ లీగ్‌ను ఖతం చేయాలని కుట్ర పన్నుతోంది. అందులో భాగంగానే సరిగ్గా ఐపీఎల్ నిర్వహించే టైమ్‌లోనే పీఎస్ఎల్ను ఆర్గనైజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది.
ఐపీఎల్ విండో మార్చి నుంచి మే మధ్యలో ఉంటుందనేది తెలిసిందే. ఇప్పుడు పీఎస్ఎల్ను కూడా సరిగ్గా ఇదే విండోలో నిర్వహించాలని పీసీబీ పట్టుదలతో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఐపీఎల్‌ను పడగొట్టాలంటే సరిగ్గా అదే టైమ్‌లో పీఎస్ఎల్ను విజయవంతంగా నిర్వహించాలని అనుకుంటోందట. అయితే ఈ వార్త గురించి తెలిసిన నెటిజన్స్ పాకిస్థాన్‌పై విమర్శలకు దిగుతున్నారు. పులిని చూసి నక్క వాతలు పెట్టుకోవడం అంటే ఇదేనని అంటున్నారు. ఐపీఎల్‌కు ఏ విధంగానూ పీఎస్ఎల్ సాటిరాదని.. ఇది పాక్ బోర్డుకు తీవ్ర నష్టాన్ని మిగులుస్తుందని చెబుతున్నారు. ఒకే టైమ్‌లో ఐపీఎల్‌కు పోటీగా పెడితే యాడ్స్, వ్యూస్ పరంగా లాసెస్ తప్పవని హెచ్చరిస్తున్నారు. రోమాన్ పావెల్, జేసన్ రాయ్, సికిందర్ రజా, షెర్ఫేన్ రూథర్‌ఫర్డ్, షమర్ జోసెఫ్, రీలీ రూసో, డేవిడ్ విల్లే లాంటి ఆటగాళ్లు ఈ రెండు లీగ్స్‌లోనూ ఆడతారు. ఒకవేళ ఐపీఎల్ టైమ్‌లో పీఎస్ఎల్ నిర్వహిస్తే ఎక్కువ డబ్బులు ఇక్కడే వస్తాయి కాబట్టి ఈ ప్లేయర్లు పాక్‌కు వెళ్లరు. అది వాళ్లకు నష్టమేనని కామెంట్స్ చేస్తున్నారు.
PSL set to clash with the IPL as the PSL window is likely to be moved to April and May. pic.twitter.com/TZcEivIgnA
— Mufaddal Vohra (@mufaddal_vohra) May 5, 2024