ప్రస్తుతం అందరికీ హెల్త్ కాన్షియస్ బాగా పెరిగిపోయింది. ఆరోగ్యంగా ఉండాలి అనుకోవడమే కాకుండా.. తమ ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు ట్రాక్ చేయాలి అని చాలా మంది అనుకుంటున్నారు. ఆ లిస్ట్ లో సెలబ్రిటీలు ఎలాగూ ఉంటారు. ఇప్పుడు కామన్ పీపుల్ కూడా చేరిపోయారు. అందుకే మార్కెట్ లోకి స్మార్ట్ గ్యాడ్జెట్స్, హెల్త్ గ్యాడ్జెట్స్ బాగా వస్తున్నాయి. ఇప్పుడు శాంసంగ్ తమ ఏఐ పవర్డ్ హెల్త్ రింగ్ ని అయితే లాంఛ్ చేసింది. పారిస్ లో జరిగిన అన్ ప్యాకింగ్ ఈవెంట్ లో ఈ రింగ్ కి సంబంధించి పూర్తి వివరాలను వెల్లడించారు. అది కూడా అదిరిపోయే ఫీచర్స్, టెక్నాలజీతో ఈ హెల్త్ రింగ్ ఉండటం విశేషం. అందులో ఒకటి కాదు, రెండు కాదు.. మూడు విభిన్న రంగుల్లో 9 రకాల సైజెస్ లో ఈ రింగును తీసుకొస్తున్నారు. మరి.. ఆ హెల్త్ రింగ్ విశేషాలు ఏంటో చూద్దాం.
శాంసంగ్ అంటే ప్రపంచవ్యాప్తంగా ఒక మంచి గుర్తింపు, గుడ్ విల్ ఉంది. అందుకే సాంసంగ్ నుంచి వస్తున్న ఈ హెల్త్ రింగ్ పై అందరి దృష్టి పడింది. అలాగే వినియోగదారుల్లో అంచనాలు కూడా అదే తరహాలో ఉన్నాయి. ఇప్పుడు ఆ హెల్త్ రింగ్ కి సంబంధించి స్పెసిఫికేషన్స్, ఫీచర్స్, అలాగే ఆ రింగ్ ధర గురించి కూడా ఆసక్తికర సమాచారాన్ని తెలుసుకుందాం. ఈ శాంసంగ్ ఏఐ పవర్డ్ హెల్త్ రింగ్ లుక్స్ గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఎంతో స్టైలిష్ గా ఉంది. ఇది ఒక హెల్త్ గ్యాడ్జెట్ అంటే ఎవరూ నమ్మరు. ఏదో వెడ్డింగ్ రింగ్ తరహాలో ఉంది. పైగా గ్రేడ్ 5 టైటేనియంతో దీన్ని అవుటర్ లేయర్ సెక్యూర్ చేశారు. అంటే ఎలాంటి పరిస్థితులను అయినా ఈ రింగ్ తట్టుకోగలదు.
ఇంక ఈ రింగ్ బరువు ఎంతో తెలిస్తే.. మీరు నోరెళ్లబెట్టేస్తారు. ఎందుకంటే ఈ హెల్త్ రింగ్ బరువు కేవలం 2.3 గ్రాముల నుంచి 3 గ్రాముల వరకు మాత్రమే ఉంటుంది. మీరు ఎంచుకునే సైజును బట్టి ఈ బరువు ఆధార పడి ఉంటుంది. దీని డైమెన్షన్స్ 7.0ఎంఎం * 2.6 ఎంఎం మాత్రమే. ఇందులో మొత్తం 9 విభిన్న సైజులు ఉన్నాయి. సైజ్ 5 నుంచి సైజ్ 13 వరకు ఈ హెల్త్ రింగ్ అందుబాటులో ఉంది. ఇది మీ చేతికి ఉంది అనే బావన కూడా ఉండదు. కానీ, పని విషయంలో మాత్రం మిమ్మల్ని మెస్మరైజ్ చేయడం పక్కా. ఇంక ఇది 10 ఏటీఎం వాటర్ రెసిస్టెన్స్ తో వస్తోంది. 100 మీటర్ల వరకు వాటర్ లో తట్టుకుంటని చెప్తున్నారు. అలాగే ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 7 రోజుల వరకు బ్యాటరీ లైఫ్ ఉంటుందని కంపెనీ క్లైమ్ చేస్తోంది.
శాంసంగ్ హెల్త్ రింగ్ స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే.. ఇది 8 ఎంబీ మెమొరీతో వస్తోంది. ఇందులో డే టూ నైట్ ఎఫర్ట్ లెస్ హెల్త్ ట్రాకింగ్ ఉంటుంది. మీ యాక్టివిటీస్, స్లీప్, హార్ట్ రేట్ ని నిరంతరం ట్రాక్ చేస్తూనే ఉంటుంది. మీరు నిద్రపోయే సమయంలో ఎలా నిద్రపోయారు? బ్లడ్ ఆక్సిజన్ ఏ స్థాయిలో ఉంది అనే విషయాలను కూడా ట్రాక్ చేస్తుంది. ఎనర్జీ స్కోర్ ని ఈ రింగ్ ద్వారా పరిచయం చేస్తున్నారు. టోటల్ హెల్త్ అప్ డేట్ కోసం ఓవరాల్ వైటలిటీ కౌంటింగ్ ని స్కోర్ రూపంలో ఈ రింగ్ ఇస్తుంది. ధరించడానికి చాలా కంఫర్ట్ గా ఉంటుందని చెప్తున్నారు. ఈ శాంసంగ్ ఏఐ హెల్త్ రింగ్ ధర 399 డాలర్లుగా ప్రకటించారు.