పరగడుపున కాఫీ తాగితే.

www.mannamweb.com


చాలామందికి ఉదయాన్నే కాఫీ సిప్ చేయందే రోజు మొదలు కాదు. అది ఓకే కానీ హెల్త్కి మంచిదేనా అనే డౌట్ ఎప్పుడో ఒకప్పుడు వచ్చే ఉంటుంది. పరగడుపున కాఫీ తాగితే శరీరంలో సహజంగా విడుదలయ్యే కార్టిసాల్ హార్మోన్ మీద ప్రభావం పడుతుంది.

దానివల్ల రోజంతా ఎనర్జీ లేనట్టు ఉంటుంది. పరగడుపున కాఫీ తాగొద్దు అనేందుకు మరో రీజన్… రాత్రిళ్లు నిద్రపోయినప్పుడు శరీరం నుంచి లిక్విడ్స్ పోతాయి. ఉదయం లేచేసరికి శరీరం డీ హైడ్రేట్ మోడ్లో ఉంటుంది. కాఫీ ఏమో డైయూరెటిక్. దాంతో పరగడుపున తాగే కాఫీ వంట్లో ఉన్న మరికొన్ని లిక్విడ్స్ను బయటకు పంపిస్తుంది. దాంతో శరీరం మరింత డీహైడ్రేట్ అవుతుంది. అయితే.. పరగడుపున కాఫీ తాగందే కొందరికి ఇంజిన్ నడవదు కదా…! అన్నిటికీ ఉపాయాలు ఉన్నట్టే హెల్దీగా కాఫీ తాగేందుకు కూడా మార్గాలు చెప్తున్నారు ఆరోగ్య నిపుణులు. వాళ్లు చెప్పినట్టు తాగితే కాఫీ మీ శరీరానికి మేలు చేస్తుందట!
– ఉదయం నిద్ర లేవగానే పరగడుపున కాఫీ తాగడానికి ముందు కొన్ని నట్స్ తినాలి. దానివల్ల శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతాయి.
– కాఫీలో పాలకు బదులుగా ప్రొటీన్ కలుపుకుని తాగాలి. ఇది రుచిగా ఉంటుంది. పాలలా కాకుండా తేలికగా అరిగిపోతుంది. అంతేకాదు జీవక్రియలకు హెల్దీ బూస్ట్ ఇస్తుంది.
– అన్ ఫ్లేవర్డ్, కొల్లాజెన్ను కలుపుకుంటే కాఫీలో పోషక విలువలు పెరుగుతాయి.