IBPS Clerk Notification 2024: ఐబీపీఎస్‌ క్లర్క్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల.. ఈ సారి భారీగా పెరిగిన పోస్టులు

www.mannamweb.com


ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (ఐబీపీఎస్‌) 2025-2026 సంవత్సరానికి సంబంధించి కామన్ రిక్రూట్‌మెంట్‌ ప్రాసెస్ (సీఆర్‌పీ)-XIV నోటిఫికేషన్ విడుదలైంది.

ఐబీపీఎస్‌ క్లర్క్‌ నోటిఫికేషన్‌ ద్వారా మొత్తం 6128 పోస్టులను భర్తీ చేయనున్నారు. బ్యాంకు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులు దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో క్లర్క్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు చేసుకోవడానికి అవకాశం లభించినట్లైంది. ఈ మొత్తం పోస్టుల్లో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లోనూ భారీగా ఖాళీలున్నాయి.

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం కూడా ఉండాలి. అభ్యర్ధుల వయసు జులై 1, 2024 నాటికి 20 నుంచి 28 యేళ్ల మధ్య ఉండాలి. అంటే దరఖాస్తుదారులు జులై 2, 1996 నుంచి జులై 1, 2004 మధ్య జన్మించి ఉండాలి. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో జులై 1వ తేదీ నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌ దరఖాస్తులకు జులై 21, 2024 చివరి తేదీ. దరఖాస్తు సమయంలో జనరల్ అభ్యర్ధులు రూ.850 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఈఎమ్‌ఎమ్‌, డీఈఎస్‌ఎమ్‌ అభ్యర్ధులు మాత్రం రూ.175 రిజిస్ట్రేషన్‌ ఫీజు కింద చెల్లిస్తే సరిపోతుంది.
ప్రిలిమినరీ, మెయిన్ ఎగ్జామ్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

రాత పరీక్ష విధానం..

ఐబీపీఎస్‌ క్లర్క్‌ ప్రిలిమ్స్‌ పరీక్ష 100 మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నలకు 100 మార్కులకు ఉంటుంది. ఇంగ్లిష్ ల్యాంగ్వేజ్‌, న్యూమరికల్‌ ఎబిలిటీ, రీజనింగ్‌ ఎబిలిటీ విభాగాల నుంచి ప్రశ్నలు వస్తాయి. మెయిన్స్‌ పరీక్ష మొత్తం 200 మార్కులకు రెండు గంటల సమయంలో ఉంటుంది.

ముఖ్యమైన తేదీలు…

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు ప్రారంభ తేదీ: జులై 01,2024
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: జులై 21, 2024
ప్రీ-ఎగ్జామ్‌ ట్రైనింగ్‌ నిర్వహణ తేదీలు: ఆగస్టు 12 నుంచి 17 వరకు
ఆన్‌లైన్‌ ప్రిలిమినరీ పరీక్షలు: ఆగస్టు 24, 25, 31 తేదీల్లో
ప్రిలిమినరీ పరీక్ష ఫలితాల విడుదల తేదీ: సెప్టెంబర్‌ 2024లో
ఆన్‌లైన్‌ మెయిన్ పరీక్షలు: అక్టోబర్‌ 13, 2024.

నోటిఫికేషన్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.